శ్రీమద్భగవద్గీత - 567: 15వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 567: Chap. 15, Ver. 16


🌹. శ్రీమద్భగవద్గీత - 567 / Bhagavad-Gita - 567 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 16 🌴

16. ద్వావిమౌ పురుషా లోకే క్షరశ్చాక్షర ఏవ చ |
క్షర: సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ||

🌷. తాత్పర్యం : నశ్వరులు మరియు అనశ్వరులని జీవులు రెండు రకములు, భౌతికజగమునందలి ప్రతిజీవియు నశ్వరము (క్షరుడు) కాగా, ఆధ్యాత్మికజగమునందు ప్రతిజీవియు అనశ్వరమని(అక్షరుడని) చెప్పబడినది.


🌷. భాష్యము : పూర్వమే వివరింపబడినట్లు దేవదేవుడైన శ్రీకృష్ణుడు వ్యాసదేవుని అవతారమున వేదాంతసూత్రములను రచించెను. అట్టి వేదాంతసూత్రములందలి అంశముల సారాంశమును అతడిచ్చట తెలియజేయుచు అసంఖ్యాకములుగా నున్న జీవులను క్షరులు మరియు అక్షరులుగా విభజింపవచ్చునని పలుకుచున్నాడు. వాస్తవమునకు జీవులు శ్రీకృష్ణ భగవానుని విభిన్నాంశములు. వారే భౌతికజగత్తుతో సంపర్కమును పొందినప్పుడు “జీవభూతులు” అని పిలువబడుదురు. ఈ శ్లోకమున తెలుపబడిన “క్షర:సర్వాణి భూతాని” యను పదము ననుసరించి వారు నశ్వరులు.

కాని దేవదేవుడైన శ్రీకృష్ణునితో ఏకత్వమున నిలిచినవారు మాత్రము అనశ్వరులుగా లేదా అక్షరులుగా పిలువబడుదురు. ఇచ్చట ఏకత్వమనగా అక్షరపురుషులకు వ్యక్తిత్వము ఉండదని భావము కాదు. భగవానుడు మరియు ఆ అక్షరపురుషుల నడుమ అనైక్యత లేదని మాత్రమే అది సూచించును. అనగా అక్షరులు సృష్టిప్రయోజనమునకు అనుకూలురై యుందురు. వాస్తవమునకు సృష్టి యనెడి విషయము ఆధ్యాత్మిక జగమునందు లేకున్నను వేదాంతసూత్రములందు తెలుపబడినట్లు దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వవ్యక్తీకరణములకు మూలమైనందున అటువంటి భావము ఇచ్చట వ్యక్తపరుపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 567 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 15 - Purushothama Yoga - 16 🌴

16. dvāv imau puruṣau loke kṣaraś cākṣara eva ca
kṣaraḥ sarvāṇi bhūtāni kūṭa-stho ’kṣara ucyate

🌷 Translation : There are two classes of beings, the fallible and the infallible. In the material world every living entity is fallible, and in the spiritual world every living entity is called infallible.


🌹 Purport : As already explained, the Lord in His incarnation as Vyāsadeva compiled the Vedānta-sūtra. Here the Lord is giving, in summary, the contents of the Vedānta-sūtra. He says that the living entities, who are innumerable, can be divided into two classes – the fallible and the infallible. The living entities are eternally separated parts and parcels of the Supreme Personality of Godhead. When they are in contact with the material world they are called jīva-bhūta, and the Sanskrit words given here, kṣaraḥ sarvāṇi bhūtāni, mean that they are fallible.

Those who are in oneness with the Supreme Personality of Godhead, however, are called infallible. Oneness does not mean that they have no individuality, but that there is no disunity. They are all agreeable to the purpose of the creation. Of course, in the spiritual world there is no such thing as creation, but since the Supreme Personality of Godhead, as stated in the Vedānta-sūtra, is the source of all emanations, that conception is explained.

🌹 🌹 🌹 🌹 🌹


29 Oct 2020