శ్రీమద్భగవద్గీత - 560: 15వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 560: Chap. 15, Ver. 09


🌹. శ్రీమద్భగవద్గీత - 560 / Bhagavad-Gita - 560 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 09 🌴

09. శ్రోత్రం చక్షు: స్పర్శనం చ రసనం ఘ్రాణేమేవ చ |
అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ||

🌷. తాత్పర్యం : ఈ విధముగా జీవుడు వేరొక స్థూలదేహమును గ్రహించి మనస్సుతో కూడియున్న ఒకానొక రకమైన కర్ణములు, నయనములు, జిహ్వ, నాసిక, స్పర్శను పొందును. ఆ విధముగా అతడు ఒక ప్రత్యేక రకమగు ఇంద్రియార్థములను అనుభవించును.

🌷. భాష్యము : మరొక రీతిలో చెప్పవలెనన్న జీవుడు తన చైతన్యమును శునక, మార్జాల గుణములతో కలుషిత మొనర్చుకొనినచో తదుపరి జన్మమున అతడు ఎట్టి దేహమును పొందుననిగాని లేదా ఎందులకై ఒక ప్రత్యేక దేహమున అతడు వసించియున్నాడని ఎరుగలేరు. అందులకై ఆధ్యాత్మికగురువు నుండి శ్రవణము చేసి అవగతము చేసికొనిన భగవద్గీత మరియు తత్సదృశ వాజ్మయపు విశిష్టజ్ఞానము అత్యంత అవసరము. ఈ విషయములను అవగాహన చేసికొనుతను అభ్యసించువాడు నిక్కముగా భాగ్యవంతుడు. జీవుడు వివిధపరిస్థితులలో దేహమును త్యాగము చేయుచుండును. వివిధ పరిస్థితులలో జీవించుచుండును. అదే విధముగా గుణప్రభావమున కొన్ని పరిస్థితుల యందు భోగించుచుండును. అట్టి భోగభ్రాంతి యందే అతడు పలువిధములైన సుఖదుఃఖములను అనుభవించు చుండును.

కామము మరియు కోరికచే శాశ్వతముగా మోసగింపబడినవారు తమ దేహమార్పు విషయమున గాని, ప్రస్తుత దేహమున ఎందులకై వసించియున్నామని గాని అవగాహన చేసికొనగలిగే శక్తి నశించియుందురు. వారి దానిని అర్థము చేసికొనజాలరు. కాని ఆధ్యాత్మికజ్ఞానమును అలవరచుకొనినవారు జీవాత్మ దేహముకన్నను అన్యమైనదనియు, అది దేహములను మార్చుచు పలురీతుల భోగించుచున్నదనియు గాంచగలరు. అట్టి జ్ఞానము కలవాడు ఎట్లు బద్ధజీవుడు ఈ భౌతికజగమున దుఃఖము ననుభవించునో అవగాహన చేసికొనగలడు. జనసామాన్యపు బద్ధజీవనము మిక్కిలి క్లేశకరమైనందునే కృష్ణభక్తిభావన యందు పురోగతి నొందినవారు తమ శక్తి కొలది ఈ జ్ఞానమును వారికి అందింప యత్నింతురు. కావున జనులు బద్ధజీవనము నుండి వెలుపలికి వచ్చి, కృష్ణభక్తిరసభావితులై, ఆధ్యాత్మికలోకమును చేరుటకు తమను తాము ముక్తులను కావించుకొనవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 560 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 15 - Purushothama Yoga - 09 🌴

09. śrotraṁ cakṣuḥ sparśanaṁ ca rasanaṁ ghrāṇam eva ca
adhiṣṭhāya manaś cāyaṁ viṣayān upasevate


🌷 Translation : The living entity, thus taking another gross body, obtains a certain type of ear, eye, tongue, nose and sense of touch, which are grouped about the mind. He thus enjoys a particular set of sense objects.

🌹 Purport : In other words, if the living entity adulterates his consciousness with the qualities of cats and dogs, in his next life he gets a cat or dog body and enjoys. Consciousness is originally pure, like water. But if we mix water with a certain color, it changes. Similarly, consciousness is pure, for the spirit soul is pure. But consciousness is changed according to the association of the material qualities. Real consciousness is Kṛṣṇa consciousness. When, therefore, one is situated in Kṛṣṇa consciousness, he is in his pure life.

But if his consciousness is adulterated by some type of material mentality, in the next life he gets a corresponding body. He does not necessarily get a human body again; he can get the body of a cat, dog, hog, demigod or one of many other forms, for there are 8,400,000 species.

🌹 🌹 🌹 🌹 🌹

22 Oct 2020