శ్రీమద్భగవద్గీత - 557: 15వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 557: Chap. 15, Ver. 06


🌹. శ్రీమద్భగవద్గీత - 557 / Bhagavad-Gita - 557 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 06 🌴

06. న తద్ భాసయతే సూర్యో న శశాఙ్కో న పావక: |
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ ||


🌷. తాత్పర్యం : అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచేగాని లేదా అగ్ని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరినవారు తిరిగి ఈ భౌతిక జగమునకు మరలిరారు.

🌷. భాష్యము : కృష్ణలోకముగా (గోలోకబృందావనము) తెలియబడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ధామము (ఆధ్యాత్మికజగము) ఇచ్చట వర్ణింపబడినది. ఆధ్యాత్మికలోకములన్నియును స్వయంప్రకాశమానములు కనుక ఆధ్యాత్మికజగత్తు నందు సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్ని, విద్యుత్తుల అవసరము లేదు. ఈ విశ్వములో సూర్యుడొక్కడే స్వయం ప్రకాశమానుడు. కాని ఆధ్యాత్మికజగత్తులోని లోకములన్నియు స్వయం ప్రకాశమానములే. వైకుంఠలోకములుగా పిలువబడు ఆ లోకముల ప్రకాశమాన కాంతియే బ్రహ్మజ్యోతి యనబడు తేజోమయ ఆకాశమును రూపొందించును.

వాస్తవమునకు ఆ కాంతి కృష్ణలోకమైన గోలోక బృందావనము నుండియే బయల్వెడలుచున్నది. ఆ తేజపు అతికొద్దిభాగము మహత్తత్త్వముచే (భౌతిక జగము) కప్పుబడినను మిగిలిన భాగమంతయు వైకుంఠములని పిలువబడు ఆధ్యాత్మిక లోకములచే నిండి యుండును. ఆ లోకములలో ముఖ్యమైనదే గోలోక బృందావనము. అంధకారబంధురమైన ఈ భౌతికజగము నందున్నంత కాలము జీవుడు బద్ధజీవనమును గడిపినను, మిథ్యాసంసారవృక్షమును ఖండించుట ద్వారా ఆధ్యాత్మికలోకమును చేరినంతనే ముక్తుడగును. అటు పిమ్మట అతడు ఈ భౌతికజగమునకు తిరిగివచ్చు అవకాశమే లేదు. బద్ధజీవనమున జీవుడు తనను తాను భౌతికజగమునకు ప్రభువుగా తలచినను, ముక్తస్థితిలో మాత్రము ఆధ్యాత్మికజగమును చేరి శ్రీకృష్ణభగవానునికి సహచరుడై నిత్యానందమును, నిత్యజీవనమును, సంపూర్ణజ్ఞానమును పొందును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 557 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 15 - Purushothama Yoga - 06 🌴

06. na tad bhāsayate sūryo na śaśāṅko na pāvakaḥ
yad gatvā na nivartante tad dhāma paramaṁ mama

🌷 Translation : That supreme abode of Mine is not illumined by the sun or moon, nor by fire or electricity. Those who reach it never return to this material world.

🌹 Purport : The spiritual world, the abode of the Supreme Personality of Godhead, Kṛṣṇa – which is known as Kṛṣṇaloka, Goloka Vṛndāvana – is described here. In the spiritual sky there is no need of sunshine, moonshine, fire or electricity, because all the planets are self-luminous. We have only one planet in this universe, the sun, which is self-luminous, but all the planets in the spiritual sky are self-luminous. The shining effulgence of all those planets (called Vaikuṇṭhas) constitutes the shining sky known as the brahma-jyotir. Actually, the effulgence is emanating from the planet of Kṛṣṇa, Goloka Vṛndāvana.

Part of that shining effulgence is covered by the mahat-tattva, the material world. Other than this, the major portion of that shining sky is full of spiritual planets, which are called Vaikuṇṭhas, chief of which is Goloka Vṛndāvana. As long as a living entity is in this dark material world, he is in conditional life, but as soon as he reaches the spiritual sky by cutting through the false, perverted tree of this material world, he becomes liberated. Then there is no chance of his coming back here. In his conditional life, the living entity considers himself to be the lord of this material world, but in his liberated state he enters into the spiritual kingdom and becomes an associate of the Supreme Lord. There he enjoys eternal bliss, eternal life, and full knowledge.

🌹 🌹 🌹 🌹 🌹

17 Oct 2020