శ్రీమద్భగవద్గీత - 530: 14వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 530: Chap. 14, Ver. 06


🌹. శ్రీమద్భగవద్గీత - 530 / Bhagavad-Gita - 530 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 6 🌴

06. తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశమనామయమ్ |
సుఖసఙ్గేన బధ్నాతి జ్ఞానసఙ్గేన చానఘ ||


🌷. తాత్పర్యం : ఓ పాపరహితుడా! సత్త్వగుణము మిగిలిన రెండు గుణముల కన్నను పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మనుజుని సర్వపాపఫలము నుండి ముక్తుని చేయును. ఆ గుణము నందున్న వారు సుఖభావన చేతను, జ్ఞానభావన చేతను బద్ధులగుదురు.

🌷. భాష్యము : భౌతికప్రకృతిచే బద్ధులయ్యెడి జీవులు పలురకములుగా నుందురు. వారిలో ఒకడు సుఖిగా గోచరించును, వేరొకడు క్రియాశీలుడుగా కనిపించును, మరి ఇంకొకడు నిస్సహాయునిగా నుండును. మనస్సునకు సంబంధించిన ఇట్టి భావములే ప్రకృతి యందు జీవుల బద్దస్థితికి కారణములగుచున్నవి. జీవులెట్లు వివిధరీతులుగా బంధితులగుదురో ఈ అధ్యాయమున వివరింపబడినది. అట్టి బంధకారణములలో మొదట ఇచ్చట సత్త్వగుణము పరిశీలింపబడుచున్నది. సత్త్వగుణము నలవరచుకొనుట ద్వారా మనుజుడు బద్ధులైన ఇతర గుణములవారి కన్నను బుద్ధిమంతుడగును. జగములో సత్త్వగుణాభివృద్ధి యొక్క ఫలమిదియే.

ఆ విధముగా సత్త్వగుణమును వృద్ధిచేసికొనినవాడు భౌతికక్లేశములచే అంతగా ప్రభావితుడు కాడు. అంతియేగాక అట్టివాడు జ్ఞానమును పొందవలెనను భావనయు కలిగియుండును. అట్లు సత్త్వగుణము నందు స్థితుడై యుండవలెను. సత్త్వగుణము నందలి సుఖభావనకు మనుజుడు తాను దాదాపు సర్వపాపముల నుండి ముక్తిని పొందియున్నాననెడి అవగాహనయే కారణము. కాని వాస్తవమునకు వేదంజ్ఞానము ప్రకారము సత్త్వగుణమనగా ఉన్నతమైన జ్ఞానము మరియు అధికతరమైన సుఖభావనమని భావము. కాని వచ్చిన చిక్కేమనగా జీవుడు సత్త్వగుణమునందు స్థితుడైనంతనే తాను జ్ఞానాభివృద్ధి నొందితిననియు మరియు ఇతరులకన్నను మెరుగనియు తలచును. ఈ విధముగా అతడు బద్ధుడగును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 530 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 06 🌴

06. tatra sattvaṁ nirmalatvāt prakāśakam anāmayam
sukha-saṅgena badhnāti jñāna-saṅgena cānagha


🌷 Translation : O sinless one, the mode of goodness, being purer than the others, is illuminating, and it frees one from all sinful reactions. Those situated in that mode become conditioned by a sense of happiness and knowledge.

🌹 Purport : The living entities conditioned by material nature are of various types. One is happy, another is very active, and another is helpless. All these types of psychological manifestations are causes of the entities’ conditioned status in nature. How they are differently conditioned is explained in this section of Bhagavad-gītā. The mode of goodness is first considered. The effect of developing the mode of goodness in the material world is that one becomes wiser than those otherwise conditioned. A man in the mode of goodness is not so much affected by material miseries, and he has a sense of advancement in material knowledge.

The representative type is the brāhmaṇa, who is supposed to be situated in the mode of goodness. This sense of happiness is due to understanding that, in the mode of goodness, one is more or less free from sinful reactions. Actually, in the Vedic literature it is said that the mode of goodness means greater knowledge and a greater sense of happiness. The difficulty here is that when a living entity is situated in the mode of goodness he becomes conditioned to feel that he is advanced in knowledge and is better than others. In this way he becomes conditioned.

🌹 🌹 🌹 🌹 🌹

22 Sept 2020