శ్రీమద్భగవద్గీత - 518: 13వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 518: Chap. 13, Ver. 29


🌹. శ్రీమద్భగవద్గీత - 518 / Bhagavad-Gita - 518 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 29 🌴

29. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ |
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ ||


🌷. తాత్పర్యం : సర్వత్ర ప్రతిజీవి యందును సమముగా నిలిచియుండు పరమాత్మను దర్శించువాడు తన మనస్సుచే తనను తాను హీనపరచుకొనడు. ఆ విధముగా అతడు పరమగతిని పొందగలడు.

🌷. భాష్యము : జీవుడు భౌతికస్థితిని అంగీకరించుట వలన తన యథార్థ ఆధ్యాత్మికస్థితికి భిన్నముగా నిలిచియుండును. కాని దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన పరమాత్మ రూపమున సర్వత్రా నిలిచియున్నాడని అతడు అవగాహనము చేసికొనినచో, అనగా అతడు ప్రతిజీవి యందును ఆ భగవానుని దర్శింపగలిగినచో తన విధ్వంసక మన:ప్రవృత్తిచే తనను తాను హీనపరచుకొనక క్రమముగా ఆధ్యాత్మికజగము వైపునకు పురోగమించును. సాధారణముగా మనస్సు ఇంద్రియప్రీతి కార్యములకు అలవాటు పడియుండును. కాని దానిని పరమాత్మ వైపునకు మళ్ళించినచో మనుజుడు ఆధ్యాత్మికావగాహనలో పురోగతిని పొందగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 518 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 29 🌴

29. samaṁ paśyan hi sarvatra samavasthitam īśvaram
na hinasty ātmanātmānaṁ tato yāti parāṁ gatim


🌷 Translation : One who sees the Supersoul equally present everywhere, in every living being, does not degrade himself by his mind. Thus he approaches the transcendental destination.

🌹 Purport : The living entity, by accepting his material existence, has become situated differently than in his spiritual existence. But if one understands that the Supreme is situated in His Paramātmā manifestation everywhere, that is, if one can see the presence of the Supreme Personality of Godhead in every living thing, he does not degrade himself by a destructive mentality, and he therefore gradually advances to the spiritual world. The mind is generally addicted to sense gratifying processes; but when the mind turns to the Supersoul, one becomes advanced in spiritual understanding.

🌹 🌹 🌹 🌹 🌹

9 Sept 2020