🌹. శ్రీమద్భగవద్గీత - 526 / Bhagavad-Gita - 526 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 2 🌴
02. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతా: |
సర్గేఅపి నోపజాయన్తే ప్రళయే న వ్యథన్తి చ ||
🌷. తాత్పర్యం : ఈ జ్ఞానమునందు స్థిరముగా నిలుచుట ద్వారా మనుజుడు నా దివ్యత్వము వంటి దివ్యత్వమును పొందగలడు. ఆ విధముగా ప్రతిష్టితుడై అతడు సృష్టి సమయమున జన్మింపడు లేదా ప్రళయ సమయమున వ్యథ నొందడు.
🌷. భాష్యము : సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానమును పొందిన పిమ్మట మనుజుడు శ్రీకృష్ణభగవానునితో గుణరీతి ఏకత్వమును పొంది జన్మమృత్యుపరంపర నుండి ముక్తిని బడయును. అంతియే గాని ఆత్మగా అతడెన్నడును తన వ్యక్తిత్వమును కోల్పోవడు. కనుకనే ఆధ్యాత్మిక జగత్తు నందలి దివ్యలోకములను చేరిన ముక్తాత్ములు శ్రీకృష్ణభగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో నిలిచి, ఆ పరమపురుషుని పాదపద్మములనే సదా దర్శింపగోరుదురని వేదవాజ్మయమున తెలుపబడినది. అనగా ముక్తినొందిన పిదపయు భక్తులు తమ నిజస్వరూపమును మరియు వ్యక్తిత్వమును కోల్పోవరు. ఈ భౌతికజగమునందు మనము సంపాదించిన జ్ఞానమంతయు త్రిగుణములచే మలినమై యుండును. త్రిగుణములచే మలినపడని జ్ఞానమే ఆధ్యాత్మికజ్ఞానము. అట్టి దివ్యమైన ఆధ్యాత్మికజ్ఞానమునందు స్థితుడైనంతనే మనుజుడు దేవదేవునితో సమానస్థాయిలో నిలుచును. ఆధ్యాత్మికజగమును గూర్చిన జ్ఞానము లేనటువంటి నిరాకారవాదులు భౌతికజగత్తు కర్మల నుండి ముక్తినొందినంతనే వైవిధ్యమన్నది లేకుండ ఆత్మ రూపరహితమగునని పలుకుదురు.
కాని వాస్తవమునకు భౌతికజగమునందు భౌతికత్వమున వైవిధ్యమున్నట్లే ఆధ్యాత్మికజగత్తు నందు కూడా వైవిధ్యమున్నది. ఈ విషయమున అజ్ఞానులైనవారే ఆధ్యాత్మికస్థితి వైవిద్యమునకు విరుద్ధమని తలతురు. కాని నిజమునకు ముక్తి పిమ్మట మనుజుడు ఆధ్యాత్మికజగమున ఆధ్యాత్మికరూపమును పొందును. అట్టి ఆధ్యాత్మికజగమున పలు ఆధ్యాత్మిక కర్మలు గలవు. అచ్చటి ఆధ్యాత్మికస్థితియే భక్తిమయ జీవనమనబడును. అట్టి ఆధ్యాత్మికస్థితి గుణరహితమనియు, ప్రతియొక్కరు అచ్చట భగవానునితో గుణరీతిని సమానమై యుందురనియు చెప్పబడినది. అటువంటి జ్ఞానసముపార్జనమునకు మనుజుడు ఆధ్యాత్మికగుణములను వృద్ధి చేసికొన వలయును. ఆ రీతి ఆధ్యాత్మికగుణములను వృద్ధిచేసికొనిన వాడు భౌతికజగత్తు సృష్టిచే గాని, ప్రలయముచే గాని వ్యథ నొందడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 526 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 02 🌴
02. idaṁ jñānam upāśritya mama sādharmyam āgatāḥ
sarge ’pi nopajāyante pralaye na vyathanti ca
🌷 Translation : By becoming fixed in this knowledge, one can attain to the transcendental nature like My own. Thus established, one is not born at the time of creation or disturbed at the time of dissolution.
🌹 Purport : After acquiring perfect transcendental knowledge, one acquires qualitative equality with the Supreme Personality of Godhead, becoming free from the repetition of birth and death. One does not, however, lose his identity as an individual soul. It is understood from Vedic literature that the liberated souls who have reached the transcendental planets of the spiritual sky always look to the lotus feet of the Supreme Lord, being engaged in His transcendental loving service. So, even after liberation, the devotees do not lose their individual identities. Generally, in the material world, whatever knowledge we get is contaminated by the three modes of material nature. Knowledge which is not contaminated by the three modes of nature is called transcendental knowledge. As soon as one is situated in that transcendental knowledge, he is on the same platform as the Supreme Person.
However, just as there is material variegatedness in this world, in the spiritual world there is also variegatedness. Those in ignorance of this think that spiritual existence is opposed to material variety. But actually, in the spiritual sky, one attains a spiritual form. There are spiritual activities, and the spiritual situation is called devotional life. That atmosphere is said to be uncontaminated, and there one is equal in quality with the Supreme Lord. To obtain such knowledge, one must develop all the spiritual qualities. One who thus develops the spiritual qualities is not affected either by the creation or by the destruction of the material world.
🌹 🌹 🌹 🌹 🌹
17 Sept 2020