శ్రీమద్భగవద్గీత - 520: 13వ అధ్., శ్లో 31 / Bhagavad-Gita - 520: Chap. 13, Ver. 31


🌹. శ్రీమద్భగవద్గీత - 520 / Bhagavad-Gita - 520 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 31 🌴

31. యదా భూతపృథ గ్భావమేకస్థ మనుపశ్యతి |
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ||


🌷. తాత్పర్యం : బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి, జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించిరో గాంచినపుడు బ్రహ్మభావమును పొందును.

🌷. భాష్యము : జీవుల వివిధ కోరికల ననుసరించియే వారి వివిధదేహములు సృజింపబడు చున్నవనియు, వాస్తవముగా ఆ దేహములన్నియు ఆత్మకు సంబంధించినవి కావనియు దర్శించగలిగినప్పుడే మనుజుడు నిజదృష్టి కలిగినవాడగును. భౌతికదృష్టిలో కొందరు జీవులు దేవతారూపమున, కొందరు మానవరూపమున, కొందరు శునక, మార్జాలాది రూపమున గోచరింతురు.

ఇట్టి దృష్టి భౌతికమేగాని వాస్తవదృష్టి కాదు. ఈ భేదభావనమునకు జీవితపు భౌతిక భావనయే కారణము. కాని వాస్తవమునకు దేహము నశించిన పిమ్మట మిగులునది ఆత్మ ఒక్కటియే. ఆ ఆత్మయే భౌతికప్రకృతి సంపర్కము వలన వివిధదేహములను పొందుచుండును. ఈ విషయములను గాంచగలిగినవాడు ఆధ్యాత్మికదృష్టిని బడయగలడు. ఈ విధముగా మనిషి, మృగము, పెద్ద, చిన్న మొదలుగు భేదభావముల నుండి ముక్తుడై, చైతన్యమును శుద్ధి పరచుకొనిన వాడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమున కృష్ణభక్తిభావనను వృద్ధిచేసికొనగలడు. అట్టి భక్తుడు ఏ విధముగా సర్వమును గాంచునో తరువాతి శ్లోకమున వివరింపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 520 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 31 🌴

31. yadā bhūta-pṛthag-bhāvam eka-stham anupaśyati
tata eva ca vistāraṁ brahma sampadyate tadā


🌷 Translation : When a sensible man ceases to see different identities due to different material bodies and he sees how beings are expanded everywhere, he attains to the Brahman conception.

🌹 Purport : When one can see that the various bodies of living entities arise due to the different desires of the individual soul and do not actually belong to the soul itself, one actually sees. In the material conception of life, we find someone a demigod, someone a human being, a dog, a cat, etc. This is material vision, not actual vision.

This material differentiation is due to a material conception of life. After the destruction of the material body, the spirit soul is one. The spirit soul, due to contact with material nature, gets different types of bodies. When one can see this, he attains spiritual vision; thus being freed from differentiations like man, animal, big, low, etc., one becomes purified in his consciousness and able to develop Kṛṣṇa consciousness in his spiritual identity. How he then sees things will be explained in the next verse.

🌹 🌹 🌹 🌹 🌹

11 Sept 2020