శ్రీమద్భగవద్గీత - 527: 14వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 527: Chap. 14, Ver. 03


🌹. శ్రీమద్భగవద్గీత - 527 / Bhagavad-Gita - 527 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 3 🌴


03. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్ |
సమ్భవ: సర్వభూతానాం తతో భవతి భారత ||

🌷. తాత్పర్యం : ఓ భరతవంశీయుడా! బ్రహ్మముగా పిలువబడు మహతత్త్వము సమస్త జననమునకు ఆధారమై యున్నది. సర్వజీవుల జన్మను సంభవింపజేయుచు నేనే ఆ బ్రహ్మము నందు బీజప్రదానము కావించుచున్నాను.

🌷. భాష్యము : ఇదియే విశ్వమునందు జరుగుచున్న సమస్తమునకు వివరణము. ప్రతిదియు క్షేత్రము (దేహము) మరియు క్షేత్రజ్ఞుని (ఆత్మ) కలయికచే ఒనగూడుచున్నది. ఇట్టి ప్రకృతి, ఆత్మల కలయిక శ్రీకృష్ణభగవానునిచే సాధ్యము కావింపబడును. వాస్తవమునకు “మహతత్త్వము” సమస్త విశ్వమునకు సర్వ కారణమై యున్నది. త్రిగుణపూర్ణమైన ఆ మహతత్త్వమే కొన్నిమార్లు బ్రహ్మముగా పిలువబడును. దానియందే శ్రీకృష్ణభగవానుడు బీజప్రదానము చేయగా అసంఖ్యాకమగు విశ్వములు ఉత్పత్తి యగును.

అట్టి మహతత్త్వము ముండకోపనిషత్తు (1.1.9) నందు బ్రహ్మముగా వర్ణింపబడినది. “తస్మాదేతద్ బ్రహ్మ నామ రూపమన్నం చ జాయతే”. అట్టి బ్రహ్మము నందు భగవానుడు జీవులను బీజరూపమున ఉంచును. భూమి, జలము, అగ్ని, వాయువు మొదలుగా గల చతుర్వింశతి మూలకములన్నియును భౌతికశక్తిగా పరిగణింపబడును మరియ అవియే మహద్భ్రహ్మమనబడును భౌతికప్రకృతిని రూపొందించును. సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు దీనికి పరమైన దివ్య ప్రకృతియే జీవుడు. దేవదేవుని సంకల్పముచే భౌతికప్రకృతి యందు ఉన్నతప్రకృతి మిశ్రణము కావింపబడును. తదనంతరము జీవులందరును భౌతికప్రకృతి యందు జన్మింతురు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 527 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 03 🌴

03. mama yonir mahad brahma tasmin garbhaṁ dadhāmy aham
sambhavaḥ sarva-bhūtānāṁ tato bhavati bhārata

🌷 Translation : The total material substance, called Brahman, is the source of birth, and it is that Brahman that I impregnate, making possible the births of all living beings, O son of Bharata.

🌹 Purport : This is an explanation of the world: everything that takes place is due to the combination of kṣetra and kṣetra-jña, the body and the spirit soul. This combination of material nature and the living entity is made possible by the Supreme God Himself. The mahat-tattva is the total cause of the total cosmic manifestation; and that total substance of the material cause, in which there are three modes of nature, is sometimes called Brahman. The Supreme Personality impregnates that total substance, and thus innumerable universes become possible.

This total material substance, the mahat-tattva, is described as Brahman in the Vedic literature (Muṇḍaka Upaniṣad 1.1.19): tasmād etad brahma nāma-rūpam annaṁ ca jāyate. The Supreme Person impregnates that Brahman with the seeds of the living entities. The twenty-four elements, beginning from earth, water, fire and air, are all material energy, and they constitute what is called mahad brahma, or the great Brahman, the material nature. As explained in the Seventh Chapter, beyond this there is another, superior nature – the living entity. Into material nature the superior nature is mixed by the will of the Supreme Personality of Godhead, and thereafter all living entities are born of this material nature.

🌹 🌹 🌹 🌹 🌹

19 Sept 2020