🌹. శ్రీమద్భగవద్గీత - 519 / Bhagavad-Gita - 519 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 30 🌴
30. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశ: |
య: పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి ||
🌷. తాత్పర్యం : భౌతికప్రకృతిచే సృష్టింపబడిన దేహము చేతనే సర్వకార్యములు ఒనరింపబడు చున్నవనియు మరియు తాను అకర్తననియు గాంచగలిగినవాడు యథార్థదృష్టి కలిగినట్టివాడు.
🌷. భాష్యము : ఈ దేహము పరమాత్ముని నిర్దేశములో భౌతికప్రకృతిచే తయారుచేయబడును. అట్టి దేహపరమగు సమస్త కార్యములకు ఆత్మ కర్త కాదు. దేహస్మృతి కారణముననే చేయవలసిన కార్యములన్నియును మనుజునిచే బలవంతముగా చేయింపబడుచున్నవి. అట్టి కార్యములు సుఖము కొరకైనను లేదా దుఃఖము కొరకైనను సరియే. కాని వాస్తవమునకు ఆత్మ అట్టి సర్వదేహకార్యములకు పరమైనది. జీవుని పూర్వపు కోరికల ననుసరించి అతనికి దేహమొసగబడుచుండును.
కోరికలను తీర్చుకొనుటకు ఒసగబడిన దేహముతో జీవుడు ఆ కోరికల ననుసరించి వర్తించుచుండును. అనగా ఈ దేహము జీవుడు తన కోరికలను పూర్ణము చేసికొనుటకు భగవానునిచే రూపొందించబడిన యంత్రము వంటిది. అట్టి కోరికల కారణముననే మనుజుడు సుఖదుఃఖముల ననుభవించు కొరకై వివిధ పరిస్థితుల యందుంచబడును. ఇట్టి ఆధ్యాత్మిక దృష్టి అభివృద్ధినొందినంతనే మనుజుడు తనను తన దేహకార్యముల నుండి అన్యముగా గాంచును. అట్టి ఆధ్యాత్మికదృష్టి కలిగినవాడే నిజమైన ద్రష్ట.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 519 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 30 🌴
30. prakṛtyaiva ca karmāṇi kriyamāṇāni sarvaśaḥ
yaḥ paśyati tathātmānam akartāraṁ sa paśyati
🌷 Translation : One who sees the Supersoul equally present everywhere, in every living being, does not degrade himself by his mind. Thus he approaches the transcendental destination.
🌹 Purport : This body is made by material nature under the direction of the Supersoul, and whatever activities are going on in respect to one’s body are not his doing. Whatever one is supposed to do, either for happiness or for distress, one is forced to do because of the bodily constitution. The self, however, is outside all these bodily activities. This body is given according to one’s past desires. To fulfill desires, one is given the body, with which he acts accordingly.
Practically speaking, the body is a machine, designed by the Supreme Lord, to fulfill desires. Because of desires, one is put into difficult circumstances to suffer or to enjoy. This transcendental vision of the living entity, when developed, makes one separate from bodily activities. One who has such a vision is an actual seer.
🌹 🌹 🌹 🌹 🌹
10 Sept 2020