శ్రీమద్భగవద్గీత - 516: 13వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 516: Chap. 13, Ver. 27


🌹. శ్రీమద్భగవద్గీత - 516 / Bhagavad-Gita - 516 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 27 🌴

27. యావత్ సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమమ్ |
క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ది భరతర్షభ ||


🌷. తాత్పర్యం : ఓ భరతవంశశ్రేష్టుడా! స్థితిని కలిగియున్నట్టి స్థావర, జంగమములలో నీవు గాంచునదేదైనను క్షేత్రక్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలిసికొనుము.

🌷. భాష్యము : జగత్తు యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగియున్నట్టి భౌతికప్రకృతి మరియు జీవుల గూర్చి ఈ శ్లోకమున వివరింపబడినది. సృష్టింపబడిన ప్రతిదియు జీవుడు మరియు ప్రకృతి కలయిక చేతనే ఏర్పడినది. జగత్తులో వృక్షములు, పర్వతములు, కొండలవంటి అచరసృష్టి కలదు. అదేవిధముగా పలువిధములైన చరసృష్టి కూడా కలదు.

అవియన్నియు భౌతికప్రకృతి మరియు ఉన్నతప్రకృతియైన జీవుని కలయిక చేతనే ఏర్పడినవి. ఉన్నతప్రకృతికి సంబంధించిన జీవుని కలయిక లేక స్పర్శ లేనిదే ఏదియును వృద్ధినొందదు. ఈ విధముగా భౌతికప్రకృతి మరియు జీవుల నడుమ సంబంధము అనంతముగా సాగుచున్నది. వారి నడుమ సంయోగమనునది శ్రీకృష్ణభగవానునిచే ప్రభావితమగు చున్నందున ఆ భగవానుడే ఉన్నత, న్యూనప్రకృతులను నియమించువాడై యున్నాడు. అనగా భౌతికప్రకృతి భగవానునిచే సృష్టింపబడి, ఉన్నతప్రకృతియైన జీవుడు దాని యందుంచబడగా సర్వకార్యములు, సృష్టి ఒనగూడుచున్నవి.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 516 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 27 🌴

27. yāvat sañjāyate kiñcit sattvaṁ sthāvara-jaṅgamam
kṣetra-kṣetrajña-saṁyogāt tad viddhi bharatarṣabha


🌷 Translation : O chief of the Bhāratas, know that whatever you see in existence, both the moving and the nonmoving, is only a combination of the field of activities and the knower of the field.

🌹 Purport : Both material nature and the living entity, which were existing before the creation of the cosmos, are explained in this verse. Whatever is created is but a combination of the living entity and material nature. There are many manifestations like trees, mountains and hills which are not moving, and there are many existences which are moving, and all of them are but combinations of material nature and the superior nature, the living entity. Without the touch of the superior nature, the living entity, nothing can grow.

The relationship between material nature and spiritual nature is eternally going on, and this combination is effected by the Supreme Lord; therefore He is the controller of both the superior and inferior natures. The material nature is created by Him, and the superior nature is placed in this material nature, and thus all these activities and manifestations take place.

🌹 🌹 🌹 🌹 🌹


7 Sept 2020