శ్రీమద్భగవద్గీత - 538: 14వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 538: Chap. 14, Ver. 14


🌹. శ్రీమద్భగవద్గీత - 538 / Bhagavad-Gita - 538 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 14 🌴

14. యదా సత్త్వే ప్రవృద్దే తు ప్రలయం యాతి దేహభృత్ |
తదోత్తమవిదాం లోకానమలాన్ ప్రతిపద్యతే ||


🌷. తాత్పర్యం : సత్త్వగుణము నందుండి మరణించినవాడు మహర్షుల యొక్క ఉన్నత పవిత్రలోకములను పొందును.

🌷. భాష్యము : సత్త్వగుణము నందున్నవాడు బ్రహ్మలోకము లేదా జనలోకము వంటి ఉన్నత లోకములను పొంది అచ్చట దేహసౌఖ్యముల ననుభవించును. ఈ శ్లోకమున “అమలాన్” అను పదము ప్రధానమైనది. ఆ లోకములు రజస్తమోగుణముల నుండి విడివడియున్నవి తెలియజేయుటయే దాని భావము. కలుషభరితమైన ఈ భౌతికజగమున సత్త్వగుణమనునది అత్యంత పవిత్రమైయున్నది.

భిన్నజీవుల కొరకు భిన్నలోకములు ఏర్పాటు చేయబడియున్నందున, సత్త్వగుణమునందు నిలిచి మరణించువారు మహర్షులు మరియు మహాభక్తులు నివసించు లోకములకు ఉద్దరింపబడుదురు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 538 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 14 🌴

14. yadā sattve pravṛddhe tu pralayaṁ yāti deha-bhṛt
tadottama-vidāṁ lokān amalān pratipadyate


🌷 Translation : When one dies in the mode of goodness, he attains to the pure higher planets of the great sages.

🌹 Purport : One in goodness attains higher planetary systems, like Brahmaloka or Janaloka, and there enjoys godly happiness. The word amalān is significant; it means “free from the modes of passion and ignorance.” There are impurities in the material world, but the mode of goodness is the purest form of existence in the material world.

There are different kinds of planets for different kinds of living entities. Those who die in the mode of goodness are elevated to the planets where great sages and great devotees live.

🌹 🌹 🌹 🌹 🌹


30 Sept 2020


శ్రీమద్భగవద్గీత - 537: 14వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 537: Chap. 14, Ver. 13


🌹. శ్రీమద్భగవద్గీత - 537 / Bhagavad-Gita - 537 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 13 🌴

13. అప్రకాశో(ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయన్తే వివృద్దే కురునందన ||


🌷. తాత్పర్యం : ఓ కురునందనా! తమోగుణము వృద్ధినొందినప్పుడు అంధకారము, సోమరితనము, బుద్ధిహీనత, భ్రాంతి యనునవి వ్యక్తములగును.

🌷. భాష్యము : ప్రకాశములేనప్పుడు జ్ఞానము శూన్యమైనందున, తమోగుణము నందున్నవాడు నియమబద్ధముగా కాక తోచిన రీతిగా ప్రయోజశూన్యముగా కర్మనొనరించును. తాను కార్యసామర్థ్యమును కలిగియున్నను అతడెట్టి యత్నములను గావింపడు. ఇదియే భ్రాంతి యనబడును.

అనగా చైతన్యమున్నను అట్టివాడు క్రియారహితుడై యుండును. తమోగుణము నందున్న వానికి ఇవియన్నియు చిహ్నములు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 537 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 13 🌴

13. aprakāśo ’pravṛttiś ca pramādo moha eva ca
tamasy etāni jāyante vivṛddhe kuru-nandana


🌷 Translation : When there is an increase in the mode of ignorance, O son of Kuru, darkness, inertia, madness and illusion are manifested.

🌹 Purport : When there is no illumination, knowledge is absent. One in the mode of ignorance does not work by a regulative principle; he wants to act whimsically, for no purpose. Even though he has the capacity to work, he makes no endeavor.

This is called illusion. Although consciousness is going on, life is inactive. These are the symptoms of one in the mode of ignorance.

🌹 🌹 🌹 🌹 🌹

29 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 536: 14వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 536: Chap. 14, Ver. 12


🌹. శ్రీమద్భగవద్గీత - 536 / Bhagavad-Gita - 536 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 12 🌴

12. లోభ: ప్రవృత్తిరారామ్భ: కర్మణామశమ: స్పృహా |
రజస్యేతాని జాయన్తే వివృద్దే భరతర్షభ ||


🌷. తాత్పర్యం : ఓ భరతవంశ శ్రేష్టుడా! రజోగుణము వృద్ధినొందినపుడు లోభము, కామ్యకర్మము, తీవ్రయత్నము, అణచసాధ్యముగాని కోరిక, తపన యను లక్షణములు వృద్ది నొందును.

🌷. భాష్యము : రజోగుణము నందున్నవాడు తాను పొందియున్న స్థితితో ఎన్నడును సంతృప్తినొందడు. దానిని వృద్ధిచేసికొనుటకు అతడు ఆకాంక్ష పడుచుండును. నివసించుటకు గృహమును నిర్మించదలచినచో తానా గృహమందు అనంతకాలము నివసింప బోవుచున్నట్లు రాజమహలు వంటి భవంతిని నిర్మింప శాయశక్తులు యత్నించును. ఇంద్రియ భోగానుభవమునకై తీవ్రమైన ఆకాంక్షను వృద్ధిచేసికొను అతని భోగములకు అంతమనునది ఉండదు.

ఇల్లు మరియు సంసారముతోడనే ఎల్లప్పుడును నిలిచి ఇంద్రియభోగానుభవమును కొనసాగించుటయే అతని కోరిక. ఆ కోరికకు త్రెంపు అనునది ఉండదు. ఈ చిహ్నములన్నింటిని రజోగుణ లక్షణములుగా అర్థము చేసికొనవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 502 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 12 🌴

12. lobhaḥ pravṛttir ārambhaḥ karmaṇām aśamaḥ spṛhā
rajasy etāni jāyante vivṛddhe bharatarṣabha


🌷 Translation : O chief of the Bhāratas, when there is an increase in the mode of passion the symptoms of great attachment, fruitive activity, intense endeavor, and uncontrollable desire and hankering develop.

🌹 Purport : One in the mode of passion is never satisfied with the position he has already acquired; he hankers to increase his position. If he wants to construct a residential house, he tries his best to have a palatial house, as if he would be able to reside in that house eternally. And he develops a great hankering for sense gratification.

There is no end to sense gratification. He always wants to remain with his family and in his house and to continue the process of sense gratification. There is no cessation of this. All these symptoms should be understood as characteristic of the mode of passion.

🌹 🌹 🌹 🌹 🌹

28 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 535: 14వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 535: Chap. 14, Ver. 11


🌹. శ్రీమద్భగవద్గీత - 535 / Bhagavad-Gita - 535 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 11 🌴

11. సర్వద్వారేషు దేహే(స్మిన్ ప్రకాశ ఉపజాయతే |
జ్ఞానం యదా తదా విద్యాద్ వివృద్ధం సత్త్వమిత్యుత ||


🌷. తాత్పర్యం : దేహ ద్వారములన్నియును జ్ఞానముచే ప్రకాశమానమైనప్పుడు సత్త్వగుణము యొక్క వ్యక్తీకరణము అనుభవమునకు వచ్చును.

🌷. భాష్యము : దేహమునకు రెండు కన్నులు, రెండు చెవులు, రెండు నాసికారంధ్రములు, నోరు, జననావయము, పృష్టమను తొమ్మిది ద్వారములు గలవు. ఈ తొమ్మిది ద్వారములలో ప్రతిదియు సత్త్వగుణ లక్షణములచే ప్రకాశమానమైనప్పుడు మనుజుడు సత్త్వగుణమును వృద్ధిచేసికొనిననాడని అవగాహన చేసికొనవచ్చును.

అట్టి సత్త్వగుణమున మనుజుడు విషయములను వాస్తవదృక్పథమున గాంచునట్లు, వినుటయు, స్వీకరించుటయు చేయగలడు. ఆ విధముగా అతడు అంతర్భాహ్యములందు శుద్ధుడు కాగలడు. అనగా ప్రతిద్వారముమందును ఆనందము మరియు సౌఖ్యలక్షణములు వృద్ధి కాగలవు. అదియే సత్త్వగుణపు వాస్తవస్థితి.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 535 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 11 🌴

11. sarva-dvāreṣu dehe ’smin prakāśa upajāyate
jñānaṁ yadā tadā vidyād vivṛddhaṁ sattvam ity uta


🌷 Translation : The manifestation of the mode of goodness can be experienced when all the gates of the body are illuminated by knowledge.

🌹 Purport : There are nine gates in the body: two eyes, two ears, two nostrils, the mouth, the genitals and the anus. When every gate is illuminated by the symptoms of goodness, it should be understood that one has developed the mode of goodness. In the mode of goodness, one can see things in the right position, one can hear things in the right position, and one can taste things in the right position. One becomes cleansed inside and outside. In every gate there is development of the symptoms of happiness, and that is the position of goodness.

🌹 🌹 🌹 🌹 🌹


27 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 534: 14వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 534: Chap. 14, Ver. 10


🌹. శ్రీమద్భగవద్గీత - 534 / Bhagavad-Gita - 534 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 10 🌴

10. రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత |
రజ: సత్త్వం తమశ్చైవ తమ: సత్త్వం రజస్తథా ||


🌷. తాత్పర్యం : ఓ భరతవంశీయుడా! కొన్నిమార్లు రజస్తమోగుణములను జయించి సత్త్వగుణము ప్రబలమగుచుండును. మరికొన్నిమార్లు రజోగుణము సత్త్వ, తమోగుణములను జయించుచుండును. ఇంకొన్నిమార్లు తమోగుణము సత్త్వ, రజోగుణములను జయించుచుండును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుచుండును.

🌷. భాష్యము : రజోగుణము ప్రబలమైనప్పుడు సత్త్వగుణము మరియు తమోగుణము జయింపబడును. సత్త్వగుణము ప్రధానమైనప్పుడు రజస్తమోగుణములు జయింపబడును. ఇక తమోగుణము ప్రబలమైనప్పుడు సత్త్వగుణము మరియు రజోగుణము జయింపబడి యుండును. త్రిగుణముల నడుమ ఇట్టి పోటీ సదా కొనసాగుచునే యుండును కావున కృష్ణభక్తిభావనలో వాస్తవముగా పురోగతి కోరువాడు వీటిని అధిగమింపబలయును. మనుజుని యందు ప్రబలమైయున్నట్టి గుణము అతని వ్యవహారములు, కర్మలు, ఆహారము మొదలగు విషయముల ద్వారా వ్యక్తమగుచుండును. ఈ విషయము రాబోవు అధ్యాయములలో వివరింపబడును.

కాని మనుజుడు తలచినచో సాధన ద్వారా సత్త్వగుణమును వృద్ధిచేసికొని రజస్తమోగుణములను జయింపవచ్చును. అదే విధముగా అతడు రజోగుణము వృద్ధిచేసికొని సత్త్వతమోగుణములను జయింపవచ్చును లేదా తమోగుణమును అలవరచుకొని సత్త్వరజోగుణములను జయింప వచ్చును. ఈ విధముగా ప్రకృతిగుణములు మూడువిధములైనను స్థిరనిశ్చయము కలిగినవాడు సత్త్వగుణమునందు స్థితుడు కాగలడు. పిదప ఆ సత్త్వగుణమును సైతము అతడు అధిగమించి “వసుదేవస్థితి” యను శుద్ధసత్త్వమునకు చేరగలడు. అట్టి స్థితియందే మనుజుడు భగవద్విజ్ఞానమును అవగాహనము చేసికొనగలడు. అనగా మనుజుని కర్మల ననుసరించి అతడు ఎట్టి గుణమునందు స్థితుడైయున్నాడో తెలిసికొనవచ్చును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 534 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 10 🌴

10. rajas tamaś cābhibhūya sattvaṁ bhavati bhārata
rajaḥ sattvaṁ tamaś caiva tamaḥ sattvaṁ rajas tathā

🌷 Translation : Sometimes the mode of goodness becomes prominent, defeating the modes of passion and ignorance, O son of Bharata. Sometimes the mode of passion defeats goodness and ignorance, and at other times ignorance defeats goodness and passion. In this way there is always competition for supremacy.

🌹 Purport : When the mode of passion is prominent, the modes of goodness and ignorance are defeated. When the mode of goodness is prominent, passion and ignorance are defeated. And when the mode of ignorance is prominent, passion and goodness are defeated. This competition is always going on. Therefore, one who is actually intent on advancing in Kṛṣṇa consciousness has to transcend these three modes. The prominence of some certain mode of nature is manifested in one’s dealings, in his activities, in eating, etc. All this will be explained in later chapters.

But if one wants, he can develop, by practice, the mode of goodness and thus defeat the modes of ignorance and passion. One can similarly develop the mode of passion and defeat goodness and ignorance. Or one can develop the mode of ignorance and defeat goodness and passion. Although there are these three modes of material nature, if one is determined he can be blessed by the mode of goodness, and by transcending the mode of goodness he can be situated in pure goodness, which is called the vasudeva state, a state in which one can understand the science of God. By the manifestation of particular activities, it can be understood in what mode of nature one is situated.

🌹 🌹 🌹 🌹 🌹

26 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 533: 14వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 533: Chap. 14, Ver. 09


🌹. శ్రీమద్భగవద్గీత - 533 / Bhagavad-Gita - 533 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 9 🌴

09. సత్త్వం సుఖే సంజయతి రజ: కర్మణి భారత |
జ్ఞానమావృత్య తు తమ: ప్రమాదే సంజయత్యుత ||


🌷. తాత్పర్యం : ఓ భరతవంశస్థుడా! సత్త్వ గుణము మనుజుని సౌఖ్యమునందు బంధించును, రజోగుణము అతనిని కామ్యకర్మమునందు బంధించును, తమోగుణము జ్ఞానమును కప్పివేయుట ద్వారా బుద్ధిహీనత యందు అతనిని బంధించును.

🌷. భాష్యము : తత్త్వవేత్తగాని, విజ్ఞానశాస్త్రవేత్తగాని లేదా విద్యనొసగు అధ్యాపకుడుగాని తన జ్ఞానరంగమందు నియుక్తుడై తద్ద్వారా సంతృప్తుడై యుండునట్లు, సత్త్వగుణము నందున్నవాడు తన కర్మచే లేదా జ్ఞానసముపార్జనా యత్నముచే తృప్తుడై యుండును. రజోగుణము నందున్నవాడు కామ్యకర్మల యందు రతుడై శక్త్యానుసారముగా ధనమును కూడబెట్టును. పిదప అట్టి ధనమును సత్కార్యములకై వినియోగించుటకు అతడి కొన్నిమార్లు వైద్యశాలలను నిర్మించుట, ధర్మసంస్థలకు దానమిచ్చుట వంటి కర్మల నొనరించుచుండును. ఇట్టి కార్యములన్నియును రజోగుణము నందున్నవాని లక్షణములు. ఇక తమోగుణలక్షణము మనుజుని జ్ఞానమును కప్పివేయుట. అట్టి తమోగుణము నందు మనుజుడు ఏది ఒనరించినను అది అతనికిగాని, ఇతరులకుగాని మేలును చేయజాలదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 533 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 09 🌴

09. sattvaṁ sukhe sañjayati rajaḥ karmaṇi bhārata
jñānam āvṛtya tu tamaḥ pramāde sañjayaty uta


🌷 Translation : O son of Bharata, the mode of goodness conditions one to happiness; passion conditions one to fruitive action; and ignorance, covering one’s knowledge, binds one to madness.

🌹 Purport : A person in the mode of goodness is satisfied by his work or intellectual pursuit, just as a philosopher, scientist or educator may be engaged in a particular field of knowledge and may be satisfied in that way. A man in the mode of passion may be engaged in fruitive activity; he owns as much as he can and spends for good causes. Sometimes he tries to open hospitals, give to charity institutions, etc. These are signs of one in the mode of passion. And the mode of ignorance covers knowledge. In the mode of ignorance, whatever one does is good neither for him nor for anyone.

🌹 🌹 🌹 🌹 🌹

25 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 532: 14వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 532: Chap. 14, Ver. 08


🌹. శ్రీమద్భగవద్గీత - 532 / Bhagavad-Gita - 532 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 8 🌴

08. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ |
ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత ||


🌷. తాత్పర్యం : ఓ భరతవంశీయుడా! అజ్ఞానము వలన పుట్టిన తమోగుణము ఎల్లదేహధారులకు మోహకారణమని యెరుంగుము. జీవుని బంధించునటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర యనునవి ఈ తమోగుణపు ఫలములై యున్నవి.

🌷. భాష్యము : ఈ శ్లోకమునందలి “తు” అను ప్రత్యేక పదప్రయోగమునకు మిక్కిలి ప్రాముఖ్యము కలదు. జీవునికి తమోగుణము ఒక అత్యంత విచిత్ర లక్షణమని తెలియజేయుటయే దాని భావము. వాస్తవమునకు తమోగుణము సత్వగుణమునకు సంపూర్ణముగా విరుద్ధమైనది. సత్త్వగుణమునందు జ్ఞానాభివృద్ది కారణముగా మనుజుడు ఏది యెట్టిదో తెలియగలుగుచుండ, తమోగుణమునందు దానికి వ్యతిరేకఫలములను పొందుచుండును. అనగా తమోగుణమునందున్న ప్రతివాడును బుద్ధిహీనతను కలిగియున్నందున ఏది యెట్టిదో ఎరుగకుండును. తత్కారణముగా ప్రగతికి బదులు పతనము నొందును.

అట్టి తమోగుణము వేదవాజ్మయము నందు “వస్తుయాథాత్మ్య జ్ఞానావరకం విపర్యయ జ్ఞానజనకం తమ:” అని నిర్వచింప బడినది. అనగా అజ్ఞాన కారణముగా మనుజుడు దేనిని కూడా యథాతథముగా అవగాహనము చేసికొనజాలడు. ఉదాహరణమునకు ప్రతియొక్కడు తన తాత మరణించు యుండెననియు, తానును మరణింతుననియు, మానవుడు మరణించు స్వభావము కలవాడనియు ఎరిగియుండును. అలాగుననే అతని సంతానము సైతము మరణించును. అనగా మరణమనునది అవివార్యము. అయినప్పటికిని జనులు నిత్యమైన ఆత్మను పట్టించుకొనక రేయింబవళ్ళు కష్టపడచు ధనమును వెర్రిగా కూడబెట్టుచుందురు. ఇదియే బుద్ధిహీనత యనబడును. ఇట్టి బుద్ధిహీనత లేదా మూర్ఖత కారణముగా వారు ఆధ్యాత్మిక ప్రగతి యెడ విముఖులై యుందురు. అట్టివారు అతి సోమరులై యుందురు. ఆధ్యాత్మికావగాహనకై సత్సంగమునకు ఆహ్వానించినప్పుడు వారు ఆసక్తిని చూపరు.

🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 532 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 08 🌴

08. tamas tv ajñāna-jaṁ viddhi mohanaṁ sarva-dehinām
pramādālasya-nidrābhis tan nibadhnāti bhārata


🌷 Translation : O son of Bharata, know that the mode of darkness, born of ignorance, is the delusion of all embodied living entities. The results of this mode are madness, indolence and sleep, which bind the conditioned soul.

🌹 Purport : In this verse the specific application of the word tu is very significant. This means that the mode of ignorance is a very peculiar qualification of the embodied soul. The mode of ignorance is just the opposite of the mode of goodness. In the mode of goodness, by development of knowledge, one can understand what is what, but the mode of ignorance is just the opposite. Everyone under the spell of the mode of ignorance becomes mad, and a madman cannot understand what is what. Instead of making advancement, one becomes degraded. The definition of the mode of ignorance is stated in the Vedic literature. Vastu-yāthātmya-jñānāvarakaṁ viparyaya-jñāna-janakaṁ tamaḥ: under the spell of ignorance, one cannot understand a thing as it is. For example, everyone can see that his grandfather has died and therefore he will also die; man is mortal.

The children that he conceives will also die. So death is sure. Still, people are madly accumulating money and working very hard all day and night, not caring for the eternal spirit. This is madness. In their madness, they are very reluctant to make advancement in spiritual understanding. Such people are very lazy. When they are invited to associate for spiritual understanding, they are not much interested. They are not even active like the man who is controlled by the mode of passion. Thus another symptom of one embedded in the mode of ignorance is that he sleeps more than is required. Six hours of sleep is sufficient, but a man in the mode of ignorance sleeps at least ten or twelve hours a day. Such a man appears to be always dejected and is addicted to intoxicants and sleeping. These are the symptoms of a person conditioned by the mode of ignorance.

🌹 🌹 🌹 🌹 🌹

24 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 531: 14వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 531: Chap. 14, Ver. 07


🌹. శ్రీమద్భగవద్గీత - 531 / Bhagavad-Gita - 531 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 7 🌴

07. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసఙ్గసముద్భవమ్ |
తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసఙ్గేన దేహినమ్ ||


🌷. తాత్పర్యం : ఓ కౌంతేయా! అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వలన రజోగుణము ఉద్భవించుచున్నది. దీని కారణమున జీవుడు కామ్యకర్మలచే బద్ధుడగును.

🌷. భాష్యము : స్త్రీ పురుషుల నడుమ గల ఆకర్షణము రజోగుణలక్షణము. అనగా స్త్రీ పురుషుని యెడ ఆకర్షణను కలిగియుండుట మరియు పురుషుడు స్త్రీ యెడ ఆకర్షితుడగుట యనునది రజోగుణమనబడును. ఇట్టి రజోగుణము అధికమైనప్పుడు మనుజుడు భౌతికానందాభిలాషుడై ఇంద్రియసుఖమును అనుభవింపగోరును. అట్టి ఇంద్రియసుఖము కొరకు రజోగుణము నందున్నవాడు సంఘమునందు లేదా దేశమునందు గౌరవమును మరియు చక్కని ఇల్లు, భార్య, సంతానము కలిగిన సుఖసంసారమును వాంచించును. ఇవియన్నియును రజోగుణము నుండి పుట్టినవే. ఇట్టి విషయములకై ప్రాకులాడునంత కాలము అతడు అధికముగా శ్రమింప వలసి వచ్చును.

కనుకనే రజోగుణము నందున్నవాడు తన కర్మఫలముల యెడ రతుడై యుండి, ఆ కర్మలచే బంధితుడగునని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. భార్యను, సంతానమును, సంఘమును సంతృప్తిపరచుటకు మరియు తన గౌరవమును నిలుపుకొనుటకు మనుజుడు సదా కర్మయందు నిమగ్నుడు కావలసివచ్చును. దీనిని బట్టి భౌతికప్రపంచమంతయు ఇంచుమించుగా రజోగుణమునందు ఉన్నదనియే చెప్పవచ్చును. రజోగుణము దృష్ట్యా నవనాగరికత అభివృద్ది నొందినట్లు పరిగణింపబడినను వాస్తవమునకు సత్త్వగుణాభివృద్దియే ప్రగతిగా పరిగణింపబడును. పూర్వము ఆ విధముగనే భావింపబడెడిది. సత్త్వగుణమునందు నిలిచినవారికే ముక్తిలేదన్నచో రజోగుణమున బద్ధులైనవారి మాట వేరుగా చెప్పానేల?

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 531 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 07 🌴

07. rajo rāgātmakaṁ viddhi tṛṣṇā-saṅga-samudbhavam
tan nibadhnāti kaunteya karma-saṅgena dehinam


🌷 Translation : The mode of passion is born of unlimited desires and longings, O son of Kuntī, and because of this the embodied living entity is bound to material fruitive actions.

🌹 Purport :The mode of passion is characterized by the attraction between man and woman. Woman has attraction for man, and man has attraction for woman. This is called the mode of passion. And when the mode of passion is increased, one develops the hankering for material enjoyment. He wants to enjoy sense gratification. For sense gratification, a man in the mode of passion wants some honor in society, or in the nation, and he wants to have a happy family, with nice children, wife and house. These are the products of the mode of passion.

As long as one is hankering after these things, he has to work very hard. Therefore it is clearly stated here that he becomes associated with the fruits of his activities and thus becomes bound by such activities. In order to please his wife, children and society and to keep up his prestige, one has to work. Therefore, the whole material world is more or less in the mode of passion. Modern civilization is considered to be advanced in the standard of the mode of passion. Formerly, the advanced condition was considered to be in the mode of goodness. If there is no liberation for those in the mode of goodness, what to speak of those who are entangled in the mode of passion?

🌹 🌹 🌹 🌹 🌹


23 Sept 2020


శ్రీమద్భగవద్గీత - 530: 14వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 530: Chap. 14, Ver. 06


🌹. శ్రీమద్భగవద్గీత - 530 / Bhagavad-Gita - 530 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 6 🌴

06. తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశమనామయమ్ |
సుఖసఙ్గేన బధ్నాతి జ్ఞానసఙ్గేన చానఘ ||


🌷. తాత్పర్యం : ఓ పాపరహితుడా! సత్త్వగుణము మిగిలిన రెండు గుణముల కన్నను పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మనుజుని సర్వపాపఫలము నుండి ముక్తుని చేయును. ఆ గుణము నందున్న వారు సుఖభావన చేతను, జ్ఞానభావన చేతను బద్ధులగుదురు.

🌷. భాష్యము : భౌతికప్రకృతిచే బద్ధులయ్యెడి జీవులు పలురకములుగా నుందురు. వారిలో ఒకడు సుఖిగా గోచరించును, వేరొకడు క్రియాశీలుడుగా కనిపించును, మరి ఇంకొకడు నిస్సహాయునిగా నుండును. మనస్సునకు సంబంధించిన ఇట్టి భావములే ప్రకృతి యందు జీవుల బద్దస్థితికి కారణములగుచున్నవి. జీవులెట్లు వివిధరీతులుగా బంధితులగుదురో ఈ అధ్యాయమున వివరింపబడినది. అట్టి బంధకారణములలో మొదట ఇచ్చట సత్త్వగుణము పరిశీలింపబడుచున్నది. సత్త్వగుణము నలవరచుకొనుట ద్వారా మనుజుడు బద్ధులైన ఇతర గుణములవారి కన్నను బుద్ధిమంతుడగును. జగములో సత్త్వగుణాభివృద్ధి యొక్క ఫలమిదియే.

ఆ విధముగా సత్త్వగుణమును వృద్ధిచేసికొనినవాడు భౌతికక్లేశములచే అంతగా ప్రభావితుడు కాడు. అంతియేగాక అట్టివాడు జ్ఞానమును పొందవలెనను భావనయు కలిగియుండును. అట్లు సత్త్వగుణము నందు స్థితుడై యుండవలెను. సత్త్వగుణము నందలి సుఖభావనకు మనుజుడు తాను దాదాపు సర్వపాపముల నుండి ముక్తిని పొందియున్నాననెడి అవగాహనయే కారణము. కాని వాస్తవమునకు వేదంజ్ఞానము ప్రకారము సత్త్వగుణమనగా ఉన్నతమైన జ్ఞానము మరియు అధికతరమైన సుఖభావనమని భావము. కాని వచ్చిన చిక్కేమనగా జీవుడు సత్త్వగుణమునందు స్థితుడైనంతనే తాను జ్ఞానాభివృద్ధి నొందితిననియు మరియు ఇతరులకన్నను మెరుగనియు తలచును. ఈ విధముగా అతడు బద్ధుడగును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 530 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 06 🌴

06. tatra sattvaṁ nirmalatvāt prakāśakam anāmayam
sukha-saṅgena badhnāti jñāna-saṅgena cānagha


🌷 Translation : O sinless one, the mode of goodness, being purer than the others, is illuminating, and it frees one from all sinful reactions. Those situated in that mode become conditioned by a sense of happiness and knowledge.

🌹 Purport : The living entities conditioned by material nature are of various types. One is happy, another is very active, and another is helpless. All these types of psychological manifestations are causes of the entities’ conditioned status in nature. How they are differently conditioned is explained in this section of Bhagavad-gītā. The mode of goodness is first considered. The effect of developing the mode of goodness in the material world is that one becomes wiser than those otherwise conditioned. A man in the mode of goodness is not so much affected by material miseries, and he has a sense of advancement in material knowledge.

The representative type is the brāhmaṇa, who is supposed to be situated in the mode of goodness. This sense of happiness is due to understanding that, in the mode of goodness, one is more or less free from sinful reactions. Actually, in the Vedic literature it is said that the mode of goodness means greater knowledge and a greater sense of happiness. The difficulty here is that when a living entity is situated in the mode of goodness he becomes conditioned to feel that he is advanced in knowledge and is better than others. In this way he becomes conditioned.

🌹 🌹 🌹 🌹 🌹

22 Sept 2020


శ్రీమద్భగవద్గీత - 529: 14వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 529: Chap. 14, Ver. 05


🌹. శ్రీమద్భగవద్గీత - 529 / Bhagavad-Gita - 529 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 5 🌴

05. సత్త్వం రజస్తమ ఇతి గుణా: ప్రకృతిసమ్భవా : |
నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ||


🌷. తాత్పర్యం : ఓ మహాబాహుడవైన అర్జునా! భౌతిక ప్రకృతి సత్త్వరజస్తమో గుణములనెడి మూడు గుణములను కలిగి యుండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును.

🌷. భాష్యము : జీవుడు దివ్యుడైనందున వాస్తవమునకు ప్రకృతితో ఎట్టి సంబంధము లేనివాడు. అయినను భౌతిక జగత్తు నందు అతడు బంధితుడగుట వలన భౌతిక ప్రకృతి త్రిగుణముల ననుసరించి వర్తించు చుండును. జీవులు ప్రకృతి త్రిగుణముల ననుసరించి వివిధ దేహములను కలిగి యుండుట వలన ఆ గుణముల ననుసరించియే వర్తించ వలసి వచ్చును. ఇట్టి వర్తనమే వివిధములైన సుఖదుఃఖములకు కారణమగుచున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 529 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 05 🌴

05. sattvaṁ rajas tama iti guṇāḥ prakṛti-sambhavāḥ
nibadhnanti mahā-bāho dehe dehinam avyayam


🌷 Translation : Material nature consists of three modes – goodness, passion and ignorance. When the eternal living entity comes in contact with nature, O mighty-armed Arjuna, he becomes conditioned by these modes.

🌹 Purport : The living entity, because he is transcendental, has nothing to do with this material nature. Still, because he has become conditioned by the material world, he is acting under the spell of the three modes of material nature.

Because living entities have different kinds of bodies, in terms of the different aspects of nature, they are induced to act according to that nature. This is the cause of the varieties of happiness and distress.

🌹 🌹 🌹 🌹 🌹


21 Sept 2020


శ్రీమద్భగవద్గీత - 528: 14వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 528: Chap. 14, Ver. 04


🌹. శ్రీమద్భగవద్గీత - 528 / Bhagavad-Gita - 528 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 4 🌴

04. సర్వయోనిషు కౌన్తేయ మూర్తయ: సమ్భవన్తి యా: |
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రద: పితా: ||


🌷. తాత్పర్యం : ఓ కౌంతేయా! సర్వజీవ సముదాయము భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నదనియు మరియు నేనే వాటికి బీజప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసికొన వలెను.

🌷. భాష్యము : దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వజీవులకు ఆది జనకుడనని ఈ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. వారు భౌతికప్రకృతి మరియు ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క సంయోగము వంటివారు. అట్టి జీవులు ఈ లోకమునందే గాక, ప్రతిలోక మందును ఉన్నారు. అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకమునందు వారి నిలిచి యున్నారు. సర్వత్రా నిలిచియున్న అట్టి జీవులు భూమి యందును, జలము నందును, అగ్ని యందును స్థితిని కలిగి యున్నారు.

ఈ ఉద్భవము లన్నింటికిని ప్రకృతి మరియు శ్రీకృష్ణుని బీజప్రదానములే కారణము. సారాంశమేమనగా సృష్టి సమయమున తమ పూర్వకర్మల ననుసరించి వివిధరూపములను పొందు జీవులు భౌతికప్రకృతి గర్భమున బీజరూపమున ఉంచబడుదురు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 528 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 04 🌴

04. sarva-yoniṣu kaunteya mūrtayaḥ sambhavanti yāḥ
tāsāṁ brahma mahad yonir ahaṁ bīja-pradaḥ pitā


🌷 Translation : It should be understood that all species of life, O son of Kuntī, are made possible by birth in this material nature, and that I am the seed-giving father.

🌹 Purport : In this verse it is clearly explained that the Supreme Personality of Godhead, Kṛṣṇa, is the original father of all living entities. The living entities are combinations of the material nature and the spiritual nature.

Such living entities are seen not only on this planet but on every planet, even on the highest, where Brahmā is situated. Everywhere there are living entities; within the earth there are living entities, even within water and within fire. All these appearances are due to the mother, material nature, and Kṛṣṇa’s seed-giving process. The purport is that the material world is impregnated with living entities, who come out in various forms at the time of creation according to their past deeds.

🌹 🌹 🌹 🌹 🌹


20 Sept 2020


శ్రీమద్భగవద్గీత - 527: 14వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 527: Chap. 14, Ver. 03


🌹. శ్రీమద్భగవద్గీత - 527 / Bhagavad-Gita - 527 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 3 🌴


03. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్ |
సమ్భవ: సర్వభూతానాం తతో భవతి భారత ||

🌷. తాత్పర్యం : ఓ భరతవంశీయుడా! బ్రహ్మముగా పిలువబడు మహతత్త్వము సమస్త జననమునకు ఆధారమై యున్నది. సర్వజీవుల జన్మను సంభవింపజేయుచు నేనే ఆ బ్రహ్మము నందు బీజప్రదానము కావించుచున్నాను.

🌷. భాష్యము : ఇదియే విశ్వమునందు జరుగుచున్న సమస్తమునకు వివరణము. ప్రతిదియు క్షేత్రము (దేహము) మరియు క్షేత్రజ్ఞుని (ఆత్మ) కలయికచే ఒనగూడుచున్నది. ఇట్టి ప్రకృతి, ఆత్మల కలయిక శ్రీకృష్ణభగవానునిచే సాధ్యము కావింపబడును. వాస్తవమునకు “మహతత్త్వము” సమస్త విశ్వమునకు సర్వ కారణమై యున్నది. త్రిగుణపూర్ణమైన ఆ మహతత్త్వమే కొన్నిమార్లు బ్రహ్మముగా పిలువబడును. దానియందే శ్రీకృష్ణభగవానుడు బీజప్రదానము చేయగా అసంఖ్యాకమగు విశ్వములు ఉత్పత్తి యగును.

అట్టి మహతత్త్వము ముండకోపనిషత్తు (1.1.9) నందు బ్రహ్మముగా వర్ణింపబడినది. “తస్మాదేతద్ బ్రహ్మ నామ రూపమన్నం చ జాయతే”. అట్టి బ్రహ్మము నందు భగవానుడు జీవులను బీజరూపమున ఉంచును. భూమి, జలము, అగ్ని, వాయువు మొదలుగా గల చతుర్వింశతి మూలకములన్నియును భౌతికశక్తిగా పరిగణింపబడును మరియ అవియే మహద్భ్రహ్మమనబడును భౌతికప్రకృతిని రూపొందించును. సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు దీనికి పరమైన దివ్య ప్రకృతియే జీవుడు. దేవదేవుని సంకల్పముచే భౌతికప్రకృతి యందు ఉన్నతప్రకృతి మిశ్రణము కావింపబడును. తదనంతరము జీవులందరును భౌతికప్రకృతి యందు జన్మింతురు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 527 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 03 🌴

03. mama yonir mahad brahma tasmin garbhaṁ dadhāmy aham
sambhavaḥ sarva-bhūtānāṁ tato bhavati bhārata

🌷 Translation : The total material substance, called Brahman, is the source of birth, and it is that Brahman that I impregnate, making possible the births of all living beings, O son of Bharata.

🌹 Purport : This is an explanation of the world: everything that takes place is due to the combination of kṣetra and kṣetra-jña, the body and the spirit soul. This combination of material nature and the living entity is made possible by the Supreme God Himself. The mahat-tattva is the total cause of the total cosmic manifestation; and that total substance of the material cause, in which there are three modes of nature, is sometimes called Brahman. The Supreme Personality impregnates that total substance, and thus innumerable universes become possible.

This total material substance, the mahat-tattva, is described as Brahman in the Vedic literature (Muṇḍaka Upaniṣad 1.1.19): tasmād etad brahma nāma-rūpam annaṁ ca jāyate. The Supreme Person impregnates that Brahman with the seeds of the living entities. The twenty-four elements, beginning from earth, water, fire and air, are all material energy, and they constitute what is called mahad brahma, or the great Brahman, the material nature. As explained in the Seventh Chapter, beyond this there is another, superior nature – the living entity. Into material nature the superior nature is mixed by the will of the Supreme Personality of Godhead, and thereafter all living entities are born of this material nature.

🌹 🌹 🌹 🌹 🌹

19 Sept 2020


శ్రీమద్భగవద్గీత - 526: 14వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 526: Chap. 14, Ver. 02


🌹. శ్రీమద్భగవద్గీత - 526 / Bhagavad-Gita - 526 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 2 🌴

02. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతా: |
సర్గేఅపి నోపజాయన్తే ప్రళయే న వ్యథన్తి చ ||


🌷. తాత్పర్యం : ఈ జ్ఞానమునందు స్థిరముగా నిలుచుట ద్వారా మనుజుడు నా దివ్యత్వము వంటి దివ్యత్వమును పొందగలడు. ఆ విధముగా ప్రతిష్టితుడై అతడు సృష్టి సమయమున జన్మింపడు లేదా ప్రళయ సమయమున వ్యథ నొందడు.

🌷. భాష్యము : సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానమును పొందిన పిమ్మట మనుజుడు శ్రీకృష్ణభగవానునితో గుణరీతి ఏకత్వమును పొంది జన్మమృత్యుపరంపర నుండి ముక్తిని బడయును. అంతియే గాని ఆత్మగా అతడెన్నడును తన వ్యక్తిత్వమును కోల్పోవడు. కనుకనే ఆధ్యాత్మిక జగత్తు నందలి దివ్యలోకములను చేరిన ముక్తాత్ములు శ్రీకృష్ణభగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో నిలిచి, ఆ పరమపురుషుని పాదపద్మములనే సదా దర్శింపగోరుదురని వేదవాజ్మయమున తెలుపబడినది. అనగా ముక్తినొందిన పిదపయు భక్తులు తమ నిజస్వరూపమును మరియు వ్యక్తిత్వమును కోల్పోవరు. ఈ భౌతికజగమునందు మనము సంపాదించిన జ్ఞానమంతయు త్రిగుణములచే మలినమై యుండును. త్రిగుణములచే మలినపడని జ్ఞానమే ఆధ్యాత్మికజ్ఞానము. అట్టి దివ్యమైన ఆధ్యాత్మికజ్ఞానమునందు స్థితుడైనంతనే మనుజుడు దేవదేవునితో సమానస్థాయిలో నిలుచును. ఆధ్యాత్మికజగమును గూర్చిన జ్ఞానము లేనటువంటి నిరాకారవాదులు భౌతికజగత్తు కర్మల నుండి ముక్తినొందినంతనే వైవిధ్యమన్నది లేకుండ ఆత్మ రూపరహితమగునని పలుకుదురు.

కాని వాస్తవమునకు భౌతికజగమునందు భౌతికత్వమున వైవిధ్యమున్నట్లే ఆధ్యాత్మికజగత్తు నందు కూడా వైవిధ్యమున్నది. ఈ విషయమున అజ్ఞానులైనవారే ఆధ్యాత్మికస్థితి వైవిద్యమునకు విరుద్ధమని తలతురు. కాని నిజమునకు ముక్తి పిమ్మట మనుజుడు ఆధ్యాత్మికజగమున ఆధ్యాత్మికరూపమును పొందును. అట్టి ఆధ్యాత్మికజగమున పలు ఆధ్యాత్మిక కర్మలు గలవు. అచ్చటి ఆధ్యాత్మికస్థితియే భక్తిమయ జీవనమనబడును. అట్టి ఆధ్యాత్మికస్థితి గుణరహితమనియు, ప్రతియొక్కరు అచ్చట భగవానునితో గుణరీతిని సమానమై యుందురనియు చెప్పబడినది. అటువంటి జ్ఞానసముపార్జనమునకు మనుజుడు ఆధ్యాత్మికగుణములను వృద్ధి చేసికొన వలయును. ఆ రీతి ఆధ్యాత్మికగుణములను వృద్ధిచేసికొనిన వాడు భౌతికజగత్తు సృష్టిచే గాని, ప్రలయముచే గాని వ్యథ నొందడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 526 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 02 🌴

02. idaṁ jñānam upāśritya mama sādharmyam āgatāḥ
sarge ’pi nopajāyante pralaye na vyathanti ca


🌷 Translation : By becoming fixed in this knowledge, one can attain to the transcendental nature like My own. Thus established, one is not born at the time of creation or disturbed at the time of dissolution.

🌹 Purport : After acquiring perfect transcendental knowledge, one acquires qualitative equality with the Supreme Personality of Godhead, becoming free from the repetition of birth and death. One does not, however, lose his identity as an individual soul. It is understood from Vedic literature that the liberated souls who have reached the transcendental planets of the spiritual sky always look to the lotus feet of the Supreme Lord, being engaged in His transcendental loving service. So, even after liberation, the devotees do not lose their individual identities. Generally, in the material world, whatever knowledge we get is contaminated by the three modes of material nature. Knowledge which is not contaminated by the three modes of nature is called transcendental knowledge. As soon as one is situated in that transcendental knowledge, he is on the same platform as the Supreme Person.

However, just as there is material variegatedness in this world, in the spiritual world there is also variegatedness. Those in ignorance of this think that spiritual existence is opposed to material variety. But actually, in the spiritual sky, one attains a spiritual form. There are spiritual activities, and the spiritual situation is called devotional life. That atmosphere is said to be uncontaminated, and there one is equal in quality with the Supreme Lord. To obtain such knowledge, one must develop all the spiritual qualities. One who thus develops the spiritual qualities is not affected either by the creation or by the destruction of the material world.

🌹 🌹 🌹 🌹 🌹

17 Sept 2020



శ్రీమద్భగవద్గీత - 525: 14వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 525: Chap. 14, Ver. 01


🌹. శ్రీమద్భగవద్గీత - 525 / Bhagavad-Gita - 525 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 1 🌴


01. శ్రీ భగవానువాచ

పరం భూయ: ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ |
యజ్జ్ఞాత్వా మునయ: సర్వే పరాం సిద్ధిమితో గతా: ||

🌷. తాత్పర్యం : దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను : దేనిని తెలిసికొని మునులందరును పరమసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలో కెల్ల ఉత్తమమైన ఈ దివ్యజ్ఞానమును నీకిప్పుడు నేను మరల తెలియ జేయుదును.

🌷. భాష్యము : సప్తమాధ్యాయము నుండి ద్వాదశాధ్యాయపు అంతము వరకు పరతత్త్వమును, దేవదేవుడును అగు తనను గూర్చి విశదముగా వివరించిన శ్రీకృష్ణభగవానుడు తిరిగి ఇప్పుడు అర్జునునకు మరింత జ్ఞానవికాసమును కలిగించుచున్నాడు. తాత్త్విక చింతన విధానము ద్వారా ఈ అధ్యాయమును అవగాహన చేసికొనినచో మనుజుడు శీఘ్రముగా భక్తియోగమును అవగతము చేసికొనగలడు. నమ్రతతో జ్ఞానాభివృద్ధిని సాధించుట ద్వారా జీవుడు భౌతికబంధము నుండి ముక్తుడు కాగలడని గడచిన త్రయోదశాధ్యాయమున వివరింపబడినది. ఆలాగుననే ప్రకృతి త్రిగుణముల సంపర్కము చేతనే జీవుడు భౌతికజగములో బంధితుడగుననియు పూర్వము తెలుపబడినది.

ఇక ప్రస్తుతము ఈ అధ్యాయమున ప్రకృతి త్రిగుణములనేవో, అవి ఎట్లు వర్తించునో, ఏ విధముగా అవి బంధ, మోక్షములను గూర్చునో దేవదేవుడైన శ్రీకృష్ణుడు తెలియజేయుచున్నాడు. ఈ అధ్యాయమునందు తెలుపబడిన జ్ఞానము పూర్వపు అధ్యాయములందు తెలుపబడిన జ్ఞానము కన్నను మిగుల శ్రేష్టమని భగవానుడు పలుకుచున్నాడు. అట్టి ఈ జ్ఞానమును అవగాహనము చేసికొనుట ద్వారా పలువురు మునులు పరమసిద్ధిని పొంది ఆధ్యాత్మిక జగత్తును చేరిరి.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 525 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 01 🌴


01. śrī-bhagavān uvāca

paraṁ bhūyaḥ pravakṣyāmi jñānānāṁ jñānam uttamam
yaj jñātvā munayaḥ sarve parāṁ siddhim ito gatāḥ

🌷 Translation : The Supreme Personality of Godhead said: Again I shall declare to you this supreme wisdom, the best of all knowledge, knowing which all the sages have attained the supreme perfection.

🌹 Purport : From the Seventh Chapter to the end of the Twelfth Chapter, Śrī Kṛṣṇa in detail reveals the Absolute Truth, the Supreme Personality of Godhead. Now, the Lord Himself is further enlightening Arjuna. If one understands this chapter through the process of philosophical speculation, he will come to an understanding of devotional service. In the Thirteenth Chapter, it was clearly explained that by humbly developing knowledge one may possibly be freed from material entanglement.

It has also been explained that it is due to association with the modes of nature that the living entity is entangled in this material world. Now, in this chapter, the Supreme Personality explains what those modes of nature are, how they act, how they bind and how they give liberation. The knowledge explained in this chapter is proclaimed by the Supreme Lord to be superior to the knowledge given so far in other chapters. By understanding this knowledge, various great sages attained perfection and transferred to the spiritual world. The Lord now explains the same knowledge in a better way. This knowledge is far, far superior to all other processes of knowledge thus far explained, and knowing this many attained perfection. Thus it is expected that one who understands this Fourteenth Chapter will attain perfection.

🌹 🌹 🌹 🌹 🌹

16 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 524: 13వ అధ్., శ్లో 35 / Bhagavad-Gita - 524: Chap. 13, Ver. 35


🌹. శ్రీమద్భగవద్గీత - 524 / Bhagavad-Gita - 524 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 35 🌴

35. క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమన్తరం జ్ఞానచక్షుషా |
భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్ ||


🌷. తాత్పర్యం : దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమ గల భేదమును జ్ఞానదృష్టితో దర్శించి, ప్రకృతిబంధము నుండి మోక్షమును బడయ విధానము నెరుగగలిగినవారు పరమగతిని పొందగలరు.

🌷. భాష్యము : దేహము, దేహయజమానియైన ఆత్మ, పరమాత్ముడు అనెడి మూడు అంశముల నడుమ గల భేదమును మనుజుడు తప్పక తెలిసికొనవలెనని పలుకుటయే ఈ త్రయోదశాయాధ్యాయపు సారాంశము. ఈ అధ్యాయమునందు ఎనిమిదవశ్లోకము నుండి పండ్రెండవ శ్లోకము వరకు వివరించిన మోక్షవిధానమును సైతము ప్రతియొక్కరు గుర్తింపవలెను. అంతటవారు పరమగతిని పొందగలరు. శ్రద్ధావంతుడైన మనుజుడు తొలుత సజ్జనసాంగత్యమును పొంది శ్రీకృష్ణభగవానుని గూర్చి శ్రవణము చేయవలెను. తద్ద్వారా అతడు క్రమముగా ఆత్మవికాసము నొందగలడు. మనుజుడు గురువును స్వీకరించినచో ఆత్మ మరియు అనాత్మల (భౌతికపదార్థము) నడుమగల వ్యత్యాసమును తెలియగలుగును. అది యంతట మరింత ఆధ్యాత్మికానుభూతికి సోపానము కాగలదు. జీవితపు భౌతిక భావన నుండి ముక్తులు కావలసినదిగా శిష్యులకు ఆధ్యాత్మికగురువు తన వివిధ ఉపదేశముల ద్వారా బోధనల కావించును.

ఈ దేహము భౌతికపదార్థమనియు మరియు ఇరువది నాలుగు తత్త్వములచే విశ్లేషణీయమనియు ఎవ్వరైనను గ్రహింపవచ్చును. ఆత్మ మరియు పరమాత్మ భిన్నులేగాని ఏకము కాదు. ఆత్మ మరియు ఇరువదినాలుగు భౌతికాంశముల సంయోగము చేతనే భౌతికజగత్తు నడుచుచున్నది. భౌతికజగమును ఈ విధమైన ఆత్మ మరియు చతుర్వింశతి తత్త్వముల కలయికగా గాంచుచు పరమాత్ముని నిజస్థితిని దర్శింపగలిగినవాడు ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు అర్హుడగుచున్నాడు. ఈ విషయములన్నియును చింతనము మరియు ఆత్మానుభవము కొరకు ఉద్దేశింపబడియున్నవి. కనుక ఆధ్యాత్మికగురువు సహాయముచే ఈ అధ్యాయము నందలి విషయములను మనుజుడు సంపూర్ణముగా అవగాహనము చేసికొనవలెను.

శ్రీ మద్భగవద్గీత యందలి “క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము” అను త్రయోదశాధ్యాయమునకు భక్తివేదాంత భాష్యము సమాప్తము.


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 524 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 35 🌴

35. ṣetra-kṣetrajñayor evam antaraṁ jñāna-cakṣuṣā
bhūta-prakṛti-mokṣaṁ ca ye vidur yānti te param

🌷 Translation : Those who see with eyes of knowledge the difference between the body and the knower of the body, and can also understand the process of liberation from bondage in material nature, attain to the supreme goal.

🌹 Purport : The purport of this Thirteenth Chapter is that one should know the distinction between the body, the owner of the body, and the Supersoul. One should recognize the process of liberation, as described in verses 8 through 12. Then one can go on to the supreme destination. A faithful person should at first have some good association to hear of God and thus gradually become enlightened. If one accepts a spiritual master, one can learn to distinguish between matter and spirit, and that becomes the stepping-stone for further spiritual realization.

A spiritual master, by various instructions, teaches his students to get free from the material concept of life. For instance, in Bhagavad-gītā we find Kṛṣṇa instructing Arjuna to free him from materialistic considerations. One can understand that this body is matter; it can be analyzed with its twenty-four elements. The soul and the Supersoul are two. This material world is working by the conjunction of the soul and the twenty-four material elements. One who can see the constitution of the whole material manifestation as this combination of the soul and material elements and can also see the situation of the Supreme Soul becomes eligible for transfer to the spiritual world. These things are meant for contemplation and for realization, and one should have a complete understanding of this chapter with the help of the spiritual master.

Thus end the Bhaktivedanta Purports to the Thirteenth Chapter of the Śrīmad Bhagavad-gītā in the Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness

🌹 🌹 🌹 🌹 🌹


15 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 523: 13వ అధ్., శ్లో 34 / Bhagavad-Gita - 523: Chap. 13, Ver. 34


🌹. శ్రీమద్భగవద్గీత - 523 / Bhagavad-Gita - 523 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 34 🌴

34. యథా ప్రకాశయత్యేక: కృత్స్నం లోకమిమం రవి: |
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ||


🌷. తాత్పర్యం : ఓ భరతవంశీయుడా! ఒక్కడేయైన సూర్యుడు లోకమునంతటిని ప్రకాశింపజేయునట్లు, దేహంనందలి ఆత్మ సమస్తదేహమును చైతన్యముతో ప్రకాశింప జేయును.

🌷. భాష్యము : చైతన్యము సంబంధించిన సిద్ధాంతములు పెక్కు గలవు. అట్టి చైతన్యమునకు భగవద్గీత యందు ఇచ్చట సూర్యుడు మరియు సూర్యకాంతి యొక్క ఉపమాన మొసగబడినది. సూర్యుడు ఒక్కచోటనే నిలిచియుండి సమస్త విశ్వమును ప్రకాశింప జేయునట్లు, దేహమునందలి హృదయములో నిలిచియున్నట్టి అణుఆత్మ చైతన్యముచే దేహము నంతటిని ప్రకాశింప జేయుచున్నది. కనుక సూర్యకాంతి లేదా వెలుగు సూర్యుని ఉనికిని నిదర్శమైనట్లే, దేహమునందలి చైతన్యము దేహమునందలి ఆత్మ యొక్క ఉనికికి నిదర్శమైయున్నది. ఆత్మ దేహము నందున్నంత కాలము చైతన్యము సైతము వెడలిపోవును.

అనగా ఆత్మలేని దేహము చైతన్యరహితమగును. తెలివిగల ఎవ్వరికైనను ఇది సులభగ్రాహ్యము. కనుకనే చైతన్యమనునది భౌతికపదార్థ సమ్మేళనముచే ఏర్పడినది కాదని, ఆది ఆత్మ యొక్క లక్షణమని తెలియబడు చున్నది. జీవుని ఈ చైతన్యము భగవానుని దివ్యచైతన్యముతో గుణరీతిగనే సమనముగాని దివ్యమైనది కాదు. ఏలయన జీవుని చైతన్యము ఒక దేహమునకే పరిమితమై యుండు అన్యదేహములను గూర్చి తెలియకుండును. కాని సర్వదేహములలో ఆత్మకు స్నేహితునిగా వర్తించుచు నిలిచియుండెడి పరమాత్ముడు మాత్రము సకల దేహముల నెరిగియుండును. ఇదియే దివ్యచైతన్యము మరియు వ్యక్తిగత చైతన్యము నడుమ గల భేదము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 523 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 34 🌴

34. yathā prakāśayaty ekaḥ kṛtsnaṁ lokam imaṁ raviḥ
kṣetraṁ kṣetrī tathā kṛtsnaṁ prakāśayati bhārata


🌷 Translation : O son of Bharata, as the sun alone illuminates all this universe, so does the living entity, one within the body, illuminate the entire body by consciousness.

🌹 Purport : There are various theories regarding consciousness. Here in Bhagavad-gītā the example of the sun and the sunshine is given. As the sun is situated in one place but is illuminating the whole universe, so a small particle of spirit soul, although situated in the heart of this body, is illuminating the whole body by consciousness. Thus consciousness is the proof of the presence of the soul, as sunshine or light is the proof of the presence of the sun. When the soul is present in the body, there is consciousness all over the body, and as soon as the soul has passed from the body there is no more consciousness.

This can be easily understood by any intelligent man. Therefore consciousness is not a product of the combinations of matter. It is the symptom of the living entity. The consciousness of the living entity, although qualitatively one with the supreme consciousness, is not supreme, because the consciousness of one particular body does not share that of another body. But the Supersoul, which is situated in all bodies as the friend of the individual soul, is conscious of all bodies. That is the difference between supreme consciousness and individual consciousness.

🌹 🌹 🌹 🌹 🌹

14 Sept 2020


శ్రీమద్భగవద్గీత - 522: 13వ అధ్., శ్లో 33 / Bhagavad-Gita - 522: Chap. 13, Ver. 33



🌹. శ్రీమద్భగవద్గీత - 522 / Bhagavad-Gita - 522 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 33 🌴

33. యథా యథా సర్వగతం సాక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే |
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ||

🌷. తాత్పర్యం : సర్వత్ర వ్యాపించియున్నను సూక్ష్మత్వ కారణముగా ఆకాశము దేనితోను కలియనట్లు, బ్రహ్మభావములో నిలిచిన ఆత్మ దేహమునందు నిలిచియున్నను దేహముతో కలియదు.

🌷. భాష్యము : వాయువు అనునది జలము, బురద, మలము వంటి దేని యందు ప్రవేశించినను దేని తోడను కలియదు. అదే విధముగా జీవుడు తన సూక్ష్మత్వ కారణముగా వివిధదేహములందు నిలిచినను వాటికి పరుడైయుండును.

కనుకనే ఏ విధముగా అతడు దేహములో నిలిచియుండునో మరియు దేహము నశించిన పిమ్మట ఎట్లు దేహము నుండి ముక్తుడగునో భౌతికదృష్టిచే గాంచుట అసాధ్యము. విజ్ఞానశాస్త్రము ద్వారా ఎవ్వరును దీనిని తెలిసికొనజాలరు మరియు ధ్రువపరచలేరు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 522 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 33 🌴

33. yathā sarva-gataṁ saukṣmyād ākāśaṁ nopalipyate
sarvatrāvasthito dehe tathātmā nopalipyate


🌷 Translation : The sky, due to its subtle nature, does not mix with anything, although it is all-pervading. Similarly, the soul situated in Brahman vision does not mix with the body, though situated in that body.

🌹 Purport : The air enters into water, mud, stool and whatever else is there; still it does not mix with anything. Similarly, the living entity, even though situated in varieties of bodies, is aloof from them due to his subtle nature.

Therefore it is impossible to see with the material eyes how the living entity is in contact with this body and how he is out of it after the destruction of the body. No one in science can ascertain this.

🌹 🌹 🌹 🌹 🌹


13 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 521: 13వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 521: Chap. 13, Ver. 32


🌹. శ్రీమద్భగవద్గీత - 521 / Bhagavad-Gita - 521 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 32 🌴

32. అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మా యమవ్యయ: |
శరీరస్థోపి కౌన్తేయ న కరోతి న లిప్యతే ||


🌷. తాత్పర్యం : నిత్యదృష్టి కలిగినవారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగను, నిత్యమైనదిగను, త్రిగుణాతీతమైనదిగను దర్శింతురు. ఓ అర్జునా! అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగియున్నను కర్మనొనరింపదు మరియు బద్ధము కాదు.

🌷. భాష్యము : దేహము జన్మించుచున్నందున జీవుడును జన్మించినట్లు గోచరించుచుండును. కాని వాస్తవమునకు జీవుడు నిత్యమైనవాడు మరియు జన్మలేనటువంటివాడు. దేహమునందు నిలిచియున్నను అతడు దివ్యుడు మరియు నిత్యుడు. కనుక అతడ నశింపులేనివాడు. స్వభావరీత్యా అతడు ఆనందపూర్ణుడు. భౌతికకర్మల యందు అతడు నిమగ్నుడు కానందున దేహసంపర్కముచే ఒనరింపబడు కర్మలు అతనిని బంధింపవు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 521 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 32 🌴

32. anāditvān nirguṇatvāt paramātmāyam avyayaḥ
śarīra-stho ’pi kaunteya na karoti na lipyate


🌷 Translation : Those with the vision of eternity can see that the imperishable soul is transcendental, eternal, and beyond the modes of nature. Despite contact with the material body, O Arjuna, the soul neither does anything nor is entangled.

🌹 Purport : A living entity appears to be born because of the birth of the material body, but actually the living entity is eternal; he is not born, and in spite of his being situated in a material body, he is transcendental and eternal. Thus he cannot be destroyed. By nature he is full of bliss. He does not engage himself in any material activities; therefore the activities performed due to his contact with material bodies do not entangle him.

🌹 🌹 🌹 🌹 🌹

12 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 520: 13వ అధ్., శ్లో 31 / Bhagavad-Gita - 520: Chap. 13, Ver. 31


🌹. శ్రీమద్భగవద్గీత - 520 / Bhagavad-Gita - 520 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 31 🌴

31. యదా భూతపృథ గ్భావమేకస్థ మనుపశ్యతి |
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ||


🌷. తాత్పర్యం : బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి, జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించిరో గాంచినపుడు బ్రహ్మభావమును పొందును.

🌷. భాష్యము : జీవుల వివిధ కోరికల ననుసరించియే వారి వివిధదేహములు సృజింపబడు చున్నవనియు, వాస్తవముగా ఆ దేహములన్నియు ఆత్మకు సంబంధించినవి కావనియు దర్శించగలిగినప్పుడే మనుజుడు నిజదృష్టి కలిగినవాడగును. భౌతికదృష్టిలో కొందరు జీవులు దేవతారూపమున, కొందరు మానవరూపమున, కొందరు శునక, మార్జాలాది రూపమున గోచరింతురు.

ఇట్టి దృష్టి భౌతికమేగాని వాస్తవదృష్టి కాదు. ఈ భేదభావనమునకు జీవితపు భౌతిక భావనయే కారణము. కాని వాస్తవమునకు దేహము నశించిన పిమ్మట మిగులునది ఆత్మ ఒక్కటియే. ఆ ఆత్మయే భౌతికప్రకృతి సంపర్కము వలన వివిధదేహములను పొందుచుండును. ఈ విషయములను గాంచగలిగినవాడు ఆధ్యాత్మికదృష్టిని బడయగలడు. ఈ విధముగా మనిషి, మృగము, పెద్ద, చిన్న మొదలుగు భేదభావముల నుండి ముక్తుడై, చైతన్యమును శుద్ధి పరచుకొనిన వాడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమున కృష్ణభక్తిభావనను వృద్ధిచేసికొనగలడు. అట్టి భక్తుడు ఏ విధముగా సర్వమును గాంచునో తరువాతి శ్లోకమున వివరింపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 520 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 31 🌴

31. yadā bhūta-pṛthag-bhāvam eka-stham anupaśyati
tata eva ca vistāraṁ brahma sampadyate tadā


🌷 Translation : When a sensible man ceases to see different identities due to different material bodies and he sees how beings are expanded everywhere, he attains to the Brahman conception.

🌹 Purport : When one can see that the various bodies of living entities arise due to the different desires of the individual soul and do not actually belong to the soul itself, one actually sees. In the material conception of life, we find someone a demigod, someone a human being, a dog, a cat, etc. This is material vision, not actual vision.

This material differentiation is due to a material conception of life. After the destruction of the material body, the spirit soul is one. The spirit soul, due to contact with material nature, gets different types of bodies. When one can see this, he attains spiritual vision; thus being freed from differentiations like man, animal, big, low, etc., one becomes purified in his consciousness and able to develop Kṛṣṇa consciousness in his spiritual identity. How he then sees things will be explained in the next verse.

🌹 🌹 🌹 🌹 🌹

11 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 519: 13వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 519: Chap. 13, Ver. 30


🌹. శ్రీమద్భగవద్గీత - 519 / Bhagavad-Gita - 519 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 30 🌴

30. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశ: |
య: పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి ||


🌷. తాత్పర్యం : భౌతికప్రకృతిచే సృష్టింపబడిన దేహము చేతనే సర్వకార్యములు ఒనరింపబడు చున్నవనియు మరియు తాను అకర్తననియు గాంచగలిగినవాడు యథార్థదృష్టి కలిగినట్టివాడు.

🌷. భాష్యము : ఈ దేహము పరమాత్ముని నిర్దేశములో భౌతికప్రకృతిచే తయారుచేయబడును. అట్టి దేహపరమగు సమస్త కార్యములకు ఆత్మ కర్త కాదు. దేహస్మృతి కారణముననే చేయవలసిన కార్యములన్నియును మనుజునిచే బలవంతముగా చేయింపబడుచున్నవి. అట్టి కార్యములు సుఖము కొరకైనను లేదా దుఃఖము కొరకైనను సరియే. కాని వాస్తవమునకు ఆత్మ అట్టి సర్వదేహకార్యములకు పరమైనది. జీవుని పూర్వపు కోరికల ననుసరించి అతనికి దేహమొసగబడుచుండును.

కోరికలను తీర్చుకొనుటకు ఒసగబడిన దేహముతో జీవుడు ఆ కోరికల ననుసరించి వర్తించుచుండును. అనగా ఈ దేహము జీవుడు తన కోరికలను పూర్ణము చేసికొనుటకు భగవానునిచే రూపొందించబడిన యంత్రము వంటిది. అట్టి కోరికల కారణముననే మనుజుడు సుఖదుఃఖముల ననుభవించు కొరకై వివిధ పరిస్థితుల యందుంచబడును. ఇట్టి ఆధ్యాత్మిక దృష్టి అభివృద్ధినొందినంతనే మనుజుడు తనను తన దేహకార్యముల నుండి అన్యముగా గాంచును. అట్టి ఆధ్యాత్మికదృష్టి కలిగినవాడే నిజమైన ద్రష్ట.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 519 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 30 🌴

30. prakṛtyaiva ca karmāṇi kriyamāṇāni sarvaśaḥ
yaḥ paśyati tathātmānam akartāraṁ sa paśyati

🌷 Translation : One who sees the Supersoul equally present everywhere, in every living being, does not degrade himself by his mind. Thus he approaches the transcendental destination.

🌹 Purport : This body is made by material nature under the direction of the Supersoul, and whatever activities are going on in respect to one’s body are not his doing. Whatever one is supposed to do, either for happiness or for distress, one is forced to do because of the bodily constitution. The self, however, is outside all these bodily activities. This body is given according to one’s past desires. To fulfill desires, one is given the body, with which he acts accordingly.

Practically speaking, the body is a machine, designed by the Supreme Lord, to fulfill desires. Because of desires, one is put into difficult circumstances to suffer or to enjoy. This transcendental vision of the living entity, when developed, makes one separate from bodily activities. One who has such a vision is an actual seer.

🌹 🌹 🌹 🌹 🌹

10 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 518: 13వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 518: Chap. 13, Ver. 29


🌹. శ్రీమద్భగవద్గీత - 518 / Bhagavad-Gita - 518 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 29 🌴

29. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ |
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ ||


🌷. తాత్పర్యం : సర్వత్ర ప్రతిజీవి యందును సమముగా నిలిచియుండు పరమాత్మను దర్శించువాడు తన మనస్సుచే తనను తాను హీనపరచుకొనడు. ఆ విధముగా అతడు పరమగతిని పొందగలడు.

🌷. భాష్యము : జీవుడు భౌతికస్థితిని అంగీకరించుట వలన తన యథార్థ ఆధ్యాత్మికస్థితికి భిన్నముగా నిలిచియుండును. కాని దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన పరమాత్మ రూపమున సర్వత్రా నిలిచియున్నాడని అతడు అవగాహనము చేసికొనినచో, అనగా అతడు ప్రతిజీవి యందును ఆ భగవానుని దర్శింపగలిగినచో తన విధ్వంసక మన:ప్రవృత్తిచే తనను తాను హీనపరచుకొనక క్రమముగా ఆధ్యాత్మికజగము వైపునకు పురోగమించును. సాధారణముగా మనస్సు ఇంద్రియప్రీతి కార్యములకు అలవాటు పడియుండును. కాని దానిని పరమాత్మ వైపునకు మళ్ళించినచో మనుజుడు ఆధ్యాత్మికావగాహనలో పురోగతిని పొందగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 518 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 29 🌴

29. samaṁ paśyan hi sarvatra samavasthitam īśvaram
na hinasty ātmanātmānaṁ tato yāti parāṁ gatim


🌷 Translation : One who sees the Supersoul equally present everywhere, in every living being, does not degrade himself by his mind. Thus he approaches the transcendental destination.

🌹 Purport : The living entity, by accepting his material existence, has become situated differently than in his spiritual existence. But if one understands that the Supreme is situated in His Paramātmā manifestation everywhere, that is, if one can see the presence of the Supreme Personality of Godhead in every living thing, he does not degrade himself by a destructive mentality, and he therefore gradually advances to the spiritual world. The mind is generally addicted to sense gratifying processes; but when the mind turns to the Supersoul, one becomes advanced in spiritual understanding.

🌹 🌹 🌹 🌹 🌹

9 Sept 2020


శ్రీమద్భగవద్గీత - 517: 13వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 517: Chap. 13, Ver. 28


🌹. శ్రీమద్భగవద్గీత - 517 / Bhagavad-Gita - 517 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 28 🌴

28. సమం సర్వేషు భూతేషు తిష్టన్తం పరమేశ్వరమ్ |
వినశ్యత్స్వవినశ్యన్తం య: పశ్యతి స పశ్యతి ||

🌷. తాత్పర్యం : సర్వదేహములందు ఆత్మను గూడియుండు పరమాత్మను గాంచువాడు మరియు నాశవంతమైన దేహమునందలి ఆత్మ, పరమాత్మ లిరువురిని ఎన్నడును నశింపరానివారుగా తెలిసికొనగలిగినవాడు యథార్థదృష్టిని కలిగినవాడు.

🌷. భాష్యము : దేహము, దేహయజమానియైన ఆత్మ, ఆత్మ యొక్క మిత్రుడు అనెడి మూడు విషయములను సత్సాంగత్యముచే దర్శింపగలిగినవాడు యథార్థముగా జ్ఞానవంతుడు. ఆధ్యాత్మిక విషయముల యథార్థజ్ఞానము కలిగినవాని సాంగత్యము లేకుండా ఆ మూడు విషయములను ఎవ్వరును దర్శింపలేరు. అట్టి జ్ఞానవంతుల సాంగత్యము లేనివారు అజ్ఞానులు. వారు కేవలము దేహమునే గాంచుచు, దేహము నశించిన పిమ్మట సర్వము ముగియునని తలతురు. కాని వాస్తవమునకు అట్టి భావన సరియైనది కాదు. దేహము నశించిన పిమ్మటయు ఆత్మ, పరమాత్మ లిరువురు నిలిచియుందురు. అంతియేగాక వారు అనంతముగా పలువిధములైన స్థావర, జంగమ రూపములలో తమ అస్తిత్వమును కొనసాగింతురు.

జీవాత్మ దేహమునకు యజమానియైనందున “పరమేశ్వర” అను పదమునకు కొన్నిమార్లు జీవాత్మగా అర్థము చెప్పబడుచుండును. అట్టి ఆత్మ దేహము నశించిన పిమ్మట వేరొక దేహమును పొందుచుండును. ఈ విధముగా ఆత్మ దేహమునకు యజమానిగా తెలియబడుచుండును. కాని కొందరు “పరమేశ్వర” అను పదమునకు పరమాత్ముడని అర్థము చెప్పుదురు. ఈ రెండు భావములందును ఆత్మ మరియు పరమాత్మలు శాశ్వతముగా నిలుచువారే. వారెన్నడును నశింపరు. ఈ విధముగా ఆత్మ, పరమాత్మలను దర్శించువాడు జరుగుచున్నదానిని యథార్థముగా గాంచగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 517 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 28 🌴

28. samaṁ sarveṣu bhūteṣu tiṣṭhantaṁ parameśvaram
vinaśyatsv avinaśyantaṁ yaḥ paśyati sa paśyati


🌷 Translation : One who sees the Supersoul accompanying the individual soul in all bodies, and who understands that neither the soul nor the Supersoul within the destructible body is ever destroyed, actually sees.

🌹 Purport : Anyone who by good association can see three things combined together – the body, the proprietor of the body, or individual soul, and the friend of the individual soul – is actually in knowledge. Unless one has the association of a real knower of spiritual subjects, one cannot see these three things. Those who do not have such association are ignorant; they simply see the body, and they think that when the body is destroyed everything is finished. But actually it is not so. After the destruction of the body, both the soul and the Supersoul exist, and they go on eternally in many various moving and nonmoving forms.

The Sanskrit word parameśvara is sometimes translated as “the individual soul” because the soul is the master of the body and after the destruction of the body he transfers to another form. In that way he is master. But there are others who interpret this parameśvara to be the Supersoul. In either case, both the Supersoul and the individual soul continue. They are not destroyed. One who can see in this way can actually see what is happening.

🌹 🌹 🌹 🌹 🌹

8 Sept 2020


శ్రీమద్భగవద్గీత - 516: 13వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 516: Chap. 13, Ver. 27


🌹. శ్రీమద్భగవద్గీత - 516 / Bhagavad-Gita - 516 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 27 🌴

27. యావత్ సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమమ్ |
క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ది భరతర్షభ ||


🌷. తాత్పర్యం : ఓ భరతవంశశ్రేష్టుడా! స్థితిని కలిగియున్నట్టి స్థావర, జంగమములలో నీవు గాంచునదేదైనను క్షేత్రక్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలిసికొనుము.

🌷. భాష్యము : జగత్తు యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగియున్నట్టి భౌతికప్రకృతి మరియు జీవుల గూర్చి ఈ శ్లోకమున వివరింపబడినది. సృష్టింపబడిన ప్రతిదియు జీవుడు మరియు ప్రకృతి కలయిక చేతనే ఏర్పడినది. జగత్తులో వృక్షములు, పర్వతములు, కొండలవంటి అచరసృష్టి కలదు. అదేవిధముగా పలువిధములైన చరసృష్టి కూడా కలదు.

అవియన్నియు భౌతికప్రకృతి మరియు ఉన్నతప్రకృతియైన జీవుని కలయిక చేతనే ఏర్పడినవి. ఉన్నతప్రకృతికి సంబంధించిన జీవుని కలయిక లేక స్పర్శ లేనిదే ఏదియును వృద్ధినొందదు. ఈ విధముగా భౌతికప్రకృతి మరియు జీవుల నడుమ సంబంధము అనంతముగా సాగుచున్నది. వారి నడుమ సంయోగమనునది శ్రీకృష్ణభగవానునిచే ప్రభావితమగు చున్నందున ఆ భగవానుడే ఉన్నత, న్యూనప్రకృతులను నియమించువాడై యున్నాడు. అనగా భౌతికప్రకృతి భగవానునిచే సృష్టింపబడి, ఉన్నతప్రకృతియైన జీవుడు దాని యందుంచబడగా సర్వకార్యములు, సృష్టి ఒనగూడుచున్నవి.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 516 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 27 🌴

27. yāvat sañjāyate kiñcit sattvaṁ sthāvara-jaṅgamam
kṣetra-kṣetrajña-saṁyogāt tad viddhi bharatarṣabha


🌷 Translation : O chief of the Bhāratas, know that whatever you see in existence, both the moving and the nonmoving, is only a combination of the field of activities and the knower of the field.

🌹 Purport : Both material nature and the living entity, which were existing before the creation of the cosmos, are explained in this verse. Whatever is created is but a combination of the living entity and material nature. There are many manifestations like trees, mountains and hills which are not moving, and there are many existences which are moving, and all of them are but combinations of material nature and the superior nature, the living entity. Without the touch of the superior nature, the living entity, nothing can grow.

The relationship between material nature and spiritual nature is eternally going on, and this combination is effected by the Supreme Lord; therefore He is the controller of both the superior and inferior natures. The material nature is created by Him, and the superior nature is placed in this material nature, and thus all these activities and manifestations take place.

🌹 🌹 🌹 🌹 🌹


7 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 515: 13వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 515: Chap. 13, Ver. 26


🌹. శ్రీమద్భగవద్గీత - 515 / Bhagavad-Gita - 515 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 26 🌴

26. అన్యే త్వేవమజానన్త: శ్రుత్వాన్యేభ్య ఉపాసతే |
తేపి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణా: ||


🌷. తాత్పర్యం : ఇంకొందరు ఆధ్యాత్మికజ్ఞానముతో పరిచయము లేకున్నను ఇతరుల నుండి పరమపురుషుని గూర్చి శ్రవణము చేసి అతనిని పూజించుట నారంభింతురు. ప్రామానికుల నుండి శ్రవణము చేయు ప్రవృత్తిగలవారగుటచే వారును జనన,మార్గమును తరింప గలరు.

🌷. భాష్యము : ఆధునిక సమాజమునందు ఆధ్యాత్మిక విషయములను గూర్చిన విద్యయన్నది ఏ మాత్రము లేనందున ఈ శ్లోకము వారికి ప్రత్యేకముగా వర్తించును. ఆధునిక సమాజములో కొందరు నాస్తికులుగా, నిర్వీశ్వరవాదులుగా లేదా తత్త్వవేత్తలుగా గోచరించినను వాస్తవమునకు సరియైన తత్త్వజ్ఞానము ఎవ్వరికినీ లేదు. కనుక సాధారణ మనుజునకు సంబంధించినంత వరకు అతడు సజ్జనుడైనచో శ్రవణము ద్వారా పురోగతి నొందుటకు అవకాశము కలదు.

అట్టి శ్రవణ విధానము అత్యంత ముఖ్యమైనది. ఆధునిక జగములో కృష్ణభక్తి ప్రచారము చేసిన శ్రీచైతన్య మహాప్రభువు ఈ శ్రవణవిధానమునకు మిక్కిలి ప్రాధాన్యము నొసగిరి. ఏలయన ప్రామాణికులైన వారినుండి కేవలము శ్రవణము చేయుట ద్వారానే సామాన్యుడు పురోభివృద్ధిని పొందగలడని శ్రీచైతన్యమహాప్రభువు తెలిపియుండిరి.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 515 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 26 🌴

26. anye tv evam ajānantaḥ śrutvānyebhya upāsate
te ’pi cātitaranty eva mṛtyuṁ śruti-parāyaṇāḥ


🌷 Translation : Again there are those who, although not conversant in spiritual knowledge, begin to worship the Supreme Person upon hearing about Him from others. Because of their tendency to hear from authorities, they also transcend the path of birth and death.

🌹 Purport : This verse is particularly applicable to modern society because in modern society there is practically no education in spiritual matters. Some of the people may appear to be atheistic or agnostic or philosophical, but actually there is no knowledge of philosophy. As for the common man, if he is a good soul, then there is a chance for advancement by hearing. This hearing process is very important.

Lord Caitanya, who preached Kṛṣṇa consciousness in the modern world, gave great stress to hearing because if the common man simply hears from authoritative sources he can progress, especially, according to Lord Caitanya, if he hears the transcendental vibration of Krishna chanting.

🌹 🌹 🌹 🌹 🌹

6 Sept 2020


శ్రీమద్భగవద్గీత - 514: 13వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 514: Chap. 13, Ver. 25


🌹. శ్రీమద్భగవద్గీత - 514 / Bhagavad-Gita - 514 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 25 🌴

25. ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా |
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ||


🌷. తాత్పర్యం : పరమాత్ముని కొందరు ధ్యానము చేతను, మరికొందరు జ్ఞానాభ్యాసము చేతను, ఇంకను కొందరు నిష్కామకర్మ చేతను తమ యందే దర్శింతురు.

🌷. భాష్యము : మానవుని ఆత్మానుభవ అన్వేషణ ననుసరించి బద్ధజీవులు రెండు తరగతులని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు తెలియ జేయు చున్నాడు. నాస్తికులు, నిరీశ్వరవాదులు, సంశయాత్ములైన వారు ఆధ్యాత్మికభావనకు దూరులై యుందురు. అట్టివారికి అన్యముగా ఆధ్యాత్మికజీవనము నందు శ్రద్ధ కలిగినవారు అంతర్ముఖులైన భక్తులనియు, తత్త్వవేత్తలనియు, నిష్కామకర్ములనియు పిలువబడుదురు. అద్వైత సిద్ధాంతమును స్థాపించుటకు యత్నించువారలు సైతము నాస్తికులు మరియు నిరీశ్వరవాదుల యందే జమకట్టబడుదురు. అనగా శ్రీకృష్ణభగవానుని భక్తులే సరియైన ఆధ్యాత్మిక అవగాహనలో స్థితిని కలిగియుందురు.

ఆధ్యాత్మికజగత్తు భౌతికప్రకృతికి పరమమైనదనియు, అలాగుననే పరమాత్మ రూపమున సర్వుల యందు వసించియుండు శ్రీకృష్ణభగవానుడును భౌతికప్రకృతికి పరమైనవాడనియు వారు అవగాహనము చేసికొనుటయే అందులకు కారణము. పరతత్త్వమును జ్ఞానాభ్యాసము ద్వారా అవగాహన చేసికొనువారు కొందరు కలరు. వారు సైతము శ్రద్ధకలవారుగనే పరిగణింప బడుదురు. సాంఖ్యతత్త్వవేత్తలు ఈ భౌతికజగమును ఇరువదినాలుగు అంశములుగా విశ్లేషించి, ఆత్మను ఇరువదియైదవ అంశముగా భావింతురు. అట్టి ఆత్మను భౌతికంశములకు పరమైనదిగా వారు అవగతము చేసికొనినపుడు ఆ ఆత్మకు ఉన్నతముగా భగవానుడు కలడని వారు తెలిసికొనగలరు. అనగా భగవానుడు ఇరువదియారవ అంశము కాగలడు. ఈ విధముగా వారును కృష్ణభక్తిభావనలో భక్తియోగ ప్రమాణమునకు క్రమముగా చేరగలరు. అదేవిధముగా ఫలాపేక్షరహితముగా కర్మలనొనరించువారు సైతము పూర్ణలుగనే భావింపబడుదురు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 514 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 25 🌴

25. dhyānenātmani paśyanti kecid ātmānam ātmanā
anye sāṅkhyena yogena karma-yogena cāpare


🌷 Translation : Some perceive the Supersoul within themselves through meditation, others through the cultivation of knowledge, and still others through working without fruitive desires.

🌹 Purport : The Lord informs Arjuna that the conditioned souls can be divided into two classes as far as man’s search for self-realization is concerned. Those who are atheists, agnostics and skeptics are beyond the sense of spiritual understanding. But there are others, who are faithful in their understanding of spiritual life, and they are called introspective devotees, philosophers, and workers who have renounced fruitive results. Those who always try to establish the doctrine of monism are also counted among the atheists and agnostics. In other words, only the devotees of the Supreme Personality of Godhead are best situated in spiritual understanding, because they understand that beyond this material nature are the spiritual world and the Supreme Personality of Godhead, who is expanded as the Paramātmā, the Supersoul in everyone, the all-pervading Godhead. Of course there are those who try to understand the Supreme Absolute Truth by cultivation of knowledge, and they can be counted in the class of the faithful.

The Sāṅkhya philosophers analyze this material world into twenty-four elements, and they place the individual soul as the twenty-fifth item. When they are able to understand the nature of the individual soul to be transcendental to the material elements, they are able to understand also that above the individual soul there is the Supreme Personality of Godhead. He is the twenty-sixth element. Thus gradually they also come to the standard of devotional service in Kṛṣṇa consciousness. Those who work without fruitive results are also perfect in their attitude.

🌹 🌹 🌹 🌹 🌹

5 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 513: 13వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 513: Chap. 13, Ver. 24


🌹. శ్రీమద్భగవద్గీత - 513 / Bhagavad-Gita - 513 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 24 🌴

24. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణై: సహ |
సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే ||

🌷. తాత్పర్యం : భౌతికప్రకృతి, జీవుడు, త్రిగుణముల అంత:ప్రక్రియకు సంబంధించిన ఈ తత్త్వమును అవగాహన చేసికొనినవాడు నిశ్చయముగా మోక్షమును బడయును. అతని వర్తమానస్థితి ఎట్లున్నను అతడు తిరిగి జన్మింపడు.

🌷. భాష్యము : భౌతికప్రకృతి, పరమాత్మ, జీవాత్మ, వాని నడుమగల సంబంధము యొక్క స్పష్టమైన అవగాహన మనుజుని ముక్తుని గావించును. అంతియేగాక ఈ భౌతికప్రకృతికి అతడు తిరిగిరాకుండునట్లుగా అతని దృష్టిని సంపూర్ణముగా ఆధ్యాత్మికత వైపునకు మళ్ళించును. ఇదియే జ్ఞానము యొక్క ఫలితము. జీవుడు యాదృచ్చికముగా భౌతికస్థితిలోనికి పతితుడయ్యెనని అవగాహన చేసికొనుటయే జ్ఞానము యొక్క ఉద్దేశ్యమై యున్నది.

కనుక జీవుడు ప్రామాణికుల (సాధుపురుషుల మరియు గురువు) సాంగత్యమున తన నిజస్థితిని అవగతము చేసికొని, శ్రీకృష్ణుడు వివరించిన రీతిగా భగవద్గీతను తెలిసికొని ఆధ్యాత్మిక భావనకు (కృష్ణభక్తిరస భావనము) మరలవలెను. అప్పుడు అతడు నిశ్చయముగా ఈ భౌతికజగమునకు తిరిగిరాక సచ్చిదానందమయ జీవనమునకై ఆధ్యాత్మికజగత్తును చేరగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 513 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 24 🌴

24. ya evaṁ vetti puruṣaṁ prakṛtiṁ ca guṇaiḥ saha
sarvathā vartamāno ’pi na sa bhūyo ’bhijāyate


🌷 Translation : One who understands this philosophy concerning material nature, the living entity and the interaction of the modes of nature is sure to attain liberation. He will not take birth here again, regardless of his present position.

🌹 Purport : Clear understanding of material nature, the Supersoul, the individual soul and their interrelation makes one eligible to become liberated and turn to the spiritual atmosphere without being forced to return to this material nature. This is the result of knowledge. The purpose of knowledge is to understand distinctly that the living entity has by chance fallen into this material existence.

By his personal endeavor in association with authorities, saintly persons and a spiritual master, he has to understand his position and then revert to spiritual consciousness or Kṛṣṇa consciousness by understanding Bhagavad-gītā as it is explained by the Personality of Godhead. Then it is certain that he will never come again into this material existence; he will be transferred into the spiritual world for a blissful eternal life of knowledge.

🌹 🌹 🌹 🌹 🌹

4 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 512: 13వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 512: Chap. 13, Ver. 23


🌹. శ్రీమద్భగవద్గీత - 512 / Bhagavad-Gita - 512 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 23 🌴

23. ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వర: |
పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మేన్ పురుష: పర: ||


🌷. తాత్పర్యం : అయినను ఈ దేహమునందు దివ్యప్రభువును, దివ్యయజమానుడును, పర్యవేక్షకుడును, అంగీకరించు వాడును, పరమాత్మగా తెలియబడు వాడును అగు దివ్యభోక్త మరియొకడు కలడు.

🌷. భాష్యము : జీవాత్మతో సదా కూడియుండు పరమాత్ముడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యమని ఇచ్చట పేర్కొనబడినది. అట్టి పరమాత్మ ఎన్నడును సామాన్యజీవుడు కాడు. అద్వైతులైన వారు దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు ఒక్కడేయని భావించుట వలన ఆత్మ మరియు పరమాత్మల నడుమ భేదము లేదని తలతురు. కనుక సత్యమును వివరించుట కొరకే శ్రీకృష్ణభగవానుడు తాను పరమాత్మ రూపమున ప్రతిదేహమునందు ప్రాతినిధ్యము వహించుచున్నానని తెలియజేయుచున్నాడు. అతడు సదా జీవాత్మకు భిన్నుడైనవాడు. కనుకనే “పర”(దివ్యుడని) యని తెలియబడినాడు. జీవాత్మ కర్మక్షేత్రపు కర్మల ననుభవించుచుండ, పరమాత్ముడు మాత్రము భోక్తగా లేక కర్మల యందు వర్తించువాడుగా గాక సాక్షిగా, ఉపద్రష్టగా, అనుమంతగా, దివ్యభోక్తగా వర్తించును.

కనుకనే అతడు ఆత్మయని పిలువబడక పరమాత్మగా తెలియబడినాడు. అతడు సదా దివ్యుడు. అనగా ఆత్మ మరియు పరమాత్మ భిన్నమనునది స్పష్టమైన విషయము. పరమాత్మ సర్వత్రా పాణి,పాదములను కలిగియుండును. కాని జీవాత్మ అట్లు సర్వత్రా పాణి, పాదములను కలిగి యుండదు. అదియును గాక పరమాత్మ దేవదేవుని ప్రాతినిధ్యమైనందున హృదయస్థుడై నిలిచి, జీవాత్మ కోరు భోగానుభవమునకు అనుమతి నొసంగుచుండును. అనగా పరమాత్ముని అనుమతి లేనిదే జీవాత్మ ఏమియును చేయజాలదు. కనుకనే జీవాత్మ “భుక్తము” (పోషింపబడువాడు) అని, పరమాత్మ “భోక్త”(పోషించువాడు) యని తెలియబడుచున్నారు. అట్టి పరమాత్మ అసంఖ్యాకములుగా నున్న జీవులందరి యందును మిత్రుని రూపమున నిలిచియుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 512 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 23 🌴

23. upadraṣṭānumantā ca bhartā bhoktā maheśvaraḥ
paramātmeti cāpy ukto dehe ’smin puruṣaḥ paraḥ


🌷 Translation : Yet in this body there is another, a transcendental enjoyer, who is the Lord, the supreme proprietor, who exists as the overseer and permitter, and who is known as the Supersoul.

🌹 Purport : It is stated here that the Supersoul, who is always with the individual soul, is the representation of the Supreme Lord. He is not an ordinary living entity. Because the monist philosophers take the knower of the body to be one, they think that there is no difference between the Supersoul and the individual soul. To clarify this, the Lord says that He is represented as the Paramātmā in every body. He is different from the individual soul; He is para, transcendental. The individual soul enjoys the activities of a particular field, but the Supersoul is present not as finite enjoyer nor as one taking part in bodily activities, but as the witness, overseer, permitter and supreme enjoyer.

His name is Paramātmā, not ātmā, and He is transcendental. It is distinctly clear that the ātmā and Paramātmā are different. The Supersoul, the Paramātmā, has legs and hands everywhere, but the individual soul does not. And because the Paramātmā is the Supreme Lord, He is present within to sanction the individual soul’s desiring material enjoyment. Without the sanction of the Supreme Soul, the individual soul cannot do anything. The individual is bhukta, or the sustained, and the Lord is bhoktā, or the maintainer. There are innumerable living entities, and He is staying in them as a friend.

🌹 🌹 🌹 🌹 🌹

3 Sept 2020

శ్రీమద్భగవద్గీత - 511: 13వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 511: Chap. 13, Ver. 22


🌹. శ్రీమద్భగవద్గీత - 511 / Bhagavad-Gita - 511 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 22 🌴

22. పురుష: ప్రకృతిస్థో హి భుఙ్త్కే ప్రకృతిజాన్ గుణాన్ |
కారణం గుణసఙ్గోస్య సదసద్యోనిజజన్మసు ||


🌷. తాత్పర్యం : భౌతికప్రకృతి యందు త్రిగుణముల ననుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతికప్రకృతితో అతనికి గల సంగత్వమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ, అధమజన్మలను పొందుచుండును.

🌷. భాష్యము : జీవుడు ఏ విధముగా ఒక దేహము నుండి వేరొక దేహమును పొందుననెడి విషయమును అవగాహనము చేసికొనుటకు ఈ శ్లోకము అత్యంత ముఖ్యమైనది. మనుజుడు వస్త్రములను మార్చిన చందమున జీవుడు ఒక దేహము నుండి వేరొక దేహమునకు చేరునని ద్వితీయాధ్యాయమున వివరింపబడినది. ఇట్టి వస్త్రముల వంటి దేహముల మార్పునకు భౌతికస్థితితో అతని తాదాత్మ్యయే కారణము.

అట్టి మిథ్యాభావనచే అతడు ప్రభావితుడై యుండునంతవరకు ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పుచెందవలసియే యుండును. అనగా ప్రకృతిపై అధికారము చలాయించవలెననెడి అతని కోరికయే అతనిని అట్టి అవాంచిత పరిస్థితుల యందు నిలుపుచున్నది. కోరిక కారణముగనే అతడు కొన్నిమార్లు దేవతారూపమును, కొన్నిమార్లు మానవదేహమును, కొన్నిమార్లు జంతుదేహమును, కొన్నిమార్లు పక్షిదేహమును, కొన్నిమార్లు, కీటకదేహమును, కొన్నిమార్లు జలచరదేహమును, కొన్నిమార్లు సాధుజన్మను, కొన్నిమార్లు నల్లిదేహమును పొందుచుండును. ఇది అనంతముగా సాగుచున్నది. ఈ అన్ని స్థితుల యందును జీవుడు తనను తాను ప్రభువునని తలచుచుండును. కాని వాస్తవమునకు అతడు ప్రకృతి ప్రభావమునకు లోబడియే యుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 511 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 22 🌴

22. puruṣaḥ prakṛti-stho hi bhuṅkte prakṛti-jān guṇān
kāraṇaṁ guṇa-saṅgo ’sya sad-asad-yoni-janmasu


🌷 Translation : The living entity in material nature thus follows the ways of life, enjoying the three modes of nature. This is due to his association with that material nature. Thus he meets with good and evil among various species.

🌹 Purport : This verse is very important for an understanding of how the living entities transmigrate from one body to another. It is explained in the Second Chapter that the living entity is transmigrating from one body to another just as one changes dress. This change of dress is due to his attachment to material existence. As long as he is captivated by this false manifestation, he has to continue transmigrating from one body to another. Due to his desire to lord it over material nature, he is put into such undesirable circumstances. Under the influence of material desire, the entity is born sometimes as a demigod, sometimes as a man, sometimes as a beast, as a bird, as a worm, as an aquatic, as a saintly man, as a bug.

This is going on. And in all cases the living entity thinks himself to be the master of his circumstances, yet he is under the influence of material nature. How he is put into such different bodies is explained here. It is due to association with the different modes of nature. One has to rise, therefore, above the three material modes and become situated in the transcendental position. That is called Kṛṣṇa consciousness. Unless one is situated in Kṛṣṇa consciousness, his material consciousness will oblige him to transfer from one body to another because he has material desires since time immemorial. But he has to change that conception. That change can be effected only by hearing from authoritative sources. The best example is here: Arjuna is hearing the science of God from Kṛṣṇa. The living entity, if he submits to this hearing process, will lose his long-cherished desire to dominate material nature, and gradually and proportionately, as he reduces his long desire to dominate, he comes to enjoy spiritual happiness. In a Vedic mantra it is said that as he becomes learned in association with the Supreme Personality of Godhead, he proportionately relishes his eternal blissful life.

🌹 🌹 🌹 🌹 🌹

2 Sept 2020