🌹. శ్రీమద్భగవద్గీత - 396 / Bhagavad-Gita - 396 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 24 🌴
24. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |
సేనానీనామహం స్కన్ద: సరసామస్మి సాగర: ||
🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్నెరుగుము. నేను సేనానాయకులలో కార్తికేయుడను, జలనిధులలో సముద్రమునై యున్నాను.
🌷. భాష్యము :
స్వర్గలోకదేవతలలో ఇంద్రుడు ముఖ్యదేవత. అతడే స్వర్గాధిపతియనియు తెలియబడును. అతడు పాలించు లోకము ఇంద్రలోకము మరియు బృహస్పతి అతని పురోహితుడు. ఇంద్రుడు రాజులందరిలో ముఖ్యుడగుట వలన బృహస్పతి పురోహితులందరిలో ముఖ్యుడయ్యెను. రాజులందరిలో ఇంద్రుడు ప్రధానుడైనట్లుగా పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన కార్తికేయుడు సేనానాయకులలో ప్రధానుడు. అదే విధముగ జలనిధులలో సముద్రము ఘనమైనది. ఈ ప్రాతినిధ్యములన్నియును శ్రీకృష్ణుని ఘనతకు సూచనలు మాత్రమే ఒసగును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 396 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 24 🌴
24. purodhasāṁ ca mukhyaṁ māṁ viddhi pārtha bṛhaspatim
senānīnām ahaṁ skandaḥ sarasām asmi sāgaraḥ
🌷 Translation :
Of priests, O Arjuna, know Me to be the chief, Bṛhaspati. Of generals I am Kārttikeya, and of bodies of water I am the ocean.
🌹 Purport
Indra is the chief demigod of the heavenly planets and is known as the king of the heavens. The planet on which he reigns is called Indraloka. Bṛhaspati is Indra’s priest, and since Indra is the chief of all kings, Bṛhaspati is the chief of all priests. And as Indra is the chief of all kings, similarly Skanda, or Kārttikeya, the son of Pārvatī and Lord Śiva, is the chief of all military commanders. And of all bodies of water, the ocean is the greatest. These representations of Kṛṣṇa only give hints of His greatness.
🌹 🌹 🌹 🌹 🌹
22 May 2020