🌹. శ్రీమద్భగవద్గీత - 389 / Bhagavad-Gita - 389 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 17 🌴
17. కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచిన్తయన్ |
కేషు కేషు చ భావేషు చిన్త్యో(సి భగవన్మయా ||
🌷. తాత్పర్యం :
ఓ కృష్ణా! యోగీశ్వరా! నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు తెలిసికొనగలను? ఓ దేవదేవా! ఏ యే రూపములందు నున్ను స్మరింప వలెను?
🌷. భాష్యము :
గడచిన అధ్యాయమునందు తెలుపబడినట్లు దేవదేవుడైన శ్రీకృష్ణడు తన యోగమాయచే కప్పబడియుండును. కేవలము శరణాగతులైన మహాత్ములు మరియు భక్తులే అతనిని గాంచగలరు. ఇప్పుడు అర్జునుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణుడు దేవదేవుడని సంపూర్ణముగా విశ్వసించినను, సామాన్యుడు సైతము ఏవిధముగా ఆ సర్వవ్యాపియైన భగవానుని అవగతము చేసికొనగలడో అట్టి సర్వసాధారణ పద్ధతిని తెలియగోరుచున్నాడు. యోగమాయచే కప్పబడినందున శ్రీకృష్ణుని సామాన్యజనులు (దానవులు మరియు నాస్తికులతో సహా) ఎరుగలేరు. కనుక వారి లాభము కొరకే అర్జునుడు ఈ ప్రశ్నలను అడుగుచున్నాడు. ఉన్నతుడైన భక్తుడు తన స్వీయావగాహన కొరకే గాక సమస్త మానవాళి అవగాహన కొరకై యత్నించును. కనుకనే భక్తుడును మరియు ఘనవైష్ణవుడును అగు అర్జునుడు కరుణాపూర్ణుడై తన ప్రశ్నచే భగవానుని సర్వవ్యాపకత్వమును సామాన్యుడు తెలియుటకు అవకాశమొసగుచున్నాడు. శ్రీకృష్ణుడు తనను ఆచ్చాదించియున్న యోగమాయకు ప్రభువైనందునే అర్జునుడు ఇచ్చట అతనిని “యోగిన్” అ ప్రత్యేకముగా సంబోధించినాడు.
అట్టి యోగమాయ కారణముననే ఆ భగవానుడు సామాన్యునకు గోచరింపకుండుట లేక గోచరించుట జరుగుచుండును. కృష్ణుని యెడ ప్రేమలేని సామాన్యమానవుడు అతనిని గూర్చి సదా చింతనను గావింపలేడు. కనుక అతడు భౌతికభావనముననే చింతింపవలసియుండును. అర్జునుడు భౌతికప్రవృత్తి కలిగిన జనుల ఆలోచనాధోరణిని పరిగణనకు తీసికొనుచున్నాడు. ఇచ్చట “కేషు కేషు చ భావేషు” అను పదములు భౌతికప్రవృతిని (భావ మనగా భౌతికవిషయములు) సూచించును. భౌతికప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని ఆధ్యాత్మికముగా అవగాహన చేసికొనలేనందున భౌతికములైనవానిపై మనస్సును కేంద్రీకరించి, భౌతికప్రాతినిధ్యముల ద్వారా ఏవిధముగా శ్రీకృష్ణుడు వ్యక్తమగుచున్నాడో గాంచవలసినదిగా ఉపదేశింపబడుదురు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 389 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 17 🌴
17. kathaṁ vidyām ahaṁ yogiṁs tvāṁ sadā paricintayan
keṣu keṣu ca bhāveṣu cintyo ’si bhagavan mayā
🌷 Translation :
O Kṛṣṇa, O supreme mystic, how shall I constantly think of You, and how shall I know You? In what various forms are You to be remembered, O Supreme Personality of Godhead?
🌹 Purport :
As it is stated in the previous chapter, the Supreme Personality of Godhead is covered by His yoga-māyā. Only surrendered souls and devotees can see Him. Now Arjuna is convinced that his friend, Kṛṣṇa, is the Supreme Godhead, but he wants to know the general process by which the all-pervading Lord can be understood by the common man. Common men, including the demons and atheists, cannot know Kṛṣṇa, because He is guarded by His yoga-māyā energy. Again, these questions are asked by Arjuna for their benefit. The superior devotee is concerned not only for his own understanding but for the understanding of all mankind. So Arjuna, out of his mercy, because he is a Vaiṣṇava, a devotee, is opening for the common man the understanding of the all-pervasiveness of the Supreme Lord. He addresses Kṛṣṇa specifically as yogin because Śrī Kṛṣṇa is the master of the yoga-māyā energy, by which He is covered and uncovered to the common man.
The common man who has no love for Kṛṣṇa cannot always think of Kṛṣṇa; therefore he has to think materially. Arjuna is considering the mode of thinking of the materialistic persons of this world. The words keṣu keṣu ca bhāveṣu refer to material nature (the word bhāva means “physical things”). Because materialists cannot understand Kṛṣṇa spiritually, they are advised to concentrate the mind on physical things and try to see how Kṛṣṇa is manifested by physical representations.
🌹 🌹 🌹 🌹 🌹
14 May 2020