🌹. శ్రీమద్భగవద్గీత - 393 / Bhagavad-Gita - 393 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 21 🌴
21. ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ |
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ||
🌷. తాత్పర్యం :
నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను, మరత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడనై యున్నాను.
🌷. భాష్యము :
ఆదిత్యులు పన్నెండురు కలరు. వారిలో శ్రీకృష్ణుడు ప్రధానుడు. అకాశమునందు ప్రకాశించువానిలో సూర్యుడు ముఖ్యమైనవాడు. అతడు దేవదేవుని సముజ్జ్వలనేత్రముగా బ్రహ్మసంహిత యందు అంగీకరింపబడినాడు. ఆకాశమున ఏబదిరకముల వాయువులు వీచుచుండును. వాటికి అధిష్టానదేవతయైన మరీచి శ్రీకృష్ణుని ప్రతినిధి.
రాత్రి సమయమున నక్షత్రములందు ప్రదానుడైన చంద్రుడు శ్రీకృష్ణుని ప్రతినిధి. చంద్రుడు ఒకానొక నక్షత్రమని ఈ శ్లోకము ద్వారా గోచరించుచున్నది. అనగా ఆకాశమునందు మెరయు నక్షత్రములు కూడా సూర్యునికాంతినే ప్రతిబింబించుచున్నవి. విశ్వమునందు అనేక సూర్యులు కలరనెడి సిద్ధాంతమును వేదవాజ్మయము అంగీకరింపదు. సూర్యుడొక్కడే. సూర్యునికాంతిని ప్రతిబింబించుట ద్వారా చంద్రుడు వెలుగునట్లు, నక్షత్రములు కూడా వెలుతురును ప్రసరించుచున్నవి. చంద్రుడు నక్షత్రములలో ఒకడని భగవద్గీత ఇచ్చట తెలుపుచున్నందున ఆకాశమున మొరయు నక్షత్రములు చంద్రుని పోలినవే గాని సూర్యులు కానేరవు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 393 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 21 🌴
21. ādityānām ahaṁ viṣṇur jyotiṣāṁ ravir aṁśumān
marīcir marutām asmi nakṣatrāṇām ahaṁ śaśī
🌷 Translation :
Of the Ādityas I am Viṣṇu, of lights I am the radiant sun, of the Maruts I am Marīci, and among the stars I am the moon.
🌹 Purport :
There are twelve Ādityas, of which Kṛṣṇa is the principal. Among all the luminaries shining in the sky, the sun is the chief, and in the Brahma-saṁhitā the sun is accepted as the glowing eye of the Supreme Lord. There are fifty varieties of wind blowing in space, and of these winds the controlling deity, Marīci, represents Kṛṣṇa. Among the stars, the moon is the most prominent at night, and thus the moon represents Kṛṣṇa.
It appears from this verse that the moon is one of the stars; therefore the stars that twinkle in the sky also reflect the light of the sun. The theory that there are many suns within the universe is not accepted by Vedic literature. The sun is one, and as by the reflection of the sun the moon illuminates, so also do the stars. Since Bhagavad-gītā indicates herein that the moon is one of the stars, the twinkling stars are not suns but are similar to the moon.
🌹 🌹 🌹 🌹 🌹
19 May 2020