🌹. శ్రీమద్భగవద్గీత - 382 / Bhagavad-Gita - 382 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 10 🌴
10. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాన్తి తే ||
🌷. తాత్పర్యం :
ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులైనవారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేనొసగుదును.
🌷. భాష్యము :
“బుద్ధియోగమ్” అను పదము ఈ శ్లోకమునందు ముఖ్యమైనది. ద్వితీయాధ్యాయమున శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు ఉపదేశమొసగుచు తాను అనేక విషయములను చర్చించితిననియు మరియు ఇకపై బుద్ధియోగము ద్వారా కొన్ని విషయములు తెలుపనున్నట్లుయు పలికియున్న విషయమును మనమిచ్చట జ్ఞాపకము చేసికొనవలెను. అట్టి బుద్ధియోగమే ఇచ్చట పేర్కొనబడినది. బుద్ధియోగమనగా కృష్ణభక్తిరసభావనలో కర్మనొనర్చుట యనియే భావము. అదియే అత్యుత్తమబుద్ధి మరియు జ్ఞానము అనబడును. బుద్ధి యనగా తెలివి మరియు యోగమనగా యోగకర్మలు. భగవద్దామమునకు చేరగోరి మనుజుడు కృష్ణభక్తిభావనలో భక్తియుక్తసేవయందు నిలిచినచో అతని కర్మలు బుద్ధియోగమనబడును. అనగా బుద్ధియోగము ద్వారా మనుజుడు భౌతికజగత్తు బంధముల నుండి సులభముగా విడివడగలడు. పురోగతి యనుదాని చరమప్రయోజనము శ్రీకృష్ణుడే. కాని జనసామాన్యము ఈ విషయము నెరుగరు. కనుకనే గురువు మరియు భక్తుల సాంగత్యము అత్యంత ముఖ్యమై యున్నది. కనుక ప్రతియొక్కరు శ్రీకృష్ణుడే పరమగమ్యమని తెలిసికొనవలసియున్నది. ఆ విధముగా గమ్యమును నిర్ణయించి, నెమ్మదిగా అయినప్పటికిని క్రమముగా ప్రయాణించినచో అంతిమలక్ష్యము ప్రాప్తించగలదు.
మానవుడు జీవితలక్ష్యము నెరిగియు తన కర్మ ఫలముల యెడ అనురక్తిని కలిగియున్నచో అతడు కర్మయోగమునందు వర్తించినవాడగును. అదే విధముగా మానవుడు కృష్ణుడే గమ్యమని తెలిసియు, కృష్ణుని అవగతము చేసికొనుటకు మానసికకల్పనలను ఆశ్రయించినచో జ్ఞానయోగమునందు వర్తించినవాడగును. ఇక మానవుడు తన గమ్యమును సంపూర్ణముగా నెరిగి కృష్ణభక్తిభావన యందు భక్తియోగము ద్వారా శ్రీకృష్ణుని పొందగోరినపుడు భక్తియోగమునందు లేదా బుద్ధియోగమునందు వర్తించినవాడగును. వాస్తవమునకు ఈ బుద్ధియోగమే సంపూర్ణము మరియు సమగ్రమైన యోగమై యున్నది. ఇదియే మానవజన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణస్థితి. మనుజుడు ఆధ్యాత్మిక గురువును పొందినను మరియు ఏదేని ఒక ఆధ్యాత్మికసంఘముతో సంబంధమును కలిగయున్నను ఒకవేళ ఆధ్యాత్మికముగా పురోభివృద్ధిని పొందలేకపోయినచో ఎటువంటి కష్టము లేకుండా అతడు అంత్యమున తనను చేరురీతిలో శ్రీకృష్ణుడే అతనికి అంతర్యమున ఉపదేశములొసగును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 382 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 10 🌴
10. teṣāṁ satata-yuktānāṁ bhajatāṁ prīti-pūrvakam
dadāmi buddhi-yogaṁ taṁ yena mām upayānti te
🌷 Translation :
To those who are constantly devoted to serving Me with love, I give the understanding by which they can come to Me.
🌹 Purport :
In this verse the word buddhi-yogam is very significant. We may remember that in the Second Chapter the Lord, instructing Arjuna, said that He had spoken to him of many things and that He would instruct him in the way of buddhi-yoga. Now buddhi-yoga is explained. Buddhi-yoga itself is action in Kṛṣṇa consciousness; that is the highest intelligence. Buddhi means intelligence, and yoga means mystic activities or mystic elevation. When one tries to go back home, back to Godhead, and takes fully to Kṛṣṇa consciousness in devotional service, his action is called buddhi-yoga. In other words, buddhi-yoga is the process by which one gets out of the entanglement of this material world. The ultimate goal of progress is Kṛṣṇa. People do not know this; therefore the association of devotees and a bona fide spiritual master are important.
One should know that the goal is Kṛṣṇa, and when the goal is assigned, then the path is slowly but progressively traversed, and the ultimate goal is achieved. When a person knows the goal of life but is addicted to the fruits of activities, he is acting in karma-yoga. When he knows that the goal is Kṛṣṇa but he takes pleasure in mental speculations to understand Kṛṣṇa, he is acting in jñāna-yoga. And when he knows the goal and seeks Kṛṣṇa completely in Kṛṣṇa consciousness and devotional service, he is acting in bhakti-yoga, or buddhi-yoga, which is the complete yoga. This complete yoga is the highest perfectional stage of life.
🌹 🌹 🌹 🌹 🌹
8 May 2020