శ్రీమద్భగవద్గీత - 384: 10వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 384: Chap. 10, Ver. 12


🌹. శ్రీమద్భగవద్గీత - 384 / Bhagavad-Gita - 384 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 12 🌴



12. అర్జున ఉవాచ

పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ |
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ ||


🌷. తాత్పర్యం :

అర్జునుడు ఇట్లు పలికెను: నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్త్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, పుట్టుకలేని వాడవు, ఘనమైన వాడవు అయి యున్నావు.

🌷. భాష్యము :

ఈ అధ్యాయపు ముఖ్యమైన నాలుగుశ్లోకములను శ్రవణము చేసినంతనే అర్జునుడు సర్వసందేహముల నుండి ముక్తుడై శ్రీకృష్ణుని పూర్ణపురుషోత్తముడైన ఆదిదేవునిగా అంగీకరించెను. కనుకనే అతడు “నీవే పరబ్రహ్మమువు మరియు ఆదిదేవుడవు” అని ప్రకటించెను. సమస్తము తన నుండియే ఉద్భవించినదనియు మరియు దేవ, మనుష్యాది జీవులందరును తన పైననే ఆధారపడినవారనియు శ్రీకృష్ణుడు పూర్వమే ప్రకటించియున్నాడు. కాని వారు అజ్ఞానకారణముగా తమనే పరతత్త్వముగా భావించుచు తాము దేవదేవునికి ఆధీనులము కామని భావింతురు. అట్టి అజ్ఞానము భక్తియుతసేవ ద్వారా సంపూర్ణముగా తొలగునని శ్రీకృష్ణభగవానుడు గడచిన శ్లోకములలో వివరించియున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 384 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 12 🌴



12. arjuna uvāca

paraṁ brahma paraṁ dhāma pavitraṁ paramaṁ bhavān
puruṣaṁ śāśvataṁ divyam ādi-devam ajaṁ vibhum


🌷 Translation :

Arjuna said: You are the Supreme Personality of Godhead, the ultimate abode, the purest, the Absolute Truth. You are the eternal, transcendental, original person, the unborn, the greatest.


🌹 Purport :

In these two verses the Supreme Lord gives a chance to the Māyāvādī philosopher, for here it is clear that the Supreme is different from the individual soul. Arjuna, after hearing the essential four verses of Bhagavad-gītā in this chapter, became completely free from all doubts and accepted Kṛṣṇa as the Supreme Personality of Godhead. He at once boldly declares, “You are paraṁ brahma, the Supreme Personality of Godhead.”

And previously Kṛṣṇa stated that He is the originator of everything and everyone. Every demigod and every human being is dependent on Him. Men and demigods, out of ignorance, think that they are absolute and independent of the Supreme Personality of Godhead. That ignorance is removed perfectly by the discharge of devotional service. This has already been explained in the previous verse by the Lord. Now, by His grace, Arjuna is accepting Him as the Supreme Truth, in concordance with the Vedic injunction.

🌹 🌹 🌹 🌹 🌹

10 May 2020