🌹. శ్రీమద్భగవద్గీత - 380 / Bhagavad-Gita - 380 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 08 🌴
08. అహం సర్వస్య ప్రభవో మత్త: సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్వితా: ||
🌷. తాత్పర్యం :
నేనే సర్వములైన ఆధ్యాత్మిక, భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపుర్వకముగా అర్చింతురు.
🌷. భాష్యము :
వేదములను సంపూర్ణముగా అధ్యయనము చేసినవాడును మరియు శ్రీచైతన్యమహాప్రభువు వంటి ప్రామాణికుల ద్వారా జ్ఞానమును పొంది, ఆ ఉపదేశములను ఏ విధముగా ఆచరణలో పెట్టవలెనో ఎరిగినవాడు అగు పండితుడు శ్రీకృష్ణుడే భౌతిక, ఆధ్యాత్మికజగత్తుల యందలి సర్వమునకు మూలమని అవగాహన చేసికొనగలడు. ఈ విషయమును పూర్ణముగా నెరిగియుండుటచే అతడు అ భగవానుని భక్తియుతసేవలో స్థిరముగా నుమగ్నుడగును. అర్థరహిత వ్యాఖ్యానములచే గాని, మూర్ఖులచేగాని ప్రభావితుడు గాక ఆ భక్తుడు తన భక్తిమార్గము నుండి వైదొలగకుండును. శ్రీకృష్ణుడే బ్రహ్మ, శివుడు మరియు ఇతర దేవతలందరికీ మూలమని వేదవాజ్మయము ఆంగీకరించుచున్నది. “యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ గాపయతి స్మ కృష్ణ: “ యని అథర్వణవేదము నందలి గోపాలతాపన్యుపనిషత్తు (1.24) నందు తెలుపబడినది.
అనగా ఆదిలో బ్రహ్మదేవునకు వేదజ్ఞాన మొసగిన వాడును మరియు పూర్వము వేదజ్ఞానమును విస్తరింపజేసిన వాడును శ్రీకృష్ణుడే. అదే విధముగా నారాయణోపనిషత్తు (1) నందు కూడా “అప్పుడు దేవదేవుడైన నారాయణుడు జీవులను సృజించదలచెను” అని తెలుపబడినది (అథ పురుషో హ వై నారాయణో(కామయత ప్రజా: సృజేయేతి). అదే ఉపనిషత్తు ఇంకను కొనసాగి “నారాయణాద్ బ్రహ్మా జాయతే, నారాయణాద్ ప్రజాపతి:ప్రజాయతే, నారాయణాద్ ఇంద్రోజాయతే, నారాయణాదష్టౌవసవో జాయన్తే, నారాయణాద్ ఏకాదశ రుద్రా జాయన్తే, నారాయణాద్ ద్వాదశాదిత్యా:” యనియు తెలిపినది. అనగా నారాయణుని నుండియే బ్రహ్మదేవుడు మరియు ప్రజాపతులు ఉద్భవించిరి. నారాయణుని నుండియే ఇంద్రుడు జన్మించెను. నారాయణుని నుండియే అష్టవసువులు జన్మించిరి. నారాయణుని నుండియే ఏకాదశ రుద్రులు ఉద్భవించిరి మరియు నారాయణుని నుండియే ద్వాదశాధిత్యులును జన్మించిరి. అట్టి నారాయణుడు శ్రీకృష్ణభగవానుని ఒక ప్రధాన విస్తృతాంశము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 380 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 08 🌴
08. ahaṁ sarvasya prabhavo mattaḥ sarvaṁ pravartate
iti matvā bhajante māṁ budhā bhāva-samanvitāḥ
🌷 Translation :
I am the source of all spiritual and material worlds. Everything emanates from Me. The wise who perfectly know this engage in My devotional service and worship Me with all their hearts.
🌹 Purport :
A learned scholar who has studied the Vedas perfectly and has information from authorities like Lord Caitanya and who knows how to apply these teachings can understand that Kṛṣṇa is the origin of everything in both the material and spiritual worlds, and because he knows this perfectly he becomes firmly fixed in the devotional service of the Supreme Lord. He can never be deviated by any amount of nonsensical commentaries or by fools. All Vedic literature agrees that Kṛṣṇa is the source of Brahmā, Śiva and all other demigods. In the Atharva Veda (Gopāla-tāpanī Upaniṣad 1.24) it is said, yo brahmāṇaṁ vidadhāti pūrvaṁ yo vai vedāṁś ca gāpayati sma kṛṣṇaḥ: “It was Kṛṣṇa who in the beginning instructed Brahmā in Vedic knowledge and who disseminated Vedic knowledge in the past.”
Then again the Nārāyaṇa Upaniṣad (1) says, atha puruṣo ha vai nārāyaṇo ’kāmayata prajāḥ sṛjeyeti: “Then the Supreme Personality Nārāyaṇa desired to create living entities.” The Upaniṣad continues, nārāyaṇād brahmā jāyate, nārāyaṇād prajāpatiḥ prajāyate, nārāyaṇād indro jāyate, nārāyaṇād aṣṭau vasavo jāyante, nārāyaṇād ekādaśa rudrā jāyante, nārāyaṇād dvādaśādityāḥ: “From Nārāyaṇa, Brahmā is born, and from Nārāyaṇa the patriarchs are also born. From Nārāyaṇa, Indra is born, from Nārāyaṇa the eight Vasus are born, from Nārāyaṇa the eleven Rudras are born, from Nārāyaṇa the twelve Ādityas are born.” This Nārāyaṇa is an expansion of Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
6 May 2020