శ్రీమద్భగవద్గీత - 365: 09వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 365: Chap. 09, Ver. 27


🌹. శ్రీమద్భగవద్గీత - 365 / Bhagavad-Gita - 365 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 27 🌴

27. యత్కరోషి యదశ్నాషి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కొన్తేయ తత్కురుష్వ మదర్పణమ్ ||

🌷. తాత్పర్యం :

ఓ కౌన్తేయ! నీవు ఏది ఒనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను,ఏ తపస్సు నాచరించినను వాటన్నింటిని నాకు అర్పణముగా ఒనరింపుము.

🌷. భాష్యము :

ఎట్టి పరిస్థితి యందును శ్రీకృష్ణభగవానుని మరవకుండునట్లుగా జీవితమును మలచుకొనుట ప్రతియొక్కరి ధర్మము. దేహపోషణ కొరకు ప్రతియొక్కరు కర్మ చేయవలసియే ఉన్నందున తనకొరకు కర్మ చేయుమని శ్రీకృష్ణుడు ఇచ్చట ఉపదేశించుచున్నాడు. జీవనముకై ఆహారమును భుజించుట అవసరము గనుక కృష్ణునకు అర్పింపబడిన ఆహారమునే ప్రసాదరూపమున మనుజుడు గ్రహింపవలెను. అదే విధముగా నాగరికుడైన మనుజుడు ధర్మకార్యములను ఒనరింపవలసియున్నందున వానిని తన కొరకే చేయుమని శ్రీకృష్ణుడు పలుకుచున్నాడు. అదియే అర్చనము.

ప్రతియొక్కరు ఏదియో ఒకదానిని దానమిచ్చు స్వభావమును కలిగియుందురు కావున దానిని తనకే ఒసగుమని శ్రీకృష్ణుడు ఉపదేశించుచున్నాడు. అనగా అధికముగా ప్రోగుపడిన ధనమును మనుజుడు కృష్ణచైతన్యోద్యమపు ప్రచారము కొరకై వినియోగించవలెను. ధ్యానము ఈ యోగమునకు ఆచరణయోగ్యము కానిదైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు. కనుక ఎవరైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు. కనుక ఎవరైనను హరేకృష్ణ మాహా మంత్రమును జపమాలపై జపించుచు శ్రీకృష్ణుని ఇరువదినాలుగుగంటలు ధ్యానింపగలిగినచో భగవద్గీత యందలి షష్టాధ్యాయమున వివరింపబడినట్లు గొప్ప ధ్యానతత్పరుడు మరియు గొప్పయోగి కాగలడు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 365 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 27 🌴

27. yat karoṣi yad aśnāsi yaj juhoṣi dadāsi yat
yat tapasyasi kaunteya tat kuruṣva mad-arpaṇam


🌷 Translation :

Whatever you do, whatever you eat, whatever you offer or give away, and whatever austerities you perform – do that, O son of Kuntī, as an offering to Me.

🌹 Purport :

Thus, it is the duty of everyone to mold his life in such a way that he will not forget Kṛṣṇa in any circumstance. Everyone has to work for maintenance of his body and soul together, and Kṛṣṇa recommends herein that one should work for Him. Everyone has to eat something to live; therefore he should accept the remnants of foodstuffs offered to Kṛṣṇa.

Any civilized man has to perform some religious ritualistic ceremonies; therefore Kṛṣṇa recommends, “Do it for Me,” and this is called arcana. Everyone has a tendency to give something in charity; Kṛṣṇa says, “Give it to Me,” and this means that all surplus money accumulated should be utilized in furthering the Kṛṣṇa consciousness movement.

🌹 🌹 🌹 🌹 🌹


22 Apr 2020