🌹. శ్రీమద్భగవద్గీత - 349 / Bhagavad-Gita - 349 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 11 🌴
11. అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ |
పరం భావమజానన్తో మమ భూతమహేశ్వరమ్ |
🌷. తాత్పర్యం :
నేను మానవరూపమున అవతరించినపుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. సమస్తమునకు పరమప్రభువైన నా దివ్యత్వమును వారెరుగరు.
🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు మనవరూపమున అవతరించినప్పటికిని సామాన్య మానవుడు కాడని ఈ అధ్యాయమునందలి కడచిన శ్లోకముల భాష్యము వలన స్పష్టముగా విదితమైనది. వాస్తవమునకు సమస్త విశ్వము సృష్టి, స్థితి, లయములను గావించు శ్రీకృష్ణభగవానుడు సాధారణమానవుడు కానేకాడు. అయినప్పటికిని పెక్కురు మూఢులు శ్రీకృష్ణుడు కేవలము శక్తిమంతుడైన మానవుడే గాని అంతకు మించి ఏదియును కాడని భావింతురు. కాని బ్రహ్మసంహిత యందు నిర్ధారింపబడినట్లు అతడే ఆదిదేవుడు మరియు దేవదేవుడు (ఈశ్వర: పరమ: కృష్ణ: ) .
వాస్తవమునకు నియమించెడి ఈశ్వరులు పెక్కురు గలరు. వారిలో ఒకరికన్నను వేరొకరు అధికులుగా గోచరింతురు. భౌతికజగమునందలి లౌకికకార్యములందు కూడా ఒక అధికారి, అతనిపై ఒక కార్యదర్శి, అతనిపై ఒక మంత్రి, ఆ మంత్రిపై అధ్యక్షుడు ఉన్నట్లుగా మనము గాంతుము. వీరందరు తమ పరధిలో ఈశ్వరులేయైనను వేరొకనిచే నియమింపబడెడివారు. కాని శ్రీకృష్ణభగవానుడు మాత్రము దివ్య నియామకుడని బ్రహ్మసంహిత యందు తెలుపబడినది. భౌతిక, ఆధ్యాత్మికజగత్తులలో పలు ఈశ్వరులున్నను శ్రీకృష్ణుడు మాత్రము పరమేశ్వరుడు (ఈశ్వర: పరమ: కృష్ణ: ) మరియు అతని దేహము సచ్చిదానందమయమైనది (భౌతికము కానిది).
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 349 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 11 🌴
11 . avajānanti māṁ mūḍhā mānuṣīṁ tanum āśritam
paraṁ bhāvam ajānanto mama bhūta-maheśvaram
🌷 Translation :
Fools deride Me when I descend in the human form. They do not know My transcendental nature as the Supreme Lord of all that be.
🌹 Purport :
From the other explanations of the previous verses in this chapter, it is clear that the Supreme Personality of Godhead, although appearing like a human being, is not a common man. The Personality of Godhead, who conducts the creation, maintenance and annihilation of the complete cosmic manifestation, cannot be a human being. Yet there are many foolish men who consider Kṛṣṇa to be merely a powerful man and nothing more. Actually, He is the original Supreme Personality, as is confirmed in the Brahma-saṁhitā (īśvaraḥ paramaḥ kṛṣṇaḥ); He is the Supreme Lord.
There are many īśvaras, controllers, and one appears greater than another. In the ordinary management of affairs in the material world, we find some official or director, and above him there is a secretary, and above him a minister, and above him a president. Each of them is a controller, but one is controlled by another. In the Brahma-saṁhitā it is said that Kṛṣṇa is the supreme controller; there are many controllers undoubtedly, both in the material and spiritual world, but Kṛṣṇa is the supreme controller (īśvaraḥ paramaḥ kṛṣṇaḥ), and His body is sac-cid-ānanda, nonmaterial.
🌹 🌹 🌹 🌹 🌹
6 Apr 2020