శ్రీమద్భగవద్గీత - 355: 09వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 355: Chap. 09, Ver. 17


🌹. శ్రీమద్భగవద్గీత - 355 / Bhagavad-Gita - 355 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 17 🌴

17. పితాహమస్య జగతో మతా ధాతా పితామహ: |
వేద్యం పవిత్రం ఓంకార ఋక్సామ యజురేవచ ||

🌷. తాత్పర్యం :

నేను ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయియున్నాను. జ్ఞానలక్ష్యమును, పవిత్రము చేయువాడను, ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము,యజుర్వేదములు కూడా నేనే.

🌷. భాష్యము :

స్థావరజంగమాత్మకమైన సమస్తసృష్టి శ్రీకృష్ణుని శక్తి యొక్క వ్యక్తీకరణమై యున్నది. ప్రస్తుత భౌతికస్థితిలో మనము శ్రీకృష్ణుని తటస్థశక్తులేయైన వివిధజీవులతో వివధ సంబంధములను ఏర్పరచుకొనియున్నాము. ప్రకృతి కారణముగా అట్టి జీవులలో కొందరు మనకు తండ్రిగా, తల్లిగా, తాతగా, సృష్టికర్తగా గోచరింతురు. కాని వాస్తవమునకు అట్లు గోచరించు వారందరును శ్రీకృష్ణుని అంశలే. అనగా తల్లి, తండ్రి ఆది వివిధరూపములలో గోచరించునది శ్రీకృష్ణుడే గాని వేరెవ్వరును కాదు. ఈ శ్లోకమునందలి “ధాత” యను పదమునకు “సృష్టికర్త” యని భావము. మన తల్లిదండ్రులే గాక, సృష్టికర్త, పితామహి, పితామాహాదులు సైతము శ్రీకృష్ణుడే. వాస్తవమునకు శ్రీకృష్ణుని అంశలైయున్నందున ప్రతిజీవియు కృష్ణునితో సమానమే. కనుకనే వేదములన్నియును శ్రీకృష్ణుని వైపునకే కేంద్రీకరింపబడియున్నవి.

తత్కారణముగా మనము వేదముల నుండి ఏది తెలియ యత్నించినను అది శ్రీకృష్ణపరజ్ఞానమును పొందుటలో పురోగతియే యగును. మన స్థితి పవిత్రపరచు జ్ఞానము కూడా శ్రీకృష్ణుడే. అదే విధముగా వేదంనియమములను అవగతము చేసికొనుట యందు జిజ్ఞాసువైనవాడు సైతము శ్రీకృష్ణుని అంశయే. కనుక అతడును శ్రీకృష్ణుడే. వేదమంత్రములందు ప్రణవమని పిలువబడు పవిత్ర ఓంకారము కూడా శ్రీకృష్ణుడే. సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము మరియు అథర్వవేదములందలి అన్ని శ్లోకములలో ఓంకారము మిక్కిలి ప్రధానమగుటచే దానిని శ్రీకృష్ణునుగా అవగాహనము చేసికొనవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 355 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 17 🌴

17. pitāham asya jagato mātā dhātā pitāmahaḥ
vedyaṁ pavitram oṁ-kāra ṛk sāma yajur eva ca


🌷 Translation :

I am the father of this universe, the mother, the support and the grandsire. I am the object of knowledge, the purifier and the syllable oṁ. I am also the Ṛg, the Sāma and the Yajur Vedas.

🌹 Purport :

The entire cosmic manifestations, moving and nonmoving, are manifested by different activities of Kṛṣṇa’s energy. In the material existence we create different relationships with different living entities who are nothing but Kṛṣṇa’s marginal energy; under the creation of prakṛti some of them appear as our father, mother, grandfather, creator, etc., but actually they are parts and parcels of Kṛṣṇa. As such, these living entities who appear to be our father, mother, etc., are nothing but Kṛṣṇa. In this verse the word dhātā means “creator.”

Not only are our father and mother parts and parcels of Kṛṣṇa, but the creator, grandmother and grandfather, etc., are also Kṛṣṇa. Actually any living entity, being part and parcel of Kṛṣṇa, is Kṛṣṇa. All the Vedas, therefore, aim only toward Kṛṣṇa. Whatever we want to know through the Vedas is but a progressive step toward understanding Kṛṣṇa. That subject matter which helps us purify our constitutional position is especially Kṛṣṇa. Similarly, the living entity who is inquisitive to understand all Vedic principles is also part and parcel of Kṛṣṇa and as such is also Kṛṣṇa. In all the Vedic mantras the word oṁ, called praṇava, is a transcendental sound vibration and is also Kṛṣṇa. And because in all the hymns of the four Vedas – Sāma, Yajur, Ṛg and Atharva – the praṇava, or oṁ-kāra, is very prominent, it is understood to be Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹

12 Apr 2020