శ్రీమద్భగవద్గీత - 353: 09వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 353: Chap. 09, Ver. 15


🌹. శ్రీమద్భగవద్గీత - 353 / Bhagavad-Gita - 353 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 15 🌴

15. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్తో మాముపాసతే |
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ||


🌷. తాత్పర్యం :

జ్ఞానసముపార్జన యజ్ఞము నందు నియుక్తులైన ఇతరులు దేవదేవుడైన నన్ను అద్వితీయునిగా, వివధరుపునిగా, విశ్వరూపునిగా పూజింతురు.

🌷. భాష్యము :

పూర్వపు శ్లోకముల సారాంశమే ఈ శ్లోకము. సంపూర్ణ భక్తిభావనలో నిలిచి తనను తప్ప అన్యమును తెలియనివారు మహాత్ములని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపియున్నాడు. అట్టి మహాత్ముల స్థాయికి చెందకున్నను శ్రీకృష్ణునే పలువిధములుగా పూజించువారు కొందరు గలరు. వారిలో కొందరు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానసముపార్జన యందు నియుక్తులైనవారుగా ఇదివరకే వర్ణింపబడినారు. వీరికన్నను తక్కువస్థాయిలో గల ఇతరులు తిరిగి మూడు రకములుగా విభజింపబడిరి. అందులో మొదటిరకమువారు ఆత్మనే భగవానుని తలచి తమను తాము అర్చించుకొందురు. రెండవరకమువారు భగవానునికి ఏదో తోచినరూపము ఆపాదించి దానిని అర్చింతురు. మూడవ రకము వారు చెందినవారు విశ్వమును భగవానునిగా భావించి పూజింతురు.

ఈ మూడురకములలో తమను అద్వైతులుగా భావించుచు తమను తామే భగవానుని రూపమున అర్చించువారు అధికముగా నుందురు. వారు అధములు. అట్టివారు తమనే భగవానుని భావించుచు అదే భావనలో తమను తాము పూజించుకొందురు. ఇదియును ఒక విధమైన భగవదర్చనమే. ఏలయన అట్లు చేయువారు తాము దేహాదులము కామనియు, కేవలము ఆత్మస్వరూపలమేననియు సంపూర్ణముగా తెలిసియుందురు. కనీసము వారి యందు అట్టి భావనము ప్రబలముగా నుండును. సాధారణగా నిరాకారవాదులు దేవదేవుని ఈ రీతిగనే అర్చింతురు. ఈ రూపమైనను భగవానుని రూపమే అనెడి భావనలో ఇతర దేవతార్చనము చేయువారు రెండవ తరగతికి చెందినవారు. ఇక మూడవతరగతికి చెందినవారు విశ్వమును తప్ప అన్యమును ఊహింపలేక విశ్వమునే దివ్యముగా భావించి దానిని అర్చింతురు. అట్టి విశ్వము కూడా శ్రీకృష్ణ భగవానుని రూపమే అయియున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 353 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 15 🌴

15. jñāna-yajñena cāpy anye yajanto mām upāsate
ekatvena pṛthaktvena bahudhā viśvato-mukham


🌷 Translation :

Others, who engage in sacrifice by the cultivation of knowledge, worship the Supreme Lord as the one without a second, as diverse in many, and in the universal form.

🌹 Purport :

This verse is the summary of the previous verses. The Lord tells Arjuna that those who are purely in Kṛṣṇa consciousness and do not know anything other than Kṛṣṇa are called mahātmā; yet there are other persons who are not exactly in the position of mahātmā but who worship Kṛṣṇa also, in different ways. Some of them have already been described as the distressed, the financially destitute, the inquisitive, and those who are engaged in the cultivation of knowledge. But there are others who are still lower, and these are divided into three: (1) he who worships himself as one with the Supreme Lord, (2) he who concocts some form of the Supreme Lord and worships that, and (3) he who accepts the universal form, the viśva-rūpa of the Supreme Personality of Godhead, and worships that.

Out of the above three, the lowest, those who worship themselves as the Supreme Lord, thinking themselves to be monists, are most predominant. Such people think themselves to be the Supreme Lord, and in this mentality they worship themselves. This is also a type of God worship, for they can understand that they are not the material body but are actually spiritual soul; at least, such a sense is prominent. Generally the impersonalists worship the Supreme Lord in this way. The second class includes the worshipers of the demigods, those who by imagination consider any form to be the form of the Supreme Lord. And the third class includes those who cannot conceive of anything beyond the manifestation of this material universe. They consider the universe to be the supreme organism or entity and worship that. The universe is also a form of the Lord.

🌹 🌹 🌹 🌹 🌹

10 Apr 2020