శ్రీమద్భగవద్గీత - 345: 09వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 345: Chap. 09, Ver. 07


🌹. శ్రీమద్భగవద్గీత - 345 / Bhagavad-Gita - 345 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 07 🌴

07. సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిమ యాన్తి మామికామ్ |
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యాహమ్ ||

🌷. తాత్పర్యం :

ఓ కొన్తేయ! కల్పాంతమున సమస్త భౌతికసృష్టులు నా ప్రకృతి యందు ప్రవేశించును. తదుపరి కల్పారంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును.

🌷. భాష్యము :

ఈ భౌతికసృష్టి యొక్క సృష్టి, స్థితి, లయములు సంపూర్ణముగా శ్రీకృష్ణభగవానుని దివ్యసంకల్పము పైననే ఆధారపడియుండును. ఇచ్చట కల్పాంతమనగా బ్రహ్మదేవుని నిర్వాణము పిదప యని భావము. నూరు సంవత్సరములు జీవించు ఆ బ్రహ్మదేవుని ఒక పగలు 4,300,000,000 భూలోక సంవత్సరములతో సమానము. అతని రాత్రి సమయము కూడా అంతే కాలపరిమాణమును కలిగియుండును. అనగా అతని మాసమున అట్టి పగలు మరియు రాత్రి సమయములు ముప్పదియుండగా, అతని సంవత్సరకాలము పన్నెండు అట్టి మాసములను కలిగియుండును.

అటువంటి వంద సంవత్సరములు గడచిన పిమ్మట బ్రహ్మదేవుడు తనువును చాలించినపుడు ప్రళయము సంభవించును. అనగా అట్టి సమయమున అంతవరకు ప్రదర్శితమైన శ్రీకృష్ణభగవానుని శక్తి అతని యందే తిరిగి లయించిపోవును. మరల విశ్వసృష్టి అవసరమైనప్పుడు, ఆ భగవానుని సంకల్పముచే అది తిరిగి ప్రకటితమగును. కనుకనే “బహుస్యాం – నేనొక్కడనే అయినను బహురూపములు దాల్చుదును” అని తెలుపబడినది. ఇది చాందోగ్యోపనిషత్తు మంత్రము (6.2.3). శ్రీకృష్ణభగవానుడు ఆ రీతి భౌతికశక్తి యందు వ్యాపించినపుడు సమస్త విశ్వము తిరిగి ప్రకటితమగును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 345 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 07 🌴

07 . sarva-bhūtāni kaunteya prakṛtiṁ yānti māmikām
kalpa-kṣaye punas tāni kalpādau visṛjāmy aham

🌷 Translation :

O son of Kuntī, at the end of the millennium all material manifestations enter into My nature, and at the beginning of another millennium, by My potency, I create them again.

🌹 Purport :

The creation, maintenance and annihilation of this material cosmic manifestation are completely dependent on the supreme will of the Personality of Godhead. “At the end of the millennium” means at the death of Brahmā. Brahmā lives for one hundred years, and his one day is calculated at 4,300,000,000 of our earthly years. His night is of the same duration. His month consists of thirty such days and nights, and his year of twelve months. After one hundred such years, when Brahmā dies, the devastation or annihilation takes place; this means that the energy manifested by the Supreme Lord is again wound up in Himself.

Then again, when there is a need to manifest the cosmic world, it is done by His will. Bahu syām: “Although I am one, I shall become many.” This is the Vedic aphorism (Chāndogya Upaniṣad 6.2.3). He expands Himself in this material energy, and the whole cosmic manifestation again takes place.

🌹 🌹 🌹 🌹 🌹

2 Apr 2020