శ్రీమద్భగవద్గీత - 350: 09వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 350: Chap. 09, Ver. 12


🌹. శ్రీమద్భగవద్గీత - 350 / Bhagavad-Gita - 350 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 12 🌴

12. మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతస: |
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిమ మోహినీం శ్రితా: ||


🌷. తాత్పర్యం :

ఆ విధముగా మోహపరవశులైన వారు దానవ, నాస్తికభావములచే విమోహితులగుదురు. అట్టి భ్రాంతస్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞానసముపార్జన లన్నియును వ్యర్థములగును.

🌷. భాష్యము :

తమను తాము కృష్ణభక్తిభావన యందు మరియు భక్తియుతసేవ యందు నిలిచియున్నవారిగా భావించుచునే అంతరంగమున మాత్రము దేవదేవుడైన శ్రీకృష్ణుని పరతత్త్వముగా అంగీకరింపని భక్తులు పెక్కురు గలరు. భగవద్ధామప్రాప్తి యను భక్తియోగఫలమును అట్టి వారెన్నడును రుచిచూడలేరు.

అదే విధముగా కామ్యకర్మలందు, పుణ్యకర్మలందు మగ్నులైనవారు మరియు భౌతికబంధముల నుండి ముక్తిని వాంచించువారు సైతము దేవదేవుడైన శ్రీకృష్ణుని నిరసించు కారణముగా కృతకృత్యులు కాజాలరు. వేరుమాటలలో శ్రీకృష్ణుని యెడ అపహాస్య భావముతో వర్తించువారే దానవస్వభావులు లేదా నాస్తికస్వభావులు అయినట్టివారు. భగవద్గీత యందలి సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు అట్టి దానవప్రవృత్తి కలవారు కృష్ణుని శరణునొందరు. కనుక పరతత్త్వమును అవగాహన చేసికొన యత్నించు వారు మానసికకల్పనలు సాధారణజీవుడు మరియు శ్రీకృష్ణుడు ఏకమే, సమానమే అనెడి మిథ్యానిర్ణయమునకు వారిని చేర్చును.

అట్టి మిథ్యాభావనలో వారు ప్రస్తుతము దేహము ప్రక్రుతిచే కప్పబడియున్నదనియు, భౌతికదేహము నుండి ముక్తిని బడసినంతనే భగవానుడు మరియు తమ నడుమ భేదముండదనియు భావింతురు. కాని శ్రీకృష్ణునితో ఏకము కావలెననెడి వారు ప్రయత్నము భ్రాంతి కారణముగా వ్యర్థమగును. అట్టి దానవ, నాస్తికప్రవృత్తితో కూడియున్న జ్ఞానము వ్యర్థమని ఈ శ్లోకమున సూచించబడినది. అనగా వేదాంతసూత్రములు, ఉపనిషత్తులు వంటి వేదవాజ్మయమునందలి జ్ఞానసముపార్జనము దానవ, నాస్తికప్రవృత్తి గలవారికి సదా వ్యర్థమే కాగలదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 350 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 12 🌴

12 . moghāśā mogha-karmāṇo mogha-jñānā vicetasaḥ
rākṣasīm āsurīṁ caiva prakṛtiṁ mohinīṁ śritāḥ


🌷 Translation :

Those who are thus bewildered are attracted by demonic and atheistic views. In that deluded condition, their hopes for liberation, their fruitive activities, and their culture of knowledge are all defeated.

🌹 Purport :

There are many devotees who assume themselves to be in Kṛṣṇa consciousness and devotional service but at heart do not accept the Supreme Personality of Godhead, Kṛṣṇa, as the Absolute Truth. For them, the fruit of devotional service – going back to Godhead – will never be tasted. Similarly, those who are engaged in fruitive pious activities and who are ultimately hoping to be liberated from this material entanglement will never be successful either, because they deride the Supreme Personality of Godhead, Kṛṣṇa.

In other words, persons who mock Kṛṣṇa are to be understood to be demonic or atheistic. As described in the Seventh Chapter of Bhagavad-gītā, such demonic miscreants never surrender to Kṛṣṇa. Therefore their mental speculations to arrive at the Absolute Truth bring them to the false conclusion that the ordinary living entity and Kṛṣṇa are one and the same.

With such a false conviction, they think that the body of any human being is now simply covered by material nature and that as soon as one is liberated from this material body there is no difference between God and himself. This attempt to become one with Kṛṣṇa will be baffled because of delusion. Such atheistic and demoniac cultivation of spiritual knowledge is always futile.

🌹 🌹 🌹 🌹 🌹

7 Apr 2020