శ్రీమద్భగవద్గీత - 373: 10వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 373: Chap. 10, Ver. 01


🌹. శ్రీమద్భగవద్గీత - 373 / Bhagavad-Gita - 373 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 01 🌴

01. శ్రీ భగవానువాచ

భూయ ఏవ మహాబాహో శ్రుణు మే పరమం వచ: |
యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యాయా ||

🌷. తాత్పర్యం :

శ్రీకృష్ణభగవానుడు పలికెను: మహాబాహువులుగల ఓ అర్జునా! మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియమిత్రుడవగుటచే ఇంతవరకు వివరించిన జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై నేను వచించెదను.

🌷. భాష్యము :

“భగవానుడు” అను పదమునకు శక్తి, యశస్సు, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అనెడి ఆరు విభూతులను సమగ్రమముగా కలిగియున్నవాడని భావమైనట్లుగా పరాశరముని వివరించియున్నారు. ధరత్రిపై అవతరించినపుడు శ్రీకృష్ణుడు అట్టి ఆరువిభూతులను సమగ్రమముగా ప్రదర్శించియున్నందున పరాశరుడు వంటి మహా మునులు అతనిని దేవదేవునిగా ఆంగీకరించియున్నారు. ఇప్పుడు ఆ భగవానుడే స్వయముగా తన విభూతులు మరియు తన కర్మలను గూర్చిన రహస్యజ్ఞానమును అర్జునునకు ఉపదేశించనున్నాడు. సప్తమాధ్యాయపు ఆరంభము నుండియే తన వివిధశక్తులు గుర్చియు మరియు అవి వర్తించు విధమును గూర్చియు తెలియజేసిన భగవానుడు ఈ అధ్యాయమున తన ప్రత్యేక విభూతులను అర్జునునకు వివరింపనున్నాడు. నిశ్చయముతో కూడిన భక్తిని స్థాపించుట కొరకై తన వివిధశక్తులను విపులముగా గడచిన అధ్యాయమున వర్ణించిన శ్రీకృష్ణభగవానుడు తిరిగి ఈ అధ్యాయమున తన వివిధభూతులను మరియు సృష్టివిస్తారములను అర్జునునకు తెలియజేయుచున్నాడు.

శ్రీకృష్ణభగవానుని గూర్చి అధికముగా శ్రవణము చేసిన కొలది భక్తి యందు మనుజుడు అధికముగా స్థిరత్వమును పొందును. ప్రతియొక్కరు ఆ దేవదేవుని గూర్చి భక్తుల సాంగత్యమున శ్రవణము చేయవలెను. అది వారి భక్తిని వృద్ధి చేయగలదు. వాస్తవమునకు కృష్ణపరచర్చలు మరియు ప్రసంగములనునవి కృష్ణభక్తిభావన యందు నిజముగా లగ్నమైనవారి నడుమనే జరుగును. ఇతరులు అట్టివాటి యందు పాల్గొనజాలరు. అర్జునుడు తనకు అత్యంత ప్రియుడైనందునే అతని హితము కొరకు అటువంటి ఉపదేశము చేయబడుచున్నది శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా తెలియజేయుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 373 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 01 🌴

01. śrī-bhagavān uvāca

bhūya eva mahā-bāho śṛṇu me paramaṁ vacaḥ
yat te ’haṁ prīyamāṇāya vakṣyāmi hita-kāmyayā


🌷 Translation :

The Supreme Personality of Godhead said: Listen again, O mighty-armed Arjuna. Because you are My dear friend, for your benefit I shall speak to you further, giving knowledge that is better than what I have already explained.

🌹 Purport :

The word bhagavān is explained thus by Parāśara Muni: one who is full in six opulences, who has full strength, full fame, wealth, knowledge, beauty and renunciation, is Bhagavān, or the Supreme Personality of Godhead. While Kṛṣṇa was present on this earth, He displayed all six opulences. Therefore great sages like Parāśara Muni have all accepted Kṛṣṇa as the Supreme Personality of Godhead. Now Kṛṣṇa is instructing Arjuna in more confidential knowledge of His opulences and His work. Previously, beginning with the Seventh Chapter, the Lord has already explained His different energies and how they are acting. Now in this chapter He explains His specific opulences to Arjuna.

In the previous chapter He has clearly explained His different energies to establish devotion in firm conviction. Again in this chapter He tells Arjuna about His manifestations and various opulences. The more one hears about the Supreme God, the more one becomes fixed in devotional service. One should always hear about the Lord in the association of devotees; that will enhance one’s devotional service. Discourses in the society of devotees can take place only among those who are really anxious to be in Kṛṣṇa consciousness. Others cannot take part in such discourses. The Lord clearly tells Arjuna that because Arjuna is very dear to Him, for his benefit such discourses are taking place.

🌹 🌹 🌹 🌹 🌹

30 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 372: 09వ అధ్., శ్లో 34 / Bhagavad-Gita - 372: Chap. 09, Ver. 34


🌹. శ్రీమద్భగవద్గీత - 372 / Bhagavad-Gita - 372 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 34 🌴

34. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమష్కురు |
మామేవైష్యసి యుక్వైవమాత్మానం మత్పరాయణ: ||


🌷. తాత్పర్యం :

నీ మనస్సు సదా నా చింతన యందే నిమగ్నము చేయుము. నా భక్తుడవగుము. నాకు నమస్కారము, నన్ను అర్చింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణమగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు.

🌷. భాష్యము :

కృష్ణభక్తిరసభావన మొక్కటే కలుషితమైన భౌతికప్రపంచ బంధముల నుండి ముక్తిని పొందుటకు ఏకైక మార్గమని ఈ శ్లోకమునందు స్పష్టముగా తెలుపబడినది. భక్తియుతసేవను శ్రీకృష్ణభగవానునికే అర్పించవలెనని స్పష్టముగా ఇచ్చట తెలుపబడిన విషయమునకు అప్రమాణికులైన గీతావ్యాఖ్యాతలు కొన్నిమార్లు అర్థమును చెరచుదురు. దురదృష్టవశాత్తు వారు సాధ్యము కానటువంటి విషయముపైకి పాఠకుని మనస్సును మళ్ళింతురు. పరతత్త్వమేగాని సామాన్యుడు కానటువంటి శ్రీకృష్ణుని మరియు అతని మనస్సుకు భేదము లేదని అట్టి వారు తెలియజాలరు. శ్రీకృష్ణుడు, అతని దేహము, అతని మనస్సు అన్నియును ఏకమే. పరిపూర్ణమే.

ఈ విషయమునే “దేహదేహివిభేదో(యం నేశ్వరే విద్యతే క్వచిత్” యని చైతన్యచరితామృతము (ఆదిలీల పంచమాధ్యాయము 41-48) యొక్క అనుభాష్యమునందు శ్రీభక్తిసిద్ధాంతసరస్వతీ గోస్వాములవారు కుర్మపురాణము నందు తెలుపబడినదానిని ఉదహరించియుండిరి. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని యందు భేదభావమనునదియే లేదు. అతడు మరియు అతని శరీరము అభేదములు. కాని కృష్ణసంభందవిజ్ఞానము లేని కారణముగా అట్టి వ్యాఖ్యాతలు కృష్ణుని దేవదేవత్వమును మరుగుపరచి ఆ భగవానుడు అతని దేహము లేదా మనస్సు కన్నను అన్యుడని వక్రముగా వ్యాఖ్యానింతురు. ఇది వాస్తవమునకు కృష్ణసంబంధవిజ్ఞాన రాహిత్యమేయైనను అట్టివారు సామాన్యులను మోసపుచ్చి లాభమును గడించుచుందురు.

శ్రీమద్భాగవతము యందలి “పరమగుహ్యజ్ఞానము” అను నవమాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 372 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 34 🌴

34. man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru
mām evaiṣyasi yuktvaivam ātmānaṁ mat-parāyaṇaḥ


🌷 Translation :

Engage your mind always in thinking of Me, become My devotee, offer obeisances to Me and worship Me. Being completely absorbed in Me, surely you will come to Me.

🌹 Purport :

In this verse it is clearly indicated that Kṛṣṇa consciousness is the only means of being delivered from the clutches of this contaminated material world. Sometimes unscrupulous commentators distort the meaning of what is clearly stated here: that all devotional service should be offered to the Supreme Personality of Godhead, Kṛṣṇa. Unfortunately, unscrupulous commentators divert the mind of the reader to that which is not at all feasible. Such commentators do not know that there is no difference between Kṛṣṇa’s mind and Kṛṣṇa.

Kṛṣṇa is not an ordinary human being; He is Absolute Truth. His body, His mind and He Himself are one and absolute. It is stated in the Kūrma Purāṇa, as it is quoted by Bhaktisiddhānta Sarasvatī Gosvāmī in his Anubhāṣya comments on Caitanya-caritāmṛta (Fifth Chapter, Ādi-līlā, verses 41–48), deha-dehi-vibhedo ’yaṁ neśvare vidyate kvacit. This means that there is no difference in Kṛṣṇa, the Supreme Lord, between Himself and His body. But because the commentators do not know this science of Kṛṣṇa, they hide Kṛṣṇa and divide His personality from His mind or from His body. Although this is sheer ignorance of the science of Kṛṣṇa, some men make profit out of misleading people.

Thus end the Bhaktivedanta Purports to the Ninth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Most Confidential Knowledge.

🌹 🌹 🌹 🌹 🌹

29 Apr 2020


శ్రీమద్భగవద్గీత - 371: 09వ అధ్., శ్లో 33 / Bhagavad-Gita - 371: Chap. 09, Ver. 33


🌹. శ్రీమద్భగవద్గీత - 371 / Bhagavad-Gita - 371 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 33 🌴

33. కిం పునర్బ్రాహ్మణా: పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమామ్ ||

🌷. తాత్పర్యం :

ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గూర్చియు, భక్తుల గూర్చియు, రాజర్షుల గూర్చియు వేరుగా చెప్పవలెనా! అందుచే అనిత్యమును, అసుఖమును అగు ఈ లోకమునకు వచ్చియున్నందున నా ప్రేమయుక్తసేవలో నియుక్తుడవగుము.

🌷. భాష్యము :

భౌతికజగమున జనులలో పలువర్గములున్నను వాస్తవమునకు వారెవ్వరికినీ ఈ జగము సుఖకరమైన ప్రదేశము కాదు. కనుకనే “అనిత్యమ్ అసుఖం లోకమ్” అని స్పష్టముగా తెలుపబడినది. అనగా ఈ భౌతికజగత్తు అశాశ్వతము, దుఃఖపూర్ణమునై సజ్జనుడైనవాడు నివసించుటకు యోగ్యము కాకున్నది. ఈ జగము శ్రీకృష్ణభగవానునిచే అశాశ్వతమైనదిగను మరియు దుఃఖపూర్ణముగను ప్రకటింపబడగా, కొందరు తత్త్వవేత్తలు (ముఖ్యముగా మయావాదులు) దీనిని మిథ్యగా వర్ణింతురు. కాని గీత ప్రకారము జగత్తు ఆశాశ్వతమే గాని మిథ్య కాదు. మిథ్యత్వము మరియు అనిత్యత్వముల నడుమ భేదము కలదు. భౌతికజగము అశాశ్వతము. కాని దీనికి పరమైన వేరొకజగము నిత్యమైనది. అలాగుననే ఈ జగము దుఃఖపూర్ణము. కాని దీనికి పరమైన జగము నిత్యమైనది మరియు ఆనందపూర్ణమైనది.

అర్జునుడు రాజర్షుల వంశములో జన్మించినట్టివాడు. అతనికి సైతము “నా భక్తియోగమును చేపట్టి శీఘ్రమే నా ధామమును చేరుము” అని శ్రీకృష్ణుడు ఉపదేశమొసగియుండెను. అనగా దుఃఖపూర్ణము మరియు ఆశాశ్వతమైన ఈ లోకముననే ఎవ్వరును నిలిచిపోరాదు. ప్రతియొక్కరు శ్రీకృష్ణభగవానుని ఆశ్రయించి నిత్యానందమును పొందవలెను. అన్ని తరగతుల జనుల సమస్యలు పరిష్కరింపబడుటకు ఆ దేవదేవుని భక్తియోగమే ఏకైక విధానము. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిరసభావనము అలవరచుకొని తమ జీవితమును పూర్ణము కావించుకొనవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 371 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 33 🌴

33. kiṁ punar brāhmaṇāḥ puṇyā bhaktā rājarṣayas tathā
anityam asukhaṁ lokam imaṁ prāpya bhajasva mām


🌷 Translation :

How much more this is so of the righteous brāhmaṇas, the devotees and the saintly kings. Therefore, having come to this temporary, miserable world, engage in loving service unto Me.

🌹 Purport :

In this material world there are classifications of people, but, after all, this world is not a happy place for anyone. It is clearly stated here, anityam asukhaṁ lokam: this world is temporary and full of miseries, not habitable for any sane gentleman. This world is declared by the Supreme Personality of Godhead to be temporary and full of miseries. Some philosophers, especially Māyāvādī philosophers, say that this world is false, but we can understand from Bhagavad-gītā that the world is not false; it is temporary. There is a difference between temporary and false. This world is temporary, but there is another world, which is eternal. This world is miserable, but the other world is eternal and blissful.

Arjuna was born in a saintly royal family. To him also the Lord says, “Take to My devotional service and come quickly back to Godhead, back home.” No one should remain in this temporary world, full as it is with miseries. Everyone should attach himself to the bosom of the Supreme Personality of Godhead so that he can be eternally happy. The devotional service of the Supreme Lord is the only process by which all problems of all classes of men can be solved. Everyone should therefore take to Kṛṣṇa consciousness and make his life perfect.

🌹 🌹 🌹 🌹 🌹


28 Apr 2020


శ్రీమద్భగవద్గీత - 370: 09వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 370: Chap. 09, Ver. 32


🌹. శ్రీమద్భగవద్గీత - 370 / Bhagavad-Gita - 370 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 32 🌴

32. మాం హి పార్థా వ్యపాశ్రిత్య యేపి స్యు: పాపయోనయ: |
స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తేపి యాన్తి పరాం గతిమ్ ||

🌷. తాత్పర్యం :


ఓ పార్థా! నా శరణుజొచ్చువారు అధమజన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికిని పరమగతిని పొందగలరు.

🌷. భాష్యము :

భక్తిలో ఉచ్చ, నీచ జనుల నడుమ భేదభావము ఉండదని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా ప్రకటించుచున్నాడు. భౌతికభావనము నందున్నప్పుడు అట్టి విభాగములు ఉండవచ్చును గాని భగవానుని భక్తియుతసేవ యందు నియుక్తుడైనవానికి అట్టివి ఉండవు. ప్రతియొక్కరు పరమగతిని పొందుటకు అర్హులై యున్నారు. చండాలురు (శునకమాంసము భుజించువారు) యని పిలువబడు అతినీచతరగతికి చెందినవారు సైతము శుద్ధభక్తుని సంగములో పవిత్రులు కాగలరని శ్రీమద్భాగవతము (2.4.18) తెలుపుచున్నది. భక్తియోగము మరియు భక్తుల మార్గదర్శనము అనునవి అత్యంత శక్తివంతమగుటచే ఉచ్చ, నీచ తరగతి జనుల నడుమ భేదభావమును కలిగియుండవు. ఎవ్వరైనను అట్టి భక్తుని స్వీకరింపవచ్చును. అతిసామాన్యుడు సైతము భక్తుని శరణము నొందినచో చక్కని మార్గదర్శనముచే పవిత్రుడు కాగలడు.

వాస్తవమునకు గుణముల ననుసరించి మనుజులు సత్త్వగుణప్రధానులని (బ్రాహ్మణులు), రజోగుణప్రధానులని (క్షత్రియులు), రజస్తమోగుణ ప్రధానులని (వైశ్యులు), తమోగుణప్రదానులని (శూద్రులు) నాలుగు తరగతులుగా విభజింపబడిరి. ఈ నాలుగు తరగతుల కన్నను నీచమైనవారు పాపయోనులైన చండాలురు. సాధారణముగా అట్టి పాపజన్ముల సాంగత్యమును ఉన్నత తరగతికి చెందినవారు అంగీకరింపరు. కాని భక్తియోగము అత్యంత శక్తివంతమైనదగుటచే శుద్ధభక్తుడు సమస్త నీచజనులు సైతము అత్యున్నత జీవనపూర్ణత్వమును బడయునట్లుగా చేయగలడు. శ్రీకృష్ణభగవానుని శరణుజొచ్చుట ద్వారానే అది సాధ్యము కాగలదు. కనుకనే “వ్యపాశ్రిత్య” యను పదముచే సూచింపబడినట్లు ప్రతియొక్కరు శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని పొందవలెను. అంతట మనుజుడు ఘనులైన జ్ఞానులు, యోగుల కన్నను అత్యంత ఘనుడు కాగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 370 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 32 🌴

32. māṁ hi pārtha vyapāśritya ye ’pi syuḥ pāpa-yonayaḥ
striyo vaiśyās tathā śūdrās te ’pi yānti parāṁ gatim

🌷 Translation :

O son of Pṛthā, those who take shelter in Me, though they be of lower birth – women, vaiśyas [merchants] and śūdras [workers] – can attain the supreme destination.

🌹 Purport :

It is clearly declared here by the Supreme Lord that in devotional service there is no distinction between the lower and higher classes of people. In the material conception of life there are such divisions, but for a person engaged in transcendental devotional service to the Lord there are not. Everyone is eligible for the supreme destination. In the Śrīmad-Bhāgavatam (2.4.18) it is stated that even the lowest, who are called caṇḍālas (dog-eaters), can be purified by association with a pure devotee. Therefore devotional service and the guidance of a pure devotee are so strong that there is no discrimination between the lower and higher classes of men; anyone can take to it. The most simple man taking shelter of the pure devotee can be purified by proper guidance.

According to the different modes of material nature, men are classified in the mode of goodness (brāhmaṇas), the mode of passion (kṣatriyas, or administrators), the mixed modes of passion and ignorance (vaiśyas, or merchants), and the mode of ignorance (śūdras, or workers). Those lower than them are called caṇḍālas, and they are born in sinful families. Generally, the association of those born in sinful families is not accepted by the higher classes. But the process of devotional service is so strong that the pure devotee of the Supreme Lord can enable people of all the lower classes to attain the highest perfection of life. This is possible only when one takes shelter of Kṛṣṇa. As indicated here by the word vyapāśritya, one has to take shelter completely of Kṛṣṇa. Then one can become much greater than great jñānīs and yogīs.

🌹 🌹 🌹 🌹 🌹

27 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 369: 09వ అధ్., శ్లో 31 / Bhagavad-Gita - 369: Chap. 09, Ver. 31


🌹. శ్రీమద్భగవద్గీత - 369 / Bhagavad-Gita - 369 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 31 🌴

31. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాన్తిం నిగచ్చతి |
కౌన్తేయ ప్రతిజానీహి న మే భక్త: ప్రణశ్యతి ||

🌷. తాత్పర్యం :

అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయా! నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యముగా ప్రకటింపుము.


🌷. భాష్యము :

ఈ శ్లోకమును తప్పుగా అర్థము చేసికొనరాదు. దురాచారుడైనవాడు తన భక్తుడు కాలేడని భగవానుడు సప్తమాధ్యాయమున తెలిపియున్నాడు. అలాగుననే భగవద్భకుడు కానివానికి ఎట్టి శుభలక్షణములు ఉండవనియు మమమెరిగియున్నాము. అట్టి యెడ యాదృచ్చికముగా లేక ప్రయత్నపూర్వకముగా పాపమును ఒనరించినవాడు ఎట్లు భక్తుడగును? ఇటువంటి ప్రశ్న ఇచ్చట ఉదయించుట సహజమే. గీత యందలి సప్తమాధ్యాయమున పేర్కొనబడిన దుష్కృతులు (వారెన్నడును శ్రీకృష్ణుని భక్తియోగమునకు రారు) ఎటువంటి శుభలక్షణములను కలిగియుండరని శ్రీమద్భాగవతము నందు తెలుపబడినది. కాని భక్తుడైనవాడు అట్లుగాక నవవిధములైన భక్తిమార్గముల ద్వారా తన హృదయమాలిన్యమును తొలగించుకొన యత్నమున ఉన్నట్టివాడు.

అతడు శ్రీకృష్ణభగవానుని సదా తన హృదయమునందే నిలిపియుండుటచే, అతని పాపములన్నియును సహజముగనే నశించిపోయియుండును. భగవానుని నిరంతర చింతన అతనిని పరమపవిత్రునిగ చేయును. ఉన్నతస్థితి నుండి పతనము చెందినవాడు పవిత్రతకై కొన్ని ప్రాయశ్చిత్తకర్మలను చేయవలెనని వేదానుసారము కొన్ని నియమములు కలవు. పవిత్రీకరణ విధానము భక్తుని హృదయమునందు ఇదివరకే నెలకొనియున్నందున అటువంటి పరిస్థితి భక్తియోగమునకు అన్యయింపదు. హృదయమునందు అతడు శ్రీకృష్ణభగవానుని సదా స్మరించుటయే అందులకు కారణము. కనుకనే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను దివ్యమాహామంత్ర జపకీర్తనలు నిలుపుదల లేకుండా సదా జరుగవలెను. అట్టి కార్యము భక్తుని సర్వవిధములైన యాదృచ్చిక పతనముల నుండి రక్షించును. ఆ విధముగా అతడు భౌతికసంపర్కము నుండి సదా ముక్తుడై యుండగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 369 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 31 🌴

31. kṣipraṁ bhavati dharmātmā śaśvac-chāntiṁ nigacchati
kaunteya pratijānīhi na me bhaktaḥ praṇaśyati


🌷 Translation :

He quickly becomes righteous and attains lasting peace. O son of Kuntī, declare it boldly that My devotee never perishes.

🌹 Purport :

This should not be misunderstood. In the Seventh Chapter the Lord says that one who is engaged in mischievous activities cannot become a devotee of the Lord. One who is not a devotee of the Lord has no good qualifications whatsoever. The question remains, then, How can a person engaged in abominable activities – either by accident or by intention – be a pure devotee? This question may justly be raised. The miscreants, as stated in the Seventh Chapter, who never come to the devotional service of the Lord, have no good qualifications, as is stated in the Śrīmad-Bhāgavatam. Generally, a devotee who is engaged in the nine kinds of devotional activities is engaged in the process of cleansing all material contamination from the heart. He puts the Supreme Personality of Godhead within his heart, and all sinful contaminations are naturally washed away.

Continuous thinking of the Supreme Lord makes him pure by nature. According to the Vedas, there is a certain regulation that if one falls down from his exalted position he has to undergo certain ritualistic processes to purify himself. But here there is no such condition, because the purifying process is already there in the heart of the devotee, due to his remembering the Supreme Personality of Godhead constantly. Therefore, the chanting of Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare should be continued without stoppage. This will protect a devotee from all accidental falldowns. He will thus remain perpetually free from all material contaminations.

🌹 🌹 🌹 🌹 🌹

26 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 368: 09వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 368: Chap. 09, Ver. 30


🌹. శ్రీమద్భగవద్గీత - 368 / Bhagavad-Gita - 368 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 30 🌴

30. ఆపి అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మన్తవ్య: సమ్యగ్వ్యవసితో హి స: ||


🌷. తాత్పర్యం :

మిక్కిలి హేయమైన కార్యము నినరించినప్పటికిని మనుజుడు భక్తియుతసేవలో నియుక్తుడైయున్నచో, తన సంకల్పమున స్థిరనిశ్చయుడై యున్నందున అతనిని సాధువుగనే పరిగణింప వలెను.

🌷. భాష్యము :

ఈ శ్లోకమునందలి భావగర్భితమైన “సుదురాచార” అను పదమును మనము సరిగా అర్థము చేసికొనవలెను. జీవుడు బద్ధస్థితిలో నున్నప్పుడు బద్ధకర్మలు మరియు సహజస్థితికి అనుగుణమైన కర్మలనెడి రెండు విధములైన కర్మలను కలిగియుండును. దేహమును రక్షించుకొనుటకు లేదా సంఘము మరియు దేశమునకు సంబంధించిన నియమనిబంధనలను పాటించుటకు బద్ధజీవనస్థితి యందు నిక్కముగా వివిధ కర్మములు కలవు. అవియే బద్ధజీవన కర్మలనబడును. అవి భక్తులకు సైతము తప్పవు. కాని తన ఆధ్యాత్మికస్వభావమును సంపూర్ణముగా నెరిగి కృష్ణభక్తిభావన (భక్తియోగము) యందు నియుక్తుడైన జీవుడు ఆ బద్ధకర్మలతో పాటు ఆధ్యాత్మికములనబడు కర్మలను సైతము కలిగియుండును. అట్టి కర్మలు అతని సహజస్థితి యందు ఒనరింపబడుచు భక్తియోగకర్మలుగా పిలువబడును. కనుక బద్ధస్థితిలో నున్నప్పుడు భక్తికర్మలు మరియు దేహపరమైన బద్ధకర్మలు రెండును సమానాంతరములుగా సాగుచున్నను, కొన్నిమార్లు అవి ఒకదానికొకటి విరుద్ధములుగా తయారగును. ఈ విషయమున భక్తుడు సాధ్యమైనంతవరకు అత్యంత జాగరూకుడై తన భక్తికి మరియు సహజస్థితికి ఆటంకము కలిగించు దేనిని చేయకుండును.

కృష్ణభక్తిభావనా అనుభవపు పురోగతి పైననే తన కర్మల పూర్ణత్వము ఆధారపడియుండునని అతడు ఎరిగియుండును. అయినను కొన్నిమార్లు అట్టివాడు సంఘదృష్ట్యా లేదా చట్టము దృష్ట్యా అత్యంత హేయముగా భావింపబడు కార్యమును ఒనరించినట్లుగా కనిపించవచ్చును. కాని అట్టి తాత్కాలికమగుపతనము అతనిని ఏ విధముగను అనర్హుని చేయజాలదు. అత్యంత శ్రద్ధతో భక్తియుక్తసేవ యందు నిలిచియున్నవాడు ఒకవేళ పతనము నొందినను హృదయస్థుడైన పరమాత్ముడు అతనిని పవిత్రుని చేసి ఆ పాపమును క్షమించునని శ్రీమద్భాగవతము తెలియజేయుచున్నది. అనగా భౌతికసంపర్కము అత్యంత బలమైనదగుటచే భగవత్సేవ యందు పూర్ణముగా నియుక్తుడైన యోగి సైతము కొన్నిమార్లు మాయకు గురియగును. కాని కృష్ణభక్తి యనునది మరింత బలమైనదగుటచే భక్తుని అట్టి తాత్కాలిక పతనమును వెంటనే సరిదిద్దగలదు. కనుక భక్తియోగము సదా జయమునే కలిగించును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 368 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 30 🌴

30. api cet su-durācāro bhajate mām ananya-bhāk
sādhur eva sa mantavyaḥ samyag vyavasito hi saḥ

🌷 Translation :

Even if one commits the most abominable action, if he is engaged in devotional service he is to be considered saintly because he is properly situated in his determination.

🌹 Purport :

The word su-durācāraḥ used in this verse is very significant, and we should understand it properly. When a living entity is conditioned, he has two kinds of activities: one is conditional, and the other is constitutional. As for protecting the body or abiding by the rules of society and state, certainly there are different activities, even for the devotees, in connection with the conditional life, and such activities are called conditional. Besides these, the living entity who is fully conscious of his spiritual nature and is engaged in Kṛṣṇa consciousness, or the devotional service of the Lord, has activities which are called transcendental. Such activities are performed in his constitutional position, and they are technically called devotional service.

Now, in the conditioned state, sometimes devotional service and the conditional service in relation to the body will parallel one another. But then again, sometimes these activities become opposed to one another. As far as possible, a devotee is very cautious so that he does not do anything that could disrupt his wholesome condition. He knows that perfection in his activities depends on his progressive realization of Kṛṣṇa consciousness. Sometimes, however, it may be seen that a person in Kṛṣṇa consciousness commits some act which may be taken as most abominable socially or politically. But such a temporary falldown does not disqualify him.

🌹 🌹 🌹 🌹 🌹


25 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 367: 09వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 367: Chap. 09, Ver. 29


🌹. శ్రీమద్భగవద్గీత - 367 / Bhagavad-Gita - 367 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 29 🌴

29. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియ: |
యే భజన్తి తు మాం భక్యా మయి తే తేషు చాప్యహమ్ ||

🌷. తాత్పర్యం :

నేనెవరిని ద్వేషింపను, ఎవరి యెడను పక్షపాతమును కలిగియుండను. నేను సర్వుల యెడ సమముగా వర్తింతురు. కాని భక్తితో నాకు సేవనొసగెడివాడు నాకు మిత్రుడై నా యందుండును మరియు నేనును అతనికి మిత్రుడనై యుందును.

🌷. భాష్యము :

శ్రీకృష్ణుడు సర్వుల యెడ సమముగా వర్తించువాడైనచో మరియు అతనికి ఎవ్వరును ప్రత్యేక స్నేహితులు కానిచో తన దివ్యసేవలో సదా నిమగ్నులై యుండెడి భక్తుల యెడ ఎందులకై ప్రత్యేకశ్రద్ధ వహించుననెడి ప్రశ్న ఇచ్చట ఉదయించును. కాని వాస్తవమునకు ఇది సహజమేగాని భేదభావము కాదు. ఉదాహరణకు జగమునందు ఎవరేని మనుజుడు గొప్పదాత యని పేరుగాంచినను, తన సంతానము యెడల అతడు ప్రత్యేకశ్రద్ధను కలిగియుండును. అదే విధముగా భగవానుడు వివిధరూపములలో నున్న సర్వజీవులను సంతానముగ భావించి వారి జీవితావాసరమునకు కావలసిన సర్వమును ఉదారముగా సమకూర్చును. భూమియని గాని, కొండయని గాని, జలమని గాని ఎట్టి భేదభావము లేకుండా వర్షమును కురిపించెడి మేఘము వంటివాడు ఆ దేవదేవుడు. కాని తన భక్తుల యెడ మాత్రము అతడు ప్రత్యేకశ్రద్ధను కలిగియుండును.

అట్టి భక్తిపరాయణులైనవారే ఈ శ్లోకమునందు పేర్కొనబడినవారు. కృష్ణభక్తిభావనలో సదా నిలిచియుండుటచే ఆ భక్తులు నిత్యము కృష్ణుని యందే స్థితిని కలిగియుందురు. కనుకనే కృష్ణభక్తిభావనము నందున్న మహాత్ములు దివ్యాత్ములై ఆ శ్రీకృష్ణభగవానుని యందు నిలిచియున్నట్టివారని “కృష్ణభక్తిరసభావనము” అనెడి పదము సూచించుచున్నది. తత్కారణముగనే శ్రీకృష్ణుడు “మయితే” (వారు నాయందున్నారు) అని స్పష్టముగా పలికియున్నాడు. అనగా భగవానుడు వారియందున్నాడు. ఇట్టి పరస్పరానుభవమే “యే యథా మామ్ ప్రపద్యన్తే తాం స్తథైవ భజామ్యహమ్” అనెడి భగవానుని వాక్యములను సైతము వివరించును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 367 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 29 🌴

29. samo ’haṁ sarva-bhūteṣu na me dveṣyo ’sti na priyaḥ
ye bhajanti tu māṁ bhaktyā mayi te teṣu cāpy aham


🌷 Translation :

I envy no one, nor am I partial to anyone. I am equal to all. But whoever renders service unto Me in devotion is a friend, is in Me, and I am also a friend to him.

🌹 Purport :

One may question here that if Kṛṣṇa is equal to everyone and no one is His special friend, then why does He take a special interest in the devotees who are always engaged in His transcendental service? But this is not discrimination; it is natural. Any man in this material world may be very charitably disposed, yet he has a special interest in his own children. The Lord claims that every living entity – in whatever form – is His son, and so He provides everyone with a generous supply of the necessities of life. He is just like a cloud which pours rain all over, regardless of whether it falls on rock or land or water. But for His devotees, He gives specific attention. Such devotees are mentioned here: they are always in Kṛṣṇa consciousness, and therefore they are always transcendentally situated in Kṛṣṇa.

The very phrase “Kṛṣṇa consciousness” suggests that those who are in such consciousness are living transcendentalists, situated in Him. The Lord says here distinctly, mayi te: “They are in Me.” Naturally, as a result, the Lord is also in them. This is reciprocal. This also explains the words ye yathā māṁ prapadyante tāṁs tathaiva bhajāmy aham: “Whoever surrenders unto Me, proportionately I take care of him.” This transcendental reciprocation exists because both the Lord and the devotee are conscious. When a diamond is set in a golden ring, it looks very nice. The gold is glorified, and at the same time the diamond is glorified. The Lord and the living entity eternally glitter, and when a living entity becomes inclined to the service of the Supreme Lord he looks like gold. The Lord is a diamond, and so this combination is very nice. Living entities in a pure state are called devotees. The Supreme Lord becomes the devotee of His devotees.

🌹 🌹 🌹 🌹 🌹

24 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 366: 09వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 366: Chap. 09, Ver. 28


🌹. శ్రీమద్భగవద్గీత - 366 / Bhagavad-Gita - 366 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 28 🌴

28. శుభాశుభఫలరేవం మోక్ష్యసే కర్మబన్ధనై: |
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి


🌷. తాత్పర్యం :

ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి మరియు వాని శుభాశుభఫలముల నుండి ముక్తుడవు కాగలవు. ఇట్టి సన్న్యాసయోగముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు.

🌷. భాష్యము :

ఉన్నతమైన మార్గదర్శకత్వమున కృష్ణభక్తిభావనలో వర్తించువాడు యుక్తుడని పిలువబడును. దీనికి సరియైన పదము “యుక్తవైరాగ్యము”. ఈ విషయమును గూర్చి శ్రీరూపగోస్వామి మరింతగా ఇట్లు వర్ణించిరి.

అనాసక్తస్య విషయాన్ యథార్హముపయుంజత: |

నిర్భంధ: కృష్ణసంబంధే యుక్తం వైరాగ్య ముచ్యతే (భక్తిరసామృతసింధువు 1.2.255)

భౌతికజగమున ఉన్నంతవరకు మనము కర్మ చేయవలసిన ఉండును. కర్మను విరమించుట సాధ్యము కాదు.

కనుకనే కర్మలను ఒనరించి ఆ ఫలమును శ్రీకృష్ణునకు సమర్పించినచో అది “యుక్తవైరాగ్యము” అనబడునని శ్రీరూపగోస్వామి పలికిరి. వైరాగ్యమునందు వాస్తవముగా నెలకొనినపుడు అట్టి కర్మలు చిత్తదర్పణమును పరిశుభ్రము చేయగలవు. ఇక కర్త ఆధ్యాత్మికానుభవమునందు క్రమపురోగతి సాధించిన కొలది శ్రీకృష్ణభగవానుని సంపూర్ణ శరణాగతుడై అంత్యమున మోక్షమును బడయును. అతడు పొందు ముక్తియు స్పష్టముగా వివరింపబడినది.

ఈ ముక్తి ద్వారా అతడు బ్రహ్మజ్యోతిలో లీనముగాక భగవద్దామమున ప్రవేశించునని “మాముపైష్యసి” (నన్ను పొందును) యను పదము ద్వారా స్పష్టముగా తెలుపబడినది. వాస్తవమునకు ముక్తి ఐదురకములైనను జీవితమంతయు శ్రీకృష్ణభగవానుని నేతృత్వమున భక్తియోగమును సాగించిన భక్తుడు మాత్రము ఆధాత్మికముగా అత్యున్నతస్థితికి చేరి, దేహత్యాగానంతరము ఆ దేవదేవుని ధామము కేగి అతని ప్రత్యక్ష సాహచర్యమున నియుక్తుడగును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 366 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 28 🌴

28. śubhāśubha-phalair evaṁ mokṣyase karma-bandhanaiḥ
sannyāsa-yoga-yuktātmā vimukto mām upaiṣyasi

🌷 Translation :

In this way you will be freed from bondage to work and its auspicious and inauspicious results. With your mind fixed on Me in this principle of renunciation, you will be liberated and come to Me.

🌹 Purport :

One who acts in Kṛṣṇa consciousness under superior direction is called yukta. The technical term is yukta-vairāgya. This is further explained by


Rūpa Gosvāmī as follows:

anāsaktasya viṣayān yathārham upayuñjataḥ
nirbandhaḥ kṛṣṇa-sambandhe yuktaṁ vairāgyam ucyate

(Bhakti-rasāmṛta-sindhu, 1.2.255)


Rūpa Gosvāmī says that as long as we are in this material world we have to act; we cannot cease acting.

Therefore if actions are performed and the fruits are given to Kṛṣṇa, then that is called yukta-vairāgya. Actually situated in renunciation, such activities clear the mirror of the mind, and as the actor gradually makes progress in spiritual realization he becomes completely surrendered to the Supreme Personality of Godhead. Therefore at the end he becomes liberated, and this liberation is also specified.

By this liberation he does not become one with the brahma-jyotir, but rather enters into the planet of the Supreme Lord. It is clearly mentioned here: mām upaiṣyasi, “he comes to Me,” back home, back to Godhead. There are five different stages of liberation, and here it is specified that the devotee who has always lived his lifetime here under the direction of the Supreme Lord, as stated, has evolved to the point where he can, after quitting this body, go back to Godhead and engage directly in the association of the Supreme Lord.

🌹 🌹 🌹 🌹 🌹

23 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 365: 09వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 365: Chap. 09, Ver. 27


🌹. శ్రీమద్భగవద్గీత - 365 / Bhagavad-Gita - 365 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 27 🌴

27. యత్కరోషి యదశ్నాషి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కొన్తేయ తత్కురుష్వ మదర్పణమ్ ||

🌷. తాత్పర్యం :

ఓ కౌన్తేయ! నీవు ఏది ఒనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను,ఏ తపస్సు నాచరించినను వాటన్నింటిని నాకు అర్పణముగా ఒనరింపుము.

🌷. భాష్యము :

ఎట్టి పరిస్థితి యందును శ్రీకృష్ణభగవానుని మరవకుండునట్లుగా జీవితమును మలచుకొనుట ప్రతియొక్కరి ధర్మము. దేహపోషణ కొరకు ప్రతియొక్కరు కర్మ చేయవలసియే ఉన్నందున తనకొరకు కర్మ చేయుమని శ్రీకృష్ణుడు ఇచ్చట ఉపదేశించుచున్నాడు. జీవనముకై ఆహారమును భుజించుట అవసరము గనుక కృష్ణునకు అర్పింపబడిన ఆహారమునే ప్రసాదరూపమున మనుజుడు గ్రహింపవలెను. అదే విధముగా నాగరికుడైన మనుజుడు ధర్మకార్యములను ఒనరింపవలసియున్నందున వానిని తన కొరకే చేయుమని శ్రీకృష్ణుడు పలుకుచున్నాడు. అదియే అర్చనము.

ప్రతియొక్కరు ఏదియో ఒకదానిని దానమిచ్చు స్వభావమును కలిగియుందురు కావున దానిని తనకే ఒసగుమని శ్రీకృష్ణుడు ఉపదేశించుచున్నాడు. అనగా అధికముగా ప్రోగుపడిన ధనమును మనుజుడు కృష్ణచైతన్యోద్యమపు ప్రచారము కొరకై వినియోగించవలెను. ధ్యానము ఈ యోగమునకు ఆచరణయోగ్యము కానిదైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు. కనుక ఎవరైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు. కనుక ఎవరైనను హరేకృష్ణ మాహా మంత్రమును జపమాలపై జపించుచు శ్రీకృష్ణుని ఇరువదినాలుగుగంటలు ధ్యానింపగలిగినచో భగవద్గీత యందలి షష్టాధ్యాయమున వివరింపబడినట్లు గొప్ప ధ్యానతత్పరుడు మరియు గొప్పయోగి కాగలడు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 365 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 27 🌴

27. yat karoṣi yad aśnāsi yaj juhoṣi dadāsi yat
yat tapasyasi kaunteya tat kuruṣva mad-arpaṇam


🌷 Translation :

Whatever you do, whatever you eat, whatever you offer or give away, and whatever austerities you perform – do that, O son of Kuntī, as an offering to Me.

🌹 Purport :

Thus, it is the duty of everyone to mold his life in such a way that he will not forget Kṛṣṇa in any circumstance. Everyone has to work for maintenance of his body and soul together, and Kṛṣṇa recommends herein that one should work for Him. Everyone has to eat something to live; therefore he should accept the remnants of foodstuffs offered to Kṛṣṇa.

Any civilized man has to perform some religious ritualistic ceremonies; therefore Kṛṣṇa recommends, “Do it for Me,” and this is called arcana. Everyone has a tendency to give something in charity; Kṛṣṇa says, “Give it to Me,” and this means that all surplus money accumulated should be utilized in furthering the Kṛṣṇa consciousness movement.

🌹 🌹 🌹 🌹 🌹


22 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 364: 09వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 364: Chap. 09, Ver. 26


🌹. శ్రీమద్భగవద్గీత - 364 / Bhagavad-Gita - 364 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 26 🌴

26. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి |
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మన: ||


🌷. తాత్పర్యం :

పత్రమునైనను, పుష్పమునైనను, ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోను, భక్తితోను ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును.

🌷. భాష్యము :

నిత్యానందము కొరకై శాశ్వతమును మరియు ఆనందనిధానమును అగు భగవద్దామమును పొందుటకు బుద్ధిమంతుడైనవాడు కృష్ణభక్తి భావనాయుతుడై శ్రీకృష్ణభగవానుని దివ్యమగు ప్రేమయుత సేవలో నియుక్తుడు కావలెను. అట్టి అద్భుతఫలములను కలుగజేయు పద్ధతి వాస్తవమునకు అత్యంత సులభము. ఎటువంటి యోగ్యతలేని అతిదరిద్రునికి సైతము అది ఆచరణసాధ్యము. కేవలము శ్రీకృష్ణభగవానునికి శుద్ధభక్తుడగుటయే ఈ విషయమున వాంఛనీయమగు ఏకైక యోగ్యత. మనుజుని దేశ,కాల పరిస్థితులతో దానికెట్టి సంబంధము లేదు. అతిసులభమైన ఈ పద్దతిలో మనుజుడు భక్తితో పత్రమునుగాని, జలమునుగాని, ఫలమునుగాని ఆ భగవానునకు ప్రేమతో అర్పింపవచ్చును. భగవానుడు అట్టి అర్పణమును ప్రియముతో స్వీకరింపగలడు. కృష్ణభక్తిభావన విధానము అత్యంత సులభము మరియు విశ్వజనీనమైనందున ఎవ్వరికినీ దీని యందు నిషేదము లేదు. అట్టియెడ ఈ సులభమార్గము ద్వారా కృష్ణభక్తిభావితుడై అత్యున్నతమైన నిత్యానంద జ్ఞానపూర్ణమగు జీవనము పొంద వాంఛింపని అజ్ఞాని ఎవడుండును? శ్రీకృష్ణుడు ప్రేమపూర్వక సేవనే వాచించును గాని అన్యమును కాదు.

తన శుద్ధభక్తుల నుండి చిన్న పుష్పమునైనను స్వీకరించు అతడు అభక్తుల నుండి ఎత్వంటి దానిని కూడా అంగీకరింపడు. ఆత్మారాముడైన అతడు ఇతరుల నుండి కోరునదేదియును లేదు. అయినను అతడు భక్తులు ప్రేమానురాగభావముతో ఒసగుదానిని ప్రియముతో స్వీకరించును. అట్టి భక్తిభావనను వృద్దిపరచుకొనుటయే జీవితపు పూర్ణత్వమై యున్నది. భక్తి యొక్కటే శ్రీకృష్ణుని చేరుటకు ఏకైకమార్గమని కచ్చితముగా తెలుపుట కొరకే ఈ శ్లోకమున భక్తి యను పదము రెండుమార్లు వాడబడినది. అనగా బ్రహ్మణుడగుట, పండితుడు, ధనవంతుడగుట లేదా గొప్ప తత్త్వవేత్త యగుట వంటి ఇతర ఏ విధానము చేతను మనుజుడు తానొసగునది శ్రీకృష్ణుడు అంగీకరించునట్లుగా చేయజాలడు. మూలనియమమైన భక్తి లేనప్పుడు ఏదియును అతనిని అంగీకరింపజేయలేదు. కనుకనే భక్తి ఎన్నడును సామాన్యమైనది కాదు. ఆ విధానము నిత్యమైనది. అది పరతత్త్వమునకు ఒనర్చబడు ప్రత్యక్ష్యసేవ.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 364 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 26 🌴

26. patraṁ puṣpaṁ phalaṁ toyaṁ yo me bhaktyā prayacchati
tad ahaṁ bhakty-upahṛtam aśnāmi prayatātmanaḥ

🌷 Translation :

If one offers Me with love and devotion a leaf, a flower, a fruit or water, I will accept it.

🌹 Purport :

For the intelligent person, it is essential to be in Kṛṣṇa consciousness, engaged in the transcendental loving service of the Lord, in order to achieve a permanent, blissful abode for eternal happiness. The process of achieving such a marvelous result is very easy and can be attempted even by the poorest of the poor, without any kind of qualification. The only qualification required in this connection is to be a pure devotee of the Lord. It does not matter what one is or where one is situated. The process is so easy that even a leaf or a little water or fruit can be offered to the Supreme Lord in genuine love and the Lord will be pleased to accept it. No one, therefore, can be barred from Kṛṣṇa consciousness, because it is so easy and universal.

Who is such a fool that he does not want to be Kṛṣṇa conscious by this simple method and thus attain the highest perfectional life of eternity, bliss and knowledge? Kṛṣṇa wants only loving service and nothing more. Kṛṣṇa accepts even a little flower from His pure devotee. He does not want any kind of offering from a nondevotee. He is not in need of anything from anyone, because He is self-sufficient, and yet He accepts the offering of His devotee in an exchange of love and affection. To develop Kṛṣṇa consciousness is the highest perfection of life. Bhakti is mentioned twice in this verse in order to declare more emphatically that bhakti, or devotional service, is the only means to approach Kṛṣṇa. No other condition, such as becoming a brāhmaṇa, a learned scholar, a very rich man or a great philosopher, can induce Kṛṣṇa to accept some offering.

🌹 🌹 🌹 🌹 🌹

21 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 363: 09వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 363: Chap. 09, Ver. 25


🌹. శ్రీమద్భగవద్గీత - 363 / Bhagavad-Gita - 363 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 25 🌴

25. యాన్తి దేవవ్రతా దేవన్పితౄన్యాన్తి పితృవ్రతా: |
భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోపి మాం ||


🌷. తాత్పర్యం :

దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా, భూత, ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు. కాని నన్ను పూజించువారు నాతోనే నివసింతురు.


🌷. భాష్యము :
చంద్రలోకమునుగాని, సూర్యలోకమునుగాని లేదా వేరే ఇతరలోకమును గాని చేరగోరిచనచో తత్ర్పయోజనార్థమై వేదములందు నిర్దేశింపబడిన “దర్శపౌర్ణమాసి” వంటి విధానములను పాటించుట ద్వారా మనుజుడు తన కోరిన గమ్యమును సాధించగలడు. వేదముల యందలి కర్మకాండభాగములో విశదముగా వివరింపబడిన ఈ పద్ధతులు వివిధ ఉన్నతలోకములందలి దేవతల కొరకు ప్రత్యేకములైన పూజలను నిర్దేశించుచున్నవి. అదే విధముగా ప్రత్యేక యజ్ఞముల ద్వారా మనుజుడు పితృలోకమును చేరవచ్చును లేదా భూత, ప్రేతలోకములను చేరి యక్షునిగా, రాక్షసునిగా లేక పిశాచముగా మారవచ్చును. పిశాచములకు ఒనర్చుపూజ వాస్తవమునకు “క్షుద్రదేవతార్చనము” అని పిలువబడును. అట్టి క్షుద్రదేవతార్చనము కావించువారు పెక్కురు కలరు.

వారు దానిని ఆధ్యాత్మికమని భావించినను ఆ సమస్త కర్మలు నిజమునకు భౌతికములే. అదేవిధముగా దేవదేవునే అర్చించు శుద్ధభక్తుడు వైకుంఠలోకములందు గాని, కృష్ణలోకమును గాని అసంశయముగా పొందును. దేవతలను పూజించుట ద్వారా పితృలోకములను, క్షుద్రదేవతార్చనము ద్వారా పిశాచలోకములను మనుజుడు పొందుచుండ శుద్ధభక్తుడు ఎందులకు వైకుంఠలోకములను లేదా కృష్ణలోకమును పొందకుండునని ఈ అతిముఖ్యమైన శ్లోకము ద్వారా సులభముగ గ్రహింపవచ్చును. కాని శ్రీకృష్ణడు మరియు విష్ణువు వసించు ఈ దివ్యలోకములను గూర్చిన సమాచారము పెక్కుమందికి తెలియదు. వాని నెరుగని కారణమున వారు పతితులగుదురు. నిరాకారవాదులు సైతము బ్రహ్మజ్యోతి నుండు పతనము చెందగలరు. కనుకనే కేవలము హరేకృష్ణ మాహా మంత్రమును జపించుట ద్వారా మనుజుడు ఈ జన్మమందే పూర్ణుడై భగవద్దామమును చేరగలడని మహత్తరమైన సందేశమును సమస్త మానవాళికి కృష్ణచైతన్యోద్యమము తెలియపరచుచున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 363 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 25 🌴

25. yānti deva-vratā devān pitṝn yānti pitṛ-vratāḥ
bhūtāni yānti bhūtejyā yānti mad-yājino ’pi mām


🌷 Translation :

Those who worship the demigods will take birth among the demigods; those who worship the ancestors go to the ancestors; those who worship ghosts and spirits will take birth among such beings; and those who worship Me will live with Me.

🌹 Purport :

If one has any desire to go to the moon, the sun or any other planet, one can attain the desired destination by following specific Vedic principles recommended for that purpose, such as the process technically known as Darśa-paurṇamāsa. These are vividly described in the fruitive activities portion of the Vedas, which recommends a specific worship of demigods situated on different heavenly planets. Similarly, one can attain the Pitā planets by performing a specific yajña. Similarly, one can go to many ghostly planets and become a Yakṣa, Rakṣa or Piśāca. Piśāca worship is called “black arts” or “black magic.” There are many men who practice this black art, and they think that it is spiritualism, but such activities are completely materialistic. Similarly, a pure devotee, who worships the Supreme Personality of Godhead only, achieves the planets of Vaikuṇṭha and Kṛṣṇaloka without a doubt.

It is very easy to understand through this important verse that if by simply worshiping the demigods one can achieve the heavenly planets, or by worshiping the Pitās achieve the Pitā planets, or by practicing the black arts achieve the ghostly planets, why can the pure devotee not achieve the planet of Kṛṣṇa or Viṣṇu? Unfortunately many people have no information of these sublime planets where Kṛṣṇa and Viṣṇu live, and because they do not know of them they fall down. Even the impersonalists fall down from the brahma-jyotir. The Kṛṣṇa consciousness movement is therefore distributing sublime information to the entire human society to the effect that by simply chanting the Hare Kṛṣṇa mantra one can become perfect in this life and go back home, back to Godhead.

🌹 🌹 🌹 🌹 🌹


20 Apr 2020


శ్రీమద్భగవద్గీత - 362: 09వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 362: Chap. 09, Ver. 24


🌹. శ్రీమద్భగవద్గీత - 362 / Bhagavad-Gita - 362 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 24 🌴

24. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
నతు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే ||


🌷. తాత్పర్యం :

నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయియున్నాను. కావున నా వాస్తవమైన దివ్యస్వభావమును గుర్తింపలేనివారు పతనము చెందుదురు.

🌷. భాష్యము :

వేదవాజ్మయమునందు పలువిధములైన యజ్ఞములు నిర్దేశింపబడియున్నను, వాస్తవమునకు అవియన్నియును దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచుట కొరకే నిర్దేశింపబడినవి ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. యజ్ఞముగా విష్ణువు. యజ్ఞుడు లేదా విష్ణువు ప్రీత్యర్థమే ప్రతియొక్కరు కర్మనొనరించవలెనని భగవద్గీత యందలి తృతీయాధ్యాయమున స్పష్టముగా తెలపబడినది. మానవనాగరికతకు పరిపక్వరూపమైన వర్ణాశ్రమధర్మము విష్ణుప్రీతికే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది.

కనుకనే శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట “నేనే దివ్యప్రభువును గావున సర్వయజ్ఞములకు నేనే భోక్తను” అని పలికియున్నాడు. కాని మందమతులైనవారు ఈ సత్యమును తెలియక తాత్కాలిక లాభముల కొరకు ఇతర దేవతలను పూజింతురు. తత్కారణముగా వారు భౌతికస్థితికి పతనము నొంది ఎన్నడును మానవజన్మ యొక్క వాంఛితలక్ష్యమును సాధింపలేరు. అయినను ఎవరేని ఒక భౌతికకోరికరను కలిగియున్నచో దాని కొరకై శ్రీకృష్ణభగవానుని ప్రార్థించుట ఉత్తమము (అది శుద్ధభక్తి కానేరదు). తద్ద్వారా అతడు వాంఛితఫలమును పొందగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 362 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 24 🌴

24. ahaṁ hi sarva-yajñānāṁ bhoktā ca prabhur eva ca
na tu mām abhijānanti tattvenātaś cyavanti te


🌷 Translation :

I am the only enjoyer and master of all sacrifices. Therefore, those who do not recognize My true transcendental nature fall down.

🌹 Purport :

Here it is clearly stated that there are many types of yajña performances recommended in the Vedic literatures, but actually all of them are meant for satisfying the Supreme Lord. Yajña means Viṣṇu. In the Third Chapter of Bhagavad-gītā it is clearly stated that one should only work for satisfying Yajña, or Viṣṇu. The perfectional form of human civilization, known as varṇāśrama-dharma, is specifically meant for satisfying Viṣṇu.

Therefore, Kṛṣṇa says in this verse, “I am the enjoyer of all sacrifices because I am the supreme master.” Less intelligent persons, however, without knowing this fact, worship demigods for temporary benefit. Therefore they fall down to material existence and do not achieve the desired goal of life. If, however, anyone has any material desire to be fulfilled, he had better pray for it to the Supreme Lord (although that is not pure devotion), and he will thus achieve the desired result.

🌹 🌹 🌹 🌹 🌹

19 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 361: 09వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 361: Chap. 09, Ver. 23


🌹. శ్రీమద్భగవద్గీత - 361 / Bhagavad-Gita - 361 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 23 🌴

23. యేప్యన్యదేవతాభక్తా యజన్తే శ్రద్ధయాన్వితా: |
తేపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధిపుర్వకమ్ ||

🌷. తాత్పర్యం :

ఓ కౌంతేయా! అన్యదేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు.

🌷. భాష్యము :

“దేవతార్చనమునందు నియుక్తులైనవారు చేసెడి అర్చనము నాకే పరోక్షముగా అర్పింపబడినాడు వారు నిజమునకు మందబుద్దులై యున్నారు” అని శ్రీకృష్ణభగవానుడు పలికియున్నాడు. ఉదాహరణకు ఒకడు కొమ్మలకు, ఆకులకు నీరుపోసి చెట్టు మొదలుకు నీరుపోయనిచే తగినంత జ్ఞానము లేనివాడుగా (నియమపాలనము లేనివాడు) పరిగణింపబడును. అదేవిధముగా ఉదరమునకు ఆహారము నందించుటయే దేహేంద్రియములన్నింటిని సేవించుట లేదా పోషించుట కాగలదు. వాస్తవమునకు దేవతలు భగవానుని ప్రభుత్వమున వివిధ అధికారులు మరియు నిర్దేశకుల వంటివారు.

జనులు ప్రభుత్వముచే ఏర్పరచబడిన శాసనములనే అనుసరించవలెను గాని, దాని యందలి అధికారులు లేదా నిర్దేశకుల వ్యక్తిగత శాసనములకు కాదు. అదేవిధముగా ప్రతియొక్కరు భగవానునే అర్చించవలెను. తద్ద్వారా అతని వివిధ అధికారులు మరియు నిర్దేశకులు ప్రభుత్వ ప్రతినిధులుగా తమ కార్యములందు నియుక్తులై యున్నందున వారికి లంచమివ్వజూచుట వాస్తవమునకు చట్టవిరుద్ధము. ఈ విషయమే ఇచ్చట “అవిధిపూర్వకమ్” అని తెలుపబడినది. అనగా అనవసరమైన అన్యదేవతార్చనమును శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట ఆమోదించుట లేదు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 361 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 23 🌴

23. ye ’py anya-devatā-bhaktā yajante śraddhayānvitāḥ
te ’pi mām eva kaunteya yajanty avidhi-pūrvakam

🌷 Translation :

Those who are devotees of other gods and who worship them with faith actually worship only Me, O son of Kuntī, but they do so in a wrong way.

🌹 Purport :

“Persons who are engaged in the worship of demigods are not very intelligent, although such worship is offered to Me indirectly,” Kṛṣṇa says. For example, when a man pours water on the leaves and branches of a tree without pouring water on the root, he does so without sufficient knowledge or without observing regulative principles. Similarly, the process of rendering service to different parts of the body is to supply food to the stomach. The demigods are, so to speak, different officers and directors in the government of the Supreme Lord. One has to follow the laws made by the government, not by the officers or directors.

Similarly, everyone is to offer his worship to the Supreme Lord only. That will automatically satisfy the different officers and directors of the Lord. The officers and directors are engaged as representatives of the government, and to offer some bribe to the officers and directors is illegal. This is stated here as avidhi-pūrvakam. In other words, Kṛṣṇa does not approve the unnecessary worship of the demigods.

🌹 🌹 🌹 🌹 🌹

18 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 360: 09వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 360: Chap. 09, Ver. 22


🌹. శ్రీమద్భగవద్గీత - 360 / Bhagavad-Gita - 360 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 22 🌴

22. అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనా: పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||


🌷. తాత్పర్యం :

నా దివ్యరూపమును ధ్యానించుచు అనన్యభక్తిచే నన్ను సదా అర్చించువారి యోగక్షేమములను నేనే వహింతును (వారికి లేనివి సమకూర్చి, ఉన్నవి సంరక్షింతును).

🌷. భాష్యము :

కృష్ణభక్తిరసభావన లేకుండా క్షణకాలమును జీవింపలేనివాడు శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, పాదపద్మ సేవనము, ఇతర సేవలను గూర్చుట, సఖ్యము, ఆత్మనివేదనముల ద్వారా భక్తియుక్తసేవ యందు నియుక్తుడై ఇరువదినాలుగు గంటలు శ్రీకృష్ణుని చింతించుట కన్నను అన్యమును కావింపడు. అట్టి కర్మలు సర్వమంగళదాయకములు మరియు ఆధ్యాత్మిక శక్తిపూర్ణములు. అవి ఆత్మానుభవమునందు భక్తుని పూర్ణుని కావింపగలదు. తద్ద్వారా శ్రీకృష్ణభగవానుని సాహచార్యము పొందుటయే అతని ఏకైక కోరిక కాగలదు. అట్టివాడు నిస్సందేహముగా ఆ భగవానుని ఎట్టి కష్టము లేకుండా చేరగలడు. వాస్తవమునకు ఇదియే యోగమనబడును.

భగవానుని కరుణచే అట్టి భక్తుడు ఎన్నడును ఈ భౌతికజీవనమునకు తిరిగిరాడు. ఈ శ్లోకమునందలి “క్షేమము” అను పదము శ్రీకృష్ణ భగవానుని కృపాపూర్ణరక్షణమును సూచించుచున్నది. అనగా యోగము ద్వారా కృష్ణభక్తిరసభావనను పొందుటకు భక్తునకు తోడ్పడు శ్రీకృష్ణభగవానుడు, అతడు సంపూర్ణ కృష్ణభక్తిరసభావితుడైన పిమ్మట దుఃఖభూయిష్టమైన బద్ధజీవనమునకు తిరిగి పతనము చెందకుండా రక్షణము నొసగును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 360 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 22 🌴

22. ananyāś cintayanto māṁ ye janāḥ paryupāsate
teṣāṁ nityābhiyuktānāṁ yoga-kṣemaṁ vahāmy aham


🌷 Translation :

But those who always worship Me with exclusive devotion, meditating on My transcendental form – to them I carry what they lack, and I preserve what they have.

🌹 Purport :

One who is unable to live for a moment without Kṛṣṇa consciousness cannot but think of Kṛṣṇa twenty-four hours a day, being engaged in devotional service by hearing, chanting, remembering, offering prayers, worshiping, serving the lotus feet of the Lord, rendering other services, cultivating friendship and surrendering fully to the Lord. Such activities are all auspicious and full of spiritual potencies, which make the devotee perfect in self-realization, so that his only desire is to achieve the association of the Supreme Personality of Godhead. Such a devotee undoubtedly approaches the Lord without difficulty. This is called yoga.

By the mercy of the Lord, such a devotee never comes back to this material condition of life. Kṣema refers to the merciful protection of the Lord. The Lord helps the devotee to achieve Kṛṣṇa consciousness by yoga, and when he becomes fully Kṛṣṇa conscious the Lord protects him from falling down to a miserable conditioned life.

🌹 🌹 🌹 🌹 🌹

17 Apr 2020


శ్రీమద్భగవద్గీత - 359: 09వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 359: Chap. 09, Ver. 21


🌹. శ్రీమద్భగవద్గీత - 359 / Bhagavad-Gita - 359 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 21 🌴

21. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి |
ఏవం త్రయిధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభన్తే ||


🌷. తాత్పర్యం :

విస్తృతమైన స్వర్గలోకభోగముల ననుభవించి పుణ్యము క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగివత్తురు. ఈ విధముగా త్రివేదముల నియమానుసరణము ద్వారా ఇంద్రియభోగమును వాంచించువారు కేవలము జననమరణములనే మరల, మరల పొందుదురు.

🌷. భాష్యము :

ఊర్థ్వలోకములను పొందినవాడు అధిక ఆయుష్షును మరియు ఇంద్రియభోగమును అధికమైన వసతులను పొందగలిగినను శాశ్వతముగా అచ్చటనే ఉండుటకు అనుమతింపబడడు. పుణ్యకర్మఫలము నశించినంతనే అతడు తిరిగి భూలోకమునకు పంపబడును. వేదాంతసూత్రములందు (జన్మాద్యస్యయత:) తెలుపబడినరీతిగా సంపూర్ణజ్ఞానమును సాధించినట్టివాడు, అనగా సర్వకారణకారణుడైన శ్రీకృష్ణుని అవగతము చేసికొనుటలో విఫలుడైనవాడు జీవితపు పరమలక్ష్యమును సాధించుటలో విఫలత్వము నొందినవాడగును.

తత్కారణముగా అతడు క్రిందికి, పైకి సదా తిరుగుచుండు రంగులరాట్నముపైన కూర్చున్నవాని వలె ఊర్థ్వలోకమునకు ఉద్ధరింపబడుచు, తిరిగి క్రిందకు చేరుచుండును. అనగా మనుజుడు మరల క్రిందికి తిరిగి వచ్చే అవకాశమే లేనటువంటి ఆధ్యాత్మికలోకమును పొందక కేవలము ఊర్థ్వ, అధోలోకముల నడుమ జనన, మరణచక్రమందే తిరుగుచుండును. కావున మనుజుడు జ్ఞానానందపూర్ణమగు నిత్యజీవనమును అనుభవించుట ఆధ్యాత్మికలోకమును పొంది, తిరిగి ఈ దుఃఖకరమైన భౌతికస్థితికి రాకుండుట ఉత్తమము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 359 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 21 🌴

21. te taṁ bhuktvā svarga-lokaṁ viśālaṁ kṣīṇe puṇye martya-lokaṁ viśanti
evaṁ trayī-dharmam anuprapannā gatāgataṁ kāma-kāmā labhante


🌷 Translation :

When they have thus enjoyed vast heavenly sense pleasure and the results of their pious activities are exhausted, they return to this mortal planet again. Thus those who seek sense enjoyment by adhering to the principles of the three Vedas achieve only repeated birth and death.

🌹 Purport :

One who is promoted to the higher planetary systems enjoys a longer duration of life and better facilities for sense enjoyment, yet one is not allowed to stay there forever. One is again sent back to this earth upon finishing the resultant fruits of pious activities. He who has not attained perfection of knowledge, as indicated in the Vedānta-sūtra (janmādy asya yataḥ), or, in other words, he who fails to understand Kṛṣṇa, the cause of all causes, becomes baffled about achieving the ultimate goal of life and is thus subjected to the routine of being promoted to the higher planets and then again coming down, as if situated on a ferris wheel which sometimes goes up and sometimes comes down.

The purport is that instead of being elevated to the spiritual world, from which there is no longer any possibility of coming down, one simply revolves in the cycle of birth and death on higher and lower planetary systems. One should better take to the spiritual world to enjoy an eternal life full of bliss and knowledge and never return to this miserable material existence.

🌹 🌹 🌹 🌹 🌹

16 Apr 2020


శ్రీమద్భగవద్గీత - 358: 09వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 358: Chap. 09, Ver. 20


🌹. శ్రీమద్భగవద్గీత - 358 / Bhagavad-Gita - 358 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 20 🌴

20. త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా యజ్ఞైరష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే |
తే పుణ్యమాసాద్య సురేద్రలోకమ్ అశ్నన్తి దివ్యాన్దివి దేవా భోగాన్ ||


🌷. తాత్పర్యం :

స్వర్గలోకములను గోరుచు వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే అర్చింతురు. పాపఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్య ఇంద్రలోకమున జన్మించి దేవభోగముల ననుభవింతురు.

🌷. భాష్యము :

ఈ శ్లోకము నందలి “త్రైవిద్యా:” అను పదము సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదములను సూచించుచున్నది. ఇట్టి మూడు వేదములను అధ్యయనము చేసిన బ్రహ్మణుడే “త్రివేది” యని పిలువబడును. ఈ వేదములందు తెలుపబడిన జ్ఞానము యెడ ఆకర్షణను కలిగియుండువాడు నిక్కముగా సంఘములో అత్యంత గౌరవనీయుడు కాగలడు. కాని దురదృష్టవశాత్తు వేదాధ్యయనపు అంతిమ ప్రయోజనమును తెలియని వేదపండితులే అధికముగా నున్నారు. కనుకనే ఆ త్రివేదులకు అంతిమలక్ష్యము తానేయని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట ప్రకటించుచున్నాడు. నిజమైన త్రివేదులు శ్రీకృష్ణభగవానుని చరణకమలములకు శరణమునొంది అతని ప్రీత్యర్థమై భక్తియుక్తసేవలో నియుక్తులగుదురు.

అట్టి భక్తియోగము హరేకృష్ణ మహామంత్రమును జపించుటతోను మరియు అదేసమయమున కృష్ణుని గూర్చి నిజముగా అవగతము చేసికొనుట యత్నించుటతోను ఆరంభమగును. కాని దురదృష్టవశాత్తు వేదాధ్యయనపరులు సాధారణముగా ఇంద్రుడు, చంద్రుడు వంటి దేవతల కొరకు యజ్ఞములు చేయుట యందే మగ్నులగుదురు. అట్టి యత్నముచే వివిధ దేవతార్చకులు నిక్కముగా రజస్తమోగుణ సంపర్కము నుండి శుద్ధిపడినవారై మహర్లోకము, జనలోకము, తపోలోకము పలు ఊర్థ్వలోకములను(స్వర్గలోకములను) చేరుదురు. అట్టి ఉన్నతలోకములను చేరిన పిమ్మట వారు భూలోకమున్నను అనేక లక్షలరెట్లు అధికముగా సుఖముల ననుభవింతురు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 358 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 20 🌴

20. trai-vidyā māṁ soma-pāḥ pūta-pāpā yajñair iṣṭvā svar-gatiṁ prārthayante
te puṇyam āsādya surendra-lokam aśnanti divyān divi deva-bhogān


🌷 Translation :

Those who study the Vedas and drink the soma juice, seeking the heavenly planets, worship Me indirectly. Purified of sinful reactions, they take birth on the pious, heavenly planet of Indra, where they enjoy godly delights.

🌹 Purport :

The word trai-vidyāḥ refers to the three Vedas – Sāma, Yajur and Ṛg. A brāhmaṇa who has studied these three Vedas is called a tri-vedī. Anyone who is very much attached to knowledge derived from these three Vedas is respected in society. Unfortunately, there are many great scholars of the Vedas who do not know the ultimate purport of studying them. Therefore Kṛṣṇa herein declares Himself to be the ultimate goal for the tri-vedīs. Actual tri-vedīs take shelter under the lotus feet of Kṛṣṇa and engage in pure devotional service to satisfy the Lord. Devotional service begins with the chanting of the Hare Kṛṣṇa mantra and side by side trying to understand Kṛṣṇa in truth.

Unfortunately those who are simply official students of the Vedas become more interested in offering sacrifices to the different demigods like Indra and Candra. By such endeavor, the worshipers of different demigods are certainly purified of the contamination of the lower qualities of nature and are thereby elevated to the higher planetary systems or heavenly planets known as Maharloka, Janaloka, Tapoloka, etc. Once situated on those higher planetary systems, one can satisfy his senses hundreds of thousands of times better than on this planet.

🌹 🌹 🌹 🌹 🌹

15 Apr 2020


శ్రీమద్భగవద్గీత - 357: 09వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 357: Chap. 09, Ver. 19


🌹. శ్రీమద్భగవద్గీత - 357 / Bhagavad-Gita - 357 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 19 🌴

19. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్స్రుజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ||

🌷. తాత్పర్యం :

ఓ అర్జునా! వేడినొసగువాడను, వర్షము నిరోధించుట మరియు కురిపించుట చేయువాడను నేనే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. సత్, అసత్తులు రెండును నా యందే యున్నవి.

🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుడు తన వివిధశక్తులచే విద్యుత్,సూర్యుల ద్వారా వేడిని, వెలుతురును ప్రసరించుచుండును. వేసవి కాలమున వర్షము పడకుండా ఆపునది మరియు వర్షకాలమున కుండపోత వర్షములు కురిపించినది ఆ శ్రీకృష్ణుడే. జీవితకాలమున పొడగించుచు మనలను పోషించు ప్రాణశక్తి అయిన అతడు అంత్యమున మృత్యువుగా మనకు దర్శనమిచ్చును.

ఈ శక్తులన్నింటిని విశ్లేషించి చూచినచో శ్రీకృష్ణునకు భౌతికము మరియు ఆధ్యాత్మికముల నడుమ ఎత్తి భేదము లేదని మనము నిశ్చయించుకొనగలము. అనగా సత్, అసత్తులు రెండును అతడే. కనుకనే కృష్ణభక్తిరసభావన యందు పురోగమించిన స్థితి యందు మనుజుడు సత్, అసత్తుల భేదమును గాంచక సర్వమునందు కృష్ణునే గాంచును. సత్, అసత్ లు రెండును శ్రీకృష్ణుడే అయినందున సర్వ భౌతికసృష్టులను కలిగియున్న విశ్వరూపము కుడా శ్రీకృష్ణుడే. అంతియేగాక ద్విభుజ మురళీధర శ్యామసుందరుని రూపమున అతడు ఒనరించిన బృందావనలీలలు ఆ దేవదేవునివే.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 357 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 19 🌴

19. tapāmy aham ahaṁ varṣaṁ nigṛhṇāmy utsṛjāmi ca
amṛtaṁ caiva mṛtyuś ca sad asac cāham arjuna


🌷 Translation :

O Arjuna, I give heat, and I withhold and send forth the rain. I am immortality, and I am also death personified. Both spirit and matter are in Me.

🌹 Purport :

Kṛṣṇa, by His different energies, diffuses heat and light through the agency of electricity and the sun. During the summer season it is Kṛṣṇa who checks rain from falling from the sky, and then during the rainy season He gives unceasing torrents of rain. The energy which sustains us by prolonging the duration of our life is Kṛṣṇa, and Kṛṣṇa meets us at the end as death.

By analyzing all these different energies of Kṛṣṇa, one can ascertain that for Kṛṣṇa there is no distinction between matter and spirit, or, in other words, He is both matter and spirit. In the advanced stage of Kṛṣṇa consciousness, one therefore makes no such distinctions. He sees only Kṛṣṇa in everything. Since Kṛṣṇa is both matter and spirit, the gigantic universal form comprising all material manifestations is also Kṛṣṇa, and His pastimes in Vṛndāvana as two-handed Śyāmasundara, playing on a flute, are those of the Supreme Personality of Godhead.

🌹 🌹 🌹 🌹 🌹

14 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 356: 09వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 356: Chap. 09, Ver. 18


🌹. శ్రీమద్భగవద్గీత - 356 / Bhagavad-Gita - 356 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 18 🌴

18. గతిర్భర్తా ప్రభు: సాక్షీ నివాస: శరణం సుహృత్ |
ప్రభవ: ప్రలయ: స్థానం నిధానం బీజమవ్యయమ్ ||


🌷. తాత్పర్యం :

గమ్యమును, భరించువాడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, సన్నిహిత స్నేహితుడను నేనే. నేనే సృష్టిని, ప్రళయమును, సర్వమునకు స్థానమును, విధానమును, అవ్యయ బీజమును అయి యున్నాను.

🌷. భాష్యము :

“గతి”యనగా చేరవలసిన గమ్యస్థానమని భావము. జనులు తెలియకున్నను వాస్తవమునకు వారందరికిని శ్రీకృష్ణభగవానుడే చేరవలసిన గమ్యస్థానము. శ్రీకృష్ణుని తెలిసికొనలేనివాడు తప్పుదోవ పట్టగలడు. అంతియేగాక అట్టివాని నామమాత్ర పురోగతి పాక్షికము లేదా భ్రాంతి మాత్రమే కాగలదు. కొందరు వివిధదేవతలను తమ గమ్యస్థానముగా భావించి ఆయా విధానముల తీవ్ర యత్నములచే చంద్రలోకము, సూర్యలోకము, ఇంద్రలోకము, మహర్లోకాది వివిధలోకములును చేరుచుందురు. శ్రీకృష్ణుని సృష్టియే అయినందున ఆ లోకములన్నియు ఏకకాలమున కృష్ణునితో సమానములు మరియు కృష్ణునితో అసమానములై యున్నవి. కృష్ణశక్తి యొక్క వ్యక్తీకరణములై ఆ లోకములు కృష్ణునితో సమానమైన కృష్ణుని సంపూర్ణజ్ఞానమును పొందుటలో ముందడుగు వంటివి మాత్రమే. అనగా కృష్ణుని వివిధశక్తుల దరిచేరుట లేదా వాటిని గమ్యముగా భావించుట యనునది శ్రీకృష్ణుని పరోక్షముగా చేరుట వంటిది. కాని మనుజుడు కాలము మరియు శక్తి వ్యర్థము కాకూడదని తలచినచో ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని దరిచేరవలెను.

ఉదాహరణమునకు అనేక అంతస్థులు కలిగిన భవంతి యొక్క చివరి అంతస్థునకు చేరుటకు యంత్రసౌకర్యమున్నచో మెట్ల మీద నెమ్మదిగా ఏల పోవలెను? సర్వము శ్రీకృష్ణుని శక్తి పైననే ఆధారపడి యున్నందున అతని ఆశ్రయము లేనిదే ఏదియును స్థితిని కలిగియుండలేదు. సమస్తము శ్రీకృష్ణునికే చెంది అతని శక్తి పైననే ఆధారపడియుండుటచే వాస్తవమునకు సర్వమును ఆ భగవానుడే పరమ నియామకుడు. సర్వుల హృదయములందు పరమాత్మ రూపున వసించియుండుటచే అతడే దివ్య సాక్షి. మన నివాసములు, దేశములు లేక లోకములన్నియు వాస్తవమునకు శ్రీకృష్ణునితో సమానమే. అతడే పరమ ఆశ్రయమైనందున రక్షణమునకు లేదా దుఃఖనాశమునకు ప్రతియొక్కరు అతనినే శరణము నొందవలెను. మనము ఏదేని రక్షణము అవసరమైనప్పుడు దానిని సమాకుర్చునది ఒక సజీవశక్తియై యుండవలెనని మనము గుర్తెరుగవలెను. శ్రీకృష్ణుడే పరమజీవశక్తియై యున్నాడు. మన సృష్టికి అతడే కారణుడైనందున లేదా దివ్యజనకుడైనందున అతనికి మించిన సన్నిహిత స్నేహితుడుగాని, బంధువుగాని వేరొకరుండరు. ఆ శ్రీకృష్ణుడే సృష్టికి ఆదికారణుడు మరియు ప్రళయము పిమ్మట సర్వమునకు నిధానమునై యున్నాడు. కనుకనే శ్రీకృష్ణభగవానుడు సర్వకారణములకు నిత్యకారణమని తెలియబడినాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 356 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 18 🌴

18. gatir bhartā prabhuḥ sākṣī nivāsaḥ śaraṇaṁ suhṛt
prabhavaḥ pralayaḥ sthānaṁ nidhānaṁ bījam avyayam


🌷 Translation :

I am the goal, the sustainer, the master, the witness, the abode, the refuge and the most dear friend. I am the creation and the annihilation, the basis of everything, the resting place and the eternal seed.

🌹 Purport :

Gati means the destination where we want to go. But the ultimate goal is Kṛṣṇa, although people do not know it. One who does not know Kṛṣṇa is misled, and his so-called progressive march is either partial or hallucinatory. There are many who make as their destination different demigods, and by rigid performance of the strict respective methods they reach different planets known as Candraloka, Sūryaloka, Indraloka, Maharloka, etc.

But all such lokas, or planets, being creations of Kṛṣṇa, are simultaneously Kṛṣṇa and not Kṛṣṇa. Such planets, being manifestations of Kṛṣṇa’s energy, are also Kṛṣṇa, but actually they serve only as a step forward for realization of Kṛṣṇa. To approach the different energies of Kṛṣṇa is to approach Kṛṣṇa indirectly. One should directly approach Kṛṣṇa, for that will save time and energy. For example, if there is a possibility of going to the top of a building by the help of an elevator, why should one go by the staircase, step by step? Everything is resting on Kṛṣṇa’s energy; therefore without Kṛṣṇa’s shelter nothing can exist. Kṛṣṇa is the supreme ruler because everything belongs to Him and everything exists on His energy. Kṛṣṇa, being situated in everyone’s heart, is the supreme witness.

🌹 🌹 🌹 🌹 🌹

13 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 355: 09వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 355: Chap. 09, Ver. 17


🌹. శ్రీమద్భగవద్గీత - 355 / Bhagavad-Gita - 355 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 17 🌴

17. పితాహమస్య జగతో మతా ధాతా పితామహ: |
వేద్యం పవిత్రం ఓంకార ఋక్సామ యజురేవచ ||

🌷. తాత్పర్యం :

నేను ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయియున్నాను. జ్ఞానలక్ష్యమును, పవిత్రము చేయువాడను, ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము,యజుర్వేదములు కూడా నేనే.

🌷. భాష్యము :

స్థావరజంగమాత్మకమైన సమస్తసృష్టి శ్రీకృష్ణుని శక్తి యొక్క వ్యక్తీకరణమై యున్నది. ప్రస్తుత భౌతికస్థితిలో మనము శ్రీకృష్ణుని తటస్థశక్తులేయైన వివిధజీవులతో వివధ సంబంధములను ఏర్పరచుకొనియున్నాము. ప్రకృతి కారణముగా అట్టి జీవులలో కొందరు మనకు తండ్రిగా, తల్లిగా, తాతగా, సృష్టికర్తగా గోచరింతురు. కాని వాస్తవమునకు అట్లు గోచరించు వారందరును శ్రీకృష్ణుని అంశలే. అనగా తల్లి, తండ్రి ఆది వివిధరూపములలో గోచరించునది శ్రీకృష్ణుడే గాని వేరెవ్వరును కాదు. ఈ శ్లోకమునందలి “ధాత” యను పదమునకు “సృష్టికర్త” యని భావము. మన తల్లిదండ్రులే గాక, సృష్టికర్త, పితామహి, పితామాహాదులు సైతము శ్రీకృష్ణుడే. వాస్తవమునకు శ్రీకృష్ణుని అంశలైయున్నందున ప్రతిజీవియు కృష్ణునితో సమానమే. కనుకనే వేదములన్నియును శ్రీకృష్ణుని వైపునకే కేంద్రీకరింపబడియున్నవి.

తత్కారణముగా మనము వేదముల నుండి ఏది తెలియ యత్నించినను అది శ్రీకృష్ణపరజ్ఞానమును పొందుటలో పురోగతియే యగును. మన స్థితి పవిత్రపరచు జ్ఞానము కూడా శ్రీకృష్ణుడే. అదే విధముగా వేదంనియమములను అవగతము చేసికొనుట యందు జిజ్ఞాసువైనవాడు సైతము శ్రీకృష్ణుని అంశయే. కనుక అతడును శ్రీకృష్ణుడే. వేదమంత్రములందు ప్రణవమని పిలువబడు పవిత్ర ఓంకారము కూడా శ్రీకృష్ణుడే. సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము మరియు అథర్వవేదములందలి అన్ని శ్లోకములలో ఓంకారము మిక్కిలి ప్రధానమగుటచే దానిని శ్రీకృష్ణునుగా అవగాహనము చేసికొనవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 355 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 17 🌴

17. pitāham asya jagato mātā dhātā pitāmahaḥ
vedyaṁ pavitram oṁ-kāra ṛk sāma yajur eva ca


🌷 Translation :

I am the father of this universe, the mother, the support and the grandsire. I am the object of knowledge, the purifier and the syllable oṁ. I am also the Ṛg, the Sāma and the Yajur Vedas.

🌹 Purport :

The entire cosmic manifestations, moving and nonmoving, are manifested by different activities of Kṛṣṇa’s energy. In the material existence we create different relationships with different living entities who are nothing but Kṛṣṇa’s marginal energy; under the creation of prakṛti some of them appear as our father, mother, grandfather, creator, etc., but actually they are parts and parcels of Kṛṣṇa. As such, these living entities who appear to be our father, mother, etc., are nothing but Kṛṣṇa. In this verse the word dhātā means “creator.”

Not only are our father and mother parts and parcels of Kṛṣṇa, but the creator, grandmother and grandfather, etc., are also Kṛṣṇa. Actually any living entity, being part and parcel of Kṛṣṇa, is Kṛṣṇa. All the Vedas, therefore, aim only toward Kṛṣṇa. Whatever we want to know through the Vedas is but a progressive step toward understanding Kṛṣṇa. That subject matter which helps us purify our constitutional position is especially Kṛṣṇa. Similarly, the living entity who is inquisitive to understand all Vedic principles is also part and parcel of Kṛṣṇa and as such is also Kṛṣṇa. In all the Vedic mantras the word oṁ, called praṇava, is a transcendental sound vibration and is also Kṛṣṇa. And because in all the hymns of the four Vedas – Sāma, Yajur, Ṛg and Atharva – the praṇava, or oṁ-kāra, is very prominent, it is understood to be Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹

12 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 354: 09వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 354: Chap. 09, Ver. 16


🌹. శ్రీమద్భగవద్గీత - 354 / Bhagavad-Gita - 354 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 16 🌴

16. అహం క్రతురహం యజ్ఞ: స్వధాహమహమౌష ధమ్ |
మన్త్రోహమహవేవాజ్యమహమగ్నిరహం హుతమ్ ||


🌷. తాత్పర్యం :

నేనే క్రతువును, యజ్ఞమును, పూర్వుల కొసగబడు ఆహుతిని, ఔషధమును, దివ్యమంత్రమును అయి యున్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే.

🌷. భాష్యము :

“జ్యోతిష్టోమము” అను వైదికయజ్ఞము శ్రీకృష్ణుడే. అదే విధముగా స్మృతి యందు తెలుపబడిన “మహాయజ్ఞము” కూడా అతడే. పితృలోకమునకు అర్పింపబడు ఆహుతి లేక పితృలోకప్రీత్యర్థమై ఒనరించబడు యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. అట్టి ఆహుతులు నెయ్యిరూపున గల ఒకానొక ఔషధముగా పరిగణింపబడును. ఇట్టి కార్యమునకు సంబంధించిన మంత్రములు సైతము శ్రీకృష్ణుడే. యజ్ఞములందు అర్పింపబడు పాలకు సంబంధించిన పదార్థములన్నియును శ్రీకృష్ణుడే.

ప్రకృతి మూలకములలో ఒకటియైనందున అగ్నియు శ్రీకృష్ణుడే. కాని అది ప్రకృతికి సంబంధించినది కావున భగవానుని నుండి విడివడియున్నదిగా తెలియబడును. వేరు మాటలలో వేదములందు తెలుపబడిన కర్మకాండ విభాగము నందు ఉపదేశింపబడిన యజ్ఞములన్నియును వాస్తవమునకు శ్రీకృష్ణుడే. అనగా శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ యందు నియుక్తులైనవారు వేదములందు తెలుపబడిన సమస్త యజ్ఞములను నిర్వహించినట్టివారే యగుచున్నారు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 354 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 16 🌴

16. ahaṁ kratur ahaṁ yajñaḥ svadhāham aham auṣadham
mantro ’ham aham evājyam aham agnir ahaṁ hutam

🌷 Translation :

But it is I who am the ritual, I the sacrifice, the offering to the ancestors, the healing herb, the transcendental chant. I am the butter and the fire and the offering.

🌹 Purport :

The Vedic sacrifice known as Jyotiṣṭoma is also Kṛṣṇa, and He is also the Mahā-yajña mentioned in the smṛti. The oblations offered to the Pitṛloka or the sacrifice performed to please the Pitṛloka, considered as a kind of drug in the form of clarified butter, is also Kṛṣṇa. The mantras chanted in this connection are also Kṛṣṇa. And many other commodities made with milk products for offering in the sacrifices are also Kṛṣṇa.

The fire is also Kṛṣṇa because fire is one of the five material elements and is therefore claimed as the separated energy of Kṛṣṇa. In other words, the Vedic sacrifices recommended in the karma-kāṇḍa division of the Vedas are in total also Kṛṣṇa. Or, in other words, those who are engaged in rendering devotional service unto Kṛṣṇa are to be understood to have performed all the sacrifices recommended in the Vedas.

🌹 🌹 🌹 🌹 🌹

11 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 353: 09వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 353: Chap. 09, Ver. 15


🌹. శ్రీమద్భగవద్గీత - 353 / Bhagavad-Gita - 353 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 15 🌴

15. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్తో మాముపాసతే |
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ||


🌷. తాత్పర్యం :

జ్ఞానసముపార్జన యజ్ఞము నందు నియుక్తులైన ఇతరులు దేవదేవుడైన నన్ను అద్వితీయునిగా, వివధరుపునిగా, విశ్వరూపునిగా పూజింతురు.

🌷. భాష్యము :

పూర్వపు శ్లోకముల సారాంశమే ఈ శ్లోకము. సంపూర్ణ భక్తిభావనలో నిలిచి తనను తప్ప అన్యమును తెలియనివారు మహాత్ములని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపియున్నాడు. అట్టి మహాత్ముల స్థాయికి చెందకున్నను శ్రీకృష్ణునే పలువిధములుగా పూజించువారు కొందరు గలరు. వారిలో కొందరు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానసముపార్జన యందు నియుక్తులైనవారుగా ఇదివరకే వర్ణింపబడినారు. వీరికన్నను తక్కువస్థాయిలో గల ఇతరులు తిరిగి మూడు రకములుగా విభజింపబడిరి. అందులో మొదటిరకమువారు ఆత్మనే భగవానుని తలచి తమను తాము అర్చించుకొందురు. రెండవరకమువారు భగవానునికి ఏదో తోచినరూపము ఆపాదించి దానిని అర్చింతురు. మూడవ రకము వారు చెందినవారు విశ్వమును భగవానునిగా భావించి పూజింతురు.

ఈ మూడురకములలో తమను అద్వైతులుగా భావించుచు తమను తామే భగవానుని రూపమున అర్చించువారు అధికముగా నుందురు. వారు అధములు. అట్టివారు తమనే భగవానుని భావించుచు అదే భావనలో తమను తాము పూజించుకొందురు. ఇదియును ఒక విధమైన భగవదర్చనమే. ఏలయన అట్లు చేయువారు తాము దేహాదులము కామనియు, కేవలము ఆత్మస్వరూపలమేననియు సంపూర్ణముగా తెలిసియుందురు. కనీసము వారి యందు అట్టి భావనము ప్రబలముగా నుండును. సాధారణగా నిరాకారవాదులు దేవదేవుని ఈ రీతిగనే అర్చింతురు. ఈ రూపమైనను భగవానుని రూపమే అనెడి భావనలో ఇతర దేవతార్చనము చేయువారు రెండవ తరగతికి చెందినవారు. ఇక మూడవతరగతికి చెందినవారు విశ్వమును తప్ప అన్యమును ఊహింపలేక విశ్వమునే దివ్యముగా భావించి దానిని అర్చింతురు. అట్టి విశ్వము కూడా శ్రీకృష్ణ భగవానుని రూపమే అయియున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 353 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 15 🌴

15. jñāna-yajñena cāpy anye yajanto mām upāsate
ekatvena pṛthaktvena bahudhā viśvato-mukham


🌷 Translation :

Others, who engage in sacrifice by the cultivation of knowledge, worship the Supreme Lord as the one without a second, as diverse in many, and in the universal form.

🌹 Purport :

This verse is the summary of the previous verses. The Lord tells Arjuna that those who are purely in Kṛṣṇa consciousness and do not know anything other than Kṛṣṇa are called mahātmā; yet there are other persons who are not exactly in the position of mahātmā but who worship Kṛṣṇa also, in different ways. Some of them have already been described as the distressed, the financially destitute, the inquisitive, and those who are engaged in the cultivation of knowledge. But there are others who are still lower, and these are divided into three: (1) he who worships himself as one with the Supreme Lord, (2) he who concocts some form of the Supreme Lord and worships that, and (3) he who accepts the universal form, the viśva-rūpa of the Supreme Personality of Godhead, and worships that.

Out of the above three, the lowest, those who worship themselves as the Supreme Lord, thinking themselves to be monists, are most predominant. Such people think themselves to be the Supreme Lord, and in this mentality they worship themselves. This is also a type of God worship, for they can understand that they are not the material body but are actually spiritual soul; at least, such a sense is prominent. Generally the impersonalists worship the Supreme Lord in this way. The second class includes the worshipers of the demigods, those who by imagination consider any form to be the form of the Supreme Lord. And the third class includes those who cannot conceive of anything beyond the manifestation of this material universe. They consider the universe to be the supreme organism or entity and worship that. The universe is also a form of the Lord.

🌹 🌹 🌹 🌹 🌹

10 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 352: 09వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 352: Chap. 09, Ver. 14


🌹. శ్రీమద్భగవద్గీత - 352 / Bhagavad-Gita - 352 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 14 🌴

14. సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతా: |
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ||


🌷. తాత్పర్యం :

ఈ మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించువారై సదా నా మహిమలను కీర్తించుచు, నాకు నమస్కారమొసగుచు, నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజింతురు.

🌷. భాష్యము :

సామాన్యమానవునికి అధికారికముగా ముద్రవేయుట ద్వారా మహాత్ముడు కాజాలడు. మహాత్ముని లక్షణములు ఇట వర్ణింపబడినవి. మాహాత్ముడైనవాడు సదా దేవదేవుడైన శ్రీకృష్ణుని మహిమలను కీర్తించుట యందే నిమగ్నుడై యుండును. దానికి అన్యమైన కర్మ ఏదియును లేకుండా ఆ భక్తుడు కీర్తనమందే సదా నియుక్తుడై యుండును. అనగా అతడెన్నడును నిరాకారవాది కాడు. కీర్తనమను విషయము చర్చకు వచ్చినప్పుడు మనుజుడు దానిని దేవదేవుని పవిత్రనామమును, దివ్యరూపమును, దివ్యగుణములను, అసాధారణలీలలను కీర్తించుటకే ఉపయోగించవలెను. అవన్నియును ప్రతియోక్కరిచే కీర్తనీయములు కనుకనే మహాత్ముడైనవాడు దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అనురక్తుడై యుండును. శ్రీకృష్ణభగవానుని నిరాకారరూపమైన బ్రహ్మజ్యోతి యెడ అనురక్తుడై యుండెడివాడు భగవద్గీత యందు మహాత్మునిగా వర్ణింపబడలేదు. అట్టివాడు తదుపరి శ్లోకమున ఇందుకు భిన్నముగా వర్ణింపబడినాడు.

శ్రీమద్భాగవతమున తెలుపబడినట్లు మహాత్ముడైనవాడు విష్ణువు యొక్క శ్రవణ, కీర్తనములను కూడిన భక్తియుతసేవ యందు సదా నిమగ్నుడై యుండును. అతడు శ్రీకృష్ణభగవానుని సేవలోనే నిలుచునుగాని, దేవతలు లేదా మనుష్యుల సేవలో కాదు. ఆ రీతి దేవదేవుని సదా స్మరించుటయే భక్తి(శ్రవణం, కీర్తనం, విష్ణో: స్మరణం) యనబడును. దివ్యమైన ఐదు భక్తిరసములలో ఏదేని ఒక భక్తిరసము ద్వారా అంత్యమున అ భగవానునితో నిత్య సాహచార్యమును పొందవలెనని ఆ మహాత్ముడు దృఢనిశ్చయమును కలిగయుండును. దాని యందు జయమును పొందుట అతడు తన మనోవాక్కాయ కర్మలన్నింటిని ఆ దేవదేవుని సేవ యందే నియోగించును. అదియే సంపూర్ణ కృష్ణభక్తిరస భావనమని పిలువబడుచున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 352 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 14 🌴

14 . satataṁ kīrtayanto māṁ yatantaś ca dṛḍha-vratāḥ
namasyantaś ca māṁ bhaktyā nitya-yuktā upāsate


🌷 Translation :

Always chanting My glories, endeavoring with great determination, bowing down before Me, these great souls perpetually worship Me with devotion.

🌹 Purport :

The mahātmā cannot be manufactured by rubber-stamping an ordinary man. His symptoms are described here: a mahātmā is always engaged in chanting the glories of the Supreme Lord Kṛṣṇa, the Personality of Godhead. He has no other business. He is always engaged in the glorification of the Lord. In other words, he is not an impersonalist. When the question of glorification is there, one has to glorify the Supreme Lord, praising His holy name, His eternal form, His transcendental qualities and His uncommon pastimes. One has to glorify all these things; therefore a mahātmā is attached to the Supreme Personality of Godhead.

One who is attached to the impersonal feature of the Supreme Lord, the brahma-jyotir, is not described as mahātmā in the Bhagavad-gītā. He is described in a different way in the next verse. The mahātmā is always engaged in different activities of devotional service, as described in the Śrīmad-Bhāgavatam, hearing and chanting about Viṣṇu, not a demigod or human being. That is devotion: śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ and smaraṇam, remembering Him. Such a mahātmā has firm determination to achieve at the ultimate end the association of the Supreme Lord in any one of the five transcendental rasas. To achieve that success, he engages all activities – mental, bodily and vocal, everything – in the service of the Supreme Lord, Śrī Kṛṣṇa. That is called full Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹

9 Apr 2020


శ్రీమద్భగవద్గీత - 351: 09వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 351: Chap. 09, Ver. 13


🌹. శ్రీమద్భగవద్గీత - 351 / Bhagavad-Gita - 351 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 13 🌴

13. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా: |
భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం :

ఓ పృథాకుమారా! భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీప్రకృతిని ఆశ్రయించియుందురు. వారు నన్ను ఆదియును, అవ్యయుడును అగు దేవదేవునిగా నెరిగియుండుటచే నా భక్తియుతసేవలో సంపూర్ణముగా నిమగ్నులై యుందురు.

🌷. భాష్యము :

మహాత్ములైనవారి వర్ణనము ఈ శ్లోకమున స్పష్టముగా ఒసగబడినది. దైవీప్రకృతిలో స్థితిని పొందియుండుటయే మహాత్ముల ప్రథమ లక్షణము. అతడెన్నడును భౌతికప్రకృతికి లోబడియుండడు. అది ఎట్లు సాధ్యమనెడి విషయము సప్తమాధ్యాయమున ఇదివరకే వివరింపబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణము నొందినవాడు శీఘ్రమే భౌతికప్రకృతి యొక్క అధీనము నుండి ముక్తి నొందగలడు. అదియే మహాత్ముని నిజమైన యోగ్యత. కనుక మనుజుడు తన ఆత్మను ఆ భగవానుని అధీనము చేసినంతనే భౌతికప్రకృతి అదుపు నుండి ముక్తుడు కాగాలడన్నది ప్రాథమికసూత్రము. తటస్థశక్తియైన జీవుడు భౌతికశక్తి నుండి విడివడినంతనే ఆధ్యాత్మికశక్తి నేతృత్వమునకు మరియు నిర్దేశమునకు వచ్చును. అట్టి ఆధ్యాత్మికప్రకృతి నిర్దేశమే “దైవీప్రకృతి” యని పిలువబడుచున్నది. అనగా శ్రీకృష్ణభగవానునికి శరణమునొంది ఆ విధముగా పురోగతి నొందినపుడు మనుజుడు “మహాత్ముడు” అనెడి స్థాయిని పొందగలడు.

శ్రీకృష్ణుడే ఆదిపురుషుడు మరియు సర్వకారణములకు కారణమని సంపూర్ణముగా తెలిసియున్నందున మహాత్ముడైనవాడు తన మనస్సును కృష్ణునిపై నుండి ఇతరము వైపునకు మళ్ళింపడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. మహాత్ములైన శుద్ధభక్తుల సాంగత్యము వలననే అట్టి మహాత్ముడు రూపొందగలడు. శుద్ధభక్తులైనవారు చతుర్భుజ మహావిష్ణువు వంటి శ్రీకృష్ణుని ఇతర రూపములందును ఆకర్షితులుగాక కేవలము అతని ద్విభుజరూపమునందే అనురాగమును, ఆకర్షణను కలిగియుందురు. కృష్ణుని ఇతర రూపముల యెడ గాని, ఇతర దేవతల యెడగాని, మనుజుల యెడగాని వారెన్నడును ఆకర్షుతులు కారు. సంపూర్ణ భక్తిభావనలో కృష్ణుని పైననే ధ్యానము నిలిపి, ఆ కృష్ణభక్తిరసభావనలో వారు నిశ్చితమైన కృష్ణసేవ యందు సదా నియుక్తులై యుందురు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 351 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 13 🌴

13 . mahātmānas tu māṁ pārtha daivīṁ prakṛtim āśritāḥ
bhajanty ananya-manaso jñātvā bhūtādim avyayam


🌷 Translation :

O son of Pṛthā, those who are not deluded, the great souls, are under the protection of the divine nature. They are fully engaged in devotional service because they know Me as the Supreme Personality of Godhead, original and inexhaustible.

🌹 Purport :

In this verse the description of the mahātmā is clearly given. The first sign of the mahātmā is that he is already situated in the divine nature. He is not under the control of material nature. And how is this effected? That is explained in the Seventh Chapter: one who surrenders unto the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, at once becomes freed from the control of material nature. That is the qualification. One can become free from the control of material nature as soon as he surrenders his soul to the Supreme Personality of Godhead. That is the preliminary formula. Being marginal potency, as soon as the living entity is freed from the control of material nature, he is put under the guidance of the spiritual nature.

The guidance of the spiritual nature is called daivī prakṛti, divine nature. So when one is promoted in that way – by surrendering to the Supreme Personality of Godhead – one attains to the stage of great soul, mahātmā. The mahātmā does not divert his attention to anything outside Kṛṣṇa, because he knows perfectly well that Kṛṣṇa is the original Supreme Person, the cause of all causes. There is no doubt about it. Such a mahātmā, or great soul, develops through association with other mahātmās, pure devotees. Pure devotees are not even attracted by Kṛṣṇa’s other features, such as the four-armed Mahā-viṣṇu. They are simply attracted by the two-armed form of Kṛṣṇa. They are not attracted to other features of Kṛṣṇa, nor are they concerned with any form of a demigod or of a human being. They meditate only upon Kṛṣṇa in Kṛṣṇa consciousness. They are always engaged in the unswerving service of the Lord in Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹

8 Apr 2020

శ్రీమద్భగవద్గీత - 350: 09వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 350: Chap. 09, Ver. 12


🌹. శ్రీమద్భగవద్గీత - 350 / Bhagavad-Gita - 350 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 12 🌴

12. మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతస: |
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిమ మోహినీం శ్రితా: ||


🌷. తాత్పర్యం :

ఆ విధముగా మోహపరవశులైన వారు దానవ, నాస్తికభావములచే విమోహితులగుదురు. అట్టి భ్రాంతస్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞానసముపార్జన లన్నియును వ్యర్థములగును.

🌷. భాష్యము :

తమను తాము కృష్ణభక్తిభావన యందు మరియు భక్తియుతసేవ యందు నిలిచియున్నవారిగా భావించుచునే అంతరంగమున మాత్రము దేవదేవుడైన శ్రీకృష్ణుని పరతత్త్వముగా అంగీకరింపని భక్తులు పెక్కురు గలరు. భగవద్ధామప్రాప్తి యను భక్తియోగఫలమును అట్టి వారెన్నడును రుచిచూడలేరు.

అదే విధముగా కామ్యకర్మలందు, పుణ్యకర్మలందు మగ్నులైనవారు మరియు భౌతికబంధముల నుండి ముక్తిని వాంచించువారు సైతము దేవదేవుడైన శ్రీకృష్ణుని నిరసించు కారణముగా కృతకృత్యులు కాజాలరు. వేరుమాటలలో శ్రీకృష్ణుని యెడ అపహాస్య భావముతో వర్తించువారే దానవస్వభావులు లేదా నాస్తికస్వభావులు అయినట్టివారు. భగవద్గీత యందలి సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు అట్టి దానవప్రవృత్తి కలవారు కృష్ణుని శరణునొందరు. కనుక పరతత్త్వమును అవగాహన చేసికొన యత్నించు వారు మానసికకల్పనలు సాధారణజీవుడు మరియు శ్రీకృష్ణుడు ఏకమే, సమానమే అనెడి మిథ్యానిర్ణయమునకు వారిని చేర్చును.

అట్టి మిథ్యాభావనలో వారు ప్రస్తుతము దేహము ప్రక్రుతిచే కప్పబడియున్నదనియు, భౌతికదేహము నుండి ముక్తిని బడసినంతనే భగవానుడు మరియు తమ నడుమ భేదముండదనియు భావింతురు. కాని శ్రీకృష్ణునితో ఏకము కావలెననెడి వారు ప్రయత్నము భ్రాంతి కారణముగా వ్యర్థమగును. అట్టి దానవ, నాస్తికప్రవృత్తితో కూడియున్న జ్ఞానము వ్యర్థమని ఈ శ్లోకమున సూచించబడినది. అనగా వేదాంతసూత్రములు, ఉపనిషత్తులు వంటి వేదవాజ్మయమునందలి జ్ఞానసముపార్జనము దానవ, నాస్తికప్రవృత్తి గలవారికి సదా వ్యర్థమే కాగలదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 350 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 12 🌴

12 . moghāśā mogha-karmāṇo mogha-jñānā vicetasaḥ
rākṣasīm āsurīṁ caiva prakṛtiṁ mohinīṁ śritāḥ


🌷 Translation :

Those who are thus bewildered are attracted by demonic and atheistic views. In that deluded condition, their hopes for liberation, their fruitive activities, and their culture of knowledge are all defeated.

🌹 Purport :

There are many devotees who assume themselves to be in Kṛṣṇa consciousness and devotional service but at heart do not accept the Supreme Personality of Godhead, Kṛṣṇa, as the Absolute Truth. For them, the fruit of devotional service – going back to Godhead – will never be tasted. Similarly, those who are engaged in fruitive pious activities and who are ultimately hoping to be liberated from this material entanglement will never be successful either, because they deride the Supreme Personality of Godhead, Kṛṣṇa.

In other words, persons who mock Kṛṣṇa are to be understood to be demonic or atheistic. As described in the Seventh Chapter of Bhagavad-gītā, such demonic miscreants never surrender to Kṛṣṇa. Therefore their mental speculations to arrive at the Absolute Truth bring them to the false conclusion that the ordinary living entity and Kṛṣṇa are one and the same.

With such a false conviction, they think that the body of any human being is now simply covered by material nature and that as soon as one is liberated from this material body there is no difference between God and himself. This attempt to become one with Kṛṣṇa will be baffled because of delusion. Such atheistic and demoniac cultivation of spiritual knowledge is always futile.

🌹 🌹 🌹 🌹 🌹

7 Apr 2020