శ్రీమద్భగవద్గీత - 223: 05వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 223: Chap. 05, Ver. 19


🌹. శ్రీమద్భగవద్గీత - 223 / Bhagavad-Gita - 223 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 19 🌴


19. ఇహైవ తైర్జిత: సర్గో యేషాం సామ్యే స్థితం మన: |
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రాహ్మణి తే స్థితా: ||

🌷. తాత్పర్యం :

సమానత్వము మరియు ఏకత్వములందు మనస్సు నెలకొనినట్టివారు జననమరణస్థితిని జయించినట్టివారే. వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టి వారు. ఆ విధముగా వారు బ్రహ్మమునందు స్థితిని కలిగినట్టివారే యగుదురు.

🌷. భాష్యము :

పైన తెలిపిన విధముగా మనస్సు నందలి సమానత్వము ఆత్మానుభవపు చిహ్నమై యున్నది. అట్టి స్థితిని పొందినవారిని జన్మమృత్యువుల వంటి భౌతికస్థితులను జయించినవారుగా భావింపవలెను. దేహముగా ఆత్మగా భావించు దేహాత్మభావనము కలిగియున్నంతవరకు మనుజుడు బద్ధునిగా భావింపబడినను, ఆత్మజ్ఞానము ద్వారా సమత్వస్థితికి ఉద్ధరింపబడినంతనే బద్ధజీవితము నుండి ముక్తిని పొందినవాడగును.

అనగా మరణానంతరము అతడు తిరిగి ఈ భౌతికజగమున జన్మను పొందక ఆధ్యాత్మికజగమున ప్రవేశించును. రాగద్వేషములు లేనందున భగవానుడు దోషరహితుడైనట్లే, జీవుడును రాగద్వేషముల నుండి విడివడినప్పుడు దోషరహితుడై ఆధ్యాత్మికజగమున ప్రవేశించుటకు అర్హతను పొందును. అట్టివానిని ముక్తపురుషునిగానే భావింపవలెను. అతని లక్షణములు తరువాతి శ్లోకములో వర్ణింపబడినవి.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 223 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 19 🌴


19. ihaiva tair jitaḥ sargo yeṣāṁ sāmye sthitaṁ manaḥ
nirdoṣaṁ hi samaṁ brahma tasmād brahmaṇi te sthitāḥ

🌷 Translation :

Those whose minds are established in sameness and equanimity have already conquered the conditions of birth and death. They are flawless like Brahman, and thus they are already situated in Brahman.

🌹 Purport :

Equanimity of mind, as mentioned above, is the sign of self-realization. Those who have actually attained to such a stage should be considered to have conquered material conditions, specifically birth and death. As long as one identifies with this body, he is considered a conditioned soul, but as soon as he is elevated to the stage of equanimity through realization of self, he is liberated from conditional life.

In other words, he is no longer subject to take birth in the material world but can enter into the spiritual sky after his death. The Lord is flawless because He is without attraction or hatred. Similarly, when a living entity is without attraction or hatred, he also becomes flawless and eligible to enter into the spiritual sky. Such persons are to be considered already liberated, and their symptoms are described below.

🌹 🌹 🌹 🌹 🌹


8 Dec 2019