శ్రీమద్భగవద్గీత - 218: 05వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 218: Chap. 05, Ver. 14


🌹. శ్రీమద్భగవద్గీత - 218 / Bhagavad-Gita - 218 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 14 🌴


14. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు: |
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ||


🌷. తాత్పర్యం :

తన దేహమనెడి పురము యొక్క అధిపతియైన దేహి కర్మలను సృష్టించుటగాని, కర్మల యందు జనులను ప్రేరేపించుటగాని, కర్మఫలములను సృష్టించుటగాని చేయడు. ఇదియంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది.


🌷. భాష్యము :

సప్తమాధ్యాయమున తెలుపబడనున్నట్లు జీవుడు శ్రీకృష్ణభగవానుని శక్తులలో(ప్రకృతులలో) ఒకడై యున్నాడు. కాని భగవానుని వేరొక శక్తియైన(న్యునమైనట్టిది) భౌతికప్రకృతికి అతడు భిన్నుడైనవాడు. అట్టి ఉన్నతప్రకృతికి చెందిన జీవుడు అనంతకాలముగా ఏదియో ఒక కారణముచే నిమ్నమైన భౌతికప్రకృతి యొక్క సంబంధమును కలిగియున్నాడు. అతడు పొందునటువంటి తాత్కాలిక దేహము (చరించుస్థలము) వివిధములైన కర్మలకు మరియు ఫలములకు కారణమై యున్నది. అటువంటి బద్ధవాతావరణములో జీవుంచుచు అజ్ఞానవశమున దేహాత్మ భావనచే జీవుడు దేహకర్మఫలములచే పీడితుడగును. అనంతకాలము నుండి పొందిన అట్టి అజ్ఞానమే దేహపరమగు దుఃఖమునకు, చింతకు కారణమై యున్నది. జీవుడు దేహపరకార్యముల నుండి దూరుడైనంతనే వాటి ఫలముల నుండియు దూరుడు కాగలడు.

దేహమును పురమున నిలిచినంత కాలము జీవుడు దానికి అధిపతిగా కనిపించినను వాస్తవమునకు అతడు దేహమునకు అధిపతి కాని, దాని కర్మలను మరియు ఫలములను నియమించువాడు కాని కాడు. అతడు కేవలము భవసాగరమున జీవన పోరాటము సల్పునట్టివాడే. తనను తల్లక్రిందులు చేయు ఆ సముద్రపుటలలపై అతడు ఎట్టి నియంత్రణను కలిగి యుండడు. కనుక దివ్యమైన కృష్ణభక్త్తిభావన ద్వారా ఆ భవజలముల నుండి బయటపడుటయే దానికి ఉత్తమ పరిష్కారము. అది ఒక్కటే అతనిని సర్వక్లేశముల నుండి రక్షించగలదు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 218 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 14 🌴


14. na kartṛtvaṁ na karmāṇi lokasya sṛjati prabhuḥ
na karma-phala-saṁyogaṁ svabhāvas tu pravartate


🌷 Translation :

The embodied spirit, master of the city of his body, does not create activities, nor does he induce people to act, nor does he create the fruits of action. All this is enacted by the modes of material nature.

🌹 Purport :

The living entity, as will be explained in the Seventh Chapter, is one of the energies or natures of the Supreme Lord but is distinct from matter, which is another nature – called inferior – of the Lord. Somehow the superior nature, the living entity, has been in contact with material nature since time immemorial. The temporary body or material dwelling place which he obtains is the cause of varieties of activities and their resultant reactions. Living in such a conditional atmosphere, one suffers the results of the activities of the body by identifying himself (in ignorance) with the body.

It is ignorance acquired from time immemorial that is the cause of bodily suffering and distress. As soon as the living entity becomes aloof from the activities of the body, he becomes free from the reactions as well. As long as he is in the city of the body, he appears to be the master of it, but actually he is neither its proprietor nor controller of its actions and reactions. He is simply in the midst of the material ocean, struggling for existence. The waves of the ocean are tossing him, and he has no control over them. His best solution is to get out of the water by transcendental Kṛṣṇa consciousness. That alone will save him from all turmoil.

🌹 🌹 🌹 🌹 🌹


3 Dec 2019