శ్రీమద్భగవద్గీత - 220: 05వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 220: Chap. 05, Ver. 16


🌹. శ్రీమద్భగవద్గీత - 220 / Bhagavad-Gita - 220 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 16 🌴


16. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మాన: |
తేషామాదిత్యవద్జ్ఞానం ప్రకాశయతి తత్ పరమ్ ||

🌷. తాత్పర్యం :

అజ్ఞానమును నశింప జేయు జ్ఞానముచే మనుజుడు ప్రకాశవంతుడైనప్పుడు, పగటి సమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింప జేయునట్లు, అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును.

🌷. భాష్యము :

శ్రీకృష్ణుని మరచినవారు నిశ్చయముగా మొహ పరవశులగుదురు. కాని కృష్ణభక్తి భావన యందున్న వారు ఎన్నడును మోహమునకు గురికారు. “సర్వం జ్ఞానప్లవేవైన, జ్ఞానాగ్ని: సర్వకర్మాణి, న హి జ్ఞానేన సదృశమ్” అనుచు జ్ఞానము సర్వదా భగవధ్గీత యందు గొప్ప గౌరవమొసగబడినది. ఇక ఆ జ్ఞానమెట్టిది: సంపూర్ణజ్ఞానము శ్రీకృష్ణునికి శరణుపొందుట ద్వారానే లభించునని భగవద్గీత సప్తమాధ్యాయపు పంతొమ్మిదవ శ్లోకము (7.19) తెలుపుచున్నది (బహూనాం జన్మనా మన్తే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే).

అనేకానేక జన్మలు గడచిన పిమ్మట జ్ఞానవంతుడైనవాడు శ్రీకృష్ణుని శరణుపొందినపుడు (కృష్ణభక్తిరసభావితుడైనపుడు) పగటిసమయమున సూర్యుని వలన సర్వము గోచరమైనట్లు అతనికి సర్వము వెల్లడి చేయబడును. నిజమునకు జీవులు పలువిధములుగా మొహమునకు గురియగుచుందురు. ఉదాహరణకు అతడు తనను తానూ భగవానునిగా భావించుచు అజ్ఞానవాగురమున పడిపోవును. కనుక ప్రతియొక్కరు అట్టి ప్రామాణిక గురువును ఆశ్రయించి, ఆయన శరణమున కృష్ణభక్తిరసభావనము సమస్త అజ్ఞానమును నిక్కముగా పారద్రోలగలదు.

తాను దేహమును గాక దేహమునకు పరమైనవాడిననెడి పూర్ణజ్ఞానము మనుజునకున్నను, ఆత్మ మరియు పరమాత్ముని నడుమగల భేదమును అతడు గాంచలేకపోవచ్చును. కాని కృష్ణభక్తిపరాయణుడైన గురువు యొక్క శరణమును పొందినచో అతనికి సర్వము విదితము కాగలదు. శ్రీకృష్ణభగవానుని గూర్చియు మరియు దేవదేవునితో తనకు గల సంబంధమును గూర్చియు మనుజుడు అతని ప్రతినిధి నాశ్రయించినప్పుడే నిజముగా తెలిసికొనగలడు. కృష్ణసంబంధ విజ్ఞానము సంపూర్ణముగా కలిగియున్నందున కృష్ణునితో సమానముగా భక్తిగౌరవములు లభించినను కృష్ణుని ప్రతినిధియైన వాడు తానెడెన్నడును భగవానుడనని పలుకడు. భగవానుడు మరియు జీవుల నడుమ గల వ్యత్యాసమును సర్వులు ఎరుగవలెను.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 220 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 16 🌴


16. jñānena tu tad ajñānaṁ yeṣāṁ nāśitam ātmanaḥ
teṣām āditya-vaj jñānaṁ prakāśayati tat param

🌷 Translation :

When, however, one is enlightened with the knowledge by which nescience is destroyed, then his knowledge reveals everything, as the sun lights up everything in the daytime.

🌹 Purport :

Those who have forgotten Kṛṣṇa must certainly be bewildered, but those who are in Kṛṣṇa consciousness are not bewildered at all. It is stated in the Bhagavad-gītā, sarvaṁ jñāna-plavena, jñānāgniḥ sarva-karmāṇi and na hi jñānena sadṛśam. Knowledge is always highly esteemed. And what is that knowledge? Perfect knowledge is achieved when one surrenders unto Kṛṣṇa, as is said in the Seventh Chapter, nineteenth verse: bahūnāṁ janmanām ante jñānavān māṁ prapadyate.

After passing through many, many births, when one perfect in knowledge surrenders unto Kṛṣṇa, or when one attains Kṛṣṇa consciousness, then everything is revealed to him, as everything is revealed by the sun in the daytime. The living entity is bewildered in so many ways. Real knowledge can be obtained from a person who is in perfect Kṛṣṇa consciousness.

Therefore, one has to seek out such a bona fide spiritual master and, under him, learn what Kṛṣṇa consciousness is, for Kṛṣṇa consciousness will certainly drive away all nescience, as the sun drives away darkness. Even though a person may be in full knowledge that he is not this body but is transcendental to the body, he still may not be able to discriminate between the soul and the Supersoul. However, he can know everything well if he cares to take shelter of the perfect, bona fide Kṛṣṇa conscious spiritual master. One can know God and one’s relationship with God only when one actually meets a representative of God.

A representative of God never claims that he is God, although he is paid all the respect ordinarily paid to God because he has knowledge of God.

🌹 🌹 🌹 🌹 🌹


5 Dec 2019