శ్రీమద్భగవద్గీత - 219: 05వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 219: Chap. 05, Ver. 15


🌹. శ్రీమద్భగవద్గీత - 219 / Bhagavad-Gita - 219 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 15 🌴

15. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభు: |
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జన్తవ: ||


🌷. తాత్పర్యం :

భగవానుడు ఎవరి పాపమును గాని, పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారు నిజజ్ఞానమును ఆవరించెడి అజ్ఞానముచే మోహము నొందుచుందురు.

🌷. భాష్యము :

“విభు:” అనెడి సంస్కృతపదమునకు అపరిమితమైన జ్ఞానము, సంపద, బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యము అనెడి షడ్గుణములు సమగ్రముగా కలిగియున్న భగవానుడని అర్థము. పాపపుణ్యకార్యములచే కలతనొందక అతడెల్లప్పుడును తన యందే తృప్తుడై యుండును. జీవుని స్థితికి అతడెన్నడును కారణము కాడు. జీవుడే అజ్ఞానముచే మోహమునొంది కొన్నిరకములైన స్థితుల యందు నిలువగోరి, తన కర్మఫల శృంఖలమును తయారుచేసికొనును.

వాస్తవమునకు ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు పూర్ణజ్ఞానవంతుడు. అయినను తన పరిమితశక్తి కారణముగా అతడు అజ్ఞానముచే ప్రభావితుడగును. భగవానుడు సర్వశక్తిసమన్వితుడు. కాని జీవుడు అట్టివాడు కాదు. భగవానుడు “విభు:” (సర్వజ్ఞుడు) కాగా జీవుడు “అణుమాత్రుడు” అయియున్నాడు. కాని జీవుడు ఆత్మయై యున్నందున తన ఇచ్చానుసారముగా దేనినైనను కోరు శక్తిని కలిగియుండును. అతని అట్టి కోరిక సర్వశక్తిసమన్వితుడైన భగవానుని చేతనే పూర్ణము చేయబడుచుండును.

కనుక జీవుడు తన కోరికల విషయమున మోహము నొందినప్పుడు భగవానుడు వాటిని నెరవేర్చుకొను అవకాశము నోసగునే గాని, జీవుని యొక్క వాంఛనీయ పరిస్థితి యందలి కర్మలకు మరియు ఫలములకు బాధ్యతను వహింపడు. కనుకనే మోహపరిస్థితులలో నుండుటచే జీవుడు తనను దేహముగా భావించి తాత్కాలికములైన సుఖము మరియు దుఃఖములచే ప్రభావితుడగును. భగవానుడు పరమాత్మరూపున సదా జీవుని సాహచార్యమున ఉండి, పుష్పము దగ్గరగా ఉన్నప్పుడు వ్యక్తి దాని సుగంధమును ఆఘ్రాణించ గలిగిన రీతి జీవుని కోరికల నన్నింటిని అవగాహన చేసికొనును. వాస్తవమునకు కోరిక యనునది జీవునకు సూక్ష్మరూపబంధమైనను భగవానుడు జీవులకు వారి అర్హతను బట్టి కోరికలను పూర్ణము కావించుచుండును. ఈ విధముగా మనుజుడు తన కోరికలను పూర్ణము కావించుకొనుటలో సర్వశక్తిమంతుడు కాడు. కాని భగవానుడు మాత్రము తన కోరికలను పూర్ణము కావించుకొనగలడు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 219 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 15 🌴

15. nādatte kasyacit pāpaṁ na caiva sukṛtaṁ vibhuḥ
ajñānenāvṛtaṁ jñānaṁ tena muhyanti jantavaḥ



🌷 Translation :

Nor does the Supreme Lord assume anyone’s sinful or pious activities. Embodied beings, however, are bewildered because of the ignorance which covers their real knowledge.


🌹 Purport :

The Sanskrit word vibhu means the Supreme Lord who is full of unlimited knowledge, riches, strength, fame, beauty and renunciation. He is always satisfied in Himself, undisturbed by sinful or pious activities. He does not create a particular situation for any living entity, but the living entity, bewildered by ignorance, desires to be put into certain conditions of life, and thereby his chain of action and reaction begins. A living entity is, by superior nature, full of knowledge. Nevertheless, he is prone to be influenced by ignorance due to his limited power. The Lord is omnipotent, but the living entity is not. The Lord is vibhu, or omniscient, but the living entity is aṇu, or atomic.

Because he is a living soul, he has the capacity to desire by his free will. Such desire is fulfilled only by the omnipotent Lord. And so, when the living entity is bewildered in his desires, the Lord allows him to fulfill those desires, but the Lord is never responsible for the actions and reactions of the particular situation which may be desired. Being in a bewildered condition, therefore, the embodied soul identifies himself with the circumstantial material body and becomes subjected to the temporary misery and happiness of life.

The Lord is the constant companion of the living entity as Paramātmā, or the Supersoul, and therefore He can understand the desires of the individual soul, as one can smell the flavor of a flower by being near it. Desire is a subtle form of conditioning for the living entity. The Lord fulfills his desire as he deserves: Man proposes and God disposes. The individual is not, therefore, omnipotent in fulfilling his desires.

🌹 🌹 🌹 🌹 🌹


4 Dec 2019