శ్రీమద్భగవద్గీత - 221: 05వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 221: Chap. 05, Ver. 17


🌹. శ్రీమద్భగవద్గీత - 221 / Bhagavad-Gita - 221 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 17 🌴


17. తద్బుద్ధయస్తదాత్మా నస్తన్నిష్టా స్తత్పరాయణా: |
గచ్ఛన్త్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషా: ||


🌷. తాత్పర్యం :

బుద్ధి, మనస్సు, నిష్ఠ, ఆశ్రయములన్నియును భగవానుని యందే లగ్నమైనపుడు మనుజుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తిమార్గమున ప్రయాణించును.


🌷. భాష్యము :

దివ్యమగు పరమసత్యమే శ్రీకృష్ణభగవానుడు. శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడగు భగవానుని ప్రకటించుటయందే గీతాజ్ఞానమంతయు కేంద్రీకృతమైనది. వేదవాజ్మయమంతయు ఈ విషయమునే తెలుపుచున్నది. పరతత్త్వమనగా పరమసత్యత్వమని భావము. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడనెడి తత్త్వములుగా పరతత్త్వము నెరిగినవారే దానిని అవగాహన చేసికొనగలరు. ఆ పరతత్త్వము యొక్క చరమానుభవమే శ్రీకృష్ణభగవానుడు. అతనికి మించి వేరొక్కటి లేదు. కనుకనే ఆ భగవానుడు “మత్త: పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ” అని భోధించెను. నిరాకారబ్రహ్మము సైతము శ్రీకృష్ణుని పైననే ఆధారపడియున్నదని తెలుపబడినది (బ్రాహ్మణోహి ప్రతిష్టాహమ్). కనుకనే అన్నివిధముల శ్రీకృష్ణుడే పరమసత్యమై యున్నాడు.

తత్కారణముగా శ్రీకృష్ణుని యందే మనస్సు, బుద్ధి, నిష్ఠ, ఆశ్రయములను సదా కలిగి యున్నారు (కృష్ణభక్తిరస భావితులు) నిస్సందేహముగా కల్మషరహితులును మరియు పరతత్త్వ విషయమున సంపూర్ణజ్ఞానమును కలిగినవారు అగుదురు. కృష్ణభక్తిరసభావితుడు శ్రీకృష్ణుని యందు ద్వైతము కలదని (ఏకకాలమున ఏకత్వము మరియు వ్యక్తిత్వము) సంపూర్ణముగ అవగతము చేసికొనగలుగును. అట్టి జ్ఞానమును కలిగిన మనుజుడు ముక్తిమార్గమున పురోభివృద్ధిని పొందును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 221 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 17 🌴

17. tad-buddhayas tad-ātmānas tan-niṣṭhās tat-parāyaṇāḥ
gacchanty apunar-āvṛttiṁ jñāna-nirdhūta-kalmaṣāḥ

🌷 Translation :

When one’s intelligence, mind, faith and refuge are all fixed in the Supreme, then one becomes fully cleansed of misgivings through complete knowledge and thus proceeds straight on the path of liberation.


🌹 Purport :

The Supreme Transcendental Truth is Lord Kṛṣṇa. The whole Bhagavad-gītā centers around the declaration that Kṛṣṇa is the Supreme Personality of Godhead. That is the version of all Vedic literature. Para-tattva means the Supreme Reality, who is understood by the knowers of the Supreme as Brahman, Paramātmā and Bhagavān. Bhagavān, or the Supreme Personality of Godhead, is the last word in the Absolute. There is nothing more than that. The Lord says, mattaḥ parataraṁ nānyat kiñcid asti dhanañ-jaya. Impersonal Brahman is also supported by Kṛṣṇa: brahmaṇo hi pratiṣṭhāham.

Therefore in all ways Kṛṣṇa is the Supreme Reality. One whose mind, intelligence, faith and refuge are always in Kṛṣṇa, or, in other words, one who is fully in Kṛṣṇa consciousness, is undoubtedly washed clean of all misgivings and is in perfect knowledge in everything concerning transcendence. A Kṛṣṇa conscious person can thoroughly understand that there is duality (simultaneous identity and individuality) in Kṛṣṇa, and, equipped with such transcendental knowledge, one can make steady progress on the path of liberation.

🌹 🌹 🌹 🌹 🌹


6 Dec 2019