శ్రీమద్భగవద్గీత - 249: 06వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 249: Chap. 06, Ver. 16


🌹. శ్రీమద్భగవద్గీత - 249 / Bhagavad-Gita - 249 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 16 🌴

16. నాట్యనాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాన్తమనశ్నత: |
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున ||


🌷. తాత్పర్యం :

ఓ అర్జునా! అతిగా భుజించువానికి లేదా అతితక్కువ తినువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్రలేనివానికి యోగి యగుటకు అవకాశము లేదు.

🌷. భాష్యము :

ఆహారము మరియు నిద్రయందు నియమము ఇచ్చట యోగులకు నిర్దేశింపబడుచున్నది. అధికముగా భుజించుట యనగా దేహపోషణకు అవసరమైనదాని కన్నాను అధికముగా భుజించుటని భావము. సమృద్ధిగా ధాన్యము, కూరగాయలు, ఫలములు, పాలు లభించుచున్నందున మనుజుల జంతుమాంసము తిననవసరము లేదు. శ్రీమద్భగవద్గీత ప్రకారము అట్టి సరళమగు ఆహారము సాత్వికమైనట్టిది. మాంసాహారము తమోగుణప్రధానులకు ఉద్దేశింపబడినది. కావున మాంసాహారము, మద్యపానము, ధూమపానము చేయుచు కృష్ణునకు అర్పింపని ఆహారమును గ్రహించువారు తాము పాపమునే భుజించుటచే పాపకర్మల ఫలములను అనుభవింపవలసివచ్చును. “భుంజతే తే త్వఘం పాపా: యే పచన్త్యాత్మకారణాత్ – ఎవరైతే కృష్ణునికి అర్పింపక తమ ప్రీత్యర్థమే ఆహారమును స్వీకరింతురో లేక తయారుచేకొందురో అట్టివారు పాపమునే భుజించువారు కాగలరు.”

పాపమును భుజించువాడు మరియు అతిగా భుజించువాడు పూర్ణయోగమును అభ్యసింపలేడు. కనుక కృష్ణునకు అర్పింపబడిన ఆహారమును భుజించుటయే సర్వులకు ఉత్తమము. కృష్ణభక్తిభావన యందున్నవాడు తొలుత కృష్ణునికి అర్పింపబడని ఆహారమును దేనిని కూడా స్వీకరింపడు. కనుక కృష్ణభక్తిరస భావితుడే యోగాభ్యాసమునందు పూర్ణత్వమును పొందగలడు. అట్లుగాక కేవలము తనకు తోచిన విధముగా ఉపవాసముండి కృత్రిమముగా ఆహారమును విడిచి యోగమభ్యసించువాడు ఎన్నడును యోగమునందు పూర్ణుడు కాలేడు.

కృష్ణభక్తిపరాయణుడు శాస్త్రములలో తెలిపినరీతి ఉపవాసమును అవలంబించును. అతడు అధికముగా భుజించుట లేదా అతిగా ఉపవసించుట చేయనందున యోగాభ్యాసమును చక్కగా పాటించగలడు. అధికముగా భుజించువానికి స్వప్నములు ఎక్కువగా వచ్చుచున్నందున అధికసమయము నిద్రించును. వాస్తవమునకు మనుజుడు ఆరుగంటల కన్నాను అధికముగా నిద్రపోరాదు. ఆ విధముగా రోజులో ఆరుగంటల కన్నను అధికముగా నిద్రించువాడు తమోగుణముచే ప్రభావితుడైనట్టివాడే. తమోగుణప్రధానుడు మందుడై, అధికముగా నిద్రించును. అట్టివాడు ఎన్నడును యోగమును నిర్వహింపలేడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 249 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 16 🌴

16. nāty-aśnatas tu yogo ’sti na caikāntam anaśnataḥ
na cāti-svapna-śīlasya jāgrato naiva cārjuna


🌷 Translation :

There is no possibility of one’s becoming a yogī, O Arjuna, if one eats too much or eats too little, sleeps too much or does not sleep enough.

🌹 Purport :

Regulation of diet and sleep is recommended herein for the yogīs. Too much eating means eating more than is required to keep the body and soul together. There is no need for men to eat animals, because there is an ample supply of grains, vegetables, fruits and milk. Such simple foodstuff is considered to be in the mode of goodness according to the Bhagavad-gītā. Animal food is for those in the mode of ignorance.

Therefore, those who indulge in animal food, drinking, smoking and eating food which is not first offered to Kṛṣṇa will suffer sinful reactions because of eating only polluted things. Bhuñjate te tv aghaṁ pāpā ye pacanty ātma-kāraṇāt. Anyone who eats for sense pleasure, or cooks for himself, not offering his food to Kṛṣṇa, eats only sin. One who eats sin and eats more than is allotted to him cannot execute perfect yoga. It is best that one eat only the remnants of foodstuff offered to Kṛṣṇa. A person in Kṛṣṇa consciousness does not eat anything which is not first offered to Kṛṣṇa.

Therefore, only the Kṛṣṇa conscious person can attain perfection in yoga practice. Nor can one who artificially abstains from eating, manufacturing his own personal process of fasting, practice yoga. The Kṛṣṇa conscious person observes fasting as it is recommended in the scriptures. He does not fast or eat more than is required, and he is thus competent to perform yoga practice. One who eats more than required will dream very much while sleeping, and he must consequently sleep more than is required. One should not sleep more than six hours daily. One who sleeps more than six hours out of twenty-four is certainly influenced by the mode of ignorance.

🌹 🌹 🌹 🌹 🌹


31 Dec 2019

శ్రీమద్భగవద్గీత - 248: 06వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 248: Chap. 06, Ver. 15


🌹. శ్రీమద్భగవద్గీత - 248 / Bhagavad-Gita - 248 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 15 🌴

15. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానస: |
శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి ||


🌷. తాత్పర్యం :

దేహము, మనస్సు, కర్మలను ఈ విధముగా నిరంతరము మియమించుచు యోగియైన వాడు నియమిత మనస్సు కలవాడై భౌతికస్థితి నుండి విరమించుట ద్వారా భగవద్రాజ్యమును (కృష్ణధామమును) పొందును.

🌷. భాష్యము :

యోగాభ్యాసపు అంతిమలక్ష్యము ఇప్పుడు స్పష్టముగా వివరింపబడినది. అట్టి యోగాభ్యాసము ఎటువంటి భౌతికసౌక్యకరము పొందుట కొరకు గాక భౌతికస్థితి నుండి ముక్తిని పొందుటకై ఉద్దేశింపబడినది. యోగము ద్వారా ఆరోగ్యవృద్ధి చేసికొనుటకు లేదా ఏదేని సిద్ధిని పొందుటకు యత్నించువాడు గీత ప్రకారము యోగి కానేరడు. అలాగుననే భౌతికస్థితి నుండి విరమణము మనుజుని “శూన్యము” నందు ప్రవేశింపజేయదు. నిజమునకు అట్టి భావన మిథ్యయై యున్నది. భగవానుని సృష్టిలో ఎచ్చటను శూన్యమనునది లేదు. వాస్తవమునాకు భౌతికస్థితి నుండి ముక్తి మనుజిని ఆధ్యాత్మిక లోకమైన భగవద్ధామమునకు చేర్చగలదు. సూర్యచంద్రులు లేదా విద్యుత్తు యొక్క అవసరము లేని అట్టి భగవద్ధామము భగవద్గీత యందు స్పష్టముగా వివరింపబడినది. అట్టి ఆధ్యాత్మికజగము నందు యాని లోకములు కూడా భౌతికాకాశము నందలి సూర్యుని వలె స్వయంప్రకాశమానములై యుండును. సృష్టియంతయు భగవద్రాజ్యమేయైనను, ఆధ్యాత్మికాకాశము మరియు దాని యందలి లోకములు మాత్రము పరంధామమని పిలువబడును.

కృష్ణుని గూర్చిన సంపూర్ణజ్ఞానమును కలిగిన పూర్ణయోగి ఆ భగవానుడు స్వయముగా ఇచ్చట తెలిపిన రీతి (మచ్చిత్త:, మత్పర:, మత్స్థానం) నిజమైన శాంతిని పొంది, అంత్యమున గోలోకబృందావనమని తెలియబడు దివ్యమైన కృష్ణలోకమును చేరగలడు. “గోలోక ఏవ నివసిలాత్మభూత: శ్రీకృష్ణుభగవానుడు తన ధామమైన గోలోకమునందు నిత్యముగా వసించియున్నను, తన దివ్యశక్తులచే సర్వత్రా వ్యాపించియున్న పరబ్రహ్మముగా మరియు సర్వజీవహృదయస్థుడైన పరమాత్మగా తెలియబడుచున్నాడు” అని బ్రహ్మసంహిత (5.37) తెలియజేయుచున్నది. అట్టి శ్రీకృష్ణభగవానుని సంపూర్ణావగాహనము మరియు అతని సంపూర్ణాంశయైన విష్ణువు యొక్క అవగాహనము లేనిదే ఎవ్వరును ఆధ్యాత్మికజగత్తునందు గాని (వైకుంటాము) లేదా భగవద్ధామమునందు గాని (గోలోకబృందావనము) ప్రవేశింపలేరు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 248 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 15 🌴

15. yuñjann evaṁ sadātmānaṁ yogī niyata-mānasaḥ
śāntiṁ nirvāṇa-paramāṁ mat-saṁsthām adhigacchati


🌷 Translation :

Thus practicing constant control of the body, mind and activities, the mystic transcendentalist, his mind regulated, attains to the kingdom of God [or the abode of Kṛṣṇa] by cessation of material existence.

🌹 Purport :

The ultimate goal in practicing yoga is now clearly explained. Yoga practice is not meant for attaining any kind of material facility; it is to enable the cessation of all material existence. One who seeks an improvement in health or aspires after material perfection is no yogī according to Bhagavad-gītā. Nor does cessation of material existence entail one’s entering into “the void,” which is only a myth. There is no void anywhere within the creation of the Lord. Rather, the cessation of material existence enables one to enter into the spiritual sky, the abode of the Lord. The abode of the Lord is also clearly described in the Bhagavad-gītā as that place where there is no need of sun, moon or electricity. All the planets in the spiritual kingdom are self-illuminated like the sun in the material sky. The kingdom of God is everywhere, but the spiritual sky and the planets thereof are called paraṁ dhāma, or superior abodes.

A consummate yogī, who is perfect in understanding Lord Kṛṣṇa, as is clearly stated herein by the Lord Himself (mat-cittaḥ, mat-paraḥ, mat-sthānam), can attain real peace and can ultimately reach His supreme abode, Kṛṣṇaloka, known as Goloka Vṛndāvana. In the Brahma-saṁhitā (5.37) it is clearly stated, goloka eva nivasaty akhilātma-bhūtaḥ: the Lord, although residing always in His abode called Goloka, is the all-pervading Brahman and the localized Paramātmā as well by dint of His superior spiritual energies. No one can reach the spiritual sky (Vaikuṇṭha) or enter into the Lord’s eternal abode (Goloka Vṛndāvana) without the proper understanding of Kṛṣṇa and His plenary expansion Viṣṇu.

🌹 🌹 🌹 🌹 🌹


30 Dec 2019


శ్రీమద్భగవద్గీత - 247: 06వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 247: Chap. 06, Ver. 14


🌹. శ్రీమద్భగవద్గీత - 247 / Bhagavad-Gita as It is - 247🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 14 🌴

14. ప్రశాన్తాత్మా విగతభీర్భ్రహ్మచారివ్రతే స్థిత: |
మన: సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర:


🌷. తాత్పర్యం :

ఆ విధముగా కలతనొందనటువంటి నియమిత మనస్సుతో, భయమును వీడి, బ్రహ్మచర్యమును పాటించుచు యోగియైనవాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవితపరమగతిగా చేసికొనవలెను.

🌷. భాష్యము :

యాజ్ఞవల్క్యమహర్షి రచించిన బ్రహ్మచర్య నియమములందు ఈ విషయములందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది.

కర్మణా మనసా వాచా సర్వావస్థాసు సర్వదా |
సర్వత్ర మైథునత్యాగో బ్రహ్మచర్యం పచక్షతే

“అన్ని సమయములలో, అన్ని పరిస్థితులలో, అన్ని ప్రదేశములలో మనసా, వాచా, కర్మణా మైథునభోగమును త్యజించుట కొరకే బ్రహ్మచర్యవ్రతము ఉద్దేశింపబడి యున్నది.” మైథునసుఖము అనుభవించుచునే సరియైన యోగాభ్యాసమును ఎవ్వరును చేయజాలరు. కనుకనే మైథునసుఖపు జ్ఞానముండని బాల్యము నుండియే బ్రహ్మచర్యము బోధింపబడును. ఐదేండ్ల సమయము నందే పిల్లలను గురుకులమునకు లేదా గురువు వద్దకు పంపినచో అతడు వారిని చక్కని బ్రహ్మచారులగు రీతిగా శిక్షణను ఒసగగలడు.

ధ్యానమార్గము, జ్ఞానమార్గము లేదా భక్తిమార్గము ఏదైనను సరియే అట్టి బ్రహ్మచర్యభ్యాసము లేనిదే ఎవ్వరును వారి యోగమునందు అభివృద్ధిని పొందలేరు. అయినను గృహస్థజీవన ధర్మమును చక్కగా పాటించుచు, కేవలము భార్యతోనే నియమబద్ధముగా సాంసారికసుఖమును కలిగియున్నవాడు సైతము బ్రహ్మచారిగా పిలువబడును. అట్టి నియమిత గృహస్థ బ్రహ్మచారలు భక్తిమార్గమునందు ఆమోదింపబడుదురు.

కాని జ్ఞానము మరియు ధ్యానమార్గ సంప్రదాయములు అట్టి గృహస్థ బ్రహ్మచారులను తమ యందు చేర్చుకొనుటకైనను అంగీకరింపవు. భగవద్గీత (2.59) యందు ఇదే విషయము ఇట్లు చెప్పబడినది.

విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహిన: |
రసవర్ణం రసో(ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||

ఇతరులు బలవంతముగా తమను ఇంద్రియభోగము నుండి నియమించు కొనుచుండగా భక్తులు తమ ఉన్నత రసాస్వాదన కారణముగా అప్రయత్నముగా ఇంద్రియభోగముల నుండి దూరులగుచున్నారు. భక్తులు తప్ప అన్యులకు ఆ దివ్యరసాస్వాదనపు జ్ఞానము ఏమాత్రము ఉండదు. సంపూర్ణముగా కృష్ణభక్తిభావన యందు నిలివనిదే ఎవ్వరును అభయత్వమును పొందలేరని “విగతభీ:” యను పదము సూచించుచున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 24 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 14 🌴

14.praśāntātmā vigata-bhīr brahmacāri-vrate sthitaḥ
manaḥ saṁyamya mac-citto yukta āsīta mat-paraḥ


🌷 Translation :

Thus, with an unagitated, subdued mind, devoid of fear, completely free from sex life, one should meditate upon Me within the heart and make Me the ultimate goal of life.

🌹 Purport :

In the rules of celibacy written by the great sage Yājñavalkya it is said:

karmaṇā manasā vācā sarvāvasthāsu sarvadā
sarvatra maithuna-tyāgo brahmacaryaṁ pracakṣate

“The vow of brahmacarya is meant to help one completely abstain from sex indulgence in work, words and mind – at all times, under all circumstances and in all places.” No one can perform correct yoga practice through sex indulgence. Brahmacarya is taught, therefore, from childhood, when one has no knowledge of sex life. Children at the age of five are sent to the guru-kula, or the place of the spiritual master, and the master trains the young boys in the strict discipline of becoming brahmacārīs. Without such practice, no one can make advancement in any yoga, whether it be dhyāna, jñāna or bhakti.

One who, however, follows the rules and regulations of married life, having a sexual relationship only with his wife (and that also under regulation), is also called a brahmacārī. In the Bhagavad-gītā (2.59) it is said: viṣayā vinivartante nirāhārasya dehinaḥ

rasa-varjaṁ raso ’py asya paraṁ dṛṣṭvā nivartate

Whereas others are forced to restrain themselves from sense gratification, a devotee of the Lord automatically refrains because of superior taste. Other than the devotee, no one has any information of that superior taste.

Vigata-bhīḥ. One cannot be fearless unless one is fully in Kṛṣṇa consciousness. A conditioned soul is fearful due to his perverted memory, his forgetfulness of his eternal relationship with Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


29 Dec 2019

శ్రీమద్భగవద్గీత - 246: 06వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 246: Chap. 06, Ver. 13


🌹. శ్రీమద్భగవద్గీత - 246 / Bhagavad-Gita as It is - 246🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 13 🌴


13. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిర: |
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ||


🌷. తాత్పర్యం :

శరీరము, మెడను, శిరమును చక్కగా సమముగా నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రికరింపవలెను.

🌷. భాష్యము :

చతుర్బాహు విష్ణురూపమైన పరమాత్మగా ప్రతిజీవి హృదయమునందు వసించియున్న శ్రీకృష్ణుని తెలిసికొనుటయే మానవజన్మ యొక్క ముఖ్యలక్ష్యమై యున్నది. హృదయమునందు నిలిచియుండెడి అట్టి విష్ణురూపము శోధించి చూచు నిమిత్తమే యోగము అభ్యసింపబడవలెను గాని అన్యప్రయోజనము కొరకు కాదు. సర్వజీవ హృదయస్థమైన ఆ విష్ణురూపము శ్రీకృష్ణుని సంపూర్ణ ప్రాతినిధ్యరూపము. అట్టి విష్ణుమూర్తి సాక్షాత్కారము లేదా అనుభవమన్నది ఉద్దేశ్యము కానప్పుడు మనుజుడొనరించు యోగాభ్యాసము కేవలము బూటకమాత్రమే కాలమును వ్యర్థము చేయుటయే కాగలదు.

అనగా జీవితపు అంతిమలక్ష్యము శ్రీకృష్ణభగవానుడై యున్నాడు మరియు హృదయస్థుసిన విష్ణుమూర్తి అనుభూతియే యోగాభ్యాసపు లక్ష్యమై యున్నది. ఈ హృదయస్థ విష్ణుమూర్తి సాక్షాత్కారమునకు మనుజుడు సంపూర్ణముగా మైథునజీవనము నుండి విడివడవలెను. కనుక అతడు గృహమును విడిచి గతమునందు తెలిపిన రీతిగా ఆసీనుడై ఏకాంతమున జీవించవలెను. ఒకవైపు మైథునసుఖమును అనుభవించుచునే మరొకవైపు నామమాత్ర యోగతరగతులందు పాల్గొనుట ద్వారా ఎవ్వరును యోగులు కాజాలరు. అందులకై మనోనియమమును, సర్వవిధ భోగత్యాగమును (ఆ సుఖములలో అతిముఖ్యమైనదైన మైథునసుఖత్యాగమును) మనుజుడు అభ్యసింపవలెను.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 246 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 13 🌴


13. samaṁ kāya-śiro-grīvaṁ dhārayann acalaṁ sthiraḥ
samprekṣya nāsikāgraṁ svaṁ diśaś cānavalokayan

🌷 Translation :

One should hold one’s body, neck and head erect in a straight line and stare steadily at the tip of the nose.

🌹 Purport :

The goal of life is to know Kṛṣṇa, who is situated within the heart of every living being as Paramātmā, the four-handed Viṣṇu form. The yoga process is practiced in order to discover and see this localized form of Viṣṇu, and not for any other purpose. The localized viṣṇu-mūrti is the plenary representation of Kṛṣṇa dwelling within one’s heart. One who has no program to realize this viṣṇu-mūrti is uselessly engaged in mock yoga practice and is certainly wasting his time. Kṛṣṇa is the ultimate goal of life, and the viṣṇu-mūrti situated in one’s heart is the object of yoga practice.

To realize this viṣṇu-mūrti within the heart, one has to observe complete abstinence from sex life; therefore one has to leave home and live alone in a secluded place, remaining seated as mentioned above. One cannot enjoy sex life daily at home or elsewhere and attend a so-called yoga class and thus become a yogī. One has to practice controlling the mind and avoiding all kinds of sense gratification, of which sex life is the chief.

🌹 🌹 🌹 🌹 🌹

29 Dec 2019


శ్రీమద్భగవద్గీత - 245: 06వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 245: Chap. 06, Ver. 12


🌹. శ్రీమద్భగవద్గీత - 245 / Bhagavad-Gita - 245 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 12 🌴


12. తత్రైకాగ్రం మన: కృత్వా యతచిత్తేన్ద్రియక్రియ: |
ఉపవిశ్యాసనే యుజ్ఞ్యాద్ యోగమాత్మవిశుద్ధయే

🌷. తాత్పర్యం :

పిదప అతడు దానిపై స్థిరముగా కూర్చుండి ఇంద్రియమనోకర్మలను నియమించి, మనస్సును ఏకాగ్రపరచి హృదయశుద్ధి కొరకు యోగము నభ్యసించవలెను.

🌷. భాష్యము :

ఆత్మనిగ్రహము లేనివాడు మరియు మనోచంచలము కలవాడు ధ్యానమును కొనసాగింపలేడు. కలియుగమునందు జనులు అల్పాయుష్కులు, ఆధ్యాత్మిక పురోగతి యందు బద్ధకస్తులు, వివిధములైన తాపత్రయములచే సదా కలతనొందనివారు యగుట చేతనే ఆత్మానుభవమునకు హరినామసంకీర్తనము ఉత్తమమార్గమని బృహన్నారదీయ పురాణమునందు తెలుపబడినది.

హరేర్నామ హరేర్నామ హరేర్నామ కేవలం |
కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతి రన్యథా

“కపటము మరియు కలహములతో కూడిన ఈ యుగము నందు హరినామ కిర్తనమే ఏకైక ముక్తిమార్గము. దానికి మించి వేరొకమార్గము లేదు. వేరొకమార్గము లేదు. వేరొకమార్గము లేదు.”

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 245 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 12 🌴


12. tatraikāgraṁ manaḥ kṛtvā yata-cittendriya-kriyaḥ
upaviśyāsane yuñjyād yogam ātma-viśuddhaye

🌷 Translation :

The yogī should then sit on it very firmly and practice yoga to purify the heart by controlling his mind, senses and activities and fixing the mind on one point.

🌹 Purport :

One who is not self-controlled and whose mind is not undisturbed cannot practice meditation. Therefore, in the Bṛhan-nāradīya Purāṇa it is said that in Kali-yuga (the present yuga, or age), when people in general are short-lived, slow in spiritual realization and always disturbed by various anxieties, the best means of spiritual realization is chanting the holy name of the Lord.

harer nāma harer nāma harer nāmaiva kevalam
kalau nāsty eva nāsty eva nāsty eva gatir anyathā

“In this age of quarrel and hypocrisy the only means of deliverance is chanting the holy name of the Lord. There is no other way. There is no other way. There is no other way.”

🌹 🌹 🌹 🌹 🌹


28 Dec 2019

శ్రీమద్భగవద్గీత - 244: 06వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 244: Chap. 06, Ver. 11


🌹. శ్రీమద్భగవద్గీత - 244 / Bhagavad-Gita - 244 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 11 🌴

11. శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మాన: |
నాత్యుచ్చ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ||


🌷. తాత్పర్యం :

యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంతస్థాలమున కేగి నేలపై కుశగ్రాసమును పరచి, దానిని జింకచర్మము మరియు వస్త్రముతో కప్పవలెను, అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందుగాను ఉండక పవిత్రస్థానములో ఏర్పాటు కావలెను.

🌷. భాష్యము :

“శుచౌదేశే” అను పదము ఇచ్చట తీర్థస్థానములను సూచించుచున్నది. భారతభూమి యందు యోగులు మరియు భక్తులు గృహములను విడిచి గంగ, యమున వంటి పవిత్రనదులు ప్రవహించు ప్రయాగ, మథుర, బృందావనము, హృషీకేశము, హరిద్వారము వంటి తీర్థస్థానముల కేగి అచ్చట ఏకాంత యోగాభ్యాసమును కావింతురు. కాని ఇది అన్నివేళలా సర్వులకు (ముఖ్యముగా పాశ్చాత్యదేశవాసులకు) సాధ్యము కాదు. పెద్ద పెద్ద నగరములందలి యోగసంఘములు ధనమును గడింపవచ్చునేమో గాని నిజమైన యోగసాధనకు అవి ఏమాత్రము తగినవి కావు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 244 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 11 🌴

11. śucau deśe pratiṣṭhāpya sthiram āsanam ātmanaḥ
nāty-ucchritaṁ nāti-nīcaṁ cailājina-kuśottaram



🌷 Translation :

To practice yoga, one should go to a secluded place and should lay kuśa grass on the ground and then cover it with a deerskin and a soft cloth. The seat should be neither too high nor too low and should be situated in a sacred place.


🌹 Purport :

“Sacred place” refers to places of pilgrimage. In India the yogīs – the transcendentalists or the devotees – all leave home and reside in sacred places such as Prayāga, Mathurā, Vṛndāvana, Hṛṣīkeśa and Hardwar and in solitude practice yoga where the sacred rivers like the Yamunā and the Ganges flow. But often this is not possible, especially for Westerners. The so-called yoga societies in big cities may be successful in earning material benefit, but they are not at all suitable for the actual practice of yoga.

🌹 🌹 🌹 🌹 🌹


28 Dec 2019


శ్రీమద్భగవద్గీత - 243: 06వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 243: Chap. 06, Ver. 10


🌹. శ్రీమద్భగవద్గీత - 243 / Bhagavad-Gita - 243 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 10 🌴

10. యోగీ యు‍‌‌జ్ఞీత సతతమాత్మానం రహసి స్థిత: |
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహ: ||


🌷. తాత్పర్యం :

యోగియైన వాడు తన దేహమును, మనస్సును, ఆత్మను సదా భగవానుని సంబంధములో నియుక్తము చేసి, ఒంటరిగా ఏకాంతస్థలమునందు నివసించుచు సావధానముగా మనస్సు నియమింపవలెను. అతడు కోరికల నుండియు మరియు సమస్తమును కలిగియుండవలెనను భావనలనుండియు ముక్తుడై యుండవలెను.

🌷. భాష్యము :

బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు మూడువిధములుగా వివిధదశలలో దేవదేవుడైన శ్రీకృష్ణుడు అనుభవమునకు వచ్చును. అట్టి దేవదేవుని దివ్యమగు ప్రేమయుక్తసేవ యందు సదా నెలకొనియుండుటయే కృష్ణభక్తిరసభావనమని సంక్షిప్తముగా తెలుపవచ్చును. అయినను నిరాకారబ్రహ్మానుభవము లేదా పరమాత్మానుభావము నందు అనురక్తులైనవారు సైతము పాక్షికముగా కృష్ణభక్తిరసభావితులే యనబడుదురు. ఏలయన నిరాకారబ్రహ్మము శ్రీకృష్ణుని దివ్యమైన దేహకాంతి కాగా, పరమాత్మ రూపము శ్రీకృష్ణుని సర్వత్రా వ్యాపించియున్నటువంటి రూపము. అనగా నిరాకారవాదులు మరియు యోగులు సైతము పరోక్షముగా కృష్ణభక్తులే. కాని కృష్ణభక్తిపరాయణుడు బ్రహ్మమననేమో మరియు పరమాత్మయననేమో సంపూర్ణముగా తెలిసియున్నందున ఆధ్యాత్మికులలో అత్యున్నతుడై యున్నాడు. పరతత్త్వమును గూర్చిన అతని జ్ఞానము సంపూర్ణమై యుండగా, నిరాకారవాదులు మరియు యోగులు కృష్ణభక్తిభావన యందు అసంపూర్ణులై యున్నాడు.

అయినను శీఘ్రముగనో లేదా ఆలస్యముగనో అత్యున్నత పుర్ణత్వమును బడయుటకై వారందరును తమ తమ సాధనల యందు నిష్ఠగా కొనసాగవలెనని ఇచ్చట ఉపదేశించబడిరి. శ్రీకృష్ణుని యందే మనస్సును సంలగ్నము చేయుట యోగి యొక్క ప్రథమకర్తవ్యము. క్షణకాలమును మరువక కృష్ణునే అతడు సదా స్మరింపవలెను. ఆ విధముగా శ్రీకృష్ణభగవానునిపై మనస్సు కేంద్రీకృతమగుటయే “సమాధి” యనబడును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 243 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 10 🌴

10. yogī yuñjīta satatam ātmānaṁ rahasi sthitaḥ
ekākī yata-cittātmā nirāśīr aparigrahaḥ


🌷 Translation :

A transcendentalist should always engage his body, mind and self in relationship with the Supreme; he should live alone in a secluded place and should always carefully control his mind. He should be free from desires and feelings of possessiveness.

🌹 Purport :

Kṛṣṇa is realized in different degrees as Brahman, Paramātmā and the Supreme Personality of Godhead. Kṛṣṇa consciousness means, concisely, to be always engaged in the transcendental loving service of the Lord. But those who are attached to the impersonal Brahman or the localized Supersoul are also partially Kṛṣṇa conscious, because the impersonal Brahman is the spiritual ray of Kṛṣṇa and the Supersoul is the all-pervading partial expansion of Kṛṣṇa.

Thus the impersonalist and the meditator are also indirectly Kṛṣṇa conscious. A directly Kṛṣṇa conscious person is the topmost transcendentalist because such a devotee knows what is meant by Brahman and Paramātmā. His knowledge of the Absolute Truth is perfect, whereas the impersonalist and the meditative yogī are imperfectly Kṛṣṇa conscious.

Nevertheless, all of these are instructed herewith to be constantly engaged in their particular pursuits so that they may come to the highest perfection sooner or later. The first business of a transcendentalist is to keep the mind always on Kṛṣṇa. One should always think of Kṛṣṇa and not forget Him even for a moment. Concentration of the mind on the Supreme is called samādhi, or trance. In order to concentrate the mind, one should always remain in seclusion and avoid disturbance by external objects. He should be very careful to accept favorable and reject unfavorable conditions that affect his realization.

🌹 🌹 🌹 🌹 🌹


27 Dec 2019


శ్రీమద్భగవద్గీత - 242: 06వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 242: Chap. 06, Ver. 09


🌹. శ్రీమద్భగవద్గీత - 242 / Bhagavad-Gita - 242 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 09 🌴


09. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్యబన్దుషు |
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ||


🌷. తాత్పర్యం :

శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించువారలను, శత్రుమిత్రులను, పాపపుణ్యులను సమబుద్ధితో చూచువాడు మరింత పురోభివృద్ది నొందినవానిగా పరిగణింపబడును.

🌷. భాష్యము :


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 242 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 09 🌴


09. suhṛn-mitrāry-udāsīna- madhyastha-dveṣya-bandhuṣu
sādhuṣv api ca pāpeṣu sama-buddhir viśiṣyate

🌷 Translation :

A person is considered still further advanced when he regards honest well-wishers, affectionate benefactors, the neutral, mediators, the envious, friends and enemies, the pious and the sinners all with an equal mind.


🌹 Purport :

----

🌹 🌹 🌹 🌹 🌹


26 Dec 2019


శ్రీమద్భగవద్గీత - 241: 06వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 241: Chap. 06, Ver. 08


🌹. శ్రీమద్భగవద్గీత - 241 / Bhagavad-Gita - 241 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 08 🌴

08. జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేన్ద్రియ: |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్ట్రాశ్మకాంచన:


🌷. తాత్పర్యం :

మనుజుడు తాను పొందినటువంటి జ్ఞాన,విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినపుడు ఆత్మానుభవము నందు స్థితిని పొందినట్టివాడై యోగి యనబడును. అట్టివాడు ఆధ్య్తాత్మికస్థితి యందు నెలకొని ఆత్మనిగ్రహమును కలిగియుండును. అతడు గులకరాళ్లనైనను, రాళ్ళనైనను లేదా బంగారమైనను సమానముగా గాంచును.

🌷. భాష్యము :

పరతత్వానుభవము లేనటువంటి కేవల పుస్తపాండిత్యము నిష్ప్రయోజనమైనట్టిది. ఈ విషయమే ఇట్లు చెప్పబడినది.

అత: శ్రీకృష్ణనామాది న భవేద్ గ్రాహ్యమింద్రియై: |
సేవన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్పురత్యద:

“శ్రీకృష్ణుని నామము, రూపము, గుణము, లీలల దివ్యస్వభావమును భౌతికత్వముతో కూడిన ఇంద్రియములతో ఎవ్వరును అవగాహన చేసికొనలేరు. కేవలము దివ్యమైన భక్తియుక్తసేవ ద్వారా ఆధ్యాత్మికముగా పరిపూర్ణుడైనప్పుడే మనుజునకు ఆ ఆదిదేవుని రూపము, నామము, గుణము, లీలలు వ్యక్తములగును.” (భక్తిరసామృతసింధువు 1.2.234)

కృష్ణభక్తిరసభావన శాస్త్రమే ఈ శ్రీమద్భగవద్గీత. లౌకిక పాండిత్యము ద్వారా ఎవ్వరును కృష్ణభక్తిరసభావితులు కాలేరు. అందులకు శుద్దాంతరంగునితో సాహచర్యము అత్యంత అవసరము.

అట్టి భక్తుడు శుద్ధమగు భక్తియోగాముతో సంతృప్తుడై యుండుటచే కృష్ణుని కరుణ వలన అనుభవజ్ఞానమును కలిగియుండును. అటువంటి అనుభవజ్ఞానము చేతనే ఎవ్వరైనను పూర్ణులు కాగలరు మరియు తమ విశ్వాసము నందు స్తిరులై నిలువగలరు.

కాని అనుభవజ్ఞానము లేక కేవలము పుస్తకజ్ఞానము కలవారు బాహ్యవరుధ్యములచే భ్రాంతులును, కలతనొందినవారును కాగలరు. శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని పొందియున్నందున ఆత్మజ్ఞానము గలవాడే నిజముగా ఆత్మనిగ్రహమును కలిగియుండగలడు.

లౌకికపాండిత్యముతో ఎట్టి సంబంధము లేనందున అతడు దివ్యస్థితిలో నెలకొని యుండును. ప్రాపంచిక పాండిత్యము మరియు మనోకల్పనలు ఇతరులకు బంగారము వంటివైనను అతనికి మాత్రము గులకరాళ్ళు లేదా రాళ్ళతో సమానమై యుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 241 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 08 🌴

08. jñāna-vijñāna-tṛptātmā kūṭa-stho vijitendriyaḥ
yukta ity ucyate yogī sama-loṣṭrāśma-kāñcanaḥ


🌷 Translation :

A person is said to be established in self-realization and is called a yogī [or mystic] when he is fully satisfied by virtue of acquired knowledge and realization. Such a person is situated in transcendence and is self-controlled. He sees everything – whether it be pebbles, stones or gold – as the same.

🌹 Purport :

Book knowledge without realization of the Supreme Truth is useless. This is stated as follows:

ataḥ śrī-kṛṣṇa-nāmādi na bhaved grāhyam indriyaiḥ
sevonmukhe hi jihvādau svayam eva sphuraty adaḥ

“No one can understand the transcendental nature of the name, form, quality and pastimes of Śrī Kṛṣṇa through his materially contaminated senses.

Only when one becomes spiritually saturated by transcendental service to the Lord are the transcendental name, form, quality and pastimes of the Lord revealed to him.” (Bhakti-rasāmṛta-sindhu 1.2.234)

This Bhagavad-gītā is the science of Kṛṣṇa consciousness. No one can become Kṛṣṇa conscious simply by mundane scholarship. One must be fortunate enough to associate with a person who is in pure consciousness.

A Kṛṣṇa conscious person has realized knowledge, by the grace of Kṛṣṇa, because he is satisfied with pure devotional service. By realized knowledge, one becomes perfect.

By transcendental knowledge one can remain steady in his convictions, but by mere academic knowledge one can be easily deluded and confused by apparent contradictions.

It is the realized soul who is actually self-controlled, because he is surrendered to Kṛṣṇa. He is transcendental because he has nothing to do with mundane scholarship.

For him mundane scholarship and mental speculation, which may be as good as gold to others, are of no greater value than pebbles or stones.

🌹 🌹 🌹 🌹 🌹


25 Dec 2019



శ్రీమద్భగవద్గీత - 240: 06వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 240: Chap. 06, Ver. 07


🌹. శ్రీమద్భగవద్గీత - 240 / Bhagavad-Gita - 240 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 07 🌴


07. జితాత్మన: ప్రశాన్తస్య పరమాత్మా సమాహిత: |
శీతోష్ణసుఖదు:ఖేషు తథా మానాపమానయో: ||

🌷. తాత్పర్యం :

మనస్సు జయించినవాడు శాంతిని పొంది యుండుటచే పరమాత్మను చేరినట్టివాడే యగును. అట్టి మనుజునకు సుఖదుఃఖములు, శీతోష్ణములు, మానవమానములు అన్నియును సమానములె అయియున్నవి.

🌷. భాష్యము :

వాస్తవమునకు ప్రతిజీవియు ఎల్లరి హృదయములందు పరమాత్మరూపున నిలిచియుండు శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను పాటించుటకే ఉద్దేశింపబడియున్నాడు.

కాని మనస్సు బాహ్యశక్తిచే మోహితమై తప్పుదారి పట్టినప్పుడు మనుజుడు భొతికకర్మల యందు రతుడగును. కనుక ఏదేని ఒక యోగపద్ధతి ద్వారా మనస్సు నియమింపబడినంతనే అతడు తన గమ్యస్థానమును చేరినట్టివానిగా భావింపబడును.

వాస్తవమునకు మనుజుడెప్పుడును ఉన్నతమైన ఆజ్ఞకు లోబడబలసియుండును. కనుక మనుజుని మనస్సు దివ్యచైతన్యము నందు నిలిచినప్పుడు అతడు శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను పాటించుట తప్ప అన్యమును ఎరుగలేడు.

మనస్సు సదా ఉన్నత ఆజ్ఞలను గ్రహించి పాటించుట తప్ప అన్యమును ఎరుగలేడు. మనస్సు సదా ఉన్నత ఆజ్ఞలను గ్రహించి వానిని అనుసరింపవలసి యుండును. కనుక అది నిగ్రహింపబడినపుడు అప్రయత్నముగా పరమాత్మ ఆజ్ఞలను అనుసరించును.

ఇట్టి దివ్యమైన స్థితిని కృష్ణభక్తిభావన యందు నిలిచియున్న భక్తుడు శీఘ్రమే పొందుచున్నందున సుఖదుఃఖములు, శీతతాపముల వంటి ప్రకృతి ద్వంద్వములచే ప్రభావితుడు కాకుండును.

ఇట్టి స్థితియే శ్రీకృష్ణభగవానుని యందు సంలగ్నమైన స్థితి లేదా సమాధి యనబడును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 240 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 07 🌴

07. jitātmanaḥ praśāntasya paramātmā samāhitaḥ
śītoṣṇa-sukha-duḥkheṣu tathā mānāpamānayoḥ

🌷 Translation :

For one who has conquered the mind, the Supersoul is already reached, for he has attained tranquillity. To such a man happiness and distress, heat and cold, honor and dishonor are all the same.

🌹 Purport :

Actually, every living entity is intended to abide by the dictation of the Supreme Personality of Godhead, who is seated in everyone’s heart as Paramātmā.

When the mind is misled by the external, illusory energy, one becomes entangled in material activities.

Therefore, as soon as one’s mind is controlled through one of the yoga systems, one should be considered to have already reached the destination. One has to abide by superior dictation. When one’s mind is fixed on the superior nature, he has no alternative but to follow the dictation of the Supreme.

The mind must admit some superior dictation and follow it. The effect of controlling the mind is that one automatically follows the dictation of the Paramātmā, or Supersoul.

Because this transcendental position is at once achieved by one who is in Kṛṣṇa consciousness, the devotee of the Lord is unaffected by the dualities of material existence, namely distress and happiness, cold and heat, etc. This state is practical samādhi, or absorption in the Supreme.

🌹 🌹 🌹 🌹 🌹

24 Dec 2019


శ్రీమద్భగవద్గీత - 239: 06వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 239: Chap. 06, Ver. 06


🌹. శ్రీమద్భగవద్గీత - 239 / Bhagavad-Gita - 239 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 06 🌴

06. బన్దురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జిత: |
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ||


🌷. తాత్పర్యం :

మనస్సును జయించినవానికి మనస్సే ఉత్తమమిత్రుడు. కాని అట్లు చేయలేనివానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును.

🌷. భాష్యము :

మానవధర్మమును నిర్వహించుట యందు మనస్సుని మిత్రునిగా చేసికొనుట కొరకు దానిని నియమించుటయే అష్టాంగయోగాభ్యాసపు ప్రయోజమై యున్నది. మనస్సు నియమింపబడనిచో యోగాభ్యాసము కేవలము సమయమును వృథాచేయుటయే కాగలదు. మనస్సును అదుపు చేయనివాడు సదా గొప్ప శత్రువుతో కలసి జీవనము సాగించువాడు కాగలడు. తత్కారణముగా అతని జన్మ మరియు జన్మప్రయోజనము సంపూర్ణముగా నష్టము కాగలవు. తన కన్నను ఉన్నతుడైనవాని ఆజ్ఞలను నిర్వర్తించుట జీవుల సహజస్థితియై యున్నది. మనస్సు జయింపరాని శత్రువుగా నిలిచినంతకాలము మనుజుడు కామము, క్రోధము, ద్వేషము, మోహము మొదలుగువాని ఆజ్ఞలను అనుసరింపవలసివచ్చును.

కాని మనస్సు జయింపబడినప్పుడు మనుజుడు ఎల్లరి హృదయములందు పరమాత్మ రూపున వసించియున్న శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలకు కట్టుబడియుండుటకు స్వచ్చందముగా అంగీకరించును. హృదయస్థుడైన పరమాత్మను చేరి, అతని ఆజ్ఞల మేరకు వర్తించుటనే నిజమైన యోగము ఉపదేశించును. కృష్ణభక్తిభావన యందు ప్రత్యక్షముగా నియుక్తుడైనవానికి శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను సమగ్రముగా పాటించుట అప్రయత్నముగా నియుక్తుడైనవానికి శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను సమగ్రముగా పాటించుట అప్రయత్నముగా జరిగిపోవును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 239 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 06 🌴

06. bandhur ātmātmanas tasya yenātmaivātmanā jitaḥ
anātmanas tu śatrutve vartetātmaiva śatru-vat

🌷 Translation :

For him who has conquered the mind, the mind is the best of friends; but for one who has failed to do so, his mind will remain the greatest enemy.

🌹 Purport :

The purpose of practicing eightfold yoga is to control the mind in order to make it a friend in discharging the human mission. Unless the mind is controlled, the practice of yoga (for show) is simply a waste of time. One who cannot control his mind lives always with the greatest enemy, and thus his life and its mission are spoiled. The constitutional position of the living entity is to carry out the order of the superior. As long as one’s mind remains an unconquered enemy, one has to serve the dictations of lust, anger, avarice, illusion, etc.

But when the mind is conquered, one voluntarily agrees to abide by the dictation of the Personality of Godhead, who is situated within the heart of everyone as Paramātmā. Real yoga practice entails meeting the Paramātmā within the heart and then following His dictation. For one who takes to Kṛṣṇa consciousness directly, perfect surrender to the dictation of the Lord follows automatically.

🌹 🌹 🌹 🌹 🌹

23 Dec 2019

శ్రీమద్భగవద్గీత - 238: 06వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 238: Chap. 06, Ver. 05


🌹. శ్రీమద్భగవద్గీత - 238 / Bhagavad-Gita - 238 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 05 🌴

05. ఉద్ధరేదాత్మనాత్మనం నాత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బన్దురాత్మైవ రిపురాత్మన:



🌷. తాత్పర్యం :

ప్రతి యొక్కడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్దరించుకొన వలెనే గాని అధోగతిపాలు చేసికొన రాదు. బద్ధజీవునికి మనస్సనునది మిత్రుడును, అలాగుననే శత్రువును అయియున్నది.

🌷. భాష్యము :

పరిస్థితుల ననుసరించి ఆత్మ అను పదము దేహమును, మనస్సును, ఆత్మను సూచించును. యోగపద్ధతి యందు మనస్సు మరియు బద్ధజీవి యను అంశములు అత్యంత ముఖ్యములైన విషయములు. యోగాభ్యాసమునందు మనస్సే కేంద్రవిషయమైనందున ఇచ్చట ఆత్మ యనగా మనస్సని భావము. అట్టి మనస్సును నియమించి, దానిని ఇంద్రియార్థముల నుండి వేరుచేయుటయే యోగము యొక్క ముఖ్యప్రయోజనమై యున్నది. బద్ధజీవునికి అజ్ఞానమనెడి బురద నుండి ముక్తిని కలిగించు రీతిగా మనస్సుకు శిక్షణ నొసగవలెనని ఇచ్చట నొక్కి చెప్పబడినది.

వాస్తవమునకు భౌతికస్థితి యందు ప్రతియొక్కరు మనోఇంద్రియముల ప్రభావమునకు గురియై యుందురు. ప్రకృతిపై ఆధిపత్యమును వహించు కోరిక కలిగిన మిథ్యాహంకారముతో మనస్సు లగ్నమై యున్నందునే భౌతికజగము నందు శుద్దాత్మ భవబంధములో తగుల్కొనును. కనుక భౌతికప్రకృతి యొక్క పై పై మెరుగులకు ఆకర్షితము కానట్లుగా మనస్సును మలచవలెను. ఆ విధముగా బద్ధజీవుడు రక్షింపబడగలడు. ఇంద్రియార్థముల యెడ ఆకర్షణతో ఎవ్వరును తమను తాము అధోగతిపాలు చేసికొనరాదు. ఇంద్రియార్థముల యెడ మనుజుడు ఎంతగా ఆకర్షణను కలిగియుండునో అంతగా అతడు భవబంధములో చిక్కుకొనును.

అట్టి భవబంధము నుండి తప్పించుకొనుటకు మనస్సును సదా కృష్ణభక్తిభావన యందు నిలిపుటయే అత్యంత ఉత్తమమార్గము. ఈ విషయమును నొక్కి చెప్పుటకే ఈ శ్లోకమునందు “హి” అను పదము ప్రయోగింపబడినది. అనగా ప్రతియొక్కరు దీనిని ఆచరింపవలసియున్నది. అమృతబిందూపనిషత్తు (2) ఈ విషయమున ఇట్లు పలుకుచున్నది.

మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో: |
బంధాయ విషయాసంగో ముక్వై నిర్విషయం మన:

“మనుజునకు మనస్సే బంధకారణము మరియు ముక్తికారణము అయియున్నది. ఇంద్రియార్థములందు లగ్నమైన మనస్సు బంధకారణము కాగా, ఇంద్రియార్థముల నుండి విడివడిన మనస్సు మోక్షమునకు కారణమగుచున్నది”. అనగా కృష్ణభక్తిభావన యందు సంలగ్నమైన మనస్సు దివ్యమైన ముక్తికి కారణమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 238 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 05 🌴

05. uddhared ātmanātmānaṁ nātmānam avasādayet
ātmaiva hy ātmano bandhur ātmaiva ripur ātmanaḥ


🌷 Translation :

One must deliver himself with the help of his mind, and not degrade himself. The mind is the friend of the conditioned soul, and his enemy as well.

🌹 Purport :

The word ātmā denotes body, mind and soul – depending upon different circumstances. In the yoga system, the mind and the conditioned soul are especially important. Since the mind is the central point of yoga practice, ātmā refers here to the mind. The purpose of the yoga system is to control the mind and to draw it away from attachment to sense objects. It is stressed herein that the mind must be so trained that it can deliver the conditioned soul from the mire of nescience.

In material existence one is subjected to the influence of the mind and the senses. In fact, the pure soul is entangled in the material world because the mind is involved with the false ego, which desires to lord it over material nature. Therefore, the mind should be trained so that it will not be attracted by the glitter of material nature, and in this way the conditioned soul may be saved. One should not degrade oneself by attraction to sense objects. The more one is attracted by sense objects, the more one becomes entangled in material existence. The best way to disentangle oneself is to always engage the mind in Kṛṣṇa consciousness. The word hi is used for emphasizing this point, i.e., that one must do this. It is also said:

mana eva manuṣyāṇāṁ kāraṇaṁ bandha-mokṣayoḥ
bandhāya viṣayāsaṅgo muktyai nirviṣayaṁ manaḥ

“For man, mind is the cause of bondage and mind is the cause of liberation. Mind absorbed in sense objects is the cause of bondage, and mind detached from the sense objects is the cause of liberation.” (Amṛta-bindu Upaniṣad 2) Therefore, the mind which is always engaged in Kṛṣṇa consciousness is the cause of supreme liberation.

🌹 🌹 🌹 🌹 🌹

22 Dec 2019

శ్రీమద్భగవద్గీత - 237: 06వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 237: Chap. 06, Ver. 04


🌹. శ్రీమద్భగవద్గీత - 237 / Bhagavad-Gita - 237 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 04 🌴


04. యదా హి నేన్ద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే |
సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే ||

🌷. తాత్పర్యం :

విషయకోరికల నన్నింటిని విడిచి ఇంద్రియప్రీతి కొరకు వర్తించుట గాని, కామ్యకర్మలందు నియుక్తుడగుట గాని చేయని మనుజుడు యోగారూఢుడని చెప్పబడును.

🌷. భాష్యము :

మనుజుడు శ్రీకృష్ణభగవానుని దివ్యమైన ప్రేమయుక్తసేవ యందు సంపూర్ణముగా నియుక్తుడైనపుడు తన యందే ఆనందము ననుభవించును కావున ఇంద్రియభోగమునందు కాని, కామ్యకర్మలందు కాని ఎన్నడును రతుడు కాడు. కర్మ కర్మ చేయక ఎవ్వరును ఉండలేనందున అట్లు కృష్ణభక్తిపరాయణుడు కానిచో మనుజుడు ఇంద్రియభోగరతుడు కావలసివచ్చును.

కృష్ణభక్తిభావన లేనప్పుడు ప్రతియొక్కరు తన కొరకు గాని లేదా తనవారి కొరకు గాని సంబంధించిన స్వార్థపూరిత కర్మల యందు పాల్గొనుచుందురు. కాని కృష్ణభక్తిపరాయణుడు మాత్రము ప్రతిదియు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఒనరించును ఇంద్రియభోగము నుండి పూర్ణముగా దూరుడై యుండును. అట్టి అనుభవము లేనివాడు యోగమను నిచ్చెన యొక్క చివరిమెట్టును చేరుటకు ముందు యాంత్రికమైన విధానము ద్వారా విషయవాంఛల నుండి బయటపడుటకు యత్నించ వలసి యుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 237 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 04 🌴


04. yadā hi nendriyārtheṣu na karmasv anuṣajjate
sarva-saṅkalpa-sannyāsī yogārūḍhas tadocyate

🌷 Translation :

A person is said to be elevated in yoga when, having renounced all material desires, he neither acts for sense gratification nor engages in fruitive activities.

🌹 Purport :

When a person is fully engaged in the transcendental loving service of the Lord, he is pleased in himself, and thus he is no longer engaged in sense gratification or in fruitive activities. Otherwise, one must be engaged in sense gratification, since one cannot live without engagement. Without Kṛṣṇa consciousness, one must be always seeking self-centered or extended selfish activities. But a Kṛṣṇa conscious person can do everything for the satisfaction of Kṛṣṇa and thereby be perfectly detached from sense gratification. One who has no such realization must mechanically try to escape material desires before being elevated to the top rung of the yoga ladder.

🌹 🌹 🌹 🌹 🌹


21 Dec 2019


శ్రీమద్భగవద్గీత - 236: 06వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 236: Chap. 06, Ver. 03


🌹. శ్రీమద్భగవద్గీత - 236 / Bhagavad-Gita - 236 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 03 🌴

03. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే |
యోగారూఢస్య తస్యైవ శమ: కారణముచ్యతే ||

🌷. తాత్పర్యం :

అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలో నున్న యోగికి కర్మము సాధనముగా చెప్పబడగా, యోగము నందు సిద్ధిని పొందిన వానికి భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడినది.

🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానునితో సంబధమును ఏర్పరచుకొను పద్ధతియే యోగమని పిలువబడును. అత్యున్నతమైన ఆధ్యాత్మికానుభవమును పొందుటకు అట్టి యోగమును ఒక నిచ్చెనగా భావింపవచ్చును. అది జీవుని అత్యంత హీనస్థితి నుండి ప్రారంభమై పూర్ణమైన ఆత్మానుభవస్థితి వరకు కొనసాగియుండును. వివిధములైన ఉన్నతుల ననుసరించి ఆ నిచ్చెన యొక్క వివిధభాగములు వివిధనామములతో పిలువబడును. అట్టి యోగమును నిచ్చెనను జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తియోగమను నామములు కలిగిన మూడుభాగములుగా విభజింపవచ్చును. ఆ యోగనిచ్చెన యొక్క ఆరంభము “యోగారురుక్షువు” స్థితియనియు, దాని చివరిమెట్టు “యోగారూఢము” అనియు పిలువబడును.

ఆరంభదశలో వివిధములైన నియమముల ద్వారా మరియు వివిధములైన ఆసనముల ద్వారా(దాదాపు శరీరవ్యాయామము వంటివి మాత్రమే) ధ్యానము నందు ప్రవేశించుటకు చేయు అష్టాంగయోగమందలి పద్ధతులు కామ్యకర్మలనియే భావింపబడును. అయినను ఇంద్రియములను నియమించుటకు అవసరమగు పూర్ణ మనోనిర్మలత్వమును సాధించుటకు అవన్నియును సహాయభూతములు కాగలవు. అట్టి ధ్యానమునందు పూర్ణత్వమును బడసినవాడు కలతపెట్టెడి సర్వమనోకర్మల నుండి దూరుడగును.

కృష్ణభక్తిరసభవితుడు శ్రీకృష్ణునే సదా తలచుచున్నందున తొలి నుండియే ధ్యానస్థితి యందు నెలకొనియుండును. అంతియేగాక నిరంతర కృష్ణసేవ యందు నిలిచియున్నందున అతడు సర్వవిధములైన కామ్యకర్మలను త్యజించినవానిగా భావింపబడును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 236 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 03 🌴

03. ārurukṣor muner yogaṁ karma kāraṇam ucyate
yogārūḍhasya tasyaiva śamaḥ kāraṇam ucyate

🌷 Translation :

For one who is a neophyte in the eightfold yoga system, work is said to be the means; and for one who is already elevated in yoga, cessation of all material activities is said to be the means.

🌹 Purport :

The process of linking oneself with the Supreme is called yoga. It may be compared to a ladder for attaining the topmost spiritual realization. This ladder begins from the lowest material condition of the living entity and rises up to perfect self-realization in pure spiritual life. According to various elevations, different parts of the ladder are known by different names. But all in all, the complete ladder is called yoga and may be divided into three parts, namely jñāna-yoga, dhyāna-yoga and bhakti-yoga. The beginning of the ladder is called the yogārurukṣu stage, and the highest rung is called yogārūḍha.

Concerning the eightfold yoga system, attempts in the beginning to enter into meditation through regulative principles of life and practice of different sitting postures (which are more or less bodily exercises) are considered fruitive material activities. All such activities lead to achieving perfect mental equilibrium to control the senses. When one is accomplished in the practice of meditation, he ceases all disturbing mental activities.

A Kṛṣṇa conscious person, however, is situated from the beginning on the platform of meditation because he always thinks of Kṛṣṇa. And, being constantly engaged in the service of Kṛṣṇa, he is considered to have ceased all material activities.

🌹 🌹 🌹 🌹 🌹

20 Dec 2019

శ్రీమద్భగవద్గీత - 235: 06వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 235: Chap. 06, Ver. 02


🌹. శ్రీమద్భగవద్గీత - 235 / Bhagavad-Gita - 235 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 02 🌴


02. యం యం సన్న్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాణ్డవ |
న హ్యసన్న్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన ||

🌷. తాత్పర్యం :

ఏది సన్న్యాసమని పిలువ బడునో దానిని యోగమనియు (భగవానునితో కలయిక) నీవు తెలిసికొనుము. ఓ పాండుకుమారా! ఇంద్రియ ప్రీతి కోరికను త్యాగము చేయనిదే ఎవ్వడును యోగి కాజాలడు.

🌷. భాష్యము :

జీవునిగా తన నిజస్థితిని సంపూర్ణముగా తెలిసి తద్రీతి వర్తించుటయే నిజమైన సన్న్యాసయోగము(భక్తి) అనబడును. నిజమునకు జీవునికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అతడు శ్రీకృష్ణభగవానుని తటస్థశక్తియైనట్టి వాడు. అతడు బాహ్యశక్తిచే బంధితుడైనప్పుడు బద్ధునిగాను మరియు కృష్ణభక్తిరసభావితుడైనప్పుడు (ఆధ్యాత్మికశక్తిని ఎరిగినపుడు) నిజమైన సహజస్థితిని పొందినవానిగను తెలియబడును. కనుకనే మనుజుడు పూర్ణజ్ఞానవంతుడైనపుడు సర్వవిధములైన ఇంద్రియభోగకర్మల నుండి (కామ్యకర్మల నుండి) దూరుడై యుండును. భౌతికాసక్తి నుండి ఇంద్రియములను నియమించు యోగులు ఈ పద్దతిని అభ్యసింతురు.

కాని కృష్ణభక్తిభావన యందున్నవాడు కృష్ణపరములు కానటువంటి కర్మల యందు ఇంద్రియములను నియుక్తముచేయు అవకాశమే లేదు. కనుకనే కృష్ణభక్తిభావితుడు ఏకకాలమున సన్న్యాసియు మరియు యోగియు అయియున్నాడు. జ్ఞాన, యోగవిధానములందు తెలుపబడిన జ్ఞానము, ఇంద్రియనిగ్రహమనువాని ప్రయోజనము కృష్ణభక్తిభావన యందు అప్రయత్నముగానే సిద్ధించును. మనుజుడు స్వార్థపూరిత కర్మలను విడువలేనిచో అట్టి జ్ఞానము, యోగము నిరర్థకములే కాగలవు. స్వార్థపూరితమగు చింతను విడచి శ్రీకృష్ణభగవానునికి ప్రియమును గూర్చ సిద్దమగుటయే జీవుని ముఖ్యలక్షణమై యున్నది.

కనుకనే కృష్ణభక్తిభావన యందున్నవాడు ఎటువంటి స్వీయానందము కొరకు కోరికను కలిగియుండక, సదా శ్రీకృష్ణునికి ఆనందము నొసగుట యందే నియుక్తుడై యుండును. కర్మచేయక ఎవ్వడును ఉండలేనందున శ్రీకృష్ణభగవానుని గూర్చిన జ్ఞానము లేనివాడు స్వీయతృప్తికర కార్యమునందు నియుక్తుడగును. కాని వాస్తవమునాకు కృష్ణభక్తిరసభావావితకర్మ ద్వారా సర్వప్రయోజనములు మనుజునకు సంపూర్ణముగా సిద్ధింపగలవు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 235 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 02 🌴


02. yaṁ sannyāsam iti prāhur yogaṁ taṁ viddhi pāṇḍava
na hy asannyasta-saṅkalpo yogī bhavati kaścana

🌷 Translation :

What is called renunciation you should know to be the same as yoga, or linking oneself with the Supreme, O son of Pāṇḍu, for one can never become a yogī unless he renounces the desire for sense gratification.

🌹 Purport :

Real sannyāsa-yoga or bhakti means that one should know his constitutional position as the living entity, and act accordingly. The living entity has no separate independent identity. He is the marginal energy of the Supreme. When he is entrapped by material energy, he is conditioned, and when he is Kṛṣṇa conscious, or aware of the spiritual energy, then he is in his real and natural state of life.

Therefore, when one is in complete knowledge, one ceases all material sense gratification, or renounces all kinds of sense gratificatory activities. This is practiced by the yogīs who restrain the senses from material attachment. But a person in Kṛṣṇa consciousness has no opportunity to engage his senses in anything which is not for the purpose of Kṛṣṇa. Therefore, a Kṛṣṇa conscious person is simultaneously a sannyāsī and a yogī. The purpose of knowledge and of restraining the senses, as prescribed in the jñāna and yoga processes, is automatically served in Kṛṣṇa consciousness. If one is unable to give up the activities of his selfish nature, then jñāna and yoga are of no avail.

The real aim is for a living entity to give up all selfish satisfaction and to be prepared to satisfy the Supreme. A Kṛṣṇa conscious person has no desire for any kind of self-enjoyment. He is always engaged for the enjoyment of the Supreme. One who has no information of the Supreme must therefore be engaged in self-satisfaction, because no one can stand on the platform of inactivity. All purposes are perfectly served by the practice of Kṛṣṇa consciousness

🌹 🌹 🌹 🌹 🌹

19 Dec 2019


శ్రీమద్భగవద్గీత - 234: 06వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 234: Chap. 06, Ver. 01


🌹. శ్రీమద్భగవద్గీత - 234 / Bhagavad-Gita - 234 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగము - 01 🌴

01. శ్రీ భగవానువాచ

అనాశ్రిత: కర్మఫలం కార్యం కర్మ కరోతి య: |
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియ:


🌷. తాత్పర్యం :

శ్రీకృష్ణభగవానుడు పలికెను: కర్మఫలముల యెడ ఆసక్తిని గొనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్న్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతియేగాని కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను చేయక యుండెడి వాడు యోగి కాజాలడు.

🌷. భాష్యము :

అష్టాంగయోగపధ్ధతి మనస్సును మరియు ఇంద్రియములను నియమించుటకు ఒక మార్గమని శ్రీకృష్ణభగవానుడు ఈ అధ్యాయమున వివరింపనున్నాడు. కాని కలియుగములో దీనిని ఆచరించుట సాధారణ మానవులకు అత్యంత కటినమైన కార్యము. ఈ ఆధ్యాయమున అష్టాంగయోగపద్ధతి ప్రతిపాదించబడినను కర్మయోగమే (కృష్ణభక్తిరసభావిత కర్మ) ఉత్తమమని శ్రీకృష్ణభగవానుడు నొక్కి చెప్పెను.

ప్రతియొక్కరు ఈ జగమునందు కుటుంబమును పోషించుట కొరకే కర్మను చేయుచుందురు. తన కొరకు లేదా తనవారు కొరకు యనెడి స్వార్థము లేకుండా ఎవ్వరును పనిచేయలేరు. కాని కర్మఫలములను ఆశింపక కృష్ణభక్తిభావన యందే కర్మ చేయుట పూర్ణత్వలక్షణమై యున్నది. జీవులందరును శ్రీకృష్ణభగవానుని అంశలైనందున వారు వాస్తవమునకు కృష్ణభక్తిభావన యందే కర్మ నొనరింపవలెను. దేహాన్గములు దేహతృప్తి కొరకే కర్మనొనరించును. అవి ఎన్నడును తమ తృప్తి కొరకు వర్తించక దేహతృప్తి కొరకే పనిచేయును. అదే విధముగా స్వీయతృప్తి కొరకు కాక శ్రీకృష్ణభగవానుని ప్రిత్యర్థము కర్మ నొనరించు జీవుడే సన్న్యాసి (పూర్ణుడైన యోగి) యనబడును.

శ్రీకృష్ణభగవానుని ప్రీతియే తన ఆధ్యాత్మికజయమునకు ప్రయాణమనెడి భావన కలిగినందున ఆ భక్తుడు పూర్ణుడైన సన్న్యాసి లేదా పూర్ణుడైన యోగి యనబడును. సన్న్యాసమునకు ప్రతిరూపమైన శ్రీచైతన్యమాహాప్రభువు ఈ క్రింది విధముగా ప్రార్థించిరి.


న ధనం న జనం న సుందరీం కవిటం వా జగదీశ కామయే |
మం జన్మనీ జన్మనీశ్వరే భావతాద్భక్తిరహైతుకీ త్వయి

“హే భగవాన్! ధనమును కూడబెట్టవలెనని గాని, సుందరస్త్రీలతో ఆనందింపవలెనని గాని లేక శిష్యులు పలువురు కావలెనని గాని నేను కోరను. ప్రతిజన్మ యందును నీ భక్తి యనెడి నిర్హేతుక కరుణనే నేను వాంచించుచున్నను.”

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 234 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 01 🌴

01. śrī-bhagavān uvāca

anāśritaḥ karma-phalaṁ kāryaṁ karma karoti yaḥ
sa sannyāsī ca yogī ca na niragnir na cākriyaḥ


🌷 Translation :

The Supreme Personality of Godhead said: One who is unattached to the fruits of his work and who works as he is obligated is in the renounced order of life, and he is the true mystic, not he who lights no fire and performs no duty.

🌹 Purport :

In this chapter the Lord explains that the process of the eightfold yoga system is a means to control the mind and the senses. However, this is very difficult for people in general to perform, especially in the Age of Kali. Although the eightfold yoga system is recommended in this chapter, the Lord emphasizes that the process of karma-yoga, or acting in Kṛṣṇa consciousness, is better. Everyone acts in this world to maintain his family and their paraphernalia, but no one is working without some self-interest, some personal gratification, be it concentrated or extended. The criterion of perfection is to act in Kṛṣṇa consciousness, and not with a view to enjoying the fruits of work.

To act in Kṛṣṇa consciousness is the duty of every living entity because all are constitutionally parts and parcels of the Supreme. The parts of the body work for the satisfaction of the whole body.

The limbs of the body do not act for self-satisfaction but for the satisfaction of the complete whole. Similarly, the living entity who acts for satisfaction of the supreme whole and not for personal satisfaction is the perfect sannyāsī, the perfect yogī. Lord Caitanya, the highest perfectional symbol of renunciation, prays in this way:

na dhanaṁ na janaṁ na sundarīṁ kavitāṁ vā jagad-īśa kāmaye
mama janmani janmanīśvare bhavatād bhaktir ahaitukī tvayi

“O Almighty Lord, I have no desire to accumulate wealth, nor to enjoy beautiful women. Nor do I want any number of followers. What I want only is the causeless mercy of Your devotional service in my life, birth after birth.”

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2019

శ్రీమద్భగవద్గీత - 233: 05వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 233: Chap. 05, Ver. 29


🌹. శ్రీమద్భగవద్గీత - 233 / Bhagavad-Gita - 233🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 29 🌴


29. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ |
సుహృదం సర్వభుతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్చతి ||

🌷. తాత్పర్యం :

నా సంపూర్ణభావన యందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపస్సులకు చరమభోక్తగను, సకల లోకములకు దేవతలకు ప్రభువుగను, సకలజీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలిసికొని భౌతికదుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును.

🌷. భాష్యము :

మాయాశక్తి బంధములో నున్న బద్ధజీవులు భౌతికజగమునందు శాంతిని పొందుటకై ఆరాటపడుచుందురు. కాని శాంతిసూత్రమును మాత్రము వారెరుగరు. అదియే భగవద్గీత యందు ఇచ్చట వివరింపబడినది. ఆ ఘనమైన శాంతిసూత్రము ఈ విధముగా తెలుపబడినది. సమస్త మానవకర్మలకు శ్రీకృష్ణభగవానుడే దివ్యభోక్త. అతడే సర్వలోకములకు మరియు అందున్న దేవతలకు ప్రభువు కనుక జనులు అతని దివ్యసేవకే సమస్తమును అర్పించవలసి యున్నది. అతని కన్నాను ఘనుడైనవాడు వేరోక్కడు లేడు. బ్రహ్మరుద్రాదుల వంటి దేవతల కన్న్నాను అతడు ఘనమైనవాడు.

మాయకారణముననే జీవులు తమను ప్రభువులుగా తలచుచున్నను వాస్తవమునాకు వారు దేవదేవుని మాయకు ఆధీనులైనట్టివారే. శ్రీకృష్ణభగవానుడు ప్రకృతి ప్రభువు కాగా, కఠినమగు ప్రకృతి నియమములచే నియమింపబడువారు బద్ధజీవులు. ఈ నగ్నసత్యమును అవగతము చేసికొననంతవరకు వక్తిగతముగా గాని, సామూహికముగా గాని విశ్వశాంతిని సాధించు అవకాశమే లేదు. దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వులకు ప్రభువు మరియు దేవతలతో సహా సర్వజీవులు అతనికి లోబడియుండువారు అనుటయే కృష్ణభక్తిరసభావనము. అట్టి సంపూర్ణ కృష్ణభక్తిభావన యందే మనుజుడు పూర్ణశాంతిని పొందగలడు.

యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి యను ఎనిమిది అంగములు గల యోగాభ్యాసమునందు క్రమానుగతమైన ఉద్దరమున్నను అది భక్తియుక్తసేవచే సంపూర్ణత్వము నొందుట యందు ఉపోద్ఘాతము వంటిది మాత్రమే. భక్తియోగమునందలి సంపూర్ణత్వమొక్కటే మనుజునకు శాంతిని గూర్చగలదు. అదియే మానవజన్మ యొక్క పరమసిద్ధియై యున్నది.

శ్రీమద్భగవద్గీత యందలి “కర్మయోగము – కృష్ణభక్తిరసభావితకర్మ” అను పంచమాధ్యాయమునకు భక్తివేదాంత భాష్యము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 233 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 29 🌴


29. bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśvaram
suhṛdaṁ sarva-bhūtānāṁ jñātvā māṁ śāntim ṛcchati

🌷 Translation :

A person in full consciousness of Me, knowing Me to be the ultimate beneficiary of all sacrifices and austerities, the Supreme Lord of all planets and demigods, and the benefactor and well-wisher of all living entities, attains peace from the pangs of material miseries.

🌹 Purport :

The conditioned souls within the clutches of the illusory energy are all anxious to attain peace in the material world. But they do not know the formula for peace, which is explained in this part of the Bhagavad-gītā. The greatest peace formula is simply this: Lord Kṛṣṇa is the beneficiary in all human activities. Men should offer everything to the transcendental service of the Lord because He is the proprietor of all planets and the demigods thereon. No one is greater than He. He is greater than the greatest of the demigods, Lord Śiva and Lord Brahmā.

Under the spell of illusion, living entities are trying to be lords of all they survey, but actually they are dominated by the material energy of the Lord. The Lord is the master of material nature, and the conditioned souls are under the stringent rules of material nature. Unless one understands these bare facts, it is not possible to achieve peace in the world either individually or collectively. This is the sense of Kṛṣṇa consciousness: Lord Kṛṣṇa is the supreme predominator, and all living entities, including the great demigods, are His subordinates. One can attain perfect peace only in complete Kṛṣṇa consciousness.

There is a gradual process of elevation in the practice of yama, niyama, āsana, prāṇāyāma, pratyāhāra, dhāraṇā, dhyāna and samādhi. But these only preface perfection by devotional service, which alone can award peace to the human being. It is the highest perfection of life.

Thus end the Bhaktivedanta Purports to the Fifth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Karma-yoga, or Action in Kṛṣṇa Consciousness.

🌹 🌹 🌹 🌹 🌹


17 Dec 2019

శ్రీమద్భగవద్గీత - 232: 05వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 232: Chap. 05, Ver. 28


🌹. శ్రీమద్భగవద్గీత - 232 / Bhagavad-Gita - 232 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 28 🌴

28. యతేన్ద్రియమనో బుద్ధిర్మునిర్మోక్ష పరాయణ : |
విగతేచ్చాభయ క్రోధో య: సదా ముక్త ఏవ స: ||


🌷. తాత్పర్యం :

యోగాభ్యాసము ద్వారా మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను అదుపు జేయునట్టి మోక్షవాంచితుడు కోరిక, భయము, కోపముల నుండి ముక్తుడగును. అట్టి స్థితిలో సదా నిలిచియుండువాడు నిక్కముగా ముక్తిని పొందగలడు.

🌷. భాష్యము :

మనుజుడు అర్థనిమీలిత నేత్రములను కలిగి, ప్రాణాపాన వాయువులను తటస్థము చేయుట ద్వారా శ్వాసను నాసిక యందే నియంత్రించవలెను. ఇటువంటి యోగాభ్యాసము ద్వారా మనుజుడు ఇంద్రియములపై ఆధిపత్యమును పొందగలిగి బాహ్యమగు ఇంద్రియార్థములను త్యజింపగలుగును. ఆ విధముగా అతడు బ్రహ్మనిర్వాణమును బడయుటకు సన్నద్దుడగును.

మనుజుడు సర్వవిధములైన భయము, క్రోధముల నుండి విడివడి దివ్యస్థితి యందు పరమాత్ముని సన్నిధిని అనుభూత మొనర్చు కొనుటకు ఈ యోగవిధానము మిక్కిలి దోహదకరము కాగలదు. వేరుమాటలలో చెప్పవలెనన్న కృష్ణభక్తిరసభావనము యోగనిర్వహణకు అత్యంత సులభవిధానమై యున్నది. ఇంద్రియములను నియమించుటకు ఈ పధ్ధతియే అష్టాంగయోగపధ్ధతి కన్నను ఉత్తమమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 232 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 28 🌴

28. yatendriya-mano-buddhir munir mokṣa-parāyaṇaḥ
vigatecchā-bhaya-krodho yaḥ sadā mukta eva saḥ

🌷 Translation :

By yoga process controlling the mind, senses and intelligence, the transcendentalist aiming at liberation becomes free from desire, fear and anger. One who is always in this state is certainly liberated.

🌹 Purport :

Men keep the vision of the eyes between the two eyebrows and concentrate on the tip of the nose with half-closed lids. The breathing movement is restrained within the nostrils by neutralizing the up-moving and down-moving air within the body. By practice of such yoga one is able to gain control over the senses, refrain from outward sense objects, and thus prepare oneself for liberation in the Supreme.

This yoga process helps one become free from all kinds of fear and anger and thus feel the presence of the Supersoul in the transcendental situation. A Kṛṣṇa conscious person, however, being always engaged in devotional service, does not risk losing his senses to some other engagement. This is a better way of controlling the senses than by aṣṭāṅga-yoga.

🌹 🌹 🌹 🌹 🌹


16 Dec 2019

శ్రీమద్భగవద్గీత - 231: 05వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 231: Chap. 05, Ver. 27


🌹. శ్రీమద్భగవద్గీత - 231 / Bhagavad-Gita - 231 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 27 🌴

27. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాన్తరే భ్రువో: |
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యన్తరచారిణౌ


🌷. తాత్పర్యం :

బాహ్యేంద్రియార్థములన్నింటిని త్యజించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి, ప్రాణాపాన వాయువులను నాసిక యందే సమములుగా చేసి తద్ద్వారా మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను అదుపు చేయవలెను.


🌷. భాష్యము :

కృష్ణభక్తిభావన యందు నియుక్తుమగుట ద్వారా మనుజుడు శీఘ్రమే తన ఆధ్యాత్మిక ఉనికిని గుర్తించగలుగును. తదుపరి అతడు భక్తియోగము ద్వారా శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనగలడు.

భక్తియోగమునందు చక్కగా నెలకొనినపుడు మనుజుడు దివ్యమైన ఆధ్యాత్మికస్థితికి చేరి తన కర్మలన్నింటి యందును శ్రీకృష్ణుని దర్శించగలుగును. ఇట్టి విశేషస్థితియే పరబ్రహ్మమందు ముక్తస్థితి యనబడును.

పరబ్రహ్మమునందు ముక్తిని సాధించు విషయమును గూర్చి అర్జునునకు వివరించిన పిమ్మట శ్రీకృష్ణభగవానుడు అట్టి స్థితికి యమము, నియమము, ఆసనము, ప్రాణాయమము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి యను ఎనిమిదివిధములుగా గల అష్టాంగయోగము ద్వారా ఎట్లు మనుజుడు చేరగలడో ఉపదేశించుచున్నాడు.

శభ్దము, స్పర్శ, రూపము, రుచి, ఘ్రాణము వంటి ఇంద్రియార్థములను యోగమునందలి ప్రత్యాహార విధానము ద్వారా తరిమివేసి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి, అర్థనిమీలిత నేత్రములతో ధ్యానమును సలుపవలెను.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 231 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 27 🌴

27. sparśān kṛtvā bahir bāhyāṁś cakṣuś caivāntare bhruvoḥ
prāṇāpānau samau kṛtvā nāsābhyantara-cāriṇau


🌷 Translation :

Shutting out all external sense objects, keeping the eyes and vision concentrated between the two eyebrows, suspending the inward and outward breaths within the nostrils, and control the mind.

🌹 Purport :

Being engaged in Kṛṣṇa consciousness, one can immediately understand one’s spiritual identity, and then one can understand the Supreme Lord by means of devotional service.

When one is well situated in devotional service, one comes to the transcendental position, qualified to feel the presence of the Lord in the sphere of one’s activity. This particular position is called liberation in the Supreme.

After explaining the above principles of liberation in the Supreme, the Lord gives instruction to Arjuna as to how one can come to that position by the practice of the mysticism or yoga known as aṣṭāṅga-yoga, which is divisible into an eightfold procedure called yama, niyama, āsana, prāṇāyāma, pratyāhāra, dhāraṇā, dhyāna and samādhi.

One has to drive out the sense objects such as sound, touch, form, taste and smell by the pratyāhāra process in yoga, and then keep the vision of the eyes between the two eyebrows and concentrate on the tip of the nose with half-closed lids.

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


16 Dec 2019


శ్రీమద్భగవద్గీత - 230: 05వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 230: Chap. 05, Ver. 26


🌹. శ్రీమద్భగవద్గీత - 230 / Bhagavad-Gita as It is - 230 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 26 🌴

26. కామక్రోక్రోధవిముక్తానాం యతీనాం యతచేతసామ్ |
అభితో బ్రహ్మనిర్వాణాం వర్తతే విదితాత్మనామ్

🌷. తాత్పర్యం :

కామక్రోధము నుండి విడివడినవారును, ఆత్మదర్శులును, ఆత్మసంయమనము కలిగినవారును, సంపూర్ణత్వము కొరకు నిరంతరము యత్నించువారును అగు మాహాత్ములు అచిరకాలములోనే బ్రహ్మనిర్వాణము నిశ్చయముగా బడయుదురు.

🌷. భాష్యము :

ముక్తిని పొందుట కొరకై నిరంతరము యత్నించు సాధుపురుషులలో కృష్ణభక్తిరసభావన యందున్నవాడు అత్యంత శ్రేష్టుడు. శ్రీమద్భాగవతము (4.22.39) ఈ విషయమునే ఇట్లు నిర్ధారించుచున్నది.

యత్పాదపంకజపలాశవిలాసభక్త్యా కర్మాశయం గ్రథితముద్గృథయన్తి సంత: |
తద్వన్న రిక్తమతయో యతయో(పి రుద్ధస్రోతోగణాస్తమరణం భజ వాసుదేవమ్

“దేవదేవుడైన వాసుదేవుని భక్తియోగముతో అర్చించుటకు యత్నింపుము. తీవ్రముగా నాటుకొని యుండెడి కామ్యకర్మల కోరికను నశింపజేసికొనుచు ఆ భగవానుని చరణకమల సేవ యందు నిమగ్నులై దివ్యానందము ననుభవించు భక్తులు తమ ఇంద్రియవేగమును అణచినరీతిగా మహామునులు సైతము ఇంద్రియవేగమును అణచలేకున్నారు.”

కామ్యకర్మల ఫలమును అనుభవింపవలెనను కోరిక బద్ధజీవుని యందు అతి గట్టిగా నాటుకొనియుండును. తీవ్రముగా యత్నించుచున్నను మాహామునులైనవారు సైతము అట్టి కోరికలను అదుపు చేసికొనలేరు. కాని కృష్ణభక్తిరసభావన యందు శ్రీకృష్ణభగవానుని సేవలో సర్వదా నియుక్తుడైయుండు భక్తుడు ఆత్మజ్ఞానపూర్ణుడై శీఘ్రమే బ్రహ్మనిర్వాణస్థితిని బడయును. తనకుగల ఆత్మజ్ఞానముచే అతడు సదా ధ్యానమగ్నుడై యుండును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 230 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 26 🌴

26. kāma-krodha-vimuktānāṁ yatīnāṁ yata-cetasām
abhito brahma-nirvāṇaṁ vartate viditātmanām

🌷 Translation :

Those who are free from anger and all material desires, who are self-realized, self-disciplined and constantly endeavoring for perfection, are assured of liberation in the Supreme in the very near future.

🌹 Purport :

Of the saintly persons who are constantly engaged in striving toward salvation, one who is in Kṛṣṇa consciousness is the best of all. The Bhāgavatam (4.22.39) confirms this fact as follows:

yat-pāda-paṅkaja-palāśa-vilāsa-bhaktyā
karmāśayaṁ grathitam udgrathayanti santaḥ
tadvan na rikta-matayo yatayo ’pi ruddha-
sroto-gaṇās tam araṇaṁ bhaja vāsudevam

“Just try to worship, in devotional service, Vāsudeva, the Supreme Personality of Godhead. Even great sages are not able to control the forces of the senses as effectively as those who are engaged in transcendental bliss by serving the lotus feet of the Lord, uprooting the deep-grown desire for fruitive activities.”

In the conditioned soul the desire to enjoy the fruitive results of work is so deep-rooted that it is very difficult even for the great sages to control such desires, despite great endeavors. A devotee of the Lord, constantly engaged in devotional service in Kṛṣṇa consciousness, perfect in self-realization, very quickly attains liberation in the Supreme. Owing to his complete knowledge in self-realization, he always remains in trance.

🌹 🌹 🌹 🌹 🌹


15 Dec 2019

శ్రీమద్భగవద్గీత - 229: 05వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 229: Chap. 05, Ver. 25


🌹. శ్రీమద్భగవద్గీత - 229 / Bhagavad-Gita - 229 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 25 🌴

25. లభన్తే బ్రహ్మనిర్వాణం ఋషయ: క్షీణకల్మషా: |
ఛిన్నద్వైధా యతాత్మాన: సర్వభూతహితే రతా: ||


🌷. తాత్పర్యం :

అంతరంగమందే మనస్సు సంలగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు పరమైనవారును, సర్వజీవహితము కొరకే పనిచేయువారును, సర్వపాపదూరులైనవారును అగు ఋషులే బ్రహ్మనిర్వాణమును పొందుదురు.

🌷. భాష్యము :

కృష్ణభక్తిభావనాపూర్ణుడే వాస్తవమునాకు సర్వజీవుల హితకార్యమునందు నియుక్తుడైనవాడని చెప్పబడును. శ్రీకృష్ణుడే సర్వమునకు మూలకారణమనెడి నిజజ్ఞానమును కలిగి తద్భావానలో వర్తించినప్పుడు మనుజుడు సర్వుల హితార్థమై వర్తించినవాడగును. శ్రీకృష్ణభగవానుడు దివ్యభోక్త, దివ్యయజమాని, పరమమిత్రుడు అనెడి విషయమును మరచుటయే మానవుల దుఃఖమునకు కారణమై యున్నది.

కనుక మానవుల యందు ఈ చైతన్యమును జాగృతము చేయుటకై వర్తించుట వాస్తవమునకు అత్యంత ఘనమైన హితకార్యమై యున్నది. బ్రహ్మనిర్వాణమును బడయనిదే ఎవ్వరును అట్టి శ్రేష్ఠమైన క్షేమకరకార్యము నొనరింపలేరు. కృష్ణభక్తిరసభావనాయుతుడు శ్రీకృష్ణుని దేవదేవత్వమున ఎట్టి సందేహమును కలిగియుండడు. అతడు సంపూర్ణముగా పాపదూరుడై యుండుటయే అందులకు కారణము. అదియే దివ్యమైన ప్రేమస్థితి.

మానవుల యొక్క కేవల బాహ్యక్షేమమును చూచుట యందు మాత్రమే నియుక్తుడైనవాడు వాస్తవమునకు ఎవారికినీ హితమును గూర్చలేడు. మనస్సు, దేహములకు కూర్చబడు తాత్కాలిక ఉపశమనము నిత్యతృప్తిని ఎన్నడును కూర్చలేదు. జీవనసంఘర్షణ మందలి కష్టములకు నిజమైన కారణము శ్రీకృష్ణభగవానునితో గల సంబంధమును జీవుడు మరచుటయే. తనకు శ్రీకృష్ణుతోతో గల నిత్యసంబంధమును మనుజుడు సంపూర్ణముగా అవగతము చేసికొనినప్పుడు భౌతికజగమునందు ఉన్నప్పటికిని అతడు ముక్తపురుషుడే కాగలడు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 229 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 25 🌴

25. labhante brahma-nirvāṇam ṛṣayaḥ kṣīṇa-kalmaṣāḥ
chinna-dvaidhā yatātmānaḥ sarva-bhūta-hite ratāḥ



🌷 Translation :

Those who are beyond the dualities that arise from doubts, whose minds are engaged within, who are always busy working for the welfare of all living beings and who are free from all sins achieve liberation in the Supreme.

🌹 Purport :

Only a person who is fully in Kṛṣṇa consciousness can be said to be engaged in welfare work for all living entities. When a person is actually in the knowledge that Kṛṣṇa is the fountainhead of everything, then when he acts in that spirit he acts for everyone. The sufferings of humanity are due to forgetfulness of Kṛṣṇa as the supreme enjoyer, the supreme proprietor and the supreme friend. Therefore, to act to revive this consciousness within the entire human society is the highest welfare work. One cannot be engaged in such first-class welfare work without being liberated in the Supreme. A Kṛṣṇa conscious person has no doubt about the supremacy of Kṛṣṇa. He has no doubt because he is completely freed from all sins. This is the state of divine love.

A person engaged only in ministering to the physical welfare of human society cannot factually help anyone. Temporary relief of the external body and the mind is not satisfactory. The real cause of one’s difficulties in the hard struggle for life may be found in one’s forgetfulness of his relationship with the Supreme Lord. When a man is fully conscious of his relationship with Kṛṣṇa, he is actually a liberated soul, although he may be in the material tabernacle.

🌹 🌹 🌹 🌹 🌹

14 Dec 2019

శ్రీమద్భగవద్గీత - 228: 05వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 228: Chap. 05, Ver. 24


🌹. శ్రీమద్భగవద్గీత - 228 / Bhagavad-Gita - 228 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 24 🌴

24. యోన్త:సుఖోన్తరారామస్తథాన్తర్జ్యోతిరేవ య: |
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్ఛతి ||



🌷. తాత్పర్యం :

అంతరంగమందే ఆనందమును కలిగినవాడును, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగినవాడును అగు మనుజుడే వాస్తవమునకు పూర్ణుడగు యోగి యనబడును. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు.

🌷. భాష్యము :

అంతరంగమునందు ఆనందమును అనుభవించనిదే పైపై సుఖములను కలుగజేయు బాహ్యకర్మల నుండి మనుజుడెట్లు విరమింపగలడు? ముక్తపురుషుడైనవాడు సుఖమును యథార్థానుభవము చేతనే అనుభవించును. కనుక మౌనముగా ఎచ్చటనైనను కూర్చిండి అంతరంగమునందే అతడు సౌఖ్యమును అనుభవింపగలడు. అట్టి ముక్తపురుషుడు బాహ్యసుఖమును ఎన్నడును అభిలషింపడు. “బ్రహ్మభూతస్థితి” యని పిలువబడు అట్టి స్థితిని పొందినంతట మనుజుడు భగవద్ధామమును నిశ్చయముగా చేరగలడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 228 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 24 🌴


24. yo ’ntaḥ-sukho ’ntar-ārāmas tathāntar-jyotir eva yaḥ
sa yogī brahma-nirvāṇaṁ brahma-bhūto ’dhigacchati

🌷 Translation :

One whose happiness is within, who is active and rejoices within, and whose aim is inward is actually the perfect mystic. He is liberated in the Supreme, and ultimately he attains the Supreme.

🌹 Purport :

Unless one is able to relish happiness from within, how can one retire from the external engagements meant for deriving superficial happiness? A liberated person enjoys happiness by factual experience. He can, therefore, sit silently at any place and enjoy the activities of life from within. Such a liberated person no longer desires external material happiness. This state is called brahma-bhūta, attaining which one is assured of going back to Godhead, back to home.

🌹 🌹 🌹 🌹 🌹


13 Dec 2019

శ్రీమద్భగవద్గీత - 227: 05వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 227: Chap. 05, Ver. 23


🌹. శ్రీమద్భగవద్గీత - 227 / Bhagavad-Gita - 227 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 23 🌴

23. శక్నోతీహైవ య: సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్ |
కామక్రోధోద్భవం వేగం స యుక్త: స సుఖీ నర: ||

🌷. తాత్పర్యం :

దేహమును విడుచుటకు పూర్వమే ఇంద్రియముల కోరికలను అదుపు చేయగలిగిన వాడు, కామక్రోధ వేగమును అణచగలిగిన వాడు దివ్యస్థితి యందున్నట్టివాడై ఈ జగము నందు సుఖవంతుడగును.

🌷. భాష్యము :

ఆత్మానుభవమార్గమున స్థిరమైన పురోభివృద్దిని గోరువాడు ఇంద్రియ వేగమును అణుచుటకు యత్నింపవలెను. వాచవేగము, క్రోధవేగము, మనోవేగము, ఉదరవేగము, ఉపస్థవేగము, జిహ్వావేగము అను పలు ఇంద్రియవేగములు కలవు. ఈ వివిదేంద్రియ వేగములను మరియు మనస్సును అదుపు చేయగలిగినవాడు గోస్వామి లేదా స్వామి యని పిలువబడును. అట్టి గోస్వాములు నిష్ఠగా నియమజీవనము పాటించుచు, సర్వవిధములైన ఇంద్రియవేగముల నుండి దూరులై యుందురు.

కోరికలను సంతృప్తి నొందనప్పడు అవి క్రోధమును కలిగించును. తత్కారణముగా మనస్సు, కన్నులు, హృదయము ఉద్విగ్నమగును. కనుకనే ఈ భౌతికదేహమును విడుచుటకు పూర్వమే ప్రతియొక్కరు ఆ ఇంద్రియ, మనోవేగములను నియమించుటను అభ్యసించవలెను. అట్లు చేయగలిగినవాడు ఆత్మానుభవమును పొందినవాడని భావింపబడును. అట్టి ఆత్మానుభవస్థితి యందు అతడు పూర్ణానందము ననుభవించును. కనుక కోరిక, క్రోధములను తీవ్రముగా అణుచుటకు యత్నించుటయే ఆధ్యాత్మికజ్ఞాన సంపన్నున విధ్యుక్తధర్మమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 227 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 23 🌴


23. śaknotīhaiva yaḥ soḍhuṁ prāk śarīra-vimokṣaṇāt
kāma-krodhodbhavaṁ vegaṁ sa yuktaḥ sa sukhī naraḥ

🌷 Translation :

Before giving up this present body, if one is able to tolerate the urges of the material senses and check the force of desire and anger, he is well situated and is happy in this world.

🌹 Purport :

If one wants to make steady progress on the path of self-realization, he must try to control the forces of the material senses. There are the forces of talk, forces of anger, forces of mind, forces of the stomach, forces of the genitals, and forces of the tongue. One who is able to control the forces of all these different senses, and the mind, is called gosvāmī, or svāmī. Such gosvāmīs live strictly controlled lives and forgo altogether the forces of the senses.

Material desires, when unsatiated, generate anger, and thus the mind, eyes and chest become agitated. Therefore, one must practice to control them before one gives up this material body. One who can do this is understood to be self-realized and is thus happy in the state of self-realization. It is the duty of the transcendentalist to try strenuously to control desire and anger.

🌹 🌹 🌹 🌹 🌹


12 Dec 2019


శ్రీమద్భగవద్గీత - 226: 05వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 226: Chap. 05, Ver. 22


🌹. శ్రీమద్భగవద్గీత - 226 / Bhagavad-Gita - 226 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 22 🌴

22. యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే |
ఆద్యన్తవన్త: కౌన్తేయ న తేషు రమతే బుధ:


🌷. తాత్పర్యం :

బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖకారణములందు పాల్గొనడుడు. ఓ కౌంతేయా! ఆ సుఖములు ఆద్యంతములు కూడి యున్నందున తెలివిగలవాడు వాని యందు ప్రియమును పొందడు.


🌷. భాష్యము :

భౌతిక సుఖములు ఇంద్రియ సంపర్కముచే కలుగుచుండును. కాని దేహమే ఆశాశ్వతము గనుక అట్టి భౌతికసుఖము లన్నియును తాత్కాలికములై యున్నవి. తాత్కాలికమైన దేని యందును ముక్తపురుషుడు ఆసక్తిని కనబరచడు. దివ్యమైన ఆధ్యాత్మికానంద రుచిని తెలిసిన ముక్తపురుషుడు ఎట్లు ఆభాస సుఖమును అనుభవింప అంగీకరించును? ఈ విషయమును గూర్చి పద్మపురాణమునందు ఇట్లు తెలుపబడినది.


రమంతే యోగినో(నన్తే సత్యానందే చిదాత్మని |
ఇతి రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే

“యోగులైనవారు పరతత్త్వము నందు రమించుచు అనంతముగా దివ్యానందము ననుభవింతురు. కనుకనే పరతత్త్వము రాముడనియు తెలియబడును.”

శ్రీమద్భాగవాతము నందు కూడా ఈ విధముగా తెలుపబడినది(5.5.1).

నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్ కామానర్హతే విడ్భుజాం యే |
తపో దివ్య పుత్రకాయేన సత్త్వం శుద్ధ్యేద్యస్మాత్ బ్రహ్మసౌఖ్యం త్వనంతం ||

“ప్రియమైన పుత్రులారా! మానవజన్మ యందు ఇంద్రియప్రీతి కొరకు కష్టించి పనిచేయుట యుక్తము కాదు. ఏలయన అట్టి ఇంద్రియసుఖములు మలభక్షణము చేయు సూకరములకు సైతము లభించుచున్నవి. దానికి బదులు జీవితమనుగడనే శుద్ధిపరచునటువంటి తపస్సును ఈ జీవితమున మీరు చేపట్టుడు. తత్ఫలితముగా మీరు అనంతమైన ఆధ్యాత్మికానందము ననుభవింపగలరు.”

కనుకనే నిజమైన యోగులు (బుధజనులు) నిరంతర భవబంధమునకు కారణమైన ఇంద్రియసుఖముచే ఆకర్షణకు గురికారు. విషయసుఖముల యెడ ఎంత ఎక్కువ అనురక్తి పెరుగునో అంత ఎక్కువగా మనుజుడు దుఃఖములందు చిక్కుబడును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 226 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 22 🌴

22. ye hi saṁsparśa-jā bhogā duḥkha-yonaya eva te
ādy-antavantaḥ kaunteya na teṣu ramate budhaḥ

🌷 Translation :

An intelligent person does not take part in the sources of misery, which are due to contact with the material senses. O son of Kuntī, such pleasures have a beginning and an end, and so the wise man does not delight in them.

🌹 Purport :

Material sense pleasures are due to the contact of the material senses, which are all temporary because the body itself is temporary. A liberated soul is not interested in anything which is temporary. Knowing well the joys of transcendental pleasures, how can a liberated soul agree to enjoy false pleasure? In the Padma Purāṇa it is said:

ramante yogino ’nante satyānande cid-ātmani
iti rāma-padenāsau paraṁ brahmābhidhīyate

“The mystics derive unlimited transcendental pleasures from the Absolute Truth, and therefore the Supreme Absolute Truth, the Personality of Godhead, is also known as Rāma.”

In the Śrīmad-Bhāgavatam also (5.5.1) it is said:

nāyaṁ deho deha-bhājāṁ nṛ-loke
kaṣṭān kāmān arhate viḍ-bhujāṁ ye
tapo divyaṁ putrakā yena sattvaṁ
śuddhyed yasmād brahma-saukhyaṁ tv anantam

“My dear sons, there is no reason to labor very hard for sense pleasure while in this human form of life; such pleasures are available to the stool-eaters [hogs]. Rather, you should undergo penances in this life by which your existence will be purified, and as a result you will be able to enjoy unlimited transcendental bliss.”

Therefore, those who are true yogīs or learned transcendentalists are not attracted by sense pleasures, which are the causes of continuous material existence. The more one is addicted to material pleasures, the more he is entrapped by material miseries.

🌹 🌹 🌹 🌹 🌹


11 Dec 2019

శ్రీమద్భగవద్గీత - 225: 05వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 225: Chap. 05, Ver. 21


🌹. శ్రీమద్భగవద్గీత - 225 / Bhagavad-Gita - 225 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 21 🌴


21. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విన్దత్యాత్మని యత్ సుఖము |
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయ మశ్నుతే


🌷. తాత్పర్యం :

అట్టి ముక్తపురుషుడు బాహ్యేంద్రియ సుఖమునకు ఆకర్షితుడు గాక ఆత్మయందే సౌఖ్యమనుభవించు సదా ధ్యానమగ్నుడై యుండును. పరబ్రహ్మమును ధ్యానించు కారణమున ఆత్మదర్శి ఆ విధముగా అనంతసౌఖ్యము ననుభవించును.


🌷. భాష్యము :

కృష్ణభక్తిపరాయణుడైన శ్రీయామునాచార్యులు ఈ క్రింది విధముగా పలికియుండిరి.


యదవధి మమ చేత: కృష్ణపాదారవిన్దే |
నవనవరసధామాన్యుద్యతం రంతు మాసీత్
తదవధి బట నారీసంగమే స్మర్యమాణే |
భవతి ముఖవికార: సుష్టు నిష్ఠీవనం చ ||

“శ్రీకృష్ణభగవానుని దివ్యమైన ప్రేమయుక్తసేవ యందు నియుక్తమై, ఆ దేవదేవుని యందు నిత్యనూతనమైన ఆనందమును నేను అనుభవించుచున్నందున మైథునసుఖభావన కలిగినంతనే ఆరుచిచే నా ముఖము వికారము నొంది నేనా భావముపై ఉమ్మివేయుదును.” బ్రహ్మయోగము (కృష్ణభక్తిరసభావనము) నందున్నవాడు శ్రీకృష్ణభగవానుని దివ్యమైన భక్తియుతసేవ యందు నిమగ్నుడై యున్నందున భౌతికభోగముల యెడ రుచిని కోల్పోవును.

భౌతికభావనలో అత్యంత ఘనమైన సుఖము మైథునభోగము. జగమంతయు దీనిపై ఆధారపడియే పనిచేయుచున్నది. దీని ప్రోద్బలము లేకుండా లౌకికుడు ఎట్టి కర్మల యందును పాల్గొనలేడు. కాని కృష్ణభక్తిభావన యందున్నవాడు అట్టి సుఖమును వాచింపకయే అత్యంత ఉత్సాహముతో కర్మను ఒనరింపగలడు. దాని నతడు సంపూర్ణముగా త్యజించును. అట్టి సుఖత్యాగము ఆత్మానుభవమునకు ఒక పరీక్ష వంటిది. ఏలయన ఆత్మానుభవమునకు మరియు మైథునభోగమునకు పొత్తు ఎన్నడును కుదరదు. కృష్ణభక్తిభావన యందున్నవాడు ముక్తపురుషుడై యున్నందున ఏ విధమైన ఇంద్రియభోగముల యెడను ఆకర్షణను కలిగియుండడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 225 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 21 🌴


21. bāhya-sparśeṣv asaktātmā vindaty ātmani yat sukham
sa brahma-yoga-yuktātmā sukham akṣayam aśnute

🌷 Translation :

Such a liberated person is not attracted to material sense pleasure but is always in trance, enjoying the pleasure within. In this way the self-realized person enjoys unlimited happiness, for he concentrates on the Supreme.

🌹 Purport :

Śrī Yāmunācārya, a great devotee in Kṛṣṇa consciousness, said:

yad-avadhi mama cetaḥ kṛṣṇa-pādāravinde
nava-nava-rasa-dhāmany udyataṁ rantum āsīt
tad-avadhi bata nārī-saṅgame smaryamāne
bhavati mukha-vikāraḥ suṣṭhu niṣṭhīvanaṁ ca

“Since I have been engaged in the transcendental loving service of Kṛṣṇa, realizing ever-new pleasure in Him, whenever I think of sex pleasure I spit at the thought, and my lips curl with distaste.” A person in brahma-yoga, or Kṛṣṇa consciousness, is so absorbed in the loving service of the Lord that he loses his taste for material sense pleasure altogether.

The highest pleasure in terms of matter is sex pleasure. The whole world is moving under its spell, and a materialist cannot work at all without this motivation. But a person engaged in Kṛṣṇa consciousness can work with greater vigor without sex pleasure, which he avoids. That is the test in spiritual realization. Spiritual realization and sex pleasure go ill together. A Kṛṣṇa conscious person is not attracted to any kind of sense pleasure, due to his being a liberated soul.

🌹 🌹 🌹 🌹 🌹


10 Dec 2019