శ్రీమద్భగవద్గీత - 418: 11వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 418: Chap. 11, Ver. 04


🌹. శ్రీమద్భగవద్గీత - 418 / Bhagavad-Gita - 418 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 04 🌴

04. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో |
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ||


🌷. తాత్పర్యం : హే ప్రభూ! యోగేశ్వరా! నీ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడనని నీవు తలచినచో దయతో ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపుము.

🌷. భాష్యము : భౌతికేంద్రియముల ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని దర్శించుట, శ్రవణము చేయుట, అవగాహన చేసికొనుట లేదా గ్రహించుట సాధ్యముకాదని తెలపబడినది. కాని తొలి నుండియే మనుజుడు ప్రేమయుతసేవలో నిమగ్నుడైనచో అ భగవానుని గాంచగలుగును. వాస్తవమునకు ఆధ్యాత్మిక స్పులింగము మాత్రమేయైన జీవునకు భగవానుని దర్శనముగాని, అవగాహనముగాని సాధ్యముగాని విషయము. కనుకనే భక్తుడైన అర్జునుడు తన ఊహాశక్తికి లేదా కల్పనాశక్తిపై ఆధారపడక సామాన్యజీవిగా తన పరిమితిని అంగీకరించి, శ్రీకృష్ణభగవానుని అపరిమేయ స్థితిని కీర్తించుచున్నాడు. పరిమితుడైన జీవునికి అపరిమితుడును మరియు అనంతుడును అయిన భగవంతుని గూర్చి తెలియుట సాధ్యము కాదని అర్జునుడు ఎరుగగలిగెను. అపరిమితుడైన వాడు తనను తాను వ్యక్తపరచుకొనినపుడే అతని కరుణచే అతని అపరిమిత స్వభావమును ఎరుగుట సాధ్యపడగలదు.

శ్రీకృష్ణభగవానుడు అచింత్యశక్తి సంపన్నుడు కనుకనే “యోగేశ్వరా” యను పదము సైతము ప్రాధాన్యమును సంతరించుకొన్నది. అనగా అతడు అపరిమితుడైనను తాను కోరినచో తనంతట తాను వ్యక్తము కాగలడు. కనుకనే అర్జునుడు ఇచ్చట ఆజ్ఞలను ఒసగక అతని నిర్హేతుక, అచింత్యకరుణకై ప్రార్థించుచున్నాడు. భక్తిభావనలో తనను సంపూర్ణ శరణాగతుడై భక్తియుతసేవలో నిలువనిదే ఎవ్వరికినీ తనను వ్యక్తపరచుకొనవలసిన అవసరము శ్రీకృష్ణునకు లేదు. కనుక మానసికకల్పనాబలముపై ఆధారపడివారికి శ్రీకృష్ణభగవానుని దర్శించుట సాధ్యము కాదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 418 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 04 🌴

04. manyase yadi tac chakyaṁ mayā draṣṭum iti prabho
yogeśvara tato me tvaṁ darśayātmānam avyayam


🌷 Translation : If You think that I am able to behold Your cosmic form, O my Lord, O master of all mystic power, then kindly show me that unlimited universal Self.

🌹 Purport : It is said that one can neither see, hear, understand nor perceive the Supreme Lord, Kṛṣṇa, by the material senses. But if one is engaged in loving transcendental service to the Lord from the beginning, then one can see the Lord by revelation. Every living entity is only a spiritual spark; therefore it is not possible to see or to understand the Supreme Lord. Arjuna, as a devotee, does not depend on his speculative strength; rather, he admits his limitations as a living entity and acknowledges Kṛṣṇa’s inestimable position. Arjuna could understand that for a living entity it is not possible to understand the unlimited infinite. If the infinite reveals Himself, then it is possible to understand the nature of the infinite by the grace of the infinite.

The word yogeśvara is also very significant here because the Lord has inconceivable power. If He likes, He can reveal Himself by His grace, although He is unlimited. Therefore Arjuna pleads for the inconceivable grace of Kṛṣṇa. He does not give Kṛṣṇa orders. Kṛṣṇa is not obliged to reveal Himself unless one surrenders fully in Kṛṣṇa consciousness and engages in devotional service. Thus it is not possible for persons who depend on the strength of their mental speculations to see Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹

13 Jun 2020