శ్రీమద్భగవద్గీత - 414: 10వ అధ్., శ్లో 42 / Bhagavad-Gita - 414: Chap. 10, Ver. 42


🌹. శ్రీమద్భగవద్గీత - 414 / Bhagavad-Gita - 414 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 42 🌴

42. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున |
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాం శేన స్థితో జగత్ ||


🌷. తాత్పర్యం : కాని ఓ అర్జునా! ఈ సవిస్తరమైన జ్ఞానము యొక్క అవసరమేమున్నది? కేవలము ఒక అంశమాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించు చుందును.

🌷. భాష్యము : పరమాత్మ రూపమున సమస్తము నందును ప్రవేశించుట ద్వారా శ్రీకృష్ణభగవానుడు సర్వవిశ్వములందును నలిచియుండును. సమస్త విషయములు ఏ విధముగా విభూతిసంపన్నములు మరియు వైభవోపేతములుగా నిలిచియున్నవో అవగతము చేసికొనుటలో అర్థము లేదని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలియజేయుచున్నాడు. శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున చేరియుండుట చేతనే ప్రతిదియు స్థితిని కలిగియున్నదని అతడు అవగతము చేసికొనవలసియున్నది. అనగా మహత్తర జీవియైన బ్రహ్మదేవుని మొదలుగా అతిసూక్ష్మమైన చీమ వరకు గల సమస్తజీవుల యందును శ్రీకృష్ణభగవానుడు పరమాత్మ రూపమున వాటి యందు నిలిచి పోషించుట చేతనే అవి స్థితిని కలిగియున్నవి.

ఏ దేవతార్చనమైనను చివరకు దేవదేవుడైన శ్రీకృష్ణుని చెంతకే లేదా పరమగమ్యమునకే మనుజుని చేర్చునని పలుకు సిద్ధాంతమొకటి కలదు. కాని బ్రహ్మరుద్రాదులు వంటి గొప్ప దేవతలే శ్రీకృష్ణభగవానుని విభుతిలో అంశ మాత్రమునకు ప్రాతినిధ్యము వహించుచున్నందున దేవతార్చనము ఇచ్చట పూర్తిగా నిరసింపబడుచున్నది. జన్మగల ప్రతియొక్కరికి అతడే మూలము మరియు అతని కన్నను ఘనుడెవ్వడును లేడు. అతని కన్నను ఘనుడు గాని, సమానుడు గాని లేనందునే అతడు “ఆసమౌర్థ్వ” యని పిలువబడినాడు. శ్రీమద్భగవద్గీత యందలి “భగవద్విభూతి” అను దశమాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 414 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 42 🌴

42. atha vā bahunaitena kiṁ jñātena tavārjuna
viṣṭabhyāham idaṁ kṛtsnam ekāṁśena sthito jagat

🌷 Translation : But what need is there, Arjuna, for all this detailed knowledge? With a single fragment of Myself I pervade and support this entire universe.


🌹 Purport : The Supreme Lord is represented throughout the entire material universes by His entering into all things as the Supersoul. The Lord here tells Arjuna that there is no point in understanding how things exist in their separate opulence and grandeur. He should know that all things are existing due to Kṛṣṇa’s entering them as Supersoul. From Brahmā, the most gigantic entity, on down to the smallest ant, all are existing because the Lord has entered each and all and is sustaining them. There is a Mission that regularly propounds that worship of any demigod will lead one to the Supreme Personality of Godhead, or the supreme goal.

But worship of demigods is thoroughly discouraged herein because even the greatest demigods like Brahmā and Śiva represent only part of the opulence of the Supreme Lord. He is the origin of everyone born, and no one is greater than Him. He is asamaurdhva, which means that no one is superior to Him and that no one is equal to Him. Thus end the Bhaktivedanta Purports to the Tenth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Opulence of the Absolute.

🌹 🌹 🌹 🌹 🌹

9 Jun 2020