శ్రీమద్భగవద్గీత - 435: 11వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 435: Chap. 11, Ver. 21


🌹. శ్రీమద్భగవద్గీత - 435 / Bhagavad-Gita - 435 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 21 🌴

21. అమీ హి త్వాం సురసఙ్ఘా విశన్తి కేచిద్భీతా: ప్రాంజలయో గృణన్తి |
స్వస్తీత్యుక్తా మహర్షిసిద్ధసఙ్ఘా: స్తువన్తి త్వాం స్తుతిభి: పుష్కలాభి: ||


🌷. తాత్పర్యం : దేవతా సమూహములన్నియును నిన్ను శరణువేడి నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు ముగుల భయవిహ్వలులై దోసలియొగ్గి ప్రార్థనలను గావించుచున్నారు. మహర్షులు, సిద్ధసమూహములు “శాంతి, శాంతి” యని పలుకుచు వేదమంత్రములచే నిన్ను స్తుతించుచున్నారు.

🌷. భాష్యము : సర్వలోకముల యందలి దేవతలు అద్భుతమైన విశ్వరుపముచే మరియ దాని దేదీప్యమాన తేజముచే భయమునొంది తమ రక్షణ నిమిత్తమై ప్రార్థనలను కావించిరి.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 435 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 21 🌴

21. amī hi tvāṁ sura-saṅghā viśanti kecid bhītāḥ prāñjalayo gṛṇanti
svastīty uktvā maharṣi-siddha-saṅghāḥ stuvanti tvāṁ stutibhiḥ puṣkalābhiḥ

🌷 Translation : All the hosts of demigods are surrendering before You and entering into You. Some of them, very much afraid, are offering prayers with folded hands. Hosts of great sages and perfected beings, crying “All peace!” are praying to You by singing the Vedic hymns.


🌹 Purport : The demigods in all the planetary systems feared the terrific manifestation of the universal form and its glaring effulgence and so prayed for protection.

🌹 🌹 🌹 🌹 🌹


30 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 434: 11వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 434: Chap. 11, Ver. 20


🌹. శ్రీమద్భగవద్గీత - 434 / Bhagavad-Gita - 434 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 20 🌴

20. ద్యావాపృథివ్యోరిదమన్తరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వా: |
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదమ్ లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ||


🌷. తాత్పర్యం : నీవు ఒక్కడవేయైనను సమస్త ఆకాశమును, స్వర్గలోకములను మరియు వాని నడుమగల ప్రదేశము నంతటిని వ్యాపించియున్నావు. ఓ మహానుభావా! అద్భుతమును, భయంకరమును అగు ఈ రూపమును గాంచి లోకములన్నియును కలత నొందుచున్నది.

🌷. భాష్యము : “ద్యావాపృథివ్యో” (స్వర్గమునకు, భూమికి నడుమగల ప్రదేశము) మరియు “లోకత్రయం” (ముల్లోకములు) అను పదములు ఈ శ్లోకమున ప్రాముఖ్యమును కలిగియున్నవి. అర్జునుడే గాక ఇతర లోకములందలి వారు కూడా శ్రీకృష్ణభగవానుని ఈ విశ్వరూపమును గాంచినట్లు గోచరించుటయే అందులకు కారణము. అర్జునుని విశ్వరూపదర్శనము స్వప్నము కాదు. దివ్యదృష్టి ఒసగబడిన వారందరును రణరంగమున విశ్వరూపమును గాంచగలిగినారు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹🌹 Bhagavad-Gita as It is - 434 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 20 🌴

20. dyāv ā-pṛthivyor idam antaraṁ hi vyāptaṁ tvayaikena diśaś ca sarvāḥ
dṛṣṭvādbhutaṁ rūpam ugraṁ tavedaṁ loka-trayaṁ pravyathitaṁ mahātman


🌷 Translation : Although You are one, You spread throughout the sky and the planets and all space between. O great one, seeing this wondrous and terrible form, all the planetary systems are perturbed.

🌹 Purport : Dyāv ā-pṛthivyoḥ (“the space between heaven and earth”) and loka-trayam (“the three worlds”) are significant words in this verse because it appears that not only did Arjuna see this universal form of the Lord, but others in other planetary systems saw it also. Arjuna’s seeing of the universal form was not a dream. All whom the Lord endowed with divine vision saw that universal form on the battlefield.

🌹 🌹 🌹 🌹 🌹


29 Jun 2020



శ్రీమద్భగవద్గీత - 433: 11వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 433: Chap. 11, Ver. 19


🌹. శ్రీమద్భగవద్గీత - 433 / Bhagavad-Gita - 433 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 19 🌴


19. అనాదిమధ్యాన్తమనన్తవీర్యమ్ అనన్తబాహుం శశిసూర్యనేత్రమ్ |
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రమ్ స్వతేజసా విశ్వమిదం తపన్తమ్ ||

🌷. తాత్పర్యం : నీవు ఆదిమధ్యాంత రహితుడవై యున్నావు. నీ వైభవము అపరిమితమై యున్నది. అసంఖ్యాకములుగా భుజములను కలిగిన నీవు సూర్యచంద్రులను నేత్రములుగా కలిగియున్నావు. ముఖము నుండి తేజోమయమైన అగ్ని బయల్వెడలుచుండ స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేయుచున్నట్లుగా నిన్ను గాంచుచున్నాను.

🌷. భాష్యము : శ్రీకృష్ణభగవానుని షడ్గుణైశ్వర్యములకు పరిమితి లేదు. ఈ సందర్భమున మరియు పెక్కు ఇతరచోట్ల పునరుక్తి జరిగియున్నది. కాని శాస్త్రరీత్యా శ్రీకృష్ణుని వైభములను పునరుక్తి సారస్వతలోపము కాదు. సంభ్రమము, ఆశ్చర్యము లేదా పారవశ్యము కలిగినపుడు పదముల పునరుక్తి కలుగుచుండుననియు, అది దోషమేమియును కాదనియు తెలుపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 433 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 19 🌴


19. anādi-madhyāntam ananta-vīryam ananta-bāhuṁ śaśi-sūrya-netram
paśyāmi tvāṁ dīpta-hutāśa-vaktraṁ sva-tejasā viśvam idaṁ tapantam

🌷 Translation : You are without origin, middle or end. Your glory is unlimited. You have numberless arms, and the sun and moon are Your eyes. I see You with blazing fire coming forth from Your mouth, burning this entire universe by Your own radiance.

🌹 Purport : .There is no limit to the extent of the six opulences of the Supreme Personality of Godhead. Here and in many other places there is repetition, but according to the scriptures, repetition of the glories of Kṛṣṇa is not a literary weakness. It is said that at a time of bewilderment or wonder or of great ecstasy, statements are repeated over and over. That is not a flaw.

🌹 🌹 🌹 🌹 🌹


28 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 432 : 11వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 432: Chap. 11, Ver. 18


🌹. శ్రీమద్భగవద్గీత - 432 / Bhagavad-Gita - 432 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 18 🌴

18. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
త్వమవ్యయ: శాశ్వతధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే ||


🌷. తాత్పర్యం : దివ్యమైన ఆదిధ్యేయము నీవే. విశ్వమంతటికిని పరమాధారము నీవే. అవ్యయుడవు మరియు సనాతనుడవు నీవే. నీవే శాశ్వతధర్మమును రక్షించు దేవదేవుడవు. ఇదియే నా అభిప్రాయము.

🌷. భాష్యము :




🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 432 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 18 🌴

18. tvam akṣaraṁ paramaṁ veditavyaṁ tvam asya viśvasya paraṁ nidhānam
tvam avyayaḥ śāśvata-dharma-goptā sanātanas tvaṁ puruṣo mato me


🌷 Translation : You are the supreme primal objective. You are the ultimate resting place of all this universe. You are inexhaustible, and You are the oldest. You are the maintainer of the eternal religion, the Personality of Godhead. This is my opinion.


🌹 Purport :

.

🌹 🌹 🌹 🌹 🌹



27 Jun 2020



శ్రీమద్భగవద్గీత - 431 : 11వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 431: Chap. 11, Ver. 17

 

🌹. శ్రీమద్భగవద్గీత - 431 / Bhagavad-Gita - 431 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 17 🌴

17. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వత్రో దీప్తిమన్తమ్ |
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తాద్ దీప్తానలార్క ద్యుతి మప్రమేయమ్ ||

🌷. తాత్పర్యం : జ్వలించు అగ్ని లేక అప్రమేయమైన సూర్యకాంతి వలె సర్వదిక్కుల యందు ప్రసరించు తేజోమయమైన కాంతి వలన నీ రూపమును గాంచుట కష్టమగుచున్నది. అయినను పెక్కు కిరీతములు, గదలు, చక్రములచే అలంకరింపబడిన నీ ఉజ్జ్వల రూపమును సర్వత్ర నేను గాంచుచున్నాను.


🌷. భాష్యము :


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 431 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 17 🌴


17. kirīṭinaṁ gadinaṁ cakriṇaṁ ca tejo-rāśiṁ sarvato dīptimantam
paśyāmi tvāṁ durnirīkṣyaṁ samantād dīptānalārka-dyutim aprameyam

🌷 Translation : Your form is difficult to see because of its glaring effulgence, spreading on all sides, like blazing fire or the immeasurable radiance of the sun. Yet I see this glowing form everywhere, adorned with various crowns, clubs and discs.


🌹 Purport :

.

🌹 🌹 🌹 🌹 🌹



26 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 430: 11వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 430: Chap. 11, Ver. 16


🌹. శ్రీమద్భగవద్గీత - 430 / Bhagavad-Gita - 430 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 16 🌴

16. అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనన్తరూపం |
నాన్తం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ||


🌷. తాత్పర్యం : హే విశ్వప్రభూ! విశ్వరూపా! నీ దేహమునందు అపరిమితముగా సర్వత్ర వ్యాపించియున్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నయనములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆదిమధ్యాంతములను నేను గాంచలేకున్నాను.

🌷. భాష్యము : శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడగు భగవానుడు మరియు అపరిమితుడు కనుక అతని ద్వారా సమస్తమును గాంచవచ్చును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 430 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 16 🌴

16. aneka-bāhūdara-vaktra-netraṁ paśyāmi tvāṁ sarvato ’nanta-rūpam
nāntaṁ na madhyaṁ na punas tavādiṁ paśyāmi viśveśvara viśva-rūpa


🌷 Translation : O Lord of the universe, O universal form, I see in Your body many, many arms, bellies, mouths and eyes, expanded everywhere, without limit. I see in You no end, no middle and no beginning.

🌹 Purport : Kṛṣṇa is the Supreme Personality of Godhead and is unlimited; thus through Him everything could be seen.


🌹 🌹 🌹 🌹 🌹



25 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 429: 11వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 429: Chap. 11, Ver. 15


🌹. శ్రీమద్భగవద్గీత - 429 / Bhagavad-Gita - 429 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 15 🌴


15. అర్జున ఉవాచ

పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూతవిశేషసఙ్ఘాన్ |
బ్రహ్మీణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురాగాంశ్చ దివ్యాన్ ||



🌷. తాత్పర్యం : అర్జునుడు పలికెను : హే కృష్ణా! సమస్తదేవతలు, ఇతర సమస్తజీవులు నీ దేహము నందు సమావిష్టులై యుండుటను నేను గాంచుచున్నాను. పద్మాసనుడైన బ్రహ్మను, శివుని, ఋషులను, దివ్యసర్పములను కూడా నీ యందు నేను దర్శించుచున్నాను.

🌷. భాష్యము : అర్జునుడు విశ్వములోనున్న సమస్తమును విశ్వరూపమున గాంచెను. అనగా విశ్వము నందలి తొలిజీవియైన బ్రహ్మను, విశ్వపు అధోభాగములందు గర్భోదకశాయి విష్ణువు శయనించు దేవతాసర్పమును అతడు గాంచగలిగెను. ఆ సర్పతల్పము వాసుకి యని పిలువబడును. ఈ వాసుకి నామము కలిగిన సర్పములు ఇంకను కొన్ని గలవు.

అనగా ఇచ్చట అర్జునుడు గర్భోదకశాయివిష్ణువు మొదలుగా విశ్వము నందలి తొలిజీవియైన బ్రహ్మదేవుడు వసించు పద్మలోకము యొక్క అత్యంత ఉన్నతభాగము వరకు గాంచెను. దీని భావమేమనగా కేవలము రథముపై ఒకేచోట ఆసీనుడైయున్న అతడు ఆద్యంతములలో సమస్తమును గాంచగలిగెను. దేవదేవుడైన శ్రీకృష్ణుని కరుణ చేతనే అది సాధ్యమయ్యెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 429 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 15 🌴


15. arjuna uvāca


paśyāmi devāṁs tava deva dehe sarvāṁs tathā bhūta-viśeṣa-saṅghān
brahmāṇam īśaṁ kamalāsana-stham ṛṣīṁś ca sarvān uragāṁś ca divyān


🌷 Translation : Arjuna said: My dear Lord Kṛṣṇa, I see assembled in Your body all the demigods and various other living entities. I see Brahmā sitting on the lotus flower, as well as Lord Śiva and all the sages and divine serpents.


🌹 Purport : Arjuna sees everything in the universe; therefore he sees Brahmā, who is the first creature in the universe, and the celestial serpent upon which the Garbhodaka-śāyī Viṣṇu lies in the lower regions of the universe. This snake bed is called Vāsuki. There are also other snakes known as Vāsuki. Arjuna can see from the Garbhodaka-śāyī Viṣṇu up to the topmost part of the universe on the lotus-flower planet where Brahmā, the first creature of the universe, resides. That means that from the beginning to the end, everything could be seen by Arjuna, who was sitting in one place on his chariot. This was possible by the grace of the Supreme Lord, Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


24 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 428: 11వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 428: Chap. 11, Ver. 14


🌹. శ్రీమద్భగవద్గీత - 428 / Bhagavad-Gita - 428 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 14 🌴

14. తత: స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయ: |
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత ||

🌷. తాత్పర్యం : అంతట సంభ్రమమునకు గురుయైనవాడును, ఆశ్చర్యచకితుడైనవాడును, రోమాంచితుడైనవాడును అగు అర్జునుడు శిరము వంచి నమస్కరించుచు అంజలిబద్ధుడై దేవదేవుని ప్రార్థింపదొడగెను.


🌷. భాష్యము : దివ్య దర్శనమైనంతట శ్రీకృష్ణార్జునుల నడుమ గల సంబంధము శీఘ్రమే మారిపోయెను. పూర్వము వారు స్నేహముపై ఆధారపడిన సంబంధము కలిగియుండిరి. కాని విశ్వరూపదర్శనమైనంతనే అర్జునుడు అత్యంత గౌరవముతో వందనమొసగుచు, దోసలి యెగ్గి శ్రీకృష్ణుని ప్రార్థించుచున్నాడు. అనగా ఇప్పుడు అర్జునుని సంబంధము స్నేహరసపూర్ణము కాక అద్భుతరసముగా మార్పునొందెను. పరమభక్తులు శ్రీకృష్ణుని సమస్త సంబంధములకు (రసములకు) నిధిగా నెరిగియుందురు. శాస్త్రములందు పండ్రెండు రకములైన మూల రసములు పేర్కొనబడినవి.

అవియన్నియు శ్రీకృష్ణుని యందే కలవు. ఇరువురు జీవుల నడుమ, దేవతల నడుమ లేదా భగవానుడు మరియు భక్తుల నడుమ పరస్పరము వినిమయము జరుగు సర్వసంబంధములకు అతడే నిధి వంటివాడని చెప్పబడినది. ఇచ్చట అర్జునుడు అద్భుతరస సంబంధముచే ఉత్తేజితుడయ్యెను. స్వభావికముగా సమచిట్టుడును, శాంతుడును అయినప్పటికిని ఆ అద్భుతరసభావమునందు అతడు పరవశుడై, రోమాంచితము కాగా దోసలియొగ్గి పరమపురుషునికి వందనముల నొసగ నారంభించెను. అతడు దేవదేవుని అద్భుతములచే ప్రభావితుడయ్యెనే గాని భయమునకు గురి కాలేదు. అనగా అచట వ్యక్తమైన భావము అద్భుతరసము. దానిచే అతని సహజ సఖ్యసంబంధము ప్రభావితము కాగా అతడు ఆ విధముగా ప్రవర్తించెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 428 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 14 🌴

14. tataḥ sa vismayāviṣṭo hṛṣṭa-romā dhanañ-jayaḥ
praṇamya śirasā devaṁ kṛtāñjalir abhāṣata

🌷 Translation : Then, bewildered and astonished, his hair standing on end, Arjuna bowed his head to offer obeisances and with folded hands began to pray to the Supreme Lord.


🌹 Purport : .Once the divine vision is revealed, the relationship between Kṛṣṇa and Arjuna changes immediately. Before, Kṛṣṇa and Arjuna had a relationship based on friendship, but here, after the revelation, Arjuna is offering obeisances with great respect, and with folded hands he is praying to Kṛṣṇa. He is praising the universal form. Thus Arjuna’s relationship becomes one of wonder rather than friendship. Great devotees see Kṛṣṇa as the reservoir of all relationships. In the scriptures there are twelve basic kinds of relationships mentioned, and all of them are present in Kṛṣṇa. It is said that He is the ocean of all the relationships exchanged between two living entities, between the gods, or between the Supreme Lord and His devotees.

Here Arjuna was inspired by the relationship of wonder, and in that wonder, although he was by nature very sober, calm and quiet, he became ecstatic, his hair stood up, and he began to offer his obeisances unto the Supreme Lord with folded hands. He was not, of course, afraid. He was affected by the wonders of the Supreme Lord. The immediate context is wonder; his natural loving friendship was overwhelmed by wonder, and thus he reacted in this way.

🌹 🌹 🌹 🌹 🌹


23 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 427: 11వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 427: Chap. 11, Ver. 13


🌹. శ్రీమద్భగవద్గీత - 427 / Bhagavad-Gita - 427 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 13 🌴

13. తత్త్రైకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తమనేకధా |
అపశ్యద్దేవస్య శరీరే పాండవస్తదా ||


🌷. తాత్పర్యం : ఆ సమయమున అర్జునుడు బహువేలసంఖ్యలో విభజింపబడియున్నను ఒకేచోట నిలిచియున్న విశ్వము యొక్క అనంతరూపములను శ్రీకృష్ణభగవానుని విశ్వరూపమున గాంచెను.

🌷. భాష్యము : ఆ విశ్వరూపములోని మహాద్భుతమైన ఆశ్చర్యములను వివరించిన పిదప, సంజయుడు ఈ జగత్తు అంతటిని అది తన యందే కలిగి ఉన్నదని పేర్కొంటున్నాడు. ఇంకా ఆశ్చర్యముగా అర్జునుడు జగత్తు యొక్క సమస్త అస్తిత్వమునూ శ్రీ కృష్ణుడి శరీర భాగములోనే చూసాడు. అనంతమైన బ్రహ్మాండములను, వాటి యొక్క నక్షత్ర మండలములు మరియు గ్రహ-సమూహాలను ఆ పరమేశ్వరుని చిన్న అంశగా దర్శించాడు.

తన చిన్ననాటి లీలలలో, శ్రీ కృష్ణుడు తన విశ్వ రూపమును తల్లి యశోదకు కూడా చూపించాడు. ఆ సర్వేశ్వరుడు తన దివ్య వైభవములను మరుగున దాచి, భక్తుల ఆనందం కోసం ఒక చిన్నపిల్లవానిలా నటించాడు. శ్రీ కృష్ణుడు తన పుత్రుడే అనుకుంటూ, ఎన్ని సార్లు వద్దని చెప్పినా మన్ను తింటున్నాడని, ఒకసారి యశోదమాత, బాలుడిని గట్టిగా మందలించింది. నోట్లో పరీక్షించటానికి బాల కృష్ణుడిని నోరు తెరవమని అడిగింది. కానీ, కృష్ణుడు నోరు తెరిచినప్పుడు, ఆ తల్లికి సంభ్రమాశ్చర్యంగా, ఆయన తన యోగమాయా శక్తిచే, దానిలో విశ్వరూపమును చూపించాడు. యశోదమ్మ తన చిన్ని బాలకుని నోటిలో అనంతమైన బ్రహ్మాండములు, అద్భుతములు చూసి పూర్తిగా భ్రమకు లోనయ్యింది. ఆ యొక్క మహాశ్చర్యాన్ని తట్టుకోలేక ఆమె మూర్చిల్లబోయింది, శ్రీ కృష్ణుడు ఆ తల్లిని ముట్టుకుని మరలా మామూలు మనిషిని చేసాడు.

యశోదా మాతకి చూపించిన అదే విశ్వ రూపమును, భగవంతుడు, తన మిత్రుడైన అర్జునుడికి ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇప్పుడిక సంజయుడు విశ్వ రూపమును దర్శించిన అర్జునుడి ప్రతిస్పందనను తెలియ చేస్తున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 427 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 13 🌴

13. tatraika-sthaṁ jagat kṛtsnaṁ pravibhaktam anekadhā
apaśyad deva-devasya śarīre pāṇḍavas tadā


🌷 Translation : At that time Arjuna could see in the universal form of the Lord the unlimited expansions of the universe situated in one place although divided into many, many thousands.

🌹 Purport : The word tatra (“there”) is very significant. It indicates that both Arjuna and Kṛṣṇa were sitting on the chariot when Arjuna saw the universal form. Others on the battlefield could not see this form, because Kṛṣṇa gave the vision only to Arjuna. Arjuna could see in the body of Kṛṣṇa many thousands of planets. As we learn from Vedic scriptures, there are many universes and many planets. Some of them are made of earth, some are made of gold, some are made of jewels, some are very great, some are not so great, etc. Sitting on his chariot, Arjuna could see all these. But no one could understand what was going on between Arjuna and Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


22 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 426: 11వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 426: Chap. 11, Ver. 12


🌹. శ్రీమద్భగవద్గీత - 426 / Bhagavad-Gita - 426 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 12 🌴

12. దివి దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా |
యది భా: సదృశీ సా స్యా ద్భాసస్తస్య మహాత్మన: ||

🌷. తాత్పర్యం : లక్షలాది సూర్యులు ఒక్కమారు ఆకాశమున ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపమునందలి పరమపురుషుని తేజస్సును పోలగలదు.

🌷. భాష్యము : అర్జునుడు గాంచిన విషయము వర్ణణాతీతమైనది. అయినను సంజయుడు ఆ అద్భుతము యొక్క మనోచిత్రణను ధృతరాష్ట్రునకు తెలుప యత్నించుచున్నాడు. సంజయుడుగాని, ధృతరాష్ట్రుడుగాని యుద్ధరంగమున లేకున్నను వ్యాసుని అనుగ్రహముచే సంజయుడు జరిగినదంతయు యథాతథముగా గాంచగలిగెను. కనుకనే అతడు అచ్చటి పరిస్థితిని సాధ్యమైనంతవరకు అవగతమగునట్లు వేలాదిసూర్యులు ఉదయించుట వంటి ఊహాత్మక భావములతో పోల్చుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 426 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 12 🌴

12. divi sūrya-sahasrasya bhaved yugapad utthitā
yadi bhāḥ sadṛśī sā syād bhāsas tasya mahātmanaḥ


🌷 Translation : If hundreds of thousands of suns were to rise at once into the sky, their radiance might resemble the effulgence of the Supreme Person in that universal form.

🌹 Purport : What Arjuna saw was indescribable, yet Sañjaya is trying to give a mental picture of that great revelation to Dhṛtarāṣṭra. Neither Sañjaya nor Dhṛtarāṣṭra was present, but Sañjaya, by the grace of Vyāsa, could see whatever happened. Thus he now compares the situation, as far as it can be understood, to an imaginable phenomenon (i.e., thousands of suns).

🌹 🌹 🌹 🌹 🌹


21 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 425: 11వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 425: Chap. 11, Ver. 11


🌹. శ్రీమద్భగవద్గీత - 425 / Bhagavad-Gita - 425 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 11 🌴

11. దివ్యమాల్యామ్బరధరం దివ్య గంధాను లేపనమ్ |
సర్వాశ్చర్యమయం దేవమనన్తం విశ్వతోముఖమ్ ||


🌷. తాత్పర్యం : అతడు దివ్య పూమాలలను మరియు వస్త్రములను దాల్చియుండెను. పలు దివ్యసుగంధములు అతని దేహమునకు అలదబడియుండెను. అంతయు ఆశ్చర్యమయముగను, ప్రకాశమానముగను, అనంతముగను, సర్వవ్యాపకముగను ఉండెను.

🌷. భాష్యము : అర్జునుడు గాంచుచున్న హస్తములు, ముఖములు, పాదములు, ఇతర రూపముల సంఖ్యకు పరిమితి లేదనెడి విషయమును ఈ రెండు శ్లోకములలో పలుమార్లు వాడబడిన “అనేక” యను పదము సూచించుచున్నది. విశ్వమంతటిని వ్యాపించియున్న ఆ రూపములను అర్జునుడు శ్రీకృష్ణభగవానుని కరుణచే ఒకే స్థలమున నిలిచి గాంచగలిగెను. శ్రీకృష్ణభగవానుని అచింత్యశక్తియే దానికి కారణము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 425 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 11 🌴

11. divya-mālyāmbara-dharaṁ divya-gandhānulepanam
sarvāścarya-mayaṁ devam anantaṁ viśvato-mukham


🌷 Translation : He wore celestial garlands and garments, and many divine scents were smeared over His body. All was wondrous, brilliant, unlimited, all-expanding.

🌹 Purport : In these two verses the repeated use of the word many indicates that there was no limit to the number of hands, mouths, legs and other manifestations Arjuna was seeing. These manifestations were distributed throughout the universe, but by the grace of the Lord, Arjuna could see them while sitting in one place. That was due to the inconceivable potency of Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


20 Jun 2020



శ్రీమద్భగవద్గీత - 424: 11వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 424: Chap. 11, Ver. 10



🌹. శ్రీమద్భగవద్గీత - 424 / Bhagavad-Gita - 424 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 10 🌴

10. అనేకవక్త్రనయనమనేకాధ్బుతదర్శనమ్ |
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ||


🌷. తాత్పర్యం : అర్జునుడు ఆ విశ్వరూపమున అనతసంఖ్యలో ముఖములను, నేత్రములను,అద్భుత దృశ్యములను గాంచెను. ఆ రూపము పలు దివ్యాభరణములచే అలంకృతమై, ఎత్తబడియున్న పలు దివ్యాయుధములను కలిగియుండెను.

🌷. భాష్యము : అర్జునుడు గాంచుచున్న హస్తములు, ముఖములు, పాదములు, ఇతర రూపముల సంఖ్యకు పరిమితి లేదనెడి విషయమును ఈ రెండు శ్లోకములలో పలుమార్లు వాడబడిన “అనేక” యను పదము సూచించుచున్నది. విశ్వమంతటిని వ్యాపించియున్న ఆ రూపములను అర్జునుడు శ్రీకృష్ణభగవానుని కరుణచే ఒకే స్థలమున నిలిచి గాంచగలిగెను. శ్రీకృష్ణభగవానుని అచింత్య శక్తియే దానికి కారణము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 424 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 10 🌴

10. aneka-vaktra-nayanam anekādbhuta-darśanam
aneka-divyābharaṇaṁ divyānekodyatāyudham


🌷 Translation : Arjuna saw in that universal form unlimited mouths, unlimited eyes, unlimited wonderful visions. The form was decorated with many celestial ornaments and bore many divine upraised weapons.

🌹 Purport : In these two verses the repeated use of the word many indicates that there was no limit to the number of hands, mouths, legs and other manifestations Arjuna was seeing. These manifestations were distributed throughout the universe, but by the grace of the Lord, Arjuna could see them while sitting in one place. That was due to the inconceivable potency of Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


20 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 423: 11వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 423: Chap. 11, Ver. 09


🌹. శ్రీమద్భగవద్గీత - 423 / Bhagavad-Gita - 423 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 09 🌴



09. సంజయ ఉవాచ

ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి: |
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ||

🌷. తాత్పర్యం : సంజయుడు పలికెను :ఓ రాజా! యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు ఆ విధముగా పలికిన తదుపరి తన విశ్వరూపమును అర్జునునకు చూపెను.


🌷. భాష్యము :



🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 423 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 09 🌴



09. sañjaya uvāca

evam uktvā tato rājan mahā-yogeśvaro hariḥ
darśayām āsa pārthāya paramaṁ rūpam aiśvaram


🌷 Translation : Sañjaya said: O King, having spoken thus, the Supreme Lord of all mystic power, the Personality of Godhead, displayed His universal form to Arjuna.


🌹 Purport :



🌹 🌹 🌹 🌹 🌹


19 Jun 2020



శ్రీమద్భగవద్గీత - 422: 11వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 422: Chap. 11, Ver. 08


🌹. శ్రీమద్భగవద్గీత - 422 / Bhagavad-Gita - 422 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 08 🌴

08. న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా |
దివ్యం దదామి తే చక్షు: పశ్య మే యోగమైశ్వరమ్ ||

🌷. తాత్పర్యం : కాని ప్రస్తుత నేత్రములందే నన్ను గాంచలేవు గనుక నేను నీకు దివ్య నేత్రములను ఒసగుచున్నాను. నా యోగ వైభావమును వీక్షింపుము!


🌷. భాష్యము : శుద్ధభక్తుడైన వాడు శ్రీకృష్ణుని అతని ద్విభుజరూపమున కన్నను అన్యమైన ఏ రూపమునందు గాంచగోరడు. విశ్వరూపమును అతడు మనస్సుతోగాక, ఆధ్యాత్మిక చక్షువులతో ఆ దేవదేవుని కరుణ ద్వారా గాంచవలెను. కనుకనే విశ్వరూప దర్శనమునకు మనస్సునుగాక, దృష్టిని మార్చుకొనమని అర్జునుడు ఉపదేశింపబడినాడు. రాబోవు శ్లోకములందు స్పష్టపరుపబడినట్లు శ్రీకృష్ణుని విశ్వరూపము ప్రాధాన్యమైనది కాదు. అయినను అర్జునుడు కోరియున్నందున దాని దర్శనము కొరకై భగవానుడు అతనికి దివ్యదృష్టి నొసగినాడు. శ్రీకృష్ణునితో దివ్యమైన ప్రేమపూర్వక సంబంధమున చక్కగా నెలకొనిన భక్తులు అతని ప్రేమలక్షణములతోనే ఆకర్షితులగుదురు కాని విభూతిప్రదర్శచే కాదు.

శ్రీకృష్ణునితో ఆటలాడుకొను వారు, మిత్రులు, అతని తల్లితండ్రులు ఎన్నడును అతడు విభూతులను మరియు వైభవములను ప్రదర్శించవలెనని కోరియుండలేదు. శుద్ధప్రేమలో వారెంత మునిగియుండిరనగా అతడు దేవదేవుడనియు వారెరుగకుండిరి. తమ ప్రేమపూర్వక వ్యవహారములందు వారు శ్రీకృష్ణుడు దేవదేవుడనెడి విషయమును సైతము మరచిపోయిరి. శ్రీకృష్ణునితో ఆటలాడిన బాలురు కృతపుణ్య పుంజులనియు (ఘన పుణ్యాత్ములని) మరియు బహుజన్మల పిదపనే వారు ఆ విధముగా కృష్ణునితో క్రీడింప గలిగిరనియు శ్రీమద్భాగవతమున తెలుపబడినది. ఆ బాలురు శ్రీకృష్ణుని దేవదేవునిగా నెరుగక, తమ సన్నిహిత మిత్రునిగా భావించిరి.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 422 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 08 🌴

08. na tu māṁ śakyase draṣṭum anenaiva sva-cakṣuṣā
divyaṁ dadāmi te cakṣuḥ paśya me yogam aiśvaram

🌷 Translation : But you cannot see Me with your present eyes. Therefore I give you divine eyes. Behold My mystic opulence!


🌹 Purport : A pure devotee does not like to see Kṛṣṇa in any form except His form with two hands; a devotee must see His universal form by His grace, not with the mind but with spiritual eyes. To see the universal form of Kṛṣṇa, Arjuna is told not to change his mind but his vision. The universal form of Kṛṣṇa is not very important; that will be clear in subsequent verses. Yet because Arjuna wanted to see it, the Lord gives him the particular vision required to see that universal form.

Devotees who are correctly situated in a transcendental relationship with Kṛṣṇa are attracted by loving features, not by a godless display of opulences. The playmates of Kṛṣṇa, the friends of Kṛṣṇa and the parents of Kṛṣṇa never want Kṛṣṇa to show His opulences. They are so immersed in pure love that they do not even know that Kṛṣṇa is the Supreme Personality of Godhead. In their loving exchange they forget that Kṛṣṇa is the Supreme Lord. In the Śrīmad-Bhāgavatam it is stated that the boys who play with Kṛṣṇa are all highly pious souls, and after many, many births they are able to play with Kṛṣṇa. Such boys do not know that Kṛṣṇa is the Supreme Personality of Godhead. They take Him as a personal friend.

🌹 🌹 🌹 🌹 🌹

18 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 421: 11వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 421: Chap. 11, Ver. 07


🌹. శ్రీమద్భగవద్గీత - 421 / Bhagavad-Gita - 421 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 07 🌴

07. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్
మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్ద్రష్టుమిచ్చసి ||

🌷. తాత్పర్యం : ఓ అర్జునా! నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఒక్కమారుగా గాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మరియు భవిష్యత్తున ఏది వీక్ష్మింపదలచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర, జంగమాది సర్వము ఏకస్థానమున దీని యందే సంపూర్ణముగా కలవు.

🌷. భాష్యము : ఒక్కచోటనే నిలిచి ఎవ్వరును సమస్తవిశ్వమును గాంచలేరు. ఎంతటి గొప్ప శాస్త్రజ్ఞుడైనను విశ్వము నందలి ఇతర భాగములలో ఏమి జరుగుచున్నదో గాంచలేడు. కాని అర్జునుని వంటి భక్తుడు మాత్రము విశ్వములోగల సర్వమును గాంచగలుగును. అతడు భూత, భవిష్యత్, వర్తమానములందు దేనినైనను గాంచుటకు వలసిన శక్తిని శ్రీకృష్ణుడు ఒసగును. ఆ విధముగా కృష్ణుని కరుణ వలననే అర్జునుడు సమస్తమును వీక్షింప సమర్థుడయ్యెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 421 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 07 🌴

07. ihaika-sthaṁ jagat kṛtsnaṁ paśyādya sa-carācaram
mama dehe guḍākeśa yac cānyad draṣṭum icchasi

🌷 Translation : O Arjuna, whatever you wish to see, behold at once in this body of Mine! This universal form can show you whatever you now desire to see and whatever you may want to see in the future. Everything – moving and nonmoving – is here completely, in one place.

🌹 Purport : No one can see the entire universe while sitting in one place. Even the most advanced scientist cannot see what is going on in other parts of the universe. But a devotee like Arjuna can see everything that exists in any part of the universe. Kṛṣṇa gives him the power to see anything he wants to see, past, present and future. Thus by the mercy of Kṛṣṇa, Arjuna is able to see everything.

🌹 🌹 🌹 🌹 🌹

17 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 420: 11వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 420: Chap. 11, Ver. 06


🌹. శ్రీమద్భగవద్గీత - 420 / Bhagavad-Gita - 420 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 06 🌴

06. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రానశ్వినౌ మరుతస్తథా |
బహున్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ||

🌷. తాత్పర్యం : చూడుము; ఓ భరతవంశశ్రేష్టుడా., అదితి కుమారులైన పండ్రెండుగురు ఆదిత్యులను; ఎనమండుగురు వస్తువులను; పదునొకండు రుద్రులను; ఇరువురు అశ్వినీకుమారులను; నలుబది తొమ్మిది మంది మరుత్తులను (వాయుదేవతలను); అట్లే; పెక్కు నీవు గతము నందు గాంచనటు అన్ని అద్భుతములను చూడుము.

🌷. భాష్యము : అర్జునుడు శ్రీకృష్ణుని సన్నిహిత స్నేహితుడైనను మరియు విజ్ఞులలో అగ్రగణ్యుడైనను ఆ దేవదేవుని గూర్చి ప్రతిదియు నెరుగుట అతనికి సాధ్యము కాదు. ఆ రూపములను, వ్యక్తీకరణలను మానవులు కని, వినియుండలేదని ఇచ్చట తెలుపబడినది. అట్టి అద్భుతరూపములను శ్రీకృష్ణభగవానుడు ఇప్పుడు వ్యక్తపరచుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 420 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 06 🌴

06. paśyādityān vasūn rudrān aśvinau marutas tathā
bahūny adṛṣṭa-pūrvāṇi paśyāścaryāṇi bhārata


🌷 Translation : O best of the Bhāratas, see here the different manifestations of Ādityas, Vasus, Rudras, Aśvinī-kumāras and all the other demigods. Behold the many wonderful things which no one has ever seen or heard of before.

🌹 Purport : Even though Arjuna was a personal friend of Kṛṣṇa and the most advanced of learned men, it was still not possible for him to know everything about Kṛṣṇa. Here it is stated that humans have neither heard nor known of all these forms and manifestations. Now Kṛṣṇa reveals these wonderful forms.


🌹 🌹 🌹 🌹 🌹


16 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 419: 11వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 419: Chap. 11, Ver. 05


🌹. శ్రీమద్భగవద్గీత - 419 / Bhagavad-Gita - 419 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 05 🌴


05. శ్రీ భగవానువాచ

పశ్య మే పార్థ రూపాణి శతశో(థ సహస్రశ: |
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ||



🌷. తాత్పర్యం : దేవదేవడైన శ్రీకృష్ణుడు పలికెను: ఓ అర్జునా! పృథాకుమారా! లక్షలాదిగాగల నానావిధములును, దివ్యములును, పలు వర్ణమయలును అగు రూపములను (నా విభూతులను) ఇప్పుడు గాంచుము.

🌷. భాష్యము : అర్జునుడు శ్రీకృష్ణుని అతని విశ్వరూపమునందు గాంచగోరెను. అది ఆధ్యాత్మికరూపమే అయినప్పటికిని విశ్వసృష్టి కొరకే వ్యక్తమైనందున భౌతికప్రకృతి యొక్క తాత్కాలిక కాలమునకు ప్రభావితమై యుండును. భౌతికప్రకృతి వ్యక్తమగుట మరియు అవ్యక్తమగుట జరుగునట్లే, శ్రీకృష్ణుని విశ్వరూపము సైతము వ్యక్తమై, అవ్యక్తమగుచుండును. అనగా ఆధ్యాత్మికాకాశమునందు అది శ్రీకృష్ణుని ఇతర రూపముల వలె నిత్యముగా నెలకొనియుండదు.

భక్తుడెన్నడును అట్టి విశ్వరూపమును చూడ కుతూహలపడడు. కాని అర్జునుడు శ్రీకృష్ణుని ఆ విధముగా చూడగోరినందున ఆ దేవదేవుడు దానిని చూపుచున్నాడు. అట్టి విశ్వరూపమును దర్శించుట సామాన్యమానవునకు సాధ్యముకాని విషయము. దానిని గాంచుటకు శ్రీకృష్ణుడే మనుజునకు శక్తినొసగవ లెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 419 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 05 🌴


05. śrī-bhagavān uvāca

paśya me pārtha rūpāṇi śataśo ’tha sahasraśaḥ
nānā-vidhāni divyāni nānā-varṇākṛtīni ca



🌷 Translation : The Supreme Personality of Godhead said: My dear Arjuna, O son of Pṛthā, see now My opulences, hundreds of thousands of varied divine and multicolored forms.

🌹 Purport : Arjuna wanted to see Kṛṣṇa in His universal form, which, although a transcendental form, is just manifested for the cosmic manifestation and is therefore subject to the temporary time of this material nature. As the material nature is manifested and not manifested, similarly this universal form of Kṛṣṇa is manifested and nonmanifested.

It is not eternally situated in the spiritual sky like Kṛṣṇa’s other forms. As far as a devotee is concerned, he is not eager to see the universal form, but because Arjuna wanted to see Kṛṣṇa in this way, Kṛṣṇa reveals this form. This universal form is not possible to be seen by any ordinary man. Kṛṣṇa must give one the power to see it.

🌹 🌹 🌹 🌹 🌹

15 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 418: 11వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 418: Chap. 11, Ver. 04


🌹. శ్రీమద్భగవద్గీత - 418 / Bhagavad-Gita - 418 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 04 🌴

04. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో |
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ||


🌷. తాత్పర్యం : హే ప్రభూ! యోగేశ్వరా! నీ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడనని నీవు తలచినచో దయతో ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపుము.

🌷. భాష్యము : భౌతికేంద్రియముల ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని దర్శించుట, శ్రవణము చేయుట, అవగాహన చేసికొనుట లేదా గ్రహించుట సాధ్యముకాదని తెలపబడినది. కాని తొలి నుండియే మనుజుడు ప్రేమయుతసేవలో నిమగ్నుడైనచో అ భగవానుని గాంచగలుగును. వాస్తవమునకు ఆధ్యాత్మిక స్పులింగము మాత్రమేయైన జీవునకు భగవానుని దర్శనముగాని, అవగాహనముగాని సాధ్యముగాని విషయము. కనుకనే భక్తుడైన అర్జునుడు తన ఊహాశక్తికి లేదా కల్పనాశక్తిపై ఆధారపడక సామాన్యజీవిగా తన పరిమితిని అంగీకరించి, శ్రీకృష్ణభగవానుని అపరిమేయ స్థితిని కీర్తించుచున్నాడు. పరిమితుడైన జీవునికి అపరిమితుడును మరియు అనంతుడును అయిన భగవంతుని గూర్చి తెలియుట సాధ్యము కాదని అర్జునుడు ఎరుగగలిగెను. అపరిమితుడైన వాడు తనను తాను వ్యక్తపరచుకొనినపుడే అతని కరుణచే అతని అపరిమిత స్వభావమును ఎరుగుట సాధ్యపడగలదు.

శ్రీకృష్ణభగవానుడు అచింత్యశక్తి సంపన్నుడు కనుకనే “యోగేశ్వరా” యను పదము సైతము ప్రాధాన్యమును సంతరించుకొన్నది. అనగా అతడు అపరిమితుడైనను తాను కోరినచో తనంతట తాను వ్యక్తము కాగలడు. కనుకనే అర్జునుడు ఇచ్చట ఆజ్ఞలను ఒసగక అతని నిర్హేతుక, అచింత్యకరుణకై ప్రార్థించుచున్నాడు. భక్తిభావనలో తనను సంపూర్ణ శరణాగతుడై భక్తియుతసేవలో నిలువనిదే ఎవ్వరికినీ తనను వ్యక్తపరచుకొనవలసిన అవసరము శ్రీకృష్ణునకు లేదు. కనుక మానసికకల్పనాబలముపై ఆధారపడివారికి శ్రీకృష్ణభగవానుని దర్శించుట సాధ్యము కాదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 418 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 04 🌴

04. manyase yadi tac chakyaṁ mayā draṣṭum iti prabho
yogeśvara tato me tvaṁ darśayātmānam avyayam


🌷 Translation : If You think that I am able to behold Your cosmic form, O my Lord, O master of all mystic power, then kindly show me that unlimited universal Self.

🌹 Purport : It is said that one can neither see, hear, understand nor perceive the Supreme Lord, Kṛṣṇa, by the material senses. But if one is engaged in loving transcendental service to the Lord from the beginning, then one can see the Lord by revelation. Every living entity is only a spiritual spark; therefore it is not possible to see or to understand the Supreme Lord. Arjuna, as a devotee, does not depend on his speculative strength; rather, he admits his limitations as a living entity and acknowledges Kṛṣṇa’s inestimable position. Arjuna could understand that for a living entity it is not possible to understand the unlimited infinite. If the infinite reveals Himself, then it is possible to understand the nature of the infinite by the grace of the infinite.

The word yogeśvara is also very significant here because the Lord has inconceivable power. If He likes, He can reveal Himself by His grace, although He is unlimited. Therefore Arjuna pleads for the inconceivable grace of Kṛṣṇa. He does not give Kṛṣṇa orders. Kṛṣṇa is not obliged to reveal Himself unless one surrenders fully in Kṛṣṇa consciousness and engages in devotional service. Thus it is not possible for persons who depend on the strength of their mental speculations to see Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹

13 Jun 2020

శ్రీమద్భగవద్గీత - 417: 11వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 417: Chap. 11, Ver. 03


🌹. శ్రీమద్భగవద్గీత - 417 / Bhagavad-Gita - 417 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 03 🌴

03. ఏవమేత ద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర |
ద్రష్టుమిచ్చామి తే రూపమైశ్వరం పురుషోత్తమ ||


🌷. తాత్పర్యం : ఓ పురుషోత్తమా! ఓ పరమేశ్వారా! నీవు వర్ణించిన రీతిగా నీ యథార్థరూపమును నేను నా యెదుట చూడగలిగినను, నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను గాంచ నభిలషించుచున్నాను. నీ యొక్క ఆ రూపమును నేను దర్శించగోరుదును.

🌷. భాష్యము : భౌతికవిశ్వమునందు తాను తన స్వీయప్రాతినిధ్యముచే ప్రవేశించియున్న కారణముగా అది సృష్టినొంది, నడుచుచున్నదని శ్రీకృష్ణభగవానుడు పలికెను. తనకు సంబంధించినంతవరకు అర్జునుడు శ్రీకృష్ణుని వచనములచే జ్ఞానవంతుడయ్యెను. కాని శ్రీకృష్ణుడు సామాన్యమానవుడే యని భావించు నవకాశము కలిగిన భావిజనులకు విశ్వాసము కలిగించుట కొరకు అతడు ఆ దేవదేవుని విశ్వరూపమునందు గాంచగోరెను. తద్ద్వారా ఏ విధముగా ఆ భగవానుడు విశ్వమునకు పరుడై యున్నను విశ్వకార్యము నొనరించునో అతడు తెలియనెంచెను. అర్జునుడు శ్రీకృష్ణుని “పురుషోత్తమ” అని సంబోధించు యందును ప్రాముఖ్యము కలదు. ఏలయన దేవదేవుడైన శ్రీకృష్ణుడు అర్జునుని అంతరమునందు నిలిచి అతని కోరికను ఎరిగియుండెను.

స్వీయ రూపమునందు గాంచుటనే సంపూర్ణముగా తృప్తిని బడసియున్నందున తనను విశ్వరూపమునందు నమ్మకమును కలిగించుటకే అతడు విశ్వరూపమును గాంచ గోరుచున్నాడనియు శ్రీకృష్ణుడు ఎరిగియుండెను. అనగా నిర్ధారణమును గూర్చి అర్జునుడు ఎట్టి స్వీయకోరికను కలిగియుండలేదు. భవిష్యత్తులో పలువురు తాము భగవానుని అవతారములని పలుకు అవకాశమున్నందున ఆ విషయమున ఒక ప్రమాణమును లేదా గురుతును ఏర్పరచుటకు అర్జునుడు విశ్వరూపమును గాంచగోరెనని శ్రీకృష్ణుడు అవగతము చేసికొనెను. కనుక తాము అవతారములని ప్రకటించుకొనివారి విషయమున జనులు జాగరూకులై యుండవలెను. తాను కృష్ణుడనని పలుకువాడు విశ్వరూపమును చూపి తన పలుకు సత్యమని జనులకు నిరూపణ చేయ సంసిద్ధుడై యుండవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 417 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 03 🌴

03. evam etad yathāttha tvam ātmānaṁ parameśvara
draṣṭum icchāmi te rūpam aiśvaraṁ puruṣottama


🌷 Translation : O greatest of all personalities, O supreme form, though I see You here before me in Your actual position, as You have described Yourself, I wish to see how You have entered into this cosmic manifestation. I want to see that form of Yours.

🌹 Purport : The Lord said that because He entered into the material universe by His personal representation, the cosmic manifestation has been made possible and is going on. Now as far as Arjuna is concerned, he is inspired by the statements of Kṛṣṇa, but in order to convince others in the future who may think that Kṛṣṇa is an ordinary person, Arjuna desires to see Him actually in His universal form, to see how He is acting from within the universe, although He is apart from it. Arjuna’s addressing the Lord as puruṣottama is also significant. Since the Lord is the Supreme Personality of Godhead, He is present within Arjuna himself; therefore He knows the desire of Arjuna, and He can understand that Arjuna has no special desire to see Him in His universal form, for Arjuna is completely satisfied to see Him in His personal form of Kṛṣṇa.

But the Lord can understand also that Arjuna wants to see the universal form to convince others. Arjuna did not have any personal desire for confirmation. Kṛṣṇa also understands that Arjuna wants to see the universal form to set a criterion, for in the future there would be so many imposters who would pose themselves as incarnations of God. The people, therefore, should be careful; one who claims to be Kṛṣṇa should be prepared to show his universal form to confirm his claim to the people.

🌹 🌹 🌹 🌹 🌹

12 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 416: 11వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 416: Chap. 11, Ver. 02


🌹. శ్రీమద్భగవద్గీత - 416 / Bhagavad-Gita - 416 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 02 🌴

02. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా |
త్వత్త: కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ||


🌷. తాత్పర్యం : ఓ కమలపత్రాక్షా! సర్వజీవుల జనన మరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణము చేసితిని మరియు అవ్యయములైన నీ మహాత్య్మములను కూడ గుర్తించితిని.

🌷. భాష్యము : గడచిన సప్తమాధ్యాయమున శ్రీకృష్ణుడు తానే సమస్త భౌతికజగత్తు యొక్క సృష్టి, నాశములకు కారణమని (అహం కృత్స్నస్య జగత: ప్రభవ: ప్రలయస్తథా:) తనతో నిశ్చయముగా పలికియున్నందున అర్జునుడు ఇచ్చట ఆనందోత్సాహములతో అతనిని “కమలపత్రాక్షా” యని (కృష్ణుని కన్నులు కమలదళములను పోలియుండును) సంభోధించు చున్నాడు.

ఈ విషయమును గూర్చి అర్జునుడు శ్రీకృష్ణుని నుండి సవిస్తరముగా శ్రవణము చేసెను. ఆ భగవానుడు సమస్త సృష్టి, లయములకు కారణమైనను వాటికి అతీతుడై యుండునని అర్జునుడు ఎరిగియుండెను. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా నవమాధ్యాయమున తెలిపినట్లు తాను సర్వవ్యాపకుడైనను సర్వత్రా వ్యక్తిగతముగా నిలిచియుండడు. అచింత్యమైన ఆ దివ్యవిభూతినే తాను పూర్తిగా అవగాహన చేసికొనినట్లు అర్జునుడు ఆంగీకరించుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 416 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 02 🌴

02. bhavāpyayau hi bhūtānāṁ śrutau vistaraśo mayā
tvattaḥ kamala-patrākṣa māhātmyam api cāvyayam

🌷 Translation : O lotus-eyed one, I have heard from You in detail about the appearance and disappearance of every living entity and have realized Your inexhaustible glories.


🌹 Purport : Arjuna addresses Lord Kṛṣṇa as “lotus-eyed” (Kṛṣṇa’s eyes appear just like the petals of a lotus flower) out of his joy, for Kṛṣṇa has assured him, in a previous chapter, ahaṁ kṛtsnasya jagataḥ prabhavaḥ pralayas tathā: “I am the source of the appearance and disappearance of this entire material manifestation.”

Arjuna has heard of this from the Lord in detail. Arjuna further knows that in spite of His being the source of all appearances and disappearances, He is aloof from them. As the Lord has said in the Ninth Chapter, He is all-pervading, yet He is not personally present everywhere. That is the inconceivable opulence of Kṛṣṇa which Arjuna admits that he has thoroughly understood.

🌹 🌹 🌹 🌹 🌹



11 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 415: 11వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 415: Chap. 11, Ver. 01


🌹. శ్రీమద్భగవద్గీత - 415 / Bhagavad-Gita - 415 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 01 🌴

01. అర్జున ఉవాచ

మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |
యత్త్వయోక్తం వచస్తేన మోహో(యం విగతో మమ ||


🌷. తాత్పర్యం : అర్జునుడు పలికెను: ఈ పరమరహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు కరుణచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది.

🌷. భాష్యము : శ్రీకృష్ణుడు సర్వకారణకారణుడని ఈ అధ్యాయము తెలియజేయును. ఎవని నుండి భౌతికవిశ్వములు ఉద్భవించునో అట్టి మహావిష్ణువునకు శైత్యము అతడే కారణము. అట్టి శ్రీకృష్ణుడు అవతారము కాదు. సర్వావతారములకు కారణుడైన అవతారి. ఈ విషయము గడచిన అధ్యాయమున విశదముగా వివరింపబడినది. ఇచ్చట అర్జునుడు తన మోహము తొలగిపోయినట్లుగా పలికినాడు. అనగా అర్జునుడు శ్రీకృష్ణుని సామాన్యమానవునిగా లేక తన స్నేహితునిగా భావించక, సర్వమునకు కారణమైనవానిగా తెలియగలిగినాడు. అతడు పరమ్ ఉత్తేజితుడై తనకు కృష్ణుని వంటి గొప్ప స్నేహితుడు లభించినందులకు పరమానందభరితుడైనాడు. కాని తాను శ్రీకృష్ణుని సర్వకారణకారణునిగా అంగీకరించినను ఇతరులు ఆ విధముగా ఆంగీకరింపరేమోనని అతడు యోచింప నారంభించెను.

కనుకనే శ్రీకృష్ణుని దివ్యత్వమును సర్వులకు విశదపరచుటకు అతడు తన విశ్వరూపమును చూపుమని ఈ అధ్యాయమున శ్రీకృష్ణుని ప్రార్థించెను. వాస్తవమునకు శ్రీకృష్ణుని విశ్వరూపము గాంచినపుడు ఎవరైనను అర్జునుని వలె భీతి నొందెదరు. కాని కరుణాంతరంగుడైన ఆ భగవానుడు విశ్వరూపమును చూపిన పిమ్మట తన మూలరూపమును పొందియుండెను. “నీ హితము కొరకు నేనిది ఉపదేశించుచున్నాను” అని పలుమార్లు శ్రీకృష్ణుడు పలికిన విషయమును సంపూర్ణముగా అంగీకరించిన అర్జునుడు అంతయు శ్రీకృష్ణుని కరుణ చేతనే జరుగుచున్నదని కృతజ్ఞతాపూర్వకముగా ఇచ్చట పలుకుచున్నాడు. అనగా శ్రీకృష్ణుడు సర్వకారణకారణుడనియు మరియు సర్వుల హృదయమునందు పరమాత్మరూపమున వసించియున్నాడనియు అర్జునుడు ఇప్పుడు సంపూర్ణ నిశ్చయమునకు వచ్చెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 415 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 01 🌴

01. arjuna uvāca

mad-anugrahāya paramaṁ guhyam adhyātma-saṁjñitam
yat tvayoktaṁ vacas tena moho ’yaṁ vigato mama

🌷 Translation : Arjuna said: By my hearing the instructions You have kindly given me about these most confidential spiritual subjects, my illusion has now been dispelled.

🌹 Purport : This chapter reveals Kṛṣṇa as the cause of all causes. He is even the cause of the Mahā-viṣṇu, from whom the material universes emanate. Kṛiṣṇa is not an incarnation; He is the source of all incarnations. That has been completely explained in the last chapter. Now, as far as Arjuna is concerned, he says that his illusion is over. This means that Arjuna no longer thinks of Kṛṣṇa as a mere human being, as a friend of his, but as the source of everything. Arjuna is very enlightened and is glad that he has such a great friend as Kṛṣṇa, but now he is thinking that although he may accept Kṛṣṇa as the source of everything, others may not. So in order to establish Kṛṣṇa’s divinity for all, he is requesting Kṛṣṇa in this chapter to show His universal form.

Actually when one sees the universal form of Kṛṣṇa one becomes frightened, like Arjuna, but Kṛṣṇa is so kind that after showing it He converts Himself again into His original form. Arjuna agrees to what Kṛṣṇa has several times said: Kṛṣṇa is speaking to him just for his benefit. So Arjuna acknowledges that all this is happening to him by Kṛṣṇa’s grace. He is now convinced that Kṛṣṇa is the cause of all causes and is present in everyone’s heart as the Supersoul.

🌹 🌹 🌹 🌹 🌹

10 Jun 2020

శ్రీమద్భగవద్గీత - 414: 10వ అధ్., శ్లో 42 / Bhagavad-Gita - 414: Chap. 10, Ver. 42


🌹. శ్రీమద్భగవద్గీత - 414 / Bhagavad-Gita - 414 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 42 🌴

42. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున |
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాం శేన స్థితో జగత్ ||


🌷. తాత్పర్యం : కాని ఓ అర్జునా! ఈ సవిస్తరమైన జ్ఞానము యొక్క అవసరమేమున్నది? కేవలము ఒక అంశమాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించు చుందును.

🌷. భాష్యము : పరమాత్మ రూపమున సమస్తము నందును ప్రవేశించుట ద్వారా శ్రీకృష్ణభగవానుడు సర్వవిశ్వములందును నలిచియుండును. సమస్త విషయములు ఏ విధముగా విభూతిసంపన్నములు మరియు వైభవోపేతములుగా నిలిచియున్నవో అవగతము చేసికొనుటలో అర్థము లేదని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలియజేయుచున్నాడు. శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున చేరియుండుట చేతనే ప్రతిదియు స్థితిని కలిగియున్నదని అతడు అవగతము చేసికొనవలసియున్నది. అనగా మహత్తర జీవియైన బ్రహ్మదేవుని మొదలుగా అతిసూక్ష్మమైన చీమ వరకు గల సమస్తజీవుల యందును శ్రీకృష్ణభగవానుడు పరమాత్మ రూపమున వాటి యందు నిలిచి పోషించుట చేతనే అవి స్థితిని కలిగియున్నవి.

ఏ దేవతార్చనమైనను చివరకు దేవదేవుడైన శ్రీకృష్ణుని చెంతకే లేదా పరమగమ్యమునకే మనుజుని చేర్చునని పలుకు సిద్ధాంతమొకటి కలదు. కాని బ్రహ్మరుద్రాదులు వంటి గొప్ప దేవతలే శ్రీకృష్ణభగవానుని విభుతిలో అంశ మాత్రమునకు ప్రాతినిధ్యము వహించుచున్నందున దేవతార్చనము ఇచ్చట పూర్తిగా నిరసింపబడుచున్నది. జన్మగల ప్రతియొక్కరికి అతడే మూలము మరియు అతని కన్నను ఘనుడెవ్వడును లేడు. అతని కన్నను ఘనుడు గాని, సమానుడు గాని లేనందునే అతడు “ఆసమౌర్థ్వ” యని పిలువబడినాడు. శ్రీమద్భగవద్గీత యందలి “భగవద్విభూతి” అను దశమాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 414 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 42 🌴

42. atha vā bahunaitena kiṁ jñātena tavārjuna
viṣṭabhyāham idaṁ kṛtsnam ekāṁśena sthito jagat

🌷 Translation : But what need is there, Arjuna, for all this detailed knowledge? With a single fragment of Myself I pervade and support this entire universe.


🌹 Purport : The Supreme Lord is represented throughout the entire material universes by His entering into all things as the Supersoul. The Lord here tells Arjuna that there is no point in understanding how things exist in their separate opulence and grandeur. He should know that all things are existing due to Kṛṣṇa’s entering them as Supersoul. From Brahmā, the most gigantic entity, on down to the smallest ant, all are existing because the Lord has entered each and all and is sustaining them. There is a Mission that regularly propounds that worship of any demigod will lead one to the Supreme Personality of Godhead, or the supreme goal.

But worship of demigods is thoroughly discouraged herein because even the greatest demigods like Brahmā and Śiva represent only part of the opulence of the Supreme Lord. He is the origin of everyone born, and no one is greater than Him. He is asamaurdhva, which means that no one is superior to Him and that no one is equal to Him. Thus end the Bhaktivedanta Purports to the Tenth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Opulence of the Absolute.

🌹 🌹 🌹 🌹 🌹

9 Jun 2020

శ్రీమద్భగవద్గీత - 413: 10వ అధ్., శ్లో 41 / Bhagavad-Gita - 413: Chap. 10, Ver. 41


🌹. శ్రీమద్భగవద్గీత - 413 / Bhagavad-Gita - 413 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 41 🌴

41. యద్యద్విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |
తత్తదేవావగచ్చ త్వం మమ తేజోంశసంభవమ్ ||


🌷. తాత్పర్యం : సంపన్నములును, సుందరములును, వైభవోపేతములును అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినదిగా తెలిసికొనుము.

🌷. భాష్యము : భౌతిక, ఆధ్యాత్మికజగముల యందలి ఎట్టి వైభవోపేతము లేదా సుందరసృష్టియైనను శ్రీకృష్ణుని విభూతి యొక్క అంశమాత్ర వ్యక్తీకరణమే యని సర్వులు ఎరుగవలెను. కనుక విశేషవైభవముతో కూడినదేడైనను శ్రీకృష్ణుని విభూతికి ప్రాతినిధ్యముగా భావింపవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 413 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 41 🌴

41. yad yad vibhūtimat sattvaṁ śrīmad ūrjitam eva vā
tat tad evāvagaccha tvaṁ mama tejo-’ṁśa-sambhavam


🌷 Translation : Know that all opulent, beautiful and glorious creations spring from but a spark of My splendor.

🌹 Purport : Any glorious or beautiful existence should be understood to be but a fragmental manifestation of Kṛṣṇa’s opulence, whether it be in the spiritual or material world. Anything extraordinarily opulent should be considered to represent Kṛṣṇa’s opulence.-

🌹 🌹 🌹 🌹 🌹

8 Jun 2020

శ్రీమద్భగవద్గీత - 412: 10వ అధ్., శ్లో 40 / Bhagavad-Gita - 412: Chap. 10, Ver. 40


🌹. శ్రీమద్భగవద్గీత - 412 / Bhagavad-Gita - 412 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 40 🌴

40. నాన్తోస్తి మయ దివ్యానాం విభూతీనాం పరన్తప |
ఏష తూద్దేశత: ప్రోక్తా విభూతేర్విస్తరో మయా ||


🌷. తాత్పర్యం : ఓ శత్రుంజయుడా! నా దివ్య విభూతులకు అంతమనునది లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే.

🌷. భాష్యము : వేదవాజ్మయమున తెలుపబడినట్లు శ్రీకృష్ణభగవానుని విభూతులు మరియు శక్తులు వివిధరీతుల అవగతమైనను వాస్తవమునకు అట్టి విభూతులకు పరిమితిలేదు. కనుకనే సమస్త విభూతులు మరియు శక్తులు ఎన్నడును వివరింప బడలేవు. అనగా అర్జునుని జిజ్ఞాసను సంతృప్తిపరచుట కొరకు శ్రీకృష్ణభగవానుడు కేవలము కొన్ని ఉదాహరణములను మాత్రమే వివరించి యున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 412 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 40 🌴

40. nānto ’sti mama divyānāṁ vibhūtīnāṁ paran-tapa
eṣa tūddeśataḥ prokto vibhūter vistaro mayā


🌷 Translation : O mighty conqueror of enemies, there is no end to My divine manifestations. What I have spoken to you is but a mere indication of My infinite opulences.

🌹 Purport : As stated in the Vedic literature, although the opulences and energies of the Supreme are understood in various ways, there is no limit to such opulences; therefore not all the opulences and energies can be explained. Simply a few examples are being described to Arjuna to pacify his inquisitiveness.

🌹 🌹 🌹 🌹 🌹

7 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 411: 10వ అధ్., శ్లో 39 / Bhagavad-Gita - 411: Chap. 10, Ver. 39


🌹. శ్రీమద్భగవద్గీత - 411 / Bhagavad-Gita - 411 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 39 🌴

39. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున |
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ ||


🌷. తాత్పర్యం : ఇంకను ఓ అర్జునా! సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. స్థావరజంగములలో నేను లేకుండ ఏదియును స్థితిని కలిగి యుండలేదు.

🌷. భాష్యము : ప్రతిదానికి ఒక కారణముండును. అట్టి కారణము లేదా బీజము శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు శక్తి లేకుండా ఏదియును స్థితిని కలిగియుండలేదు కనుక అతడు సర్వశక్తిమంతుడని పిలువబడినాడు. అతని శక్తి లేకుండా స్థావరము గాని, జంగమము గాని ఏదియును మనుగడను కలిగియుండలేదు. కనుకనే కృష్ణుని శక్తిపై ఆధారపడనిదిగా గోచరించునది మాయగా (లేనటువంటిది) పిలువబడును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 411 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 39 🌴

39. yac cāpi sarva-bhūtānāṁ bījaṁ tad aham arjuna
na tad asti vinā yat syān mayā bhūtaṁ carācaram


🌷 Translation : Furthermore, O Arjuna, I am the generating seed of all existences. There is no being – moving or nonmoving – that can exist without Me.

🌹 Purport : Everything has a cause, and that cause or seed of manifestation is Kṛṣṇa. Without Kṛṣṇa’s energy, nothing can exist; therefore He is called omnipotent. Without His potency, neither the movable nor the immovable can exist. Whatever existence is not founded on the energy of Kṛṣṇa is called māyā, “that which is not.”

🌹 🌹 🌹 🌹 🌹

6 Jun 2020

శ్రీమద్భగవద్గీత - 410: 10వ అధ్., శ్లో 38 / Bhagavad-Gita - 410: Chap. 10, Ver. 38


🌹. శ్రీమద్భగవద్గీత - 410 / Bhagavad-Gita - 410 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 38 🌴

38. దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ |
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ||


🌷. తాత్పర్యం : నేను చట్టవిరుద్ధతను అణుచువానిలో శిక్షను, జయమును కోరువారిలో నీతిని, రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును అయి యున్నాను.

🌷. భాష్యము : దుష్కృతులైన వారిని శిక్షించు విధానములు దండనసాధనములలో ముఖ్యమైనవి. కనుక దుష్కృతులు శిక్షింపబడినప్పుడు ఆ శిక్షను గూర్చువాడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. ఏదేని ఒక రంగమునందు జయమును పొంద యత్నించువారిలో మిక్కిలి విజయవంతమైన అంశము నీతి. శ్రవణము, చింతనము, ధ్యానాది గుహ్యమగు కర్మలలో మౌనమైనది. ఏలయన మౌనము ద్వారా మనుజడు త్వరితముగా పురోగతిని సాధింపగలడు. జ్ఞానవంతుడైనవాడు భగవానుని ఉన్నత, గౌణప్రకృతులైన ఆత్మ మరియు భౌతికపదార్థముల నడుమ అంతరమును విశ్లేషించగలిగియుండును. అట్టి జ్ఞానము స్వయముగా శ్రీకృష్ణుడే.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 410 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 38 🌴

38. daṇḍo damayatām asmi nītir asmi jigīṣatām
maunaṁ caivāsmi guhyānāṁ jñānaṁ jñānavatām aham


🌷 Translation : Among all means of suppressing lawlessness I am punishment, and of those who seek victory I am morality. Of secret things I am silence, and of the wise I am the wisdom.

🌹 Purport : There are many suppressing agents, of which the most important are those that cut down miscreants. When miscreants are punished, the agency of chastisement represents Kṛṣṇa. Among those who are trying to be victorious in some field of activity, the most victorious element is morality. Among the confidential activities of hearing, thinking and meditating, silence is most important because by silence one can make progress very quickly. The wise man is he who can discriminate between matter and spirit, between God’s superior and inferior natures. Such knowledge is Kṛṣṇa Himself.

🌹 🌹 🌹 🌹 🌹

5 Jun 2020

శ్రీమద్భగవద్గీత - 409: 10వ అధ్., శ్లో 37 / Bhagavad-Gita - 409: Chap. 10, Ver. 37


🌹. శ్రీమద్భగవద్గీత - 409 / Bhagavad-Gita - 409 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 37 🌴

37. వృష్ణీనాం వాసుదేవో(స్మి పాణ్డవానాం ధనంజయ: |
మునీనామప్యహం వ్యాస: కవీనాముశనా కవి: ||


🌷. తాత్పర్యం : నేను వృష్ణివంశీయులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను అయి యున్నాను.

🌷. భాష్యము : శ్రీకృష్ణుడు ఆద్యదేవదేవుడు కాగా, బలదేవుడు అతని అవ్యవహిత విస్తృతాంశయై యున్నాడు. శ్రీకృష్ణుడు మరియు బలరాముడు వసుదేవుని తనయులుగా అవతరించి యున్నందున వారిరువురిని వాసుదేవులుగా పిలువవచ్చును. వేరొక దృష్టితో చూచినచో శ్రీకృష్ణుడు ఎన్నడును బృందావనమును వీడడు కనుక, బృందావనమునకు అన్యమైన స్థలములలో దర్శితమైన కృష్ణుని రూపములు అతని విస్తృతాంశములై యున్నవి. అనగా శ్రీకృష్ణుని విస్తృతాంశయైన వాసుదేవుడు శ్రీకృష్ణుని కన్నను అన్యుడు కాదు. భగవద్గీత యందలి ఈ శ్లోకమున గల వాసుదేవ పదము బలరామునే సూచించుచున్నదని అవగతము చేసికొనవలెను. ఏలయన బలరాముడే సర్వవతారములకు మూలమై యున్నందున వాసుదేవ అంశములకు సైతము అతడే మూలమై యున్నాడు. ఈ విధమైన శ్రీకృష్ణభగవానుని అవ్యవహిత విస్తారములు “స్వాంశములు” (వ్యక్తిగత రూపములు) అని పిలువబడును. ఇవియేగాక “విభిన్నాంశములు” అని పిలువబడు విస్తృతరూపములును కలవు.

పాండురాజు తనయులలో ధనంజయునిగా పేరొందిన అర్జునుడు నరులలో శ్రేష్టుడు గనుక శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. మునులు లేక వేదజ్ఞానపారంగతులైన మనుజులలో వ్యాసుడు శ్రేష్టుడు. ఏలయన ఆయన ఈ కలియుగ జనులకు అవగతమగునట్లు భిన్నపద్దతులలో వేదజ్ఞానమును వివరించెను. అంతియేగాక వ్యాసుడు శ్రీకృష్ణుని అవతారమై యున్నాడు. కనుక అతడు శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. ఎట్టి విషయమును గూర్చియైనను సమగ్రముగా ఆలోచింప సమర్థులైన వారిని కవులందురు. అట్టి కవులలో దానవుల గురువైన ఉశనుడు(శుక్రాచార్యుడు) అసాధారణ మేధాసంపన్నుడు మరియు దూరదృష్టి కలిగిన రాజనీతినిపుణుడు కనుక శ్రీకృష్ణుని విభూతికి ప్రతినిధియై యున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 409 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 37 🌴

37. vṛṣṇīnāṁ vāsudevo ’smipāṇḍavānāṁ dhanañ-jayaḥ
munīnām apy ahaṁ vyāsaḥ kavīnām uśanā kaviḥ


🌷 Translation : Of the descendants of Vṛṣṇi I am Vāsudeva, and of the Pāṇḍavas I am Arjuna. Of the sages I am Vyāsa, and among great thinkers I am Uśanā.

🌹 Purport : Kṛṣṇa is the original Supreme Personality of Godhead, and Baladeva is Kṛṣṇa’s immediate expansion. Both Lord Kṛṣṇa and Baladeva appeared as sons of Vasudeva, so both of Them may be called Vāsudeva. From another point of view, because Kṛṣṇa never leaves Vṛndāvana, all the forms of Kṛṣṇa that appear elsewhere are His expansions. Vāsudeva is Kṛṣṇa’s immediate expansion, so Vāsudeva is not different from Kṛṣṇa. It is to be understood that the Vāsudeva referred to in this verse of Bhagavad-gītā is Baladeva, or Balarāma, because He is the original source of all incarnations and thus He is the sole source of Vāsudeva. The immediate expansions of the Lord are called svāṁśa (personal expansions), and there are also expansions called vibhinnāṁśa (separated expansions).

Amongst the sons of Pāṇḍu, Arjuna is famous as Dhanañjaya. He is the best of men and therefore represents Kṛṣṇa. Among the munis, or learned men conversant in Vedic knowledge, Vyāsa is the greatest because he explained Vedic knowledge in many different ways for the understanding of the common mass of people in this Age of Kali. And Vyāsa is also known as an incarnation of Kṛṣṇa; therefore Vyāsa also represents Kṛṣṇa. Kavis are those who are capable of thinking thoroughly on any subject matter. Among the kavis, Uśanā, Śukrācārya, was the spiritual master of the demons; he was an extremely intelligent and far-seeing politician. Thus Śukrācārya is another representative of the opulence of Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


4 Jun 2020

శ్రీమద్భగవద్గీత - 408: 10వ అధ్., శ్లో 36 / Bhagavad-Gita - 408: Chap. 10, Ver. 36


🌹. శ్రీమద్భగవద్గీత - 408 / Bhagavad-Gita - 408 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 36 🌴

36. ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ |
జయోస్మిస్మి వ్యవసా యోస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ||


🌷 . తాత్పర్యము : నేను మోసములలో జూదమును, జేజస్వులలో తేజస్సునై యున్నాను. ఆలాగుననే జయమును, సాహసమును, బలవంతులలో బలమును నేనే.

🌻. భాష్యము : విశ్వమనదంతటను పలువిధములైన మోసకారులు కలరు. వారి పలువిధములైన మోసములలో జూదము అగ్రగణ్యమై యున్నందున అది శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. అనగా పరమపురుషునిగా శ్రీకృష్ణుడు సామాన్యపురుషుని కన్నను గొప్ప వంచన చేయగలడు. ఒకవేళ అతడు ఎవ్వరినైనను వంచింప దలచినచో ఎవ్వరును వంచన యందు అతనిని అధిగమింపలేరు. అనగా శ్రీకృష్ణుని ఘనత ఒక రంగమునందే గాక, అన్ని రంగములందు గొప్పదై యున్నది.

జయించు వారిలో జయమును, తేజస్సులలో తేజస్సును అతడే. యత్నశీలురులలో ఘన యత్నశీలుడు, సాహసులలో అతిసాహసుడు మరియు బలము గలవారిలో అతిబలశాలి అతడే. శ్రీకృష్ణుడు ధరత్రిపై అవతరించినపుడు ఎవ్వరును అతని శక్తిని అధిగమింపలేకపోయిరి. అతడు చిన్ననాతనే గోవర్ధనపర్వతము నెత్తెను. అట్టి శ్రీకృష్ణుని మోసమునందు గాని, తేజస్సునందు గాని, జయమునందు గాని, యత్నమునందు గాని మరియు బలమునందు గాని ఎవ్వరును అధిగమింపలేరు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 408 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 36 🌴

36. dyūtaṁ chalayatām asmi tejas tejasvinām aham
jayo ’smi vyavasāyo ’smi sattvaṁ sattvavatām aham


🌷 Translation : I am also the gambling of cheats, and of the splendid I am the splendor. I am victory, I am adventure, and I am the strength of the strong.

🌹 Purport : There are many kinds of cheaters all over the universe. Of all cheating processes, gambling stands supreme and therefore represents Kṛṣṇa. As the Supreme, Kṛṣṇa can be more deceitful than any mere man. If Kṛṣṇa chooses to deceive a person, no one can surpass Him in His deceit. His greatness is not simply one-sided – it is all-sided. Among the victorious, He is victory. He is the splendor of the splendid. Among the enterprising and industrious, He is the most enterprising, the most industrious.

Among adventurers He is the most adventurous, and among the strong He is the strongest. When Kṛṣṇa was present on earth, no one could surpass Him in strength. Even in His childhood He lifted Govardhana Hill. No one can surpass Him in cheating, no one can surpass Him in splendor, no one can surpass Him in victory, no one can surpass Him in enterprise, and no one can surpass Him in strength.

🌹 🌹 🌹 🌹 🌹

3 Jun 2020

శ్రీమద్భగవద్గీత - 407: 10వ అధ్., శ్లో 35 / Bhagavad-Gita - 407: Chap. 10, Ver. 35


🌹. శ్రీమద్భగవద్గీత - 407 / Bhagavad-Gita - 407 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 35 🌴

35. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛన్దసామహం |
మాసానాం మార్గశీర్షో(హమృతూనాం కుసుమాకర: ||


🌷. తాత్పర్యం : నేను సామవేద మంత్రములలో బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంతఋతువును అయి యున్నాను.

🌻. భాష్యము : వేదములలో తాను సామవేదమునని శ్రీకృష్ణభగవానుని ఇదివరకే వివరించియున్నాడు. వివిధ దేవతలచే గానము చేయబడు శ్రావ్యగేయభరితమైన ఆ సామవేదమునందు “బృహత్సామము” అనునది ఒకటి. అసాధారణ మధురిమను కలిగియుండెడి ఆ బృహత్సామము నడిరేయి యందు గానము చేయబడు చుండును. సంస్కృతమున కవిత్వమునకు అనేక నియమములుండును. ఆధునిక కవిత్వములలో జరుగురీతి దానియందు ప్రాస మరియు ఛందములు తోచినరీతిని వ్రాయుబడవు. అట్లు నియమబద్ధముగా వ్రాయబడిన కవిత్వములలో గాయత్రీమంత్రము శ్రీమద్భావతమునందు పేర్కొనబడినది. ఈ మంత్రము భగవదనుభూతికై ప్రత్యేకముగా నిర్ణయింప బడియున్నందున దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును.

ఆధ్యాత్మిక పురోగతినొందిన మహాత్ముల కొరకై నిర్దేశింపబడియున్న దీనిని జపించుచు ఆధ్యాత్మికజయము నొందెడివారు భగవానుని దివ్యస్థానమున ప్రవేశింపగలరు. కాని ఈ మహామంత్రము జపించుటకు పూర్వము మనుజుడు పూర్ణత్వమునొందిన మనుజుని లక్షణములను (సత్వగుణమును) అలవరచుకొనవలెను. పరబ్రహ్మము యొక్క ధ్వని అవతారముగా భావింపబడు ఈ గాయత్రీమంత్రము వైదికజీవన విధానమున అత్యంత ముఖ్యమైనది. బ్రహ్మదేవునిచే ప్రారంభింపబడిన ఈ మంత్రము పరంపర రూపముగా వ్యాప్తినొందినది. మార్గశీర్షమాసము (నవంబర్ – డిసంబర్) అన్ని మాసముల యందును ఉత్తమమైనదిగా పరిగణింపబడును. ఏలయన ఆ సమయమున జనులు పొలముల నుండి ధ్యానమును సేకరించి ఆనందముతో నుందురు. అలాగుననే ఋతువుల యందు వసంతఋతువు ప్రపంచమంతటికిని అత్యంత ప్రియమైనది. వాతావరణము అతివేడి, అతిశీతలముగా లేకుండ వృక్షములు ఫల, పుష్పభరితమై యండుటయే అందులకు కారణము. ఈ వసంతఋతువు నందే శ్రీకృష్ణుని పలులీలలను గుర్తుచేసికొను పలు ఉత్సవములు జరుపబడు చుండును. కనుకనే ఋతువులన్నింటిని యందును వసంతఋతువు అత్యంత ఆనందదాయకమైనదిగా పరిగణింపబడును. అది దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించుచున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 407 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 35 🌴

35. bṛhat-sāma tathā sāmnāṁ gāyatrī chandasām aham
māsānāṁ mārga-śīrṣo ’ham ṛtūnāṁ kusumākaraḥ

🌷 Translation : Of the hymns in the Sāma Veda I am the Bṛhat-sāma, and of poetry I am the Gāyatrī. Of months I am Mārgaśīrṣa [November-December], and of seasons I am flower-bearing spring.

🌹 Purport : It has already been explained by the Lord that amongst all the Vedas, He is the Sāma Veda. The Sāma Veda is rich with beautiful songs played by the various demigods. One of these songs is the Bṛhat-sāma, which has an exquisite melody and is sung at midnight. In Sanskrit, there are definite rules that regulate poetry; rhyme and meter are not written whimsically, as in much modern poetry. Amongst the regulated poetry, the Gāyatrī mantra, which is chanted by the duly qualified brāhmaṇas, is the most prominent. The Gāyatrī mantra is mentioned in the Śrīmad-Bhāgavatam. Because the Gāyatrī mantra is especially meant for God realization, it represents the Supreme Lord. This mantra is meant for spiritually advanced people, and when one attains success in chanting it, he can enter into the transcendental position of the Lord.

One must first acquire the qualities of the perfectly situated person, the qualities of goodness according to the laws of material nature, in order to chant the Gāyatrī mantra. The Gāyatrī mantra is very important in Vedic civilization and is considered to be the sound incarnation of Brahman. Brahmā is its initiator, and it is passed down from him in disciplic succession. The month of November-December is considered the best of all months because in India grains are collected from the fields at this time and the people become very happy. Of course spring is a season universally liked because it is neither too hot nor too cold and the flowers and trees blossom and flourish. In spring there are also many ceremonies commemorating Kṛṣṇa’s pastimes; therefore this is considered to be the most joyful of all seasons, and it is the representative of the Supreme Lord, Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹

2 Jun 2020


శ్రీమద్భగవద్గీత - 406: 10వ అధ్., శ్లో 34 / Bhagavad-Gita - 406: Chap. 10, Ver. 34



🌹. శ్రీమద్భగవద్గీత - 406 / Bhagavad-Gita - 406 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 34 / Chapter 10 - Vibhuti Yoga - 34 🌴

34. మృత్యు: సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ |
కీర్తి: శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి: క్షమా ||


🌷. తాత్పర్యం : సమస్తమును మ్రింగివేయునటువంటి మృత్యువును మరియు సృష్టింపబడుచున్న జీవులకు ఉద్భవమును నేనే అయి యున్నాను. స్త్రీల యందలి యశస్సు, వైభవము, మనోహరమగు వాక్కు, జ్ఞాపకశక్తి, బుద్ధి, ధృతి, ఓర్పును నేనే.

🌻. భాష్యము : జన్మతోడనే మనుజుడు ప్రతిక్షణము మరణించుట ఆరంభించును. అనగా మృత్యువు జీవుని ప్రతిక్షణము కబళించుచున్నను దాని చివరి ఘాతమే మృత్యువుగా పిలువబడును. ఆ మృత్యువే శ్రీకృష్ణుడు. భవిష్యత్ పురోగతికి సంబంధించినంతవరకు జీవులు పుట్టుట, పెరుగుట, కొంతకాలము స్థితిని కలిగి యుండుట, ఇతరములను సృష్టించుట, క్షీణించుట, అంత్యమున నశించుట యనెడి ఆరువిధములైన మార్పులను పొందుచుందురు. ఇట్టి మార్పులలో మొదటిదైన గర్భము నుండి జననము శ్రీకృష్ణుడే. ఆ జన్మమే తదుపరి కర్మలకు నాందియై యున్నది.

కీర్తి, శ్రీ:, వాక్కు, స్మృతి, బుద్ధి, ధృఢత్వము, క్షమా అను ఏడు వైభవములు స్త్రీవాచకములుగా భావింపబడును. వానినన్నింటిని గాని లేక కొన్నింటినిగాని మనుజుడు కలిగియున్నచో కీర్తినీయుడగును. ఎవరైనా ధర్మాత్ముడని ప్రసాద్ది నొందినచో అతడు కీర్తివంతుడు, వైభవోపేతుడు కాగలడు. ఉదాహరణకు సంస్కృతము పూర్ణమైన భాషయైనందున వైభవోపేతమై యున్నది. ఏదేని విషయమును అధ్యయనమును చేసిన పిమ్మట మనుజడు దానిని జ్ఞప్తి యందుంచుకొనగలిగినచో అతడు చక్కని “స్మృతి”ని కలిగియున్నాడని భావము. పలువిషయములపై పెక్కు గ్రంథములు పఠించుటయే గాక, వాటిని అవగాహన చేసికొని అవసరమైనప్పుడు ఉపయోగించుట “మేధ” యనబడును. అది మరియొక విభూతి. చంచలత్వమును జయించుటయే దృఢత్వము (ధృతి) అని పిలువబడును. పరిపూర్ణయోగ్యత కలిగియుండియు నమ్రతను, మృదుస్వభావమును కలిగి సుఖదుఃఖములందు సమత్వమును కలిగియున్నచో మనుజుని ఆ లక్షణము (వైభవము) ‘క్షమా’ అనబడును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 406 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 34 🌴

34. mṛtyuḥ sarva-haraś cāham udbhavaś ca bhaviṣyatām
kīrtiḥ śrīr vāk ca nārīṇāṁ smṛtir medhā dhṛtiḥ kṣamā


🌷 Translation : I am all-devouring death, and I am the generating principle of all that is yet to be. Among women I am fame, fortune, fine speech, memory, intelligence, steadfastness and patience.

🌹 Purport : As soon as a man is born, he dies at every moment. Thus death is devouring every living entity at every moment, but the last stroke is called death itself. That death is Kṛṣṇa. As for future development, all living entities undergo six basic changes. They are born, they grow, they remain for some time, they reproduce, they dwindle, and finally they vanish. Of these changes, the first is deliverance from the womb, and that is Kṛṣṇa. The first generation is the beginning of all future activities.

The seven opulences listed – fame, fortune, fine speech, memory, intelligence, steadfastness and patience – are considered feminine. If a person possesses all of them or some of them he becomes glorious. If a man is famous as a righteous man, that makes him glorious. Sanskrit is a perfect language and is therefore very glorious. If after studying one can remember a subject matter, he is gifted with a good memory, or smṛti. And the ability not only to read many books on different subject matters but to understand them and apply them when necessary is intelligence (medhā), another opulence. The ability to overcome unsteadiness is called firmness or steadfastness (dhṛti). And when one is fully qualified yet is humble and gentle, and when one is able to keep his balance both in sorrow and in the ecstasy of joy, he has the opulence called patience (kṣamā).

🌹 🌹 🌹 🌹 🌹

1 Jun 2020