శ్రీమద్భగవద్గీత - 332: 08వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 332: Chap. 08, Ver. 22


🌹. శ్రీమద్భగవద్గీత - 332 / Bhagavad-Gita - 332 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 22 🌴

22. పురుష: స పర: పార్థ భక్త్యా లభ్యస్త్యనన్యయా |
యస్యాన్త:స్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ||


🌷. తాత్పర్యం :

సర్వులకన్నను అధికుడైన దేవదేవుడు అనన్యభక్తి చేతనే పొందబడును. అతడు తన ధామమునందు నిలిచియున్నను సర్వవ్యాపియై యున్నాడు మరియు అతని యందే సమస్తము స్థితిని కలిగియున్నది.

🌷. భాష్యము :

పరమగమ్యస్థానము పరమపురుషుడైన శ్రీకృష్ణుని ధామమే యని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది.

అది పునరావృత్తిరహితముగు స్థానము. అట్టి ధామమును బ్రహ్మసంహిత “ఆనందచిన్మయరసము” అని వర్ణించినది. అనగా అచ్చట ప్రతిదియు దివ్యానందపూర్ణమై యుండును. అచ్చట వైవిధ్యమంతయు ఆధ్యాత్మిక ఆనందపూర్ణమేగాని భౌతికము కాదు.

సప్తమాధ్యాయమున తెలుపబడినట్లు అచ్చట ప్రకటితమగు సర్వము శ్రీకృష్ణభగవానుని ఆధ్యాత్మికశక్తికి సంబంధించినదే గావున అచ్చటి వైవిధ్యము ఆ భగవానుని విస్తారమే అయి యున్నది.

ఇక భౌతికజగమునకు సంబంధించినంత వరకు అతడు స్వధామమునందే సదా నిలిచియున్నను తన భౌతికశక్తి ద్వారా సర్వత్రా వ్యాపించియుండును. అనగా శ్రీకృష్ణభగవానుడు తన ఆధ్యాత్మికశక్తి మరియు భౌతికశక్తుల ద్వారా ఆధ్యాత్మిక, భౌతికముల యందంతటను నిలిచియుండును.

“యస్యాన్త:స్థాని” యనగా సర్వము అతని యందే నిలిచియున్నదని భావము. అనగా ప్రతిదియు అతని ఆధ్యాత్మికశక్తియందో లేక భౌతికశక్తియందో నిలిచియుండును. ఈ రెండుశక్తుల ద్వారానే ఆ దేవదేవుడు సర్వవ్యాపియై యున్నాడు.

“భక్త్యా” అను పదము ద్వారా ఇట స్పష్టముగా సూచింపబడినట్లు దివ్యమైన కృష్ణలోకమునందు గాని, అసంఖ్యాకములుగా నున్న వైకుంటలోకములందు గాని ప్రవేశుంచుట కేవలము భక్తి ద్వారానే సాధ్యము కాగలదు. భగవద్దామమును పొందుటకు ఇతరమైన ఏ పద్దతియు సహకరింపదు.

అట్టి ధామము మరియు భగవానుని గోపాలతాపన్యుపనిషత్తు (3.2) “ఏకోవశీ సర్వగ: కృష్ణ:” యని వర్ణించినది. అనగా ఆ దివ్యధామమున శ్రీకృష్ణనామాంకితుడైన దేవదేవుడు ఒక్కడే కలడు. అతడు దివ్యకరుణాపూర్ణుడు. ఒక్కనిగానే స్థితుడై యున్నప్పటికిని ఆ దేవదేవుడు కోట్లాది సంపూర్ణరూపములలో విస్తరించియుండును.

నిశ్చలముగా నిలిచియున్నను ఫలములను, పుష్పములను, పత్రములను కలిగయుండెడి వృక్షముతో అట్టి దేవదేవుని వేదములు పోల్చుచున్నవి. శ్రీకృష్ణుని సంపూర్ణాంశములైన వైకుంఠాధిపతులు చతుర్బాహులు కలిగి పురుషోత్తముడు, త్రివిక్రముడు, శ్రీధరుడు, వాసుదేవుడు, దామోదరుడు, జనార్ధనుడు, నారాయణుడు, వామనుడు, పద్మనాభుడు అది పలునామములతో పిలువబడుదురు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 332 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 22 🌴

22 . puruṣaḥ sa paraḥ pārtha bhaktyā labhyas tv ananyayā
yasyāntaḥ-sthāni bhūtāni yena sarvam idaṁ tatam


🌷 Translation :

The Supreme Personality of Godhead, who is greater than all, is attainable by unalloyed devotion. Although He is present in His abode, He is all-pervading, and everything is situated within Him.

🌹 Purport :

It is here clearly stated that the supreme destination, from which there is no return, is the abode of Kṛṣṇa, the Supreme Person. The Brahma-saṁhitā describes this supreme abode as ānanda-cinmaya-rasa, a place where everything is full of spiritual bliss.

All the variegatedness manifest there is of the quality of spiritual bliss – nothing there is material.

That variegatedness is expanded as the spiritual expansion of the Supreme Godhead Himself, for the manifestation there is totally of the spiritual energy, as explained in Chapter Seven.

As far as this material world is concerned, although the Lord is always in His supreme abode, He is nonetheless all-pervading by His material energy.

So by His spiritual and material energies He is present everywhere – both in the material and in the spiritual universes.

Yasyāntaḥ-sthāni means that everything is sustained within Him, within either His spiritual or material energy. The Lord is all-pervading by these two energies.

🌹 🌹 🌹 🌹 🌹

20 Mar 2020