🌹. శ్రీమద్భగవద్గీత - 313 / Bhagavad-Gita - 313 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 03 🌴
03. శ్రీభగవానువాచ
అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ఆధ్యాత్మముచ్యతే |
భూతభావోద్భవకరో విసర్గ: కర్మసంజ్ఞిత: ||
🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పలికెను : నాశరహితమును, దివ్యమును అగు జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్యస్వభావమే ఆధ్యాత్మమనియు చెప్పబడును. జీవుల దేహోద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము (కామ్యకర్మలు) అనబడును.
🌷. భాష్యము :
బ్రహ్మము నాశరహితమును మరియు శాశ్వతమును అయి యున్నది. కాలములో దాని సహజస్థితి యందు ఎట్టి మార్పు ఉండదు. అట్టి బ్రహ్మమునకు పరముగా నున్నదే పరబ్రహ్మము. బ్రహ్మము జీవుని సూచించగా పరబ్రహ్మము దేవదేవుడైన శ్రీకృష్ణుని సూచించును. అట్టి జీవుడు భౌతికజగత్తు నందు స్వీకరించెడి స్థితి అతని నిజస్థితి భిన్నమైనటువంటిది.
భౌతికచైతన్యములో అతడు ప్రకృతితో ప్రభువుగా నగుటకు యత్నించినను ఆధ్యాత్మిక చైతన్యములో (కృష్ణభక్తిభావన యందు) మాత్రము శ్రీకృష్ణభగవానునికి దాసునిగా వర్తించును. అట్టి భౌతికచైతన్యము నందున్నంత కాలము అతడు భౌతికజగమున వివిధములైన దేహములను పొందవలసివచ్చును. అదియే భౌతికచైతన్యపు ప్రభావము వలన కలిగెడి విభిన్నసృష్టి లేదా కర్మము అనబడును.
వేదవాజ్మయమునందు జీవుడు జీవాత్మగా మరియు బ్రహ్మముగా పిలువబడెనే గాని పరబ్రహ్మముగా ఎన్నడును పిలువబడలేదు. అట్టి జీవుడు కొన్నిమార్లు భౌతికచైతన్యముతో తాదాత్మ్యము చెంది తనను భౌతికమని భావించును. మరికొన్నిమార్లు ఉన్నతమైన ఆధ్యాత్మికశక్తితో తనను గుర్తించుచుండును. ఈ విధముగా అతడు వివధగతులను పొందుచుండును. కనుకనే అతడు శ్రీకృష్ణభగవానుని తటస్థశక్తిగా పిలువబడినాడు. అతని భౌతిక, ఆధ్యాత్మిక తాదాత్మ్యము ననుసరించి అతడు భౌతికదేహమునుగాని లేదా ఆధ్యాత్మికదేహమునుగాని పొందుచుండును. భౌతికప్రకృతిలో అతడు ఎనుమదినాలుగులక్షల జీవరాసులలోని ఏదేని ఒక జన్మను పొందినను ఆధ్యాత్మిక స్వభావమున మాత్రము ఒకే దివ్యదేహమును కలిగి యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 313 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 03 🌴
03. śrī-bhagavān uvāca
akṣaraṁ brahma paramaṁ svabhāvo ’dhyātmam ucyate
bhūta-bhāvodbhava-karo visargaḥ karma-saṁjñitaḥ
🌷 Translation :
The Supreme Personality of Godhead said: The indestructible, transcendental living entity is called Brahman, and his eternal nature is called adhyātma, the self. Action pertaining to the development of the material bodies of the living entities is called karma, or fruitive activities.
🌹 Purport :
Brahman is indestructible and eternally existing, and its constitution is not changed at any time. But beyond Brahman there is Para-brahman. Brahman refers to the living entity, and Para-brahman refers to the Supreme Personality of Godhead. The constitutional position of the living entity is different from the position he takes in the material world. In material consciousness his nature is to try to be the lord of matter, but in spiritual consciousness, Kṛṣṇa consciousness, his position is to serve the Supreme. When the living entity is in material consciousness, he has to take on various bodies in the material world. That is called karma, or varied creation by the force of material consciousness.
In Vedic literature the living entity is called jīvātmā and Brahman, but he is never called Para-brahman. The living entity (jīvātmā) takes different positions – sometimes he merges into the dark material nature and identifies himself with matter, and sometimes he identifies himself with the superior, spiritual nature. Therefore he is called the Supreme Lord’s marginal energy. According to his identification with material or spiritual nature, he receives a material or spiritual body. In material nature he may take a body from any of the 8,400,000 species of life, but in spiritual nature he has only one body.
🌹 🌹 🌹🌹 🌹
1 Mar 2020