శ్రీమద్భగవద్గీత - 324: 08వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 324: Chap. 08, Ver. 14


🌹. శ్రీమద్భగవద్గీత - 324 / Bhagavad-Gita - 324 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 14 🌴

14. అనన్యచేతా: సతతం యో మాం స్మరతి నిత్యశ: |
తస్యాహం సులభ: పార్థ నిత్యయుక్తస్య యోగిన: ||


🌷. తాత్పర్యం :

ఓ పార్థా! అనన్యచిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుతసేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై యున్నాను.

🌷. భాష్యము :

దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియోగాముతో సేవించు శుద్ధభక్తుల చరమగమ్యము ఈ శ్లోకమున ముఖ్యముగా వివరించబడినది. గడచిన అధ్యాయపు శ్లోకములందు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, కల్పనాపూర్ణ తత్త్వవేత్తలనెడి నాలుగురకముల భక్తులు పేర్కొనబడిరి. కర్మయోగము, జ్ఞానయోగము, హటయోగము మొదలగు వివధ ముక్తివిధానములు కూడా వివరింపబడినవి.

ఈ యోగవిధానములు భక్తిని కొద్దిగా కలిగియున్నను, ఈ శ్లోకమునందు మాత్రము జ్ఞాన, కర్మ, హతాది ఎట్టి యోగములతోను సంపర్కము లేనటువంటి శుద్ధభక్తియోగము పేర్కొనబడినది. “అనన్యచేతా:” అను పదముతో తెలుపబడినట్లు శుద్ధభక్తియోగమునందు భక్తుడు కృష్ణుని తప్ప అన్యమును వాంచింపడు. అట్టి శుద్ధభక్తుడు స్వర్గలోకములకు పోవలెనని గాని, బ్రహ్మజ్యోతిలో లీనము కావలెనని గాని, భవబంధముల నుండి ముక్తిని పొందవలెనని గాని వాంచింపడు. అట్టివాడు దేనిని కూడా వాంచింపడు. కనుకనే చైతన్యచరితామృతమునందు అతడు “నిష్కాముడు” అని పిలువబడినాడు.

అనగా స్వీయలాభమునందు ఎట్టి కోరికయు లేనివాడని భావము. పరమశాంతి అతనికే లభించును గాని స్వీయలాభమునకై ప్రాకులాడువానికి కాదు. జ్ఞానయోగి, కర్మయోగి లేదా హఠయోగి యనువారలు ఏదియో కొంత స్వార్థమును కలిగియున్నను, పూర్ణభక్తుడు శ్రీకృష్ణభగవానుని ప్రియమునకు అన్యమైన దానిని కోరడు. కనుకనే అకుంఠితభక్తితో తనను సేవించువారికి తాను సులభముగా లబింతునని శ్రీకృష్ణభగవానుడు తెలియజేయుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 324 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 14 🌴

14 . ananya-cetāḥ satataṁ yo māṁ smarati nityaśaḥ
tasyāhaṁ su-labhaḥ pārtha nitya-yuktasya yoginaḥ


🌷 Translation :

For one who always remembers Me without deviation, I am easy to obtain, O son of Pṛthā, because of his constant engagement in devotional service.

🌹 Purport :

This verse especially describes the final destination attained by the unalloyed devotees who serve the Supreme Personality of Godhead bhakti-yoga. Previous verses have mentioned four different kinds of devotees – the distressed, the inquisitive, those who seek material gain, and the speculative philosophers. Different processes of liberation have also been described: karma-yoga, jñāna-yoga and haṭha-yoga. The principles of these yoga systems have some bhakti added, but this verse particularly mentions pure bhakti-yoga, without any mixture of jñāna, karma or haṭha. As indicated by the word ananya-cetāḥ, in pure bhakti-yoga the devotee desires nothing but Kṛṣṇa. A pure devotee does not desire promotion to heavenly planets, nor does he seek oneness with the brahma-jyotir or salvation or liberation from material entanglement.

A pure devotee does not desire anything. In the Caitanya-caritāmṛta the pure devotee is called niṣkāma, which means he has no desire for self-interest. Perfect peace belongs to him alone, not to them who strive for personal gain. Whereas a jñāna-yogī, karma-yogī or haṭha-yogī has his own selfish interests, a perfect devotee has no desire other than to please the Supreme Personality of Godhead. Therefore the Lord says that for anyone who is unflinchingly devoted to Him, He is easy to attain.

🌹 🌹 🌹 🌹 🌹

12 Mar 2020