శ్రీమద్భగవద్గీత - 343: 09వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 343: Chap. 09, Ver. 05


🌹. శ్రీమద్భగవద్గీత - 343 / Bhagavad-Gita - 343 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 05 🌴

05. న చ మత్థ్సాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ |
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావన: ||


🌷. తాత్పర్యం :

అయినను సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగియుండదు. అచింత్యమైన నా యోగవైభమును గాంచుము! నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైనను, సర్వసృష్టికి కారణుడనైనందున ఈ దృశ్యమానజగత్తు నందలి భాగమును కాను.

🌷. భాష్యము :

సమస్తము తన యందే స్థితిని కలిగియున్నదని (మత్థ్సాని సర్వభూతాని) శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట పలుకగా దానిని వేరు విధముగా అర్థము చేసికొనరాదు. వాస్తవమునకు విశ్వము యొక్క భరణ, పోషణములతో ప్రత్యక్షముగా ఆ భగవానునకు ఎట్టి సంబంధము లేదు. కొన్నిమార్లు “అట్లాస్” తన భుజములపై భూగోళమును మోయుచు, అట్టి కార్యములో అలసినట్లుగా మనము చిత్రములలో గాంతుము. ఇదే భావనను శ్రీకృష్ణభగవానుడు విశ్వమును భరించుచున్నాడనెడి విషయమును మనము ఊహింపరాదు. ఏలయన తన యందే సర్వము స్థితిని కలిగియున్నను తాను మాత్రము వాటికి పరుడని యున్నానని భగవానుడు ఇచ్చట పలుకుచున్నాడు. గ్రహమండలము అంతరిక్షమున నిలిచియున్నది. ఆ అంతరిక్షము భగవానుని శక్తియైనను, అతడు అంతరిక్షమునకు భిన్నుడు. అతడు భిన్నముగా స్థితుడై యున్నాడు. కనుకనే “జీవులందరు నా అచింత్యశక్తి యందు నిలిచియున్నను, దేవదేవుడైన నేను వారికి పరుడనై యున్నాను” అని శ్రీకృష్ణభగవానుడు పలికినాడు. ఇదియే శ్రీకృష్ణుని అచింత్యమైన యోగవైభవము.

“భగవానుడు తన శక్తి ప్రదర్శనము చేయుచు ఊహాతీతములైన అద్భుత లీలలను గావించుచున్నాడు” అని వేదనిఘంటువైన నిరుక్తి యందు తెలుపబడినది (యుజ్యతేఽనేన దుర్ఘటేషు కార్యేషు). శ్రీకృష్ణభగవానుడు దివ్యములైన వివిధశక్తులను కలిగియున్నాడు మరియు అతని సంకల్పమే వాస్తవమైనదనెడి భావనలో మనమాతనిని అవగాహన చేసికొనవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 343 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 03 🌴

05 . na ca mat-sthāni bhūtāni paśya me yogam aiśvaram
bhūta-bhṛn na ca bhūta-stho mamātmā bhūta-bhāvanaḥ


🌷 Translation :

And yet everything that is created does not rest in Me. Behold My mystic opulence! Although I am the maintainer of all living entities and although I am everywhere, I am not a part of this cosmic manifestation, for My Self is the very source of creation.

🌹 Purport :

The Lord says that everything is resting on Him (mat-sthāni sarva-bhūtāni). This should not be misunderstood. The Lord is not directly concerned with the maintenance and sustenance of this material manifestation. Sometimes we see a picture of Atlas holding the globe on his shoulders; he seems to be very tired, holding this great earthly planet. Such an image should not be entertained in connection with Kṛṣṇa’s upholding this created universe. He says that although everything is resting on Him, He is aloof. The planetary systems are floating in space, and this space is the energy of the Supreme Lord.

But He is different from space. He is differently situated. Therefore the Lord says, “Although they are situated on My inconceivable energy, as the Supreme Personality of Godhead I am aloof from them.” This is the inconceivable opulence of the Lord. In the Nirukti Vedic dictionary it is said, yujyate ’nena durghaṭeṣu kāryeṣu: “The Supreme Lord is performing inconceivably wonderful pastimes, displaying His energy.” His person is full of different potent energies, and His determination is itself actual fact. In this way the Personality of Godhead is to be understood.

🌹 🌹 🌹 🌹 🌹

31 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 342: 09వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 342: Chap. 09, Ver. 04


🌹. శ్రీమద్భగవద్గీత - 342 / Bhagavad-Gita - 342 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 04 🌴


04. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |
మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థిత: |

🌷. తాత్పర్యం :

సమస్తజగత్తు అవ్యక్తరూపమున నాచే ఆవరించబడియున్నది. జీవులన్నియు నా యందున్నవి, కాని నేను వాని యందు లేను.

🌷. భాష్యము :

దేవదేవుడైన శ్రీకృష్ణుడు జడమైన ఇంద్రియయములకు అనుభూతుడు కాదు. ఇదే విషయము ఈ క్రింది విధముగా తెలుపబడినది.

అత: శ్రీకృష్ణనామాది న భవేద్గ్రాహ్య మిన్ద్రియై: |
సేవోన్ముఖేహి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యద: ||

(భక్తిరాసామృతసింధువు 1.2.234)

శ్రీకృష్ణుని నామము, మహిమలు, లిలాదులు ఇంద్రియములచే అవగాహనకు రావు. తగిన నేతృత్వములో భక్తియుతసేవ యందు నిలిచిన మనుజునికే అతడు స్వయముగా విదితుడు కాగలడు.

కనుకనే “ప్రేమాంజన చ్చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయన్తి” యని బ్రహ్మసంహిత యందు తెలుపబడినది. అనగా దేవదేవుడైన గోవిందుని యెడ దివ్యమైన ప్రేమను వృద్ధికావించుకొననివాడు ఆ భగవానుని సదా తన అంతర్బాహ్యములలో గాంచగలడు. సాధారణజనులకు అతడు గోచరుడు. ఆ భగవానుడు సర్వవ్యాపియై సర్వత్రా నిలిచియున్నను ఇంద్రియములచే అనుభూతుడు కాడని ఇచ్చట తెలుపబడినది. ఇదే విషయము “అవ్యక్తమూర్తినా” అను పదము ద్వారా ఇచ్చట సూచించబడినది.

మనమాతనిని గాంచలేకున్నను వాస్తవమునకు సర్వము అతని యందు స్థితిని కలిగియున్నది. సప్తమాధ్యాయమున ఇదివరకే చర్చించినట్లు జగత్తంతయు అతని ఆధ్యాత్మికశక్తి, భౌతికశక్తుల కలయిక చేతనే ఏర్పడినది. సూర్యకాంతి విశ్వమంతటను వ్యాపించియున్నట్లు, శ్రీకృష్ణభగవానుని శక్తియు సృష్టియందంతటను వ్యాపించియండి, సమస్తము ఆ శక్తి యందు స్థితిని కలిగియున్నది. శ్రీకృష్ణభగవానుడు సర్వత్రా వ్యాపించి యుండుటచే తన వ్యక్తిగత రూపమును కోల్పోవునని ఎవ్వరును భావింపరాదు.

అటువంటి వాదనను ఖండించుటకే ఆ భగవానుడు “సర్వత్రా నిలిచియున్న నా యందే సర్వము నిలిచియున్నను నేను సర్వమునకు పరుడనై యున్నను” అని పలికెను. ఆ భగవానుని వివిధశక్తుల విస్తారము వలననే జగత్తు సృజింప బడుచున్నది. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణభగవానుడు స్వీయప్రాతినిధ్యమైన తన వివిధశక్తుల విస్తారముచే సర్వత్రా నిలిచియుండును (విష్ట భ్యాహమిదం కృత్స్నమ్ ).

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 342 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 04 🌴

04 . mayā tatam idaṁ sarvaṁ jagad avyakta-mūrtinā
mat-sthāni sarva-bhūtāni na cāhaṁ teṣv avasthitaḥ

🌷 Translation :

By Me, in My unmanifested form, this entire universe is pervaded. All beings are in Me, but I am not in them.

🌹 Purport :

The Supreme Personality of Godhead is not perceivable through the gross material senses. It is said,

ataḥ śrī-kṛṣṇa-nāmādi
na bhaved grāhyam indriyaiḥ
sevonmukhe hi jihvādau
svayam eva sphuraty adaḥ

(Bhakti-rasāmṛta-sindhu 1.2.234)


Lord Śrī Kṛṣṇa’s name, fame, pastimes, etc., cannot be understood by material senses. Only to one who is engaged in pure devotional service under proper guidance is He revealed. In the Brahma-saṁhitā (5.38) it is stated, premāñjana-cchurita-bhakti-vilocanena santaḥ sadaiva hṛdayeṣu vilokayanti: one can see the Supreme Personality of Godhead, Govinda, always within himself and outside himself if one has developed the transcendental loving attitude towards Him. Thus for people in general He is not visible. Here it is said that although He is all-pervading, everywhere present, He is not conceivable by the material senses.

This is indicated here by the word avyakta-mūrtinā. But actually, although we cannot see Him, everything is resting in Him. As we have discussed in the Seventh Chapter, the entire material cosmic manifestation is only a combination of His two different energies – the superior, spiritual energy and the inferior, material energy. Just as the sunshine is spread all over the universe, the energy of the Lord is spread all over the creation, and everything is resting in that energy.

🌹 🌹 🌹 🌹 🌹

30 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 341: 09వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 341: Chap. 09, Ver. 03


🌹. శ్రీమద్భగవద్గీత - 341 / Bhagavad-Gita - 341 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 03 🌴

03. అశ్రద్ధధానా: పురుషా ధర్మస్యాస్య పరన్తప |
అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసారవర్త్మని


🌷. తాత్పర్యం :

ఓ శత్రుంజయుడా! ఈ భక్తియుతసేవ యందు శ్రద్ధ లేనివారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతికజగమునందలి జనన, మరణమార్గమునకే తిరిగివత్తురు.

🌷. భాష్యము :

శ్రద్ధలేనివారు ఈ భక్తియోగవిధానమును పొందలేరన్నది ఈ శ్లోకపు సారాంశము. శ్రద్ధ యనునది భక్తుల సాంగత్యము ద్వారా కలుగగలదు. అదృష్టహీనులైన వారు మహాత్ముల ద్వారా వేదవాజ్మయమునందలి నిదర్శనములను శ్రవణము చేసిన పిమ్మటయును శ్రీకృష్ణభగవానుని యందు శ్రద్ధను గాని, విశ్వాసమును గాని పొందారు. సంశయాత్ములైనందున వారు ఆ భగవానుని భక్తియోగములో స్థితిని పొందలేరు. కనుకనే కృష్ణభక్తిభావన యందు పురోగతి విశ్వాసము లేదా శ్రద్ధ యనునది అత్యంత ముఖ్యమైన అంశముగా పేర్కొనబడినది.

దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవామాత్రము చేతనే మనుజుడు పూర్ణత్వమును సాధింపగలడనెడి సంపూర్ణ నమ్మకమే విశ్వాసమని “చైతన్యచరితామృతము” తెలుపుచున్నది. అదియే నిజమైన శ్రద్ధ. ఈ విషయమును గూర్చి శ్రీమద్భాగవతము (4.31.14) నందు ఇట్లు తెలుపబడినది.


యథాతరోర్మూలనిషేచనేన తృప్యన్తి తత్స్కన్ధభుజోపశాఖా: |
ప్రాణోపహారాచ్చ యథేన్ద్రియాణాం తథైవ సర్వార్హణమచ్యుతేజ్యా

“వృక్షమూలమునకు నీరుపోయుట ద్వారా కొమ్మలు, రెమ్మలు, పత్రములను సంతృప్తిపరచినట్లు మరియు ఉదరమునకు ఆహారము నొసగుట ద్వారా ఇంద్రియములన్నింటిని తృప్తిపరచినట్లు, శ్రీకృష్ణభగవానుని దివ్యమగుసేవ యందు నిలుచుట ద్వారా మనుజుడు సర్వదేవతలను మరియు సర్వ ఇతరజీవులను అప్రయత్నముగా సంతృప్తిపరచినవాడగును.”

కనుక ప్రతియొక్కరు సర్వవిధములైన కర్మలను, ధర్మములను విడిచి శ్రీకృష్ణభగవానుని భక్తియుక్తసేవను స్వీకరింపవలసియున్నది. గీతను పఠించిన పిమ్మట ప్రతియోక్కరును ఈ గీతాసారాంశమునకే అరుదెంచవలెను. ఇట్టి తత్త్వము యెడ నిశ్చయమును పొందుటయే శ్రద్ధ యనబడును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 341 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 03 🌴

03 . aśraddadhānāḥ puruṣā dharmasyāsya paran-tapa
aprāpya māṁ nivartante mṛtyu-saṁsāra-vartmani


🌷 Translation :

Those who are not faithful in this devotional service cannot attain Me, O conqueror of enemies. Therefore they return to the path of birth and death in this material world.

🌹 Purport :

The faithless cannot accomplish this process of devotional service; that is the purport of this verse. Faith is created by association with devotees. Unfortunate people, even after hearing all the evidence of Vedic literature from great personalities, still have no faith in God. They are hesitant and cannot stay fixed in the devotional service of the Lord. Thus faith is a most important factor for progress in Kṛṣṇa consciousness. In the Caitanya-caritāmṛta it is said that faith is the complete conviction that simply by serving the Supreme Lord, Śrī Kṛṣṇa, one can achieve all perfection. That is called real faith. As stated in the Śrīmad-Bhāgavatam (4.31.14),

yathā taror mūla-niṣecanena
tṛpyanti tat-skandha-bhujopaśākhāḥ
prāṇopahārāc ca yathendriyāṇāṁ
tathaiva sarvārhaṇam acyutejyā

“By giving water to the root of a tree one satisfies its branches, twigs and leaves, and by supplying food to the stomach one satisfies all the senses of the body. Similarly, by engaging in the transcendental service of the Supreme Lord one automatically satisfies all the demigods and all other living entities.” Therefore, after reading Bhagavad-gītā one should promptly come to the conclusion of Bhagavad-gītā: one should give up all other engagements and adopt the service of the Supreme Lord, Kṛṣṇa, the Personality of Godhead. If one is convinced of this philosophy of life, that is faith.

🌹 🌹 🌹 🌹 🌹

29 Mar 2020


శ్రీమద్భగవద్గీత - 340: 09వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 340: Chap. 09, Ver. 02


🌹. శ్రీమద్భగవద్గీత - 340 / Bhagavad-Gita - 340 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 02 🌴

02. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం :

ఈ జ్ఞానము విద్యలకెల్ల రాజు వంటిది మరియు సర్వరహస్యములలో పరమరహస్యమైనది. పరమపవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్షజ్ఞానము కలుగజేయుటచే ధర్మము యొక్క పూర్ణత్వమై యున్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు అత్యంత సౌఖ్యకరమైనది.

🌷. భాష్యము :

పూర్వము తెలుపబడిన సకల సిద్ధాంతములు మరియు తత్త్వముల సారమైయున్నందున భగవద్గీత యందలి ఈ అధ్యాయము విద్యలకెల్ల రాజుగా పిలువబడుచున్నది. భారతదేశమునందలి తత్త్వవేత్తలలో గౌతముడు, కణాడుడు, కపిలుడు, యాజ్ఞవల్క్యుడు, శాండిల్యుడు, వైశ్వానరుడు మరియు వేదాంతసూత్ర రచయితయైన వ్యాసదేవుడు అతిముఖ్యులు. కనుక ఇచ్చట ఆధ్యాత్మికజ్ఞానమునందు గాని లేదా తత్త్వమునందు గాని ఎట్టి కొరతయు లేదు.

అట్టి సమస్తజ్ఞానమునకు రాజుగా ఈ నవమాధ్యాయమును శ్రీకృష్ణభగవానుడు వర్ణించుచున్నాడు. అనగా ఈ అధ్యాయము వేదాధ్యయనము మరియు పలు తత్త్వాధ్యయనము వలన కలిగెడి జ్ఞానము యొక్క సారమై యున్నది. గుహ్యము లేదా దివ్యము నైన జ్ఞానము దేహము మరియు ఆత్మల నడుమ గల భేదమును అవగాహన చేసికొనుట యందు కేంద్రీకరింపబడను గావున ఈ నవమాధ్యాయము రాజగుహ్యముగా కూడా తెలుపబడినది. అట్టి రాజగుహ్యజ్ఞానము భక్తియుతసేవ యందే పరిసమాప్తి నొందును.

సాధారణముగా జనులు ఇట్టి గుహ్యమైన జ్ఞానమునందు గాక, భౌతికమైన జ్ఞానమునందు ప్రవీణులై యందురు. లౌకికవిద్యకు సంబంధించినంతవరకు జనులు రాజనీతి, సామాజికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, గణితశాస్త్రము, ఖగోళశాస్త్రము, యంత్రశాస్త్రముల వంటి వాటితోనే సంబంధమును కలిగియున్నారు.

ప్రపంచమనదంతటను పలు విజ్ఞానశాఖలు మరియు విశ్వవిద్యాలయములు ఉన్నను దురదృష్టవశాత్తు వారికి ఆత్మను గూర్చి విద్యగరువు విశ్వవిద్యాలయముగాని లేక విద్యాసంస్థగాని ఎచ్చోటను లేదు. కాని వాస్తవమునకు దేహమునందు ఆత్మ అత్యంత ముఖ్యాంశమై యున్నది. ఆత్మ లేని దేహము నిరుపయోగమును, విలువరహితమును కాగలదు. అయినను జనులు ముఖ్యమైన ఆత్మను గూర్చి పట్టించుకొనక దేహావసరములకే ఎక్కువ ప్రాముఖ్యము నొసగుచున్నారు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 340 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 02 🌴

02 . rāja-vidyā rāja-guhyaṁ pavitram idam uttamam
pratyakṣāvagamaṁ dharmyaṁ su-sukhaṁ kartum avyayam



🌷 Translation :

This knowledge is the king of education, the most secret of all secrets. It is the purest knowledge, and because it gives direct perception of the self by realization, it is the perfection of religion. It is everlasting, and it is joyfully performed.

🌹 Purport :

This chapter of Bhagavad-gītā is called the king of education because it is the essence of all doctrines and philosophies explained before. Among the principal philosophers in India are Gautama, Kaṇāda, Kapila, Yājñavalkya, Śāṇḍilya and Vaiśvānara. And finally there is Vyāsadeva, the author of the Vedānta-sūtra. So there is no dearth of knowledge in the field of philosophy or transcendental knowledge.

Now the Lord says that this Ninth Chapter is the king of all such knowledge, the essence of all knowledge that can be derived from the study of the Vedas and different kinds of philosophy. It is the most confidential because confidential or transcendental knowledge involves understanding the difference between the soul and the body. And the king of all confidential knowledge culminates in devotional service.

Generally, people are not educated in this confidential knowledge; they are educated in external knowledge. As far as ordinary education is concerned, people are involved with so many departments: politics, sociology, physics, chemistry, mathematics, astronomy, engineering, etc.

There are so many departments of knowledge all over the world and many huge universities, but there is, unfortunately, no university or educational institution where the science of the spirit soul is instructed. Yet the soul is the most important part of the body; without the presence of the soul, the body has no value. Still people are placing great stress on the bodily necessities of life, not caring for the vital soul.

🌹 🌹 🌹 🌹 🌹

28 Mar 2020


శ్రీమద్భగవద్గీత - 339: 09వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 339: Chap. 09, Ver. 01


🌹. శ్రీమద్భగవద్గీత - 339 / Bhagavad-Gita - 339 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 01 🌴

01. శ్రీ భగవానువాచ

ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామనసూయవే |
జ్ఞాన విజ్ఞాన సహితం యద్ జ్ఞాత్వా మోక్షసేశుభాత్ ||


🌷. తాత్పర్యం :

శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! నీవు నా యెడ ఎన్నడును అసూయ కలవాడవు కానందున ఈ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసెదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతికస్థితి వలన కలిగెడి క్లేశముల నుండి నీవు ముక్తుడవు కాగలవు.

🌷. భాష్యము :

భక్తుడు శ్రీకృష్ణభగవానుని గూర్చి అధికముగా శ్రవణము చేసినకొలది అధికముగా ఆత్మవికాసము నొందుచుండును. ఇట్టి శ్రవణవిధానమే శ్రీమద్భాగవతమునందు ఈ విధముగా ఉపదేశింపబడినది. “భాగవత్కథలు పరమశక్తిపుర్నములు.

భవత్సంబంధిత విషయములు భక్తుల సంగములో చర్చించినచో అవి అనుభవమునకు వచ్చును. అనుభవపూర్వక జ్ఞానమైనందున ఇది ఎన్నడును మానసికకల్పనాపరులు లేదా లౌకికవిద్వాంసుల సాంగత్యమున సాధింపబడదు.”

భక్తులు సదా శ్రీకృష్ణభగవానుని సేవలో నిలిచియుందురు. ఆ విధముగా కృష్ణభక్తిభావనాయుతుడైన జీవుని మనోగతమును, శ్రద్ధను గమనించిన ఆ భగవానుడు భక్తుల సాంగత్యములో తనను గూర్చి సంపూర్ణముగా అవగతము చేసికొను బుద్ధిని అతనికి ప్రసాదించును.

కృష్ణపరమగు చర్చ అత్యంత శక్తివంతమైనది. అదృష్టభాగుడైన మనుజుడు అట్టి సాంగత్యమును పొంది ఈ జ్ఞానమును అవగతము చేసికొనుటకు యత్నించినచో తప్పక ఆధ్యాత్మికానుభావమును బడయగలడు.

తన శక్తిపూర్ణమైన సేవ యందు అత్యంత ఉన్నతస్థితిని అర్జునుడు బడయనట్లుగా చేయుటకే శ్రీకృష్ణుడు తానింతవరకు తెలియజేసిన విషయముల కన్నను పరమరహస్యమైనవానిని ఈ నవమాధ్యాయమున వివరింపనున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 339 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 01 🌴

01 . śrī-bhagavān uvāca

idaṁ tu te guhya-tamaṁ pravakṣyāmy anasūyave
jñānaṁ vijñāna-sahitaṁ yaj jñātvā mokṣyase ’śubhāt


🌷 Translation :

The Supreme Personality of Godhead said: My dear Arjuna, because you are never envious of Me, I shall impart to you this most confidential knowledge and realization, knowing which you shall be relieved of the miseries of material existence.

🌹 Purport :

As a devotee hears more and more about the Supreme Lord, he becomes enlightened. This hearing process is recommended in the Śrīmad-Bhāgavatam:

“The messages of the Supreme Personality of Godhead are full of potencies, and these potencies can be realized if topics regarding the Supreme Godhead are discussed amongst devotees.”

This cannot be achieved by the association of mental speculators or academic scholars, for it is realized knowledge.

The devotees are constantly engaged in the Supreme Lord’s service.

The Lord understands the mentality and sincerity of a particular living entity who is engaged in Kṛṣṇa consciousness and gives him the intelligence to understand the science of Kṛṣṇa in the association of devotees.

Discussion of Kṛṣṇa is very potent, and if a fortunate person has such association and tries to assimilate the knowledge, then he will surely make advancement toward spiritual realization.

Lord Kṛṣṇa, in order to encourage Arjuna to higher and higher elevation in His potent service, describes in this Ninth Chapter matters more confidential than any He has already disclosed.

🌹 🌹 🌹 🌹 🌹

27 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 338: 08వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 338: Chap. 08, Ver. 28


🌹. శ్రీమద్భగవద్గీత - 338 / Bhagavad-Gita - 338 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 28 🌴


28. వేదేషు యజ్ఞేషు తప:సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరంస్థానముపైతి చాద్యమ్ ||

🌷. తాత్పర్యం :

వేదాధ్యయనము వలన, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలన, దానము వలన లేదా తాత్వికకర్మలను మరియు కామ్యకర్మలను ఒనరించుట వలన కలుగు ఫలితములు భక్తిమార్గము చేపట్టి మనుజునికి లభింపకపోవు. కేవలము భక్తియుతసేవ నొనరించుట ద్వారా అతడు వీటినన్నింటిని పొందుటయేగాక అంత్యమున దివ్యమైన పరంధామమును సైతము చేరగలడు.

🌷. భాష్యము :

ఈ శ్లోకము కృష్ణభక్తిరసభావనపు మరియు భక్తియుతసేవను గూర్చి ప్రత్యేకముగా చర్చించిన సప్తమ, అష్టమాధ్యాయముల సారాంశమై యున్నది.

ప్రతియొక్కరు ఆధ్యాత్మికగురువు నిర్దేశమునందు వేదాధ్యనము కావించును ఆయన సన్నిధిలో పలువిధములైన తపస్సులను నిర్వహింపవలసియున్నది. బ్రహ్మచారియైనవాడు గుర్వాశ్రయమున సేవకునిగా జీవించును, ఇంటింట భిక్షను స్వీకరించి గురువునకు అర్పింపవలెను.

గురువుగారి ఆజ్ఞపైననే ఆహారమును స్వీకరించుచు, ఒకవేళ ఆయన భోజమునకు పిలువకున్నచో ఉపవసింపవలెను. ఇవియే బ్రహ్మచర్యమును ననుసరించువానికి విధింపబడిన కొన్ని వేదనియమములు.

విద్యార్థి ఆ విధముగా గురువు చెంత ఐదు నుండు ఇరువది సంవత్సరముల కాలము వేదాధ్యయనము చేసిన పిమ్మట సమగ్రలక్షణములు కలిగిన మనుజునిగా రూపొందును.

మొదటి ఆరు అధ్యాయములు మరియు చివరి ఆరు అధ్యాయములు ఆచ్చాదానలుగా కలిగిన ఈ నడుమ ఆరు అధ్యాయములు శ్రీకృష్ణభగవానునిచే ప్రత్యేకముగా రక్షింపబడుచున్నవి.

భక్తుల సంగమములో భగవద్గీతను ( ముఖ్యముగా ఈ నడుమ ఆరు అధ్యాయములను) అవగాహన చేసికొనగలిగిన భాగ్యము కలిగినచో మనుజుని జీవితము తపస్సులను, యజ్ఞములను, దానములను, ఊహాకల్పనలను అతిశయించి సఫలమగును. ఏలయన వాని ద్వారా కలుగు ఫలముల నన్నింటిని మనుజుడు కేవలము కృష్ణభక్తిరసభావన యందు నిలిచి సులభముగా పొందగలడు.

శ్రీమద్భగవద్గీత యందలి “భాగవత్ప్రాప్తి” అను అష్టమాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 338 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 28 🌴

28 . vedeṣu yajñeṣu tapaḥsu caiva dāneṣu yat puṇya-phalaṁ pradiṣṭam
atyeti tat sarvam idaṁ viditvā yogī paraṁ sthānam upaiti cādyam

🌷 Translation :

A person who accepts the path of devotional service is not bereft of the results derived from studying the Vedas, performing sacrifices, undergoing austerities, giving charity or pursuing philosophical and fruitive activities. Simply by performing devotional service, he attains all these, and at the end he reaches the supreme eternal abode.

🌹 Purport :

This verse is the summation of the Seventh and Eighth chapters, which particularly deal with Kṛṣṇa consciousness and devotional service. One has to study the Vedas under the guidance of the spiritual master and undergo many austerities and penances while living under his care.

A brahmacārī has to live in the home of the spiritual master just like a servant, and he must beg alms from door to door and bring them to the spiritual master. He takes food only under the master’s order, and if the master neglects to call the student for food that day, the student fasts. These are some of the Vedic principles for observing brahmacarya.

Then after retiring from household life, upon accepting the order of vānaprastha, he undergoes severe penances – living in forests, dressing with tree bark, not shaving, etc. By carrying out the orders of brahmacarya, householder life, vānaprastha and finally sannyāsa, one becomes elevated to the perfectional stage of life.

Some are then elevated to the heavenly kingdoms, and when they become even more advanced they are liberated in the spiritual sky, either in the impersonal brahma-jyotir or in the Vaikuṇṭha planets or Kṛṣṇaloka. This is the path outlined by Vedic literatures.

Thus end the Bhaktivedanta Purports to the Eighth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Attaining the Supreme.


Continues.....

🌹 🌹 🌹 🌹 🌹

26 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 337: 08వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 337: Chap. 08, Ver. 27


🌹. శ్రీమద్భగవద్గీత - 337 / Bhagavad-Gita - 337 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 27 🌴

27. నైతే సృతీ పార్థ జాన న్యోగీ ముహ్యతి కశ్చన |
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ||


🌷. తాత్పర్యం :

ఓ అర్జునా! భక్తులు ఈ రెండు మార్గములు నెరిగినప్పటికిని ఎన్నడును మోహము నొందరు. కనుక నీవు భక్తియందు సదా స్థిరుడవగుము.

🌷. భాష్యము :

భౌతికజగమును వీడునప్పుడు ఆత్మ అనుసరించెడి వివిధమార్గముల యెడ కలతనొందవలదని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించుచున్నాడు. భక్తుడైనవాడు తాను యాదృచ్చికముగా మరణింతునాయని గాని లేదా పూర్వనిర్దేశము ననుసరించి మరణింతునాయని గాని చింతింపరాదు. అతడు కేవలము కృష్ణభక్తిరసభావన యందు స్థిరముగా నిలిచి హరేకృష్ణ మాహామంత్రమును సదా జపించవలెను. పైన తెలిపిన రెండుమార్గములలో దేనిని గూర్చి చింతించినను అది కేవలము కలతకు మాత్రమే కారణమని అతడు తెలిసియుండవలెను. శ్రీకృష్ణభగవానుని సేవలో సదా అనురక్తమగుటయే కృష్ణభక్తిభావనలో లీనమగుటకు ఉత్తమమమైన మార్గము. అదియే భగవద్దామమునకు మనుజుని పథమును సురక్షితము, నిశ్చితము, సరళము చేయగలదు. “యోగయుక్త” అను పదము ఈ శ్లోకములో ముఖ్యమైనది. యోగమునందు స్థితిని పొందినవాడు కృష్ణభక్తిభావనలో నిలిచి తన కర్మలన్నింటిని కొనసాగించును. కనుకనే ప్రతియొక్కరు భౌతికకర్మ కలాపముల యెడ అనాసక్తులై, కృష్ణభక్తిభావనలోనే సర్వము నొనరించవలెనని శ్రీ రూపగోస్వామి తెలిపిరి (అనాసక్తస్య విషయాన్ యథార్హముపయుంజత: ). ఇట్టి “యుక్తవైరాగ్యము” చేతనే ప్రతియొక్కరు పూర్ణత్వమును సాధింపగలరు. కనుకనే భక్తుడెన్నడును ఈ వివిధమార్గములచే కలతనొందడు. భక్తియోగము ద్వారా తాను దివ్య దామమునకు చేరుట తథ్యమణి అతడు తెలిసియుండుటయే అందులకు కారణము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 337 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 27 🌴

27 . naite sṛtī pārtha jānan yogī muhyati kaścana
tasmāt sarveṣu kāleṣu yoga-yukto bhavārjuna


🌷 Translation :

Although the devotees know these two paths, O Arjuna, they are never bewildered. Therefore be always fixed in devotion.

🌹 Purport :

Kṛṣṇa is here advising Arjuna that he should not be disturbed by the different paths the soul can take when leaving the material world. A devotee of the Supreme Lord should not worry whether he will depart by arrangement or by accident. The devotee should be firmly established in Kṛṣṇa consciousness and chant Hare Kṛṣṇa. He should know that concern over either of these two paths is troublesome.

The best way to be absorbed in Kṛṣṇa consciousness is to be always dovetailed in His service, and this will make one’s path to the spiritual kingdom safe, certain and direct.

The word yoga-yukta is especially significant in this verse. One who is firm in yoga is constantly engaged in Kṛṣṇa consciousness in all his activities.

Śrī Rūpa Gosvāmī advises, anāsaktasya viṣayān yathārham upayuñjataḥ: one should be unattached in material affairs and do everything in Kṛṣṇa consciousness.

By this system, which is called yukta-vairāgya, one attains perfection. Therefore the devotee is not disturbed by these descriptions, because he knows that his passage to the supreme abode is guaranteed by devotional service.

🌹 🌹 🌹 🌹 🌹

25 Mar 2020


శ్రీమద్భగవద్గీత - 336: 08వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 336: Chap. 08, Ver. 26


🌹. శ్రీమద్భగవద్గీత - 336 / Bhagavad-Gita - 336 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 26 🌴

26. శుక్లకృష్ణే గతీ హ్యేతే జగత: శాశ్వతే మతే |
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పున: ||

🌷. తాత్పర్యం :

ఈ జగత్తు వీడుటకు వేదాభిప్రాయము ననుసరించి శుక్ల, కృష్ణములనెడి రెండు మార్గములు కలవు. శుక్లమార్గమునందు మరణించువాడు తిరిగిరాకుండును. కాని చీకటిమార్గమున మరణించువాడు మాత్రము వెనుకకు తిరిగివచ్చును.

🌷. భాష్యము :

మరణము మరియు పునరాగమనములను ఇదే వివరణను శ్రీబలదేవవిద్యాభూషణులు ఛాందోగ్యోపనిషత్తు (5.10.3-5) నుండి ఉదాహరించిరి.

కామ్యకర్మరతులు, తాత్వికకల్పనాపరులు అనంతకాలముగా ఇట్టి మరణము మరియు పునరాగమనములందు తగుల్కొనియున్నారు. శ్రీకృష్ణుని శరణుజొచ్చని కారణముగా వారెన్నడును దివ్యమైన చరమమోక్షమును పొందలేరు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 336 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 26 🌴

26 . śukla-kṛṣṇe gatī hy ete jagataḥ śāśvate mate
ekayā yāty anāvṛttim anyayāvartate punaḥ


🌷 Translation :

According to Vedic opinion, there are two ways of passing from this world – one in light and one in darkness. When one passes in light, he does not come back; but when one passes in darkness, he returns.

🌹 Purport :

The same description of departure and return is quoted by Ācārya Baladeva Vidyābhūṣaṇa from the Chāndogya Upaniṣad (5.10.3–5).

Those who are fruitive laborers and philosophical speculators from time immemorial are constantly going and coming. Actually they do not attain ultimate salvation, for they do not surrender to Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹

24 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 335: 08వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 335: Chap. 08, Ver. 25


🌹. శ్రీమద్భగవద్గీత - 335 / Bhagavad-Gita - 335 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 25 🌴

25. ధూమో రాత్రిస్తథా కృష్ణ: షణ్మాసా దక్షిణాయనమ్ |
తత్ర చాన్ద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే ||


🌷. తాత్పర్యం :

&ధూమమునందు, రాత్రియందు, కృష్ణపక్షమునందు, సూర్యుడు దక్షిణముగా ప్రయాణించు దక్షిణాయన సమయమునందు మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరల వెనుకకు తిరిగివచ్చును.

🌷. భాష్యము :

భూలోకమున కామ్యకర్మలు మరియు యజ్ఞవిధానములందు నిష్ణాతులైనవారు మరణానంతరము చంద్రలోకమును పొందుదురని శ్రీమద్భాగవతము నందలి మూడవస్కంధమున కపిలముని తెలిపెను.

అట్టి ఉన్నతులు చంద్రలోకమున దేవతల గణనము ప్రకారము పదివేలసంవత్సరములు జీవించి, సోమరసమును పానము చేయుచు జీవితమును అనుభవింతురు. కాని అంత్యమున వారు మరల భులోకమునకే తిరిగి వత్తురు.

దీని భావమేమనగా జడేంద్రియములచే అనుభూతము కాకున్నను ఉన్నతులైన జీవులు చంద్రలోకమున నిలిచియున్నారు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 335 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 25 🌴

25 . dhūmo rātris tathā kṛṣṇaḥ ṣaṇ-māsā dakṣiṇāyanam
tatra cāndramasaṁ jyotir yogī prāpya nivartate

🌷 Translation :

The mystic who passes away from this world during the smoke, the night, the fortnight of the waning moon, or the six months when the sun passes to the south reaches the moon planet but again comes back.

🌹 Purport :

In the Third Canto of Śrīmad-Bhāgavatam Kapila Muni mentions that those who are expert in fruitive activities and sacrificial methods on earth attain to the moon at death.

These elevated souls live on the moon for about 10,000 years (by demigod calculations) and enjoy life by drinking soma-rasa. They eventually return to earth. This means that on the moon there are higher classes of living beings, though they may not be perceived by the gross senses.

🌹 🌹 🌹 🌹 🌹

23 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 334: 08వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 334: Chap. 08, Ver. 24


🌹. శ్రీమద్భగవద్గీత - 334 / Bhagavad-Gita - 334 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 24 🌴

24. అగ్నిర్జ్యోతిరహ: శుక్ల: షణ్మాసా ఉత్తరాయణమ్ |
తత్ర ప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనా: ||


🌷. తాత్పర్యం :

పరబ్రహ్మము నెరిగిన బ్రహ్మవిదులు అగ్నిదేవుని ప్రభావమునందు, కాంతి యందు, పగటియందలి ఏదేని శుభఘడియ యందు, శుక్లపక్షమునందు లేక సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందు ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు.

🌷. భాష్యము :

అగ్ని, కాంతి, పగలు, శుక్లపక్షము అనువాటిని తెలిపినప్పుడు వానికి అధిష్టానదేవతలు కలరనియు, వారు ఆత్మ నిష్క్రమించుటకు తగిన ఏర్పాట్లు చేయుదురనియు మనము అవగతము చేసికొనవలెను. మరణ సమయమున మనస్సు జీవుని వేరొక జన్మను పొందునట్లుగా చేయును.

కాని పైన తెలుపబడిన సమయములందు యాదృచ్చికముగా గాని, ప్రయత్నపుర్వకముగా గాని దేహత్యాగము చేసిడివారు నిరాకార బ్రహ్మజ్యోతిని పొందగలరు.

యోగాభ్యాసమునందు నిష్ణాతులైన యోగులు తాము దేహత్యాగము చేసెడి స్థలమును మరియు సమయమును నిర్ణియించుకొనగలరుగాని ఇతరులకు అది సాధ్యము కాదు.

ఒకవేళ యాదృచ్చికముగా వారు ఆ పుణ్యఘడియలలో మరణించినచో జనన,మరణచక్రమున తిరిగి ప్రవేశింపరు. అట్లు కానిచో వారు తిరిగి జన్మను పొందక తప్పదు.

కాని కృష్ణభావనాయుతుడైన భక్తునకు శుభాశుభ సమయములందు దేహమును విడచినను, యాదృచ్చికముగా లేక పూర్వనిర్దేశ ప్రకారముగా దేహత్యాగము చేసినను వెనుకకు మరలివచ్చుట యనెడి భయము ఏమాత్రము ఉండదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 334 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 24 🌴

24 . agnir jyotir ahaḥ śuklaḥ ṣaṇ-māsā uttarāyaṇam
tatra prayātā gacchanti brahma brahma-vido janāḥ


🌷 Translation :

Those who know the Supreme Brahman attain that Supreme by passing away from the world during the influence of the fiery god, in the light, at an auspicious moment of the day, during the fortnight of the waxing moon, or during the six months when the sun travels in the north.

🌹 Purport :

When fire, light, day and the fortnight of the moon are mentioned, it is to be understood that over all of them there are various presiding deities who make arrangements for the passage of the soul.

At the time of death, the mind carries one on the path to a new life. If one leaves the body at the time designated above, either accidentally or by arrangement, it is possible for him to attain the impersonal brahma-jyotir.

Mystics who are advanced in yoga practice can arrange the time and place to leave the body.

Others have no control – if by accident they leave at an auspicious moment, then they will not return to the cycle of birth and death, but otherwise there is every possibility that they will have to return.

However, for the pure devotee in Kṛṣṇa consciousness, there is no fear of returning, whether he leaves the body at an auspicious or inauspicious moment, by accident or arrangement.

🌹 🌹 🌹 🌹 🌹

22 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 333: 08వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 333: Chap. 08, Ver. 23


🌹. శ్రీమద్భగవద్గీత - 333 / Bhagavad-Gita - 333 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 23 🌴


23. యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగిన: |
ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ ||

🌷. తాత్పర్యం :

ఓ భరతవంశశ్రేష్టుడా! ఏయే కాలములందు ఈ జగమును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగనునో లేక తిరిగిరాకుండునో నీకు నేనిప్పుడు వివరించెదను.

🌷. భాష్యము :

సంపూర్ణశరణాగతులైన అనన్యభక్తులు తమ దేహత్యాగము ఎప్పుడు జరుగునున్న విషయము గాని, ఈ విధముగా జరుగనున్నదనెడి విషయము గాని పట్టించుకొనరు. సర్వమును కేవలము శ్రీకృష్ణుని చేతులలో వదలి సులభముగా, నిశ్చింతగా, సుఖముగా వారు కృష్ణధామమును చేరుదురు. కాని అనన్యభక్తులు గాక ఆత్మానుభమునకై కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగాది పద్ధతులపై ఆధారపడెడివారు మాత్రము తగిన సమయమునందే దేహత్యాగము చేయవలసియుండును. దానిపైననే వారు ఈ జన్మ, మృత్యువులు కలిగిన జగమునాకు తిరిగి వచ్చుటయో లేక తిరిగి రాకపోవుటయో ఆధారపడియుండును.

యోగియైనవాడు పూర్ణత్వమును సాధించినచో ఈ భౌతికజగమును వీడుటకు సరియైన స్థితిని, సమయమును నిర్ణయించుకొనగలడు. కాని పూర్ణుడుగాని వాని సఫలత యాదృచ్చికముగా తగిన సమయమున జరుగు అతని దేహత్యాగముపై ఆధారపది యుండును. ఏ సమయమున మరణించినచో తిరిగి వెనుకకు రావలసిన అవసరము కలుగదో అట్టి తగిన సమయములను గూర్చి శ్రీకృష్ణభగవానుడు రాబోవు శ్లోకములో వివరింపనున్నాడు. ఆచార్యులైన శ్రీ బలదేవవిద్యాభూషణుల వ్యాఖ్యానము ననుసరించి “కాలము” అను సంస్కృతపదము ఇచ్చట కాలము యొక్క అధిష్టానదేవతను సూచించుచున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 333 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 23 🌴


23 . yatra kāle tv anāvṛttim āvṛttiṁ caiva yoginaḥ
prayātā yānti taṁ kālaṁ vakṣyāmi bharatarṣabha

🌷 Translation :

O best of the Bhāratas, I shall now explain to you the different times at which, passing away from this world, the yogī does or does not come back.

🌹 Purport :

The unalloyed devotees of the Supreme Lord, who are totally surrendered souls, do not care when they leave their bodies or by what method. They leave everything in Kṛṣṇa’s hands and so easily and happily return to Godhead. But those who are not unalloyed devotees and who depend instead on such methods of spiritual realization as karma-yoga, jñāna-yoga and haṭha-yoga must leave the body at a suitable time in order to be sure of whether or not they will return to the world of birth and death.

If the yogī is perfect he can select the time and situation for leaving this material world. But if he is not so expert his success depends on his accidentally passing away at a certain suitable time. The suitable times at which one passes away and does not come back are explained by the Lord in the next verse. According to Ācārya Baladeva Vidyābhūṣaṇa, the Sanskrit word kāla used herein refers to the presiding deity of time.

🌹 🌹 🌹 🌹 🌹

21 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 332: 08వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 332: Chap. 08, Ver. 22


🌹. శ్రీమద్భగవద్గీత - 332 / Bhagavad-Gita - 332 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 22 🌴

22. పురుష: స పర: పార్థ భక్త్యా లభ్యస్త్యనన్యయా |
యస్యాన్త:స్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ||


🌷. తాత్పర్యం :

సర్వులకన్నను అధికుడైన దేవదేవుడు అనన్యభక్తి చేతనే పొందబడును. అతడు తన ధామమునందు నిలిచియున్నను సర్వవ్యాపియై యున్నాడు మరియు అతని యందే సమస్తము స్థితిని కలిగియున్నది.

🌷. భాష్యము :

పరమగమ్యస్థానము పరమపురుషుడైన శ్రీకృష్ణుని ధామమే యని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది.

అది పునరావృత్తిరహితముగు స్థానము. అట్టి ధామమును బ్రహ్మసంహిత “ఆనందచిన్మయరసము” అని వర్ణించినది. అనగా అచ్చట ప్రతిదియు దివ్యానందపూర్ణమై యుండును. అచ్చట వైవిధ్యమంతయు ఆధ్యాత్మిక ఆనందపూర్ణమేగాని భౌతికము కాదు.

సప్తమాధ్యాయమున తెలుపబడినట్లు అచ్చట ప్రకటితమగు సర్వము శ్రీకృష్ణభగవానుని ఆధ్యాత్మికశక్తికి సంబంధించినదే గావున అచ్చటి వైవిధ్యము ఆ భగవానుని విస్తారమే అయి యున్నది.

ఇక భౌతికజగమునకు సంబంధించినంత వరకు అతడు స్వధామమునందే సదా నిలిచియున్నను తన భౌతికశక్తి ద్వారా సర్వత్రా వ్యాపించియుండును. అనగా శ్రీకృష్ణభగవానుడు తన ఆధ్యాత్మికశక్తి మరియు భౌతికశక్తుల ద్వారా ఆధ్యాత్మిక, భౌతికముల యందంతటను నిలిచియుండును.

“యస్యాన్త:స్థాని” యనగా సర్వము అతని యందే నిలిచియున్నదని భావము. అనగా ప్రతిదియు అతని ఆధ్యాత్మికశక్తియందో లేక భౌతికశక్తియందో నిలిచియుండును. ఈ రెండుశక్తుల ద్వారానే ఆ దేవదేవుడు సర్వవ్యాపియై యున్నాడు.

“భక్త్యా” అను పదము ద్వారా ఇట స్పష్టముగా సూచింపబడినట్లు దివ్యమైన కృష్ణలోకమునందు గాని, అసంఖ్యాకములుగా నున్న వైకుంటలోకములందు గాని ప్రవేశుంచుట కేవలము భక్తి ద్వారానే సాధ్యము కాగలదు. భగవద్దామమును పొందుటకు ఇతరమైన ఏ పద్దతియు సహకరింపదు.

అట్టి ధామము మరియు భగవానుని గోపాలతాపన్యుపనిషత్తు (3.2) “ఏకోవశీ సర్వగ: కృష్ణ:” యని వర్ణించినది. అనగా ఆ దివ్యధామమున శ్రీకృష్ణనామాంకితుడైన దేవదేవుడు ఒక్కడే కలడు. అతడు దివ్యకరుణాపూర్ణుడు. ఒక్కనిగానే స్థితుడై యున్నప్పటికిని ఆ దేవదేవుడు కోట్లాది సంపూర్ణరూపములలో విస్తరించియుండును.

నిశ్చలముగా నిలిచియున్నను ఫలములను, పుష్పములను, పత్రములను కలిగయుండెడి వృక్షముతో అట్టి దేవదేవుని వేదములు పోల్చుచున్నవి. శ్రీకృష్ణుని సంపూర్ణాంశములైన వైకుంఠాధిపతులు చతుర్బాహులు కలిగి పురుషోత్తముడు, త్రివిక్రముడు, శ్రీధరుడు, వాసుదేవుడు, దామోదరుడు, జనార్ధనుడు, నారాయణుడు, వామనుడు, పద్మనాభుడు అది పలునామములతో పిలువబడుదురు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 332 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 22 🌴

22 . puruṣaḥ sa paraḥ pārtha bhaktyā labhyas tv ananyayā
yasyāntaḥ-sthāni bhūtāni yena sarvam idaṁ tatam


🌷 Translation :

The Supreme Personality of Godhead, who is greater than all, is attainable by unalloyed devotion. Although He is present in His abode, He is all-pervading, and everything is situated within Him.

🌹 Purport :

It is here clearly stated that the supreme destination, from which there is no return, is the abode of Kṛṣṇa, the Supreme Person. The Brahma-saṁhitā describes this supreme abode as ānanda-cinmaya-rasa, a place where everything is full of spiritual bliss.

All the variegatedness manifest there is of the quality of spiritual bliss – nothing there is material.

That variegatedness is expanded as the spiritual expansion of the Supreme Godhead Himself, for the manifestation there is totally of the spiritual energy, as explained in Chapter Seven.

As far as this material world is concerned, although the Lord is always in His supreme abode, He is nonetheless all-pervading by His material energy.

So by His spiritual and material energies He is present everywhere – both in the material and in the spiritual universes.

Yasyāntaḥ-sthāni means that everything is sustained within Him, within either His spiritual or material energy. The Lord is all-pervading by these two energies.

🌹 🌹 🌹 🌹 🌹

20 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 331: 08వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 331: Chap. 08, Ver. 21


🌹. శ్రీమద్భగవద్గీత - 331 / Bhagavad-Gita - 331 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 21 🌴

21. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహు: పరమాం గతిమ్ |
యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ ||


🌷. తాత్పర్యం :

వేదాంతులు దేనిని అవ్యక్తము, అక్షరమని వర్ణింతురో, ఏది పరమగమ్యస్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగిరాడో అదియే నా దివ్యధామము.

🌷. భాష్యము :

దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము సర్వకోరికలు ఈడేరునటువంటి “చింతామణి” ధామముగా బ్రహ్మసంహిత యందు వర్ణింపబడినది. గోలోకబృందావనముగా తెలియబడు ఆ శ్రీకృష్ణదామము చింతామణి భరితమైన సౌధములతో అలరారుచుండును.

కోరిన ఎత్తి భక్ష్యమునైనను సమకూర్చు కల్పవృక్షములను మరియు అక్షయముగా పాలనొసగు సురభినామ గోవులను కలిగియుండెడి ఆ ధామమున శ్రీకృష్ణుడు లక్షలకొలది లక్ష్ములచే సేవించబడుచుండును. ఆదిదేవుడును మరియు సర్వకారణకారణుడును అగు గోవిందునిగా అచ్చట అతడు పిలువబడును.

మధురముగా వేణువునూదును (వేణుంక్వణన్తమ్) అతని దివ్యరూపము సర్వజగన్మోహనమై యుండును. అతని కన్నులు కలువపూల రెక్కలను బోలి, దేహఛాయ నీలమేఘవర్ణమును బోలియుండును.

పరమాకర్షకుకుడైన అతని సౌందర్యము వేలాది మన్మథులను అతిశయించునంత మనోహారముగా నుండును. పీతాంబారమును ధరించియుండు ఆ భగవానుడు మెడలో దివ్యమైన పూమాలను, శిరమున పింఛమును దాల్చియుండును.

ఆధ్యాత్మికజగమున అత్యంత ఉన్నతమైన తన ధామము (గోలోకబృందావనము) గూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీత యందు ఇచ్చట సూచనగా మాత్రమే తెలిపియున్నాడు. దాని విస్తృతవివరణము బ్రహ్మసంహిత యందు ఒసగబడినది.

భగవద్ధామమునకు పరమైనది వేరొకటి లేదనియు, అదియే పరమగమ్యస్థానమనియు వేదవాజ్మయము (కఠోపనిషత్తు 1.3.11) తెలియజేయుచున్నది (పురుషాన్నపరం కిఞ్చిత్ సా కాష్టా పరమా గతి:).

దానిని పొందినవాడు ఈ భౌతికజగమునకు తిరిగిరాదు. ఒకే లక్షణములను కలిగియున్నందున ఆ ధామమును మరియు శ్రీకృష్ణునకు ఎట్టి భేదము లేదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 331 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 21 🌴

21 . avyakto ’kṣara ity uktas tam āhuḥ paramāṁ gatim
yaṁ prāpya na nivartante tad dhāma paramaṁ mama


🌷 Translation :

That which the Vedāntists describe as unmanifest and infallible, that which is known as the supreme destination, that place from which, having attained it, one never returns – that is My supreme abode.

🌹 Purport :

The supreme abode of the Personality of Godhead, Kṛṣṇa, is described in the Brahma-saṁhitā as cintāmaṇi-dhāma, a place where all desires are fulfilled. The supreme abode of Lord Kṛṣṇa, known as Goloka Vṛndāvana, is full of palaces made of touchstone.

There are also trees, called “desire trees,” that supply any type of eatable upon demand, and there are cows, known as surabhi cows, which supply a limitless supply of milk.

In this abode, the Lord is served by hundreds of thousands of goddesses of fortune (Lakṣmīs), and He is called Govinda, the primal Lord and the cause of all causes. The Lord is accustomed to blow His flute (veṇuṁ kvaṇantam).

His transcendental form is the most attractive in all the worlds – His eyes are like lotus petals, and the color of His body is like the color of clouds. He is so attractive that His beauty excels that of thousands of Cupids.

He wears saffron cloth, a garland around His neck and a peacock feather in His hair. In the Bhagavad-gītā Lord Kṛṣṇa gives only a small hint of His personal abode, Goloka Vṛndāvana, which is the supermost planet in the spiritual kingdom.

A vivid description is given in the Brahma-saṁhitā. Vedic literatures (Kaṭha Upaniṣad 1.3.11) state that there is nothing superior to the abode of the Supreme Godhead, and that that abode is the ultimate destination (puruṣān na paraṁ kiñcit sā kāṣṭhā paramā gatiḥ).

When one attains to it, he never returns to the material world. Kṛṣṇa’s supreme abode and Kṛṣṇa Himself are nondifferent, being of the same quality.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

19 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 330: 08వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 330: Chap. 08, Ver. 20


🌹. శ్రీమద్భగవద్గీత - 330 / Bhagavad-Gita - 330 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 20 🌴

20. పరస్తస్మాత్తు భావోన్యోవ్యక్తోవ్య క్తాత్సనాతన: |
య: స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ||

🌷. తాత్పర్యం :

వ్యక్తావ్యక్తములయ్యెడి ఈ భౌతికప్రకృతి కన్నను పరమైనదియు, శాశ్వతమైనదియు నగు అవ్యక్తప్రకృతి వేరొక్కటి కలదు. అది పరమోత్కృష్టమును, నాశరహితమును అయియున్నది. ఈ జగము నందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథముగా నిలిచి యుండును.

🌷. భాష్యము :

శ్రీకృష్ణుని ఉత్కృష్టమైన అంతరంగశక్తి దివ్యమును, శాశ్వతమును అయియున్నది. బ్రహ్మదేవుని పగటి సమయమున వ్యక్తమై, రాత్రికాలమున నశించు భౌతికప్రకృతి యందలి మార్పులకు అది అతీతమైనది.

అనగా శ్రీకృష్ణుని ఉన్నతశక్తి భౌతికప్రకృతి గుణమునకు సంపూర్ణముగా విరుద్ధమైనది. ఉన్నత ప్రకృతి మరియు న్యునప్రకృతి యనునవి ఇదివరకే సప్తమాధ్యాయమున వివరింపబడినవి.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 330 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 20 🌴

20 . paras tasmāt tu bhāvo ’nyo ’vyakto ’vyaktāt sanātanaḥ
yaḥ sa sarveṣu bhūteṣu naśyatsu na vinaśyati

🌷 Translation :

Yet there is another unmanifest nature, which is eternal and is transcendental to this manifested and unmanifested matter. It is supreme and is never annihilated. When all in this world is annihilated, that part remains as it is.

🌹 Purport :

Kṛṣṇa’s superior, spiritual energy is transcendental and eternal. It is beyond all the changes of material nature, which is manifest and annihilated during the days and nights of Brahmā. Kṛṣṇa’s superior energy is completely opposite in quality to material nature. Superior and inferior nature are explained in the Seventh Chapter.

🌹 🌹 🌹 🌹 🌹

18 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 329: 08వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 329: Chap. 08, Ver. 19


🌹. శ్రీమద్భగవద్గీత - 329 / Bhagavad-Gita - 329 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 19 🌴

19. భూతగ్రామ: స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమేవశ: పార్థ ప్రభవత్యహరాగమే ||


🌷. తాత్పర్యం :

బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనపుడు జీవులు మరల మరల వ్యక్తమగుచు అతని రాత్రి సమయము ప్రారంభమైనంతనే అవశులై నశింతురు.

🌷. భాష్యము :

భౌతికజగమునందే నిలుచుట యత్నించు మందమతులు ఒకవేళ ఉన్నతలోకములను చేరినను నిశ్చయముగా తిరిగి ఈ భూలోకమునకు రావలసివచ్చును.

వారు బ్రహ్మదేవుని పగటి సమయమున భౌతికమందలి ఊర్థ్వ, అధోలోకములందు తమ కార్యములను చేయుచు బ్రహ్మదేవుని రాత్రిసమయము అరుదెంచగనే నశించిపోవుదురు.

తమ కామ్యకర్మలకై వారు బ్రహ్మదేవుని పగటి యందు పలువిధములైన దేహములను పొందినను, అతని రాత్రిసమయమున ఎటువంటి దేహము లేకుండా విష్ణువు యొక్క దేహమందు నిలిచియుండి, తిరిగి బ్రహ్మదేవుని పగలు ఆరంభమైనంతనే మరల వ్యక్తమగుచుందురు. “భూత్వా భూత్వా ప్రలీయతే – పగటియందు వ్యక్తమై రాత్రి యందు మరల నశింతురు.”

చివరికి బ్రహ్మదేవుని ఆయుష్షు తీరినంతనే వారందరును నశించిపోయి కోట్లాది సంవత్సరములు అవ్యక్తమందు నిలిచిపోవుదురు. తిరిగి బ్రహ్మదేవుడు జన్మించగనే వారును మరల వ్యక్తమగుదురు. ఈ విధముగా వారు భౌతికజగత్తు మాయచే మోహితులగుదురు.

కాని కృష్ణభక్తిరసభావనను స్వీకరించు జ్ఞానవంతులైన మనుజులు మాత్రము హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే/ హరే రామ హరే రామ రామ రామ హరే హరే – యను కృష్ణనామకీర్తనము చేయుచు శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ యందే మానవజన్మను నియోగింతురు.

ఆ విధముగా వారు ఈ జన్మమునందే దివ్యమైన కృష్ణలోకమును చేరి పునర్జన్మలు లేకుండా నిత్యానందభాగులు కాగలరు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 329 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 19 🌴

19 . bhūta-grāmaḥ sa evāyaṁ bhūtvā bhūtvā pralīyate
rātry-āgame ’vaśaḥ pārtha prabhavaty ahar-āgame

🌷 Translation :

Again and again, when Brahmā’s day arrives, all living entities come into being, and with the arrival of Brahmā’s night they are helplessly annihilated.

🌹 Purport :

The less intelligent, who try to remain within this material world, may be elevated to higher planets and then again must come down to this planet earth.

During the daytime of Brahmā they can exhibit their activities on higher and lower planets within this material world, but at the coming of Brahmā’s night they are all annihilated.

In the day they receive various bodies for material activities, and at night they no longer have bodies but remain compact in the body of Viṣṇu.

Then again they are manifest at the arrival of Brahmā’s day. Bhūtvā bhūtvā pralīyate: during the day they become manifest, and at night they are annihilated again. Ultimately, when Brahmā’s life is finished, they are all annihilated and remain unmanifest for millions and millions of years.

And when Brahmā is born again in another millennium they are again manifest. In this way they are captivated by the spell of the material world.

But those intelligent persons who take to Kṛṣṇa consciousness use the human life fully in the devotional service of the Lord, chanting Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare.

Thus they transfer themselves, even in this life, to the spiritual planet of Kṛṣṇa and become eternally blissful there, not being subject to such rebirths.

🌹 🌹 🌹 🌹 🌹

17 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 328: 08వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 328: Chap. 08, Ver. 18



🌹. శ్రీమద్భగవద్గీత - 328 / Bhagavad-Gita - 328 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 18 🌴

18. అవ్యక్తాద్ వ్యక్తయ: సర్వా: ప్రభవన్త్యహరాగమే |
రాత్ర్యాగమే ప్రలీయన్తే తత్రైవావ్యక్తసంజ్ఞకే ||


🌷. తాత్పర్యం :

బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరు అవ్యక్తస్థితి నుండి వ్యక్తము చెంది, పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదురు.

🌷. భాష్యము :

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 328 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 18 🌴

18 . avyaktād vyaktayaḥ sarvāḥ prabhavanty ahar-āgame
rātry-āgame pralīyante tatraivāvyakta-saṁjñake


🌷 Translation :

At the beginning of Brahmā’s day, all living entities become manifest from the unmanifest state, and thereafter, when the night falls, they are merged into the unmanifest again.


🌹 Purport :




🌹 🌹 🌹 🌹 🌹

16 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 327: 08వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 327: Chap. 08, Ver. 17


🌹. శ్రీమద్భగవద్గీత - 327 / Bhagavad-Gita - 327 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 17 🌴

17. సహస్రయుగపర్యన్తమహర్యద్ బ్రాహ్మణో విదు: |
రాత్రిం యుగసహస్రాన్తాం తే(హోరాత్రవిదో జనా: ||


🌷. తాత్పర్యం :

మానవ పరిగణనము ననుసరించి వేయి యుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు కాగలదు. అతని రాత్రి సైతము అంతే పరిమాణము కలిగి యుండును.

🌷. భాష్యము :

భౌతికజగత్తు యొక్క కాలపరిమాణము పరిమితమై కల్పములుగా తెలుపబడు చుండును. అట్టి కల్పము బ్రహ్మదేవునికి ఒక పగటి సమయము. బ్రహ్మదేవుని ఆ ఒక్క పగటి సమయమున సత్య, త్రేత, ద్వాపర, కలియుగములు వేయిమార్లు మారుచుండును. అజ్ఞానము మరియు దుర్గుణములు ఏవియును లేకుండా కేవలము, సద్గుణము, జ్ఞానము, ధర్మములను కూడియుండు సత్యయుగము 17,28,000 సంవత్సరముల కాలపరిమితి కలిగియుండును. త్రేతాయుగమునందు దుర్గుణము ప్రవేశించును.

ఆ యుగపు కాలపరిమితి 12,96,000 సంవత్సరములు. ద్వాపరయుగమున సద్గుణము మరియు ధర్మము మరింతగా నశించి దుర్గుణము వృద్దినొందును. దాని కాలపరిమితి 8,64,000 సంవత్సరములు. చివరిదైన కలిగియుగమునందు సద్గుణము దాదాపు లుప్తమై కలహము, అజ్ఞానము, అధర్మము, దుర్గుణము, వ్యసనాది లక్షణము తీవ్రముగా విజృంభించును. ఈ యుగపు కాలపరిమితి 4,32,000 సంవత్సరములు ( ఈ యుగము గత 5,000 సంవత్సరములుగా మన అనుభవము నందున్నది). దీని యందు దుర్గుణము మరయు పాపము విపరీతముగా ప్రబలిపోవును కనుక యుగాంతమున శ్రీకృష్ణభగవానుడు కల్కిఅవతారమున దానవులను నిర్జించి, భక్తులను రక్షించి, వేరొక సత్యయుగమును ఆరంభించును. ఆ విధముగా జగత్కార్యము కొనసాగించబడును. అదేరీతి నాలుగుయుగములు వేయిమార్లు మారినప్పడు (చతుర్యుగచక్రము వేయిమార్లు తిరిగినప్పడు) అది బ్రహ్మదేవుని పగలును పూర్తిచేయును. అతని రాత్రియు అంతే పరిమాణము కలిగియుండును. బ్రహ్మదేవుడు అట్టి “శతసంవత్సరముల” కాలము జీవించి తదుపరి తన దేహమును త్యజించును.

మానవపరిగణన ప్రకారము బ్రహ్మదేవుని శతసంవత్సరముల కాలము 311 ట్రిలియన్లు 40 బిలియన్ల సంవత్సరములతో సమానము. ఈ సంఖ్యను బట్టి బ్రహ్మదేవుని ఆయు:పరిమితి అద్భుతముగను, అనంతముగను ఉన్నట్లు తోచినను, నిత్యత్వ దృష్టిలో అది ఒక మెరుపుమెరిసినంత కాలము మాత్రమే. కారణార్ణవ జలములలో అసంఖ్యాకములుగా బ్రహ్మలు సముద్రమునందలి బుడగలవలె ప్రత్యక్షమగుచు నశించుచుందురు. బ్రహ్మ మరియు అతని సృష్టి యనునవి భౌతికజగమునందలి భాగములు గనుక అవి నిత్యపరివర్తన శీలములై యున్నవి. అనగా భౌతికజగమున బ్రహ్మదేవుడు సైతము జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధుల నుండి బయటబడియుండలేదు. కాని అతడు విశ్వకలాప నిర్వహణములో శ్రీకృష్ణభగవానుని సేవ యందు నియుక్తుడైనందున శీఘ్రమే ముక్తిని పొందగలడు. ఆ బ్రహ్మదేవుని లోకమైన బ్రహ్మలోకమునే ఉన్నతులైన సన్న్యాసులు పొందుదురు. అట్టి లోకము భౌతికజగత్తు నందు అత్యున్నతమైన స్వర్గాది ఊర్థ్వలోకములను పోషించుచున్నను, బ్రహ్మ మరియు ఆ బ్రహ్మలోకవాసులు ప్రకృతినియమము ప్రకారము మరణమునకు గురికావలసియే వచ్చును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 327 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 17 🌴

17 . sahasra-yuga-paryantam ahar yad brahmaṇo viduḥ
rātriṁ yuga-sahasrāntāṁ te ’ho-rātra-vido janāḥ


🌷 Translation :

By human calculation, a thousand ages taken together form the duration of Brahmā’s one day. And such also is the duration of his night.

🌹 Purport :

The duration of the material universe is limited. It is manifested in cycles of kalpas.

A kalpa is a day of Brahmā, and one day of Brahmā consists of a thousand cycles of four yugas, or ages: Satya, Tretā, Dvāpara and Kali. The cycle of Satya is characterized by virtue, wisdom and religion, there being practically no ignorance and vice, and the yuga lasts 1,728,000 years.

In the Tretā-yuga vice is introduced, and this yuga lasts 1,296,000 years. In the Dvāpara-yuga there is an even greater decline in virtue and religion, vice increasing, and this yuga lasts 864,000 years.

And finally in Kali-yuga (the yuga we have now been experiencing over the past 5,000 years) there is an abundance of strife, ignorance, irreligion and vice, true virtue being practically nonexistent, and this yuga lasts 432,000 years.

In Kali-yuga vice increases to such a point that at the termination of the yuga the Supreme Lord Himself appears as the Kalki avatāra, vanquishes the demons, saves His devotees, and commences another Satya-yuga.

🌹 🌹 🌹 🌹 🌹

15 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 326: 08వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 326: Chap. 08, Ver. 16


🌹. శ్రీమద్భగవద్గీత - 326 / Bhagavad-Gita - 326 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 16 🌴

16. ఆబ్రహ్మభువనాల్లోకా: పునరావర్తినోర్జున |
మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే

🌷. తాత్పర్యం :

భౌతికజగము నందలి అత్యున్నత లోకము మొదలుకొని అధమలోకము వరకు గల సర్వలోకములు జన్మమృత్యు భరితమైన దుఃఖప్రదేశములే. కాని ఓ కౌంతేయా! నా లోకమును చేరినవాడు తిరిగి జన్మము నొందడు.

🌷. భాష్యము :

కర్మయోగులు, జ్ఞానయోగులు, హఠయోగులు వంటివారు శ్రీకృష్ణుని దివ్యదామమును చేరి పునరావృత్తి రహితులగుటకు పూర్వము భక్తియోగమున (కృష్ణభక్తిరసభావన యందు) పూర్ణత్వమును బడయవలసియే ఉండును.

దేవతాలోకములైన ఉన్నతలోకములను పొందినవారు సైతము జన్మ, మృత్యువులచే ప్రభావితులగుచుందురు. భూలోకవాసులు ఉన్నతలోకములకు చెందినవారు భూలోకమునకు పతనము చెందుచుందురు.

బ్రహ్మలోకమును ప్రాప్తింపజేసెడి “పంచాగ్నివిద్య” యను యజ్ఞము చాందోగ్యోపనిషత్తు నందు ఉపదేశింపబడినది. అట్టి యజ్ఞము ద్వారా బ్రహ్మలోకమును పొందినను అచ్చట కృష్ణభక్తిరసభావనను ఆచరింపనిచో తిరిగి మనుజుడు భూలోకమునకు రావలసివచ్చును.

ఉన్నతలోకములందు కృష్ణభక్తిభావనను కొనసాగించువారు మాత్రము క్రమముగా మరింత ఉన్నతమైన లోకములను చేరుచు విశ్వ ప్రళయసమయమున ఆధ్యాత్మికజగమునకు చేరుదురు. ఈ విషయమున శ్రీధరస్వామి తమ భగవద్గీత వ్యాఖ్యానము నందు ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి.

బ్రాహ్మణే సహ తే సర్వే సమ్ప్రా ప్తే ప్రతిసంచరే |
పరిస్యాన్తే కృతాత్మాన: ప్రవిశన్తి పరం పదమ్

“విశ్వప్రళయము సంభవించినపుడు కృష్ణభక్తిభావన యందు సంతతమగ్నులైన బ్రహ్మ మరియు అతని భక్తులు తమ తమ కోరికల ననుసరించి ఆధ్యాత్మికజగము నందలి వివిధలోకములను చేరుచుందురు.”

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 326 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 16 🌴

16 . ā-brahma-bhuvanāl lokāḥ punar āvartino ’rjuna
mām upetya tu kaunteya punar janma na vidyate


🌷 Translation :

From the highest planet in the material world down to the lowest, all are places of misery wherein repeated birth and death take place. But one who attains to My abode, O son of Kuntī, never takes birth again.

🌹 Purport :

All kinds of yogīs – karma, jñāna, haṭha, etc. – eventually have to attain devotional perfection in bhakti-yoga, or Kṛṣṇa consciousness, before they can go to Kṛṣṇa’s transcendental abode and never return.

Those who attain the highest material planets, the planets of the demigods, are again subjected to repeated birth and death.

As persons on earth are elevated to higher planets, people on higher planets such as Brahmaloka, Candraloka and Indraloka fall down to earth.

The practice of sacrifice called pañcāgni-vidyā, recommended in the Chāndogya Upaniṣad, enables one to achieve Brahmaloka, but if, on Brahmaloka, one does not cultivate Kṛṣṇa consciousness, then he must return to earth.

Those who progress in Kṛṣṇa consciousness on the higher planets are gradually elevated to higher and higher planets and at the time of universal devastation are transferred to the eternal spiritual kingdom. Baladeva Vidyābhūṣaṇa, in his commentary on Bhagavad-gītā, quotes this verse:

brahmaṇā saha te sarve samprāpte pratisañcare
parasyānte kṛtātmānaḥ praviśanti paraṁ padam

“When there is devastation of this material universe, Brahmā and his devotees, who are constantly engaged in Kṛṣṇa consciousness, are all transferred to the spiritual universe and to specific spiritual planets according to their desires.”

🌹 🌹 🌹 🌹 🌹

14 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 325: 08వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 325: Chap. 08, Ver. 15


🌹. శ్రీమద్భగవద్గీత - 325 / Bhagavad-Gita - 325 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 15 🌴

15. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ |
నాప్నువన్తి మహాత్మాన: సంసిద్ధిం పరమాం గతా: ||


🌷. తాత్పర్యం :

భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడసినవారగుటచే దు:ఖాలయమైన ఈ అనిత్యజగమునకు ఎన్నడును తిరిగిరారు.

🌷. భాష్యము :

ఈ అనిత్యమగు జన్మము, ముసలితనము, వ్యాధి, మరణములనెడి దుఃఖములచే నిండియున్నందున, పూర్ణత్వమును పొంది కృష్ణలోకమైన (దివ్యలోకము) గోలోకబృందావనమును పొందిన మహాత్ముడు తిరిగి ఈ లోకమునకు రాగోరడు.

అట్టి శ్రీకృష్ణధామము “అవ్యక్తము” , “అక్షరము”, “పరమగతి” యని వేదవాజ్మయము నందు వర్ణింపబడినది. అనగా అది మన భౌతికసృష్టికి అతీతమైనట్టిది మరియు అచింత్యమైనట్టిది. కాని అది పరమగతియై యుండి మహాత్ములకు మాత్రము గమ్యమై యున్నది. మహాత్ములైనవారు పూర్ణ భక్తుల నుండి ఉపదేశములను పొందుచుందురు.

ఆ విధముగా వారు కృష్ణభక్తిభావనలో భక్తియోగమునందు క్రమముగా వృద్ధినొందుచు భగవత్సేవలో నియుక్తులై స్వర్గాది ఉన్నతలోకములను గాని, చివరకు వైకుంఠలోకములను గాని కోరకుందురు.

వారు కేవలము శ్రీకృష్ణుని మరియు శ్రీకృష్ణుని సాహచర్యమును తప్ప అన్యమును వాంచింపరు. వాస్తవమునకు అదియే జీవితపు సంపూర్ణత్వమై యున్నది. ఈ శ్లోకము ముఖ్యముగా శ్రీకృష్ణభగవానుని భక్తుల గూర్చియే ప్రస్తావించుచున్నది.

అట్టి కృష్ణభక్తిరసభావితులు అత్యున్నత జీవనపూర్ణత్వమును బడయగలరు. అనగా వారే మహామహితాత్ములై యున్నారు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 325 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 15 🌴

15 . mām upetya punar janma duḥkhālayam aśāśvatam
nāpnuvanti mahātmānaḥ saṁsiddhiṁ paramāṁ gatāḥ


🌷 Translation :

After attaining Me, the great souls, who are yogīs in devotion, never return to this temporary world, which is full of miseries, because they have attained the highest perfection.

🌹 Purport :

Since this temporary material world is full of the miseries of birth, old age, disease and death, naturally he who achieves the highest perfection and attains the supreme planet, Kṛṣṇaloka, Goloka Vṛndāvana, does not wish to return.

The supreme planet is described in Vedic literature as avyakta and akṣara and paramā gati; in other words, that planet is beyond our material vision, and it is inexplicable, but it is the highest goal, the destination for the mahātmās (great souls).

The mahātmās receive transcendental messages from the realized devotees and thus gradually develop devotional service in Kṛṣṇa consciousness and become so absorbed in transcendental service that they no longer desire elevation to any of the material planets, nor do they even want to be transferred to any spiritual planet. They only want Kṛṣṇa and Kṛṣṇa’s association, and nothing else. That is the highest perfection of life.

This verse specifically mentions the personalist devotees of the Supreme Lord, Kṛṣṇa. These devotees in Kṛṣṇa consciousness achieve the highest perfection of life. In other words, they are the supreme souls.

🌹 🌹 🌹 🌹 🌹

13 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 324: 08వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 324: Chap. 08, Ver. 14


🌹. శ్రీమద్భగవద్గీత - 324 / Bhagavad-Gita - 324 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 14 🌴

14. అనన్యచేతా: సతతం యో మాం స్మరతి నిత్యశ: |
తస్యాహం సులభ: పార్థ నిత్యయుక్తస్య యోగిన: ||


🌷. తాత్పర్యం :

ఓ పార్థా! అనన్యచిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుతసేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై యున్నాను.

🌷. భాష్యము :

దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియోగాముతో సేవించు శుద్ధభక్తుల చరమగమ్యము ఈ శ్లోకమున ముఖ్యముగా వివరించబడినది. గడచిన అధ్యాయపు శ్లోకములందు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, కల్పనాపూర్ణ తత్త్వవేత్తలనెడి నాలుగురకముల భక్తులు పేర్కొనబడిరి. కర్మయోగము, జ్ఞానయోగము, హటయోగము మొదలగు వివధ ముక్తివిధానములు కూడా వివరింపబడినవి.

ఈ యోగవిధానములు భక్తిని కొద్దిగా కలిగియున్నను, ఈ శ్లోకమునందు మాత్రము జ్ఞాన, కర్మ, హతాది ఎట్టి యోగములతోను సంపర్కము లేనటువంటి శుద్ధభక్తియోగము పేర్కొనబడినది. “అనన్యచేతా:” అను పదముతో తెలుపబడినట్లు శుద్ధభక్తియోగమునందు భక్తుడు కృష్ణుని తప్ప అన్యమును వాంచింపడు. అట్టి శుద్ధభక్తుడు స్వర్గలోకములకు పోవలెనని గాని, బ్రహ్మజ్యోతిలో లీనము కావలెనని గాని, భవబంధముల నుండి ముక్తిని పొందవలెనని గాని వాంచింపడు. అట్టివాడు దేనిని కూడా వాంచింపడు. కనుకనే చైతన్యచరితామృతమునందు అతడు “నిష్కాముడు” అని పిలువబడినాడు.

అనగా స్వీయలాభమునందు ఎట్టి కోరికయు లేనివాడని భావము. పరమశాంతి అతనికే లభించును గాని స్వీయలాభమునకై ప్రాకులాడువానికి కాదు. జ్ఞానయోగి, కర్మయోగి లేదా హఠయోగి యనువారలు ఏదియో కొంత స్వార్థమును కలిగియున్నను, పూర్ణభక్తుడు శ్రీకృష్ణభగవానుని ప్రియమునకు అన్యమైన దానిని కోరడు. కనుకనే అకుంఠితభక్తితో తనను సేవించువారికి తాను సులభముగా లబింతునని శ్రీకృష్ణభగవానుడు తెలియజేయుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 324 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 14 🌴

14 . ananya-cetāḥ satataṁ yo māṁ smarati nityaśaḥ
tasyāhaṁ su-labhaḥ pārtha nitya-yuktasya yoginaḥ


🌷 Translation :

For one who always remembers Me without deviation, I am easy to obtain, O son of Pṛthā, because of his constant engagement in devotional service.

🌹 Purport :

This verse especially describes the final destination attained by the unalloyed devotees who serve the Supreme Personality of Godhead bhakti-yoga. Previous verses have mentioned four different kinds of devotees – the distressed, the inquisitive, those who seek material gain, and the speculative philosophers. Different processes of liberation have also been described: karma-yoga, jñāna-yoga and haṭha-yoga. The principles of these yoga systems have some bhakti added, but this verse particularly mentions pure bhakti-yoga, without any mixture of jñāna, karma or haṭha. As indicated by the word ananya-cetāḥ, in pure bhakti-yoga the devotee desires nothing but Kṛṣṇa. A pure devotee does not desire promotion to heavenly planets, nor does he seek oneness with the brahma-jyotir or salvation or liberation from material entanglement.

A pure devotee does not desire anything. In the Caitanya-caritāmṛta the pure devotee is called niṣkāma, which means he has no desire for self-interest. Perfect peace belongs to him alone, not to them who strive for personal gain. Whereas a jñāna-yogī, karma-yogī or haṭha-yogī has his own selfish interests, a perfect devotee has no desire other than to please the Supreme Personality of Godhead. Therefore the Lord says that for anyone who is unflinchingly devoted to Him, He is easy to attain.

🌹 🌹 🌹 🌹 🌹

12 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 323: 08వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 323: Chap. 08, Ver. 13


🌹. శ్రీమద్భగవద్గీత - 323 / Bhagavad-Gita - 323 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 13 🌴


13. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ |
య: ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిమ్ ||

🌷. తాత్పర్యం :

ఈ యోగవిధానము నందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడైన నన్ను తలచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు.

🌷. భాష్యము :

ఓంకారము, బ్రహ్మము, శ్రీకృష్ణభగవానుడు అభిన్నులని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. శ్రీకృష్ణుని నిరాకారశభ్ధ రూపమే ఓంకారము. కనుకనే శ్రీకృష్ణుని నామమే అయిన హరేకృష్ణ మాహామంత్రమునందును ఓంకారము కలదని చెప్పవచ్చును. ఆ మహామంత్ర జపమే కలియుగమునకు ప్రత్యేకముగా ఉపదేశింపబడినది.

కనుక మనుజడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యని కీర్తనము, జపము చేయచు దేహత్యాగము చేసినచో తన భక్తిలక్షణముల ననుసరించి ఏదియో ఒక ఆధ్యాత్మికలోకమును నిశ్చయముగా చేరగలడు. అనగా కృష్ణభక్తులు కృష్ణలోకమైన గోలోకబృందావనమును చేరుదురు. సాకారవాదులైన భక్తులకు ఆధ్యాత్మికజగమున ఇంకను వైకుంఠలోకనామమున తెలియబడు అసంఖ్యాక లోకములు లభ్యమై యున్నవి. కాని నిరాకారవాదులు మాత్రము అంత్యమున బ్రహ్మజ్యోతి యందు లీనమగును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 323 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 13 🌴


13 . oṁ ity ekākṣaraṁ brahma vyāharan mām anusmaran
yaḥ prayāti tyajan dehaṁ sa yāti paramāṁ gatim

🌷 Translation :

After being situated in this yoga practice and vibrating the sacred syllable oṁ, the supreme combination of letters, if one thinks of the Supreme Personality of Godhead and quits his body, he will certainly reach the spiritual planets.

🌹 Purport :

It is clearly stated here that oṁ, Brahman and Lord Kṛṣṇa are not different.

The impersonal sound of Kṛṣṇa is oṁ, but the sound Hare Kṛṣṇa contains oṁ. The chanting of the Hare Kṛṣṇa mantra is clearly recommended for this age.

So if one quits his body at the end of life chanting Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare, he certainly reaches one of the spiritual planets, according to the mode of his practice.

The devotees of Kṛṣṇa enter the Kṛṣṇa planet, Goloka Vṛndāvana. For the personalists there are also innumerable other planets, known as Vaikuṇṭha planets, in the spiritual sky, whereas the impersonalists remain in the brahma-jyotir.

🌹 🌹 🌹 🌹 🌹

11 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 322: 08వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 322: Chap. 08, Ver. 12


🌹. శ్రీమద్భగవద్గీత - 322 / Bhagavad-Gita - 322 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 12 🌴

12. సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుద్య చ |
మూర్ద్న్యాధాయాత్మన: ప్రాణమాస్థితో యోగధారణమ్ ||

🌷. తాత్పర్యం :

ఇంద్రియ కర్మల నుండు విడివడి యుండుటయే యోగస్థితి యనబడును. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి, మనస్సును హృదయము నందు స్థిరము చేసి, ప్రాణవాయువును శీర్షాగ్రము నందు నిలిపి మనుజుడు యోగము నందు స్థితుడు కాగలడు.

🌷. భాష్యము :

ఇచ్చట తెలుపబడిన యోగవిధానమును అభ్యసించుట మనుజుడు మొట్టమొదట సర్వభోగద్వారములను మూసివేయవలెను. ఇట్టి అభ్యాసమునకే “ప్రత్యాహారము”

(ఇంద్రియార్థముల నుండు ఇంద్రియములను మరలించుట) అని పేరు.

జ్ఞానేంద్రియములైన కన్నులు, చెవులు, నాసికము, జిహ్య, స్పర్శను సంపూర్ణముగా నిగ్రహించవలెను. స్వీయతృప్తి యందు వాటిని నియుక్తము చేయరాదు. ఈ విధముగా ఒనరించినపుడు మనస్సు హృదయస్థ పరమాత్మపై నెలకొని, ప్రాణవాయువు శీర్షాగ్రము నందు ప్రతిష్టితమగును. షష్టాధ్యాయమున ఈ పద్ధతి విపులముగా వివరింపబడినది.

కాని ఇదివరకే తెలుపబడినట్లు ఈ యోగపద్ధతి ప్రస్తుతకాలమునాకు ఆచరణీయము కానిది. కలియుగమునకు ఏకైక ఉత్తమమార్గము కృష్ణభక్తిరసభావనమే. భక్తియోగమునందు శ్రీకృష్ణుని పైననే సదా మనస్సు లగ్నము చేయగలిగినచో అచంచలమైన సమాధిస్థితి యందు నిలుచుట మనుజునకు సులభతరము కాగలదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 322 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 12 🌴

12 . sarva-dvārāṇi saṁyamya mano hṛdi nirudhya ca
mūrdhny ādhāyātmanaḥ prāṇam āsthito yoga-dhāraṇām

🌷 Translation :

The yogic situation is that of detachment from all sensual engagements. Closing all the doors of the senses and fixing the mind on the heart and the life air at the top of the head, one establishes himself in yoga.

🌹 Purport :

To practice yoga as suggested here, one first has to close the doors of all sense enjoyment. This practice is called pratyāhāra, or withdrawing the senses from the sense objects. The sense organs for acquiring knowledge – the eyes, ears, nose, tongue and touch – should be fully controlled and should not be allowed to engage in self-gratification. In this way the mind focuses on the Supersoul in the heart, and the life force is raised to the top of the head. In the Sixth Chapter this process is described in detail. But as mentioned before, this practice is not practical in this age. The best process is Kṛṣṇa consciousness. If one is always able to fix his mind on Kṛṣṇa in devotional service, it is very easy for him to remain in an undisturbed transcendental trance, or in samādhi.

🌹 🌹 🌹 🌹 🌹

10 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 321: 08వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 321: Chap. 08, Ver. 11


🌹. శ్రీమద్భగవద్గీత - 321 / Bhagavad-Gita - 321 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 11 🌴

11. యదక్షరం వేదవిదో వదన్తి విశన్తి యద్యతయో వీతరాగా: |
యదిచ్చన్తో బ్రహ్మచర్యం చరన్తి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే ||

🌷. తాత్పర్యం :

వేదవిదులైనవారును, ఓంకారమును ఉచ్చరించు వారును, సన్న్యాసాశ్రమము నందున్న మహర్షులు అగు మనుజులు బ్రహ్మము నందు ప్రవేశించు చున్నారు. అట్టి పూర్ణత్వమును కోరినవారు బ్రహ్మచర్యవ్రతము నభ్యసింతురు. మోక్షమును గూర్చు ఈ విధానము ఇప్పుడు నీకు నేను సంగ్రహముగా వివరింతును.

🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు భ్రూమధ్యమున ప్రాణవాయువును నిలుపు షట్చక్రయోగాభ్యాసమును ఉపదేశించినాడు. అర్జునుడు ఆ యోగాభ్యాసము తెలియదని భావించి భగవానుడు దానిని రాబోవు శ్లోకములందు వివరింపనున్నాడు. పరబ్రహ్మము అద్వితీయుడైనను పలురూపములను మరియు లక్షణములను కలిగియుండునని శ్రీకృష్ణభగవానుడు తెలియజేయుచున్నాడు.

నిరాకారవాదులకు ఓంకారము (అక్షరము) పరబ్రహ్మముతో సమానము. వీతరాగులైన యతులు ప్రవేశించు నిరాకారబ్రహ్మమును గూర్చి శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట వివరించుచున్నాడు. వైదికమార్గమునందు ఓంకారము జపించుట మరియు పూర్ణ బ్రహ్మచర్యములో గురువుచెంత నిరాకారబ్రహ్మమును గూర్చి ఎరుంగుట శిష్యులకు ఆది నుండియే భోదింపబడును. ఆ విధముగా వారు బ్రహ్మము యొక్క రెండు లక్షణములను తెలియగలరు.

ఈ అభ్యాసము బ్రహ్మచారుల ఆధ్యాత్మికజీవన పురోగతికి అత్యంత అవసరమైనను సంపూర్ణముగా నేటికాలమున అట్టి బ్రహ్మచర్యజీవనము సాధ్యము కాదు. ప్రపంచ సాంఘికవ్యవస్థ సంపూర్ణముగా మార్పునొందినందున బ్రహ్మచర్యమును విద్యార్థిదశ నుండియే పాటించుట ఎవ్వరికినీ సాధ్యము కాకున్నది. ప్రపంచమంతటను వివిధజ్ఞానశాఖలకు పలు సంస్థలున్నను బ్రహ్మచర్య నియమములందు విద్యార్థులకు విద్యగరుపు ప్రామాణిక సంస్థ ఒక్కటియు లేదు. అట్టి బ్రహ్మచర్యమును పాటించనిదే ఆధ్యాత్మికజీవన పురోగతి అత్యంత కష్టతరము కాగలదు. కనుకనే కలియుగమున శాస్త్రనియమము ప్రకారము శ్రీకృష్ణభగవానుని ప్రాప్తికి పవిత్ర శ్రీకృష్ణనామము తప్ప అన్యవిధానము లేదని శ్రీచైతన్యమాహాప్రభువు ప్రకటించి యుండిరి.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 321 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 11 🌴

11 . yad akṣaraṁ veda-vido vadanti viśanti yad yatayo vīta-rāgāḥ
yad icchanto brahma-caryaṁ caranti tat te padaṁ saṅgraheṇa pravakṣye


🌷 Translation :

Persons who are learned in the Vedas, who utter oṁ-kāra, and who are great sages in the renounced order enter into Brahman. Desiring such perfection, one practices celibacy. I shall now briefly explain to you this process by which one may attain salvation.

🌹 Purport :

Lord Śrī Kṛṣṇa has recommended to Arjuna the practice of ṣaṭ-cakra-yoga, in which one places the air of life between the eyebrows. Taking it for granted that Arjuna might not know how to practice ṣaṭ-cakra-yoga, the Lord explains the process in the following verses. The Lord says that Brahman, although one without a second, has various manifestations and features. Especially for the impersonalists, the akṣara, or oṁ-kāra – the syllable oṁ – is identical with Brahman. Kṛṣṇa here explains the impersonal Brahman, into which the renounced order of sages enter.

In the Vedic system of knowledge, students, from the very beginning, are taught to vibrate oṁ and learn of the ultimate impersonal Brahman by living with the spiritual master in complete celibacy. In this way they realize two of Brahman’s features. This practice is very essential for the student’s advancement in spiritual life, but at the moment such brahmacārī (unmarried celibate) life is not at all possible. The social construction of the world has changed so much that there is no possibility of one’s practicing celibacy from the beginning of student life.

Throughout the world there are many institutions for different departments of knowledge, but there is no recognized institution where students can be educated in the brahmacārī principles. Unless one practices celibacy, advancement in spiritual life is very difficult. Therefore Lord Caitanya has announced, according to the scriptural injunctions for this Age of Kali, that in this age no process of realizing the Supreme is possible except the chanting of the holy names of Lord Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹

9 Mar 2020


శ్రీమద్భగవద్గీత - 320: 08వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 320: Chap. 08, Ver. 10


🌹. శ్రీమద్భగవద్గీత - 320 / Bhagavad-Gita - 320 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 10 🌴

10. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ |
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురషముపైతి దివ్యమ్ ||


🌷. తాత్పర్యం :

మరణ సమయమున ప్రాణవాయువును భ్రూమధ్యమున నిలిపి, యోగశక్తిచే చలించని మనస్సుతో సంపూర్ణ భక్తి భావమున భగవానుని స్మరించెడి వాడు తప్పక ఆ పరమపురుషుని పొందగలడు.

🌷. భాష్యము :

మరణసమయమునందు దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తి యందే మనస్సును లగ్నము చేయవలెనని ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. యోగాభ్యాసము చేయువారు ప్రాణమును భ్రూమధ్యమునకు (ఆజ్ఞాచక్రమునకు) చేర్చవలెనని ఇచ్చట ఉపదేశింపబడినది. ఈ విధముగా ఆరుచక్రములపై ధ్యానమును కూడిన షట్చక్రాభ్యాసము ఇచ్చట సూచించబడుచున్నది. కాని శుద్ధభక్తుడు ఇట్టి షట్చక్రయోగము నభ్యసింపడు.

కాని అతడు కృష్ణభక్తిభావనలో సంతతమగ్నుడై మరణ సమయము నందును దేవదేవుడైన శ్రీకృష్ణుని అతని కరుణ చేతనే స్మరింపగలుగును. ఈ విషయము పదునాలుగవ శ్లోకమున విశదముగా వివరింపబడినది. ఈ శ్లోకమున “యోగబలేన” యను పదమునకు ప్రాధాన్యము కలదు. ఏలయన యోగాభ్యాసము లేకుండా మరణసమయము నందు ఎవ్వరును ఇట్టి దివ్యస్థితికి రాలేరు. ఆ యోగము షట్చక్రయోగమైనను లేదా భక్తియోగమైనను సరియే.

అంతియేగాక ఈ యోగమును అభ్యసించకుండా హఠాత్తుగా మరణసమయమున శ్రీకృష్ణభగవానుని స్మరించుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. మనుజుడు ఏదియో ఒక యోగవిధానమును (ముఖ్యముగా భక్తియోగమును) అభ్యసించియే తిరవలెను. మరణ సమయమున మనస్సు కలత చెందియుండును గనుక మనుజుడు యోగము ద్వారా జీవితకాలమునందు దివ్యత్వము అభ్యసింపవలసియున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 320 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 10 🌴

10. prayāṇa-kāle manasācalena bhaktyā yukto yoga-balena caiva
bhruvor madhye prāṇam āveśya samyak sa taṁ paraṁ puruṣam upaiti divyam


🌷 Translation :

One who, at the time of death, fixes his life air between the eyebrows and, by the strength of yoga, with an undeviating mind, engages himself in remembering the Supreme Lord in full devotion, will certainly attain to the Supreme Personality of Godhead.

🌹 Purport :

In this verse it is clearly stated that at the time of death the mind must be fixed in devotion to the Supreme Personality of Godhead. For those practiced in yoga, it is recommended that they raise the life force between the eyebrows (to the ājñā-cakra). The practice of ṣaṭ-cakra-yoga, involving meditation on the six cakras, is suggested here. A pure devotee does not practice such yoga, but because he is always engaged in Kṛṣṇa consciousness, at death he can remember the Supreme Personality of Godhead by His grace. This is explained in verse 14.

The particular use of the word yoga-balena is significant in this verse because without practice of yoga – whether ṣaṭ-cakra-yoga or bhakti-yoga – one cannot come to this transcendental state of being at the time of death. One cannot suddenly remember the Supreme Lord at death; one must have practiced some yoga system, especially the system of bhakti-yoga. Since one’s mind at death is very disturbed, one should practice transcendence through yoga during one’s life.

🌹 🌹 🌹 🌹 🌹


8 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 319: 08వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 319: Chap. 08, Ver. 09


🌹. శ్రీమద్భగవద్గీత - 319 / Bhagavad-Gita - 319 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 09 🌴

09. కవిం పురాణమనుశాసితారమ్ అణోరణీయాం సమనుస్మరేద్ య: |
సర్వస్య ధాతారమచిన్త్యరూపమ్ ఆదిత్యవర్ణం తమస: పరస్తాత్ ||


🌷. తాత్పర్యం :

నియమించు వాడును, సూక్ష్మము కన్నను సూక్ష్మమైన వాడను, సమస్తమును పోషించు వాడును, భౌతిక భావనలకు పరమైనవాడును, అచింత్యుడును, రూపసహితుడును అగు పరమపురుషుని సర్వజ్ఞునిగను మరియు ప్రాచీనునిగను ప్రతి యొక్కరు ధ్యానము చేయవలెను. సూర్యుని వలె తేజోసంపన్నుడును మరియు దివ్యుడును అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు.

🌷. భాష్యము :

భగవానుని స్మరించు విధానము ఈ శ్లోకమున తెలుపబడినది. ముఖ్యమైన విషయమేమనగా అతడు నిరాకారుడు(శూన్యుడు) కాడు. నిరాకారము లేదా శూన్యమునందు ఎవ్వరును ధ్యానమును నిలుపలేరు. అది అతికష్టము. కాని శ్రీకృష్ణుని స్మరణము అత్యంత సులభమైనది. అట్టి స్మరణమే వాస్తవముగా ఇచ్చట పేర్కొనబడినది.

మొట్టమొదట మనము అతడు పరుషుడని (రూప సహితుడని) తెలిసికొనవలెను. అనగా శ్రీకృష్ణనిగాని లేక శ్రీరామునిగాని సచ్చిదానందవిగ్రహునిగానే మనము ద్యానింపవలెను. రాముని తలచినను లేదా కృష్ణుని తలచినను అతడు ఎట్టివాడో ఈ శ్లోకమునందు వివరింపబడినది. శ్రీకృష్ణభగవానుడు “కవి” యని ఇచ్చట వర్ణింపబడినాడు. అనగా భూత, భవిష్యత్, వర్తమానములను తెలియుట ద్వారా సమస్తము నెరిగియుండెడి సర్వజ్ఞుడని భావము. సమస్తమునకు అది అతడే కనుక ప్రాచీనునిగా పిలువబడినాడు. సమస్తము అతని నుండియే ఉద్భవించినది. జగన్నియామకుడు మరియు మనుజుల పోషకుడుపోషకుడు, శిక్షకుడు అతడే. అతడే సూక్ష్మము కన్నను సూక్ష్మమైనవాడు. వెంట్రుక కొనలో పదివేలవంతు యుండెడి ఆత్మ యందును అచింత్యముగా ప్రవేశింపగలిగినంత సూక్ష్మమైనవాడు గనుకనే అతడు సూక్ష్మమైనవాటిలో సూక్ష్మమైనవాడని పిలువబడినాడు.

దేవదేవునిగా అతడు అణువు నందును మరియు అతిసూక్ష్మమైనట్టి దాని హృదయమునందును ప్రవేశించి పరమాత్మరూపమున నియమించుచుండును. అతిసూక్ష్మమైనను అతడు సర్వత్రా వ్యాపించి సమస్తమును పోషించుచున్నాడు. అతని వలననే సమస్త గ్రహమండలము నిలిచియున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 319 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 09 🌴

09. kaviṁ purāṇam anuśāsitāram aṇor aṇīyāṁsam anusmared yaḥ
sarvasya dhātāram acintya-rūpam āditya-varṇaṁ tamasaḥ parastāt

🌷 Translation :

One should meditate upon the Supreme Person as the one who knows everything, as He who is the oldest, who is the controller, who is smaller than the smallest, who is the maintainer of everything, who is beyond all material conception, who is inconceivable, and who is always a person. He is luminous like the sun, and He is transcendental, beyond this material nature.

🌹 Purport :

The process of thinking of the Supreme is mentioned in this verse. The foremost point is that He is not impersonal or void. One cannot meditate on something impersonal or void. That is very difficult. The process of thinking of Kṛṣṇa, however, is very easy and is factually stated herein.

First of all, the Lord is puruṣa, a person – we think of the person Rāma and the person Kṛṣṇa. And whether one thinks of Rāma or of Kṛṣṇa, what He is like is described in this verse of Bhagavad-gītā. The Lord is kavi; that is, He knows past, present and future and therefore knows everything. He is the oldest personality because He is the origin of everything; everything is born out of Him.

He is also the supreme controller of the universe, and He is the maintainer and instructor of humanity. He is smaller than the smallest. The living entity is one ten-thousandth part of the tip of a hair, but the Lord is so inconceivably small that He enters into the heart of this particle. Therefore He is called smaller than the smallest. As the Supreme, He can enter into the atom and into the heart of the smallest and control him as the Supersoul. Although so small, He is still all-pervading and is maintaining everything.

By Him all these planetary systems are sustained. We often wonder how these big planets are floating in the air. It is stated here that the Supreme Lord, by His inconceivable energy, is sustaining all these big planets and systems of galaxies.

🌹 🌹 🌹 🌹 🌹


7 Mar 2020

శ్రీమద్భగవద్గీత - 318: 08వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 318: Chap. 08, Ver. 08


🌹. శ్రీమద్భగవద్గీత - 318 / Bhagavad-Gita - 318 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 08 🌴

08. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా |
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్ ||


🌷. తాత్పర్యం :

ఓ పార్థా! మనస్సును ఎల్లవేళలా నా స్మరణము నందే నియుక్తము జేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసెడివాడు నన్ను తప్పక చేరగలడు.

🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుడు తన స్మరణ ప్రాముఖ్యమును ఈ శ్లోకమున నొక్కి చెప్పుచున్నాడు. అట్టి శ్రీకృష్ణుని స్మరణము హరేకృష్ణమాహామంత్ర జపకీర్తనముల ద్వారా మనుజుని హృదయమునందు జాగృతము చేయబడును. అట్ట్ శ్రీకృష్ణనామము యొక్క శ్రవణ, కీర్తనములందు కర్ణములు, జిహ్వ, మనస్సు సంపూర్ణముగా నియుక్తమగుచున్నందున ఈ ధ్యానము ఆచరణకు అత్యంతసులభమై యున్నది. ఇట్టి ధ్యానము భగవానుని పొందుటకు తోడ్పడగలదు. “పురుషం” అనగా భోక్త యని భావము.

జీవులు శ్రీకృష్ణభగవానుని తటస్థశక్తి స్వరూపులైనను భౌతికకల్మషములకు గురియై యున్నారు. వారు తమను తాము భోక్తలుగా తలచినను వాస్తవమునకు దివ్యభోక్తలు కాజాలరు. శ్రీకృష్ణభగవానుడే తన సంపూర్ణాంశములైన నారాయణుడు, వాసుదేవుడు మొదలగు పలురూపములలో పరమ భోక్తయై యున్నాడని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది.

కనుక భక్తుడైనవాడు హరేకృష్ణమహామంత్ర జపకీర్తనములను చేయుచు తన పూజాధ్యేయమైన భగవానుని నారాయణ, కృష్ణ, రామాది ఏ రూపములలోనైనా నిరంతరము తలచవచ్చును. ఈ విధానము అతనిని పవిత్రుని చేయగలదు. నిరంతర జపకీర్తనముల వలన అతడు అంత్యకాలమున భగవద్ధామమును చేరగలడు. యోగాభ్యాసమునందు అంతరమందున్న పరమాత్మపై ధ్యానము నిలిపినట్లు, హరినామ జపకీర్తనము ద్వారా మనస్సును సదా శ్రీకృష్ణుని యందు నిలుపవలెను. మనస్సు సదా చంచలమై యుండును గనుక దానిని బలవంతముగా శ్రీకృష్ణుని చింతించునట్లు చేయుట అత్యంత అవసరము.

భ్రమరమునే సదా తలచుచు కీటకము ప్రస్తుత జన్మముననే భ్రమరముగా మారెడి వృత్తాంతము ఇచ్చట సాధారణముగా ఉదహరింపబడును. అదేవిధముగా మనము శ్రీకృష్ణుని నిరంతరము స్మరించినచో అంత్యమున ఆ దేవదేవుని స్వరూపమును బోలిన స్వరూపమునే పొందగలము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 318 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 08 🌴

08. abhyāsa-yoga-yuktena cetasā nānya-gāminā
paramaṁ puruṣaṁ divyaṁ yāti pārthānucintayan

🌷 Translation :

He who meditates on Me as the Supreme Personality of Godhead, his mind constantly engaged in remembering Me, undeviated from the path, he, O Pārtha, is sure to reach Me.

🌹 Purport :

In this verse Lord Kṛṣṇa stresses the importance of remembering Him. One’s memory of Kṛṣṇa is revived by chanting the mahā-mantra, Hare Kṛṣṇa. By this practice of chanting and hearing the sound vibration of the Supreme Lord, one’s ear, tongue and mind are engaged.

This mystic meditation is very easy to practice, and it helps one attain the Supreme Lord. Puruṣam means enjoyer. Although living entities belong to the marginal energy of the Supreme Lord, they are in material contamination.

They think themselves enjoyers, but they are not the supreme enjoyer. Here it is clearly stated that the supreme enjoyer is the Supreme Personality of Godhead in His different manifestations and plenary expansions as Nārāyaṇa, Vāsudeva, etc.

The devotee can constantly think of the object of worship, the Supreme Lord, in any of His features – Nārāyaṇa, Kṛṣṇa, Rāma, etc. – by chanting Hare Kṛṣṇa. This practice will purify him, and at the end of his life, due to his constant chanting, he will be transferred to the kingdom of God.

Yoga practice is meditation on the Supersoul within; similarly, by chanting Hare Kṛṣṇa one fixes his mind always on the Supreme Lord. The mind is fickle, and therefore it is necessary to engage the mind by force to think of Kṛṣṇa.

One example often given is that of the caterpillar that thinks of becoming a butterfly and so is transformed into a butterfly in the same life. Similarly, if we constantly think of Kṛṣṇa, it is certain that at the end of our lives we shall have the same bodily constitution as Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹

6 Mar 2020