శ్రీమద్భగవద్గీత - 661: 18వ అధ్., శ్లో 78 / Bhagavad-Gita - 661: Chap. 18, Ver. 78


🌹. శ్రీమద్భగవద్గీత - 661 / Bhagavad-Gita - 661 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 78 🌴

చివరి భాగము.

78. యత్ర యోగేశ్వర: కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధర: |
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా
నీతిర్మతిర్మమ ||

🌷. తాత్పర్యం :

యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు మేతి ధనుర్ధారియైన అర్జునుడు ఎచ్చట ఉందురో అచ్చట సంపద, విజయము, అసాధారణశక్తి, నీతి నిశ్చయముగా నుండును. ఇదియే నా అభిప్రాయము.

🌷. భాష్యము :

భగవద్గీత ధృతరాష్ట్రుని విచారణలో ఆరంభమైనది. భీష్మ, ద్రోణ, కర్ణాది మహాయోధులచే సహాయమును పొందుచున్న తన కుమారులు విజయము పట్ల అతడు మిగుల ఆశను కలిగియుండెను. విజయము తన పక్షమునకే సిద్ధించునని అతడు భావించుచుండెను.

కాని యుద్ధరంగమున జరిగిన సన్నివేశమును వివరించిన పిమ్మట సంజయుడు ధృతరాష్ట్రునితో “నీవు విజయమును గూర్చి ఆలోచించినను, నా అభిప్రాయము ప్రకారము శ్రీకృష్ణార్జునులు ఎచ్చట నుందురో అచ్చటనే సర్వశుభము కలుగగలదు” అని పలికెను. అనగా ధృతరాష్ట్రుడు తన పక్షమున విజయమును ఆశింపరాదని అతడు ప్రత్యక్షముగా నిర్ధారించినాడు.

శ్రీకృష్ణుడు నిలిచియున్నందున అర్జునుని పక్షమునకే విజయము సిద్ధించుననుట నిశ్చయమైన విషయము. ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు అర్జునుని రథచోదకుడగుట ఆ భగవానుని మరొక విభూతియై యున్నది. శ్రీకృష్ణునకు గల పలువిభూతులలో వైరాగ్యము ఒకటి.

శ్రీకృష్ణుడు వైరాగ్యమునకు సైతము ప్రభువైనందున అట్టి వైరాగ్యమును పలు సందర్భములలో ప్రదర్శించెను. వాస్తవమునకు రణము దుర్యోధనుడు మరియు ధర్మరాజు నడుమ సంభవించి యుండెను. అర్జునుడు కేవలము తన అగ్రజూడైన ధర్మరాజు తరపున పోరుటకు సిద్ధపడెను. ఆ విధముగా శ్రీకృష్ణార్జును లిరువురును ధర్మరాజు పక్షమున ఉండుటచే అతని విజయము తథ్యమై యుండెను.

ప్రపంచమునెవరు పాలింపవలెనో నిర్ణయించుటకు ఆ యుద్ధము ఏర్పాటు చేయబడెను. అట్టి రాజ్యాధికారము యుధిష్టిరునకే సంప్రాప్తించునని సంజయుడు భవిష్యద్వాణిని పలికినాడు. అంతియేగాక యుద్ధ విజయానంతరము ధర్మరాజు మరింతగా సుఖసంపదలతో వర్థిల్లుననియు ఇచ్చట భవిష్యత్తు నిర్ణయింపబడినది.

ధర్మరాజు ధర్మాత్ముడు మరియు పవిత్రుడే గాక గొప్ప నీతిమంతుడగుటయే అందులకు కారణము. అతడు జీవితమున ఎన్నడును అసత్యమును పలిగియుండలేదు.

భగవద్గీతను రణరంగమున ఇరువురు స్నేహితుల నడుమ జరిగిన సంభాషణగా భావించు మూఢులు పెక్కుమంది కలరు. కాని స్నేహితుల నడుమ జరిగెడి సాధారణ సంభాషణ లెన్నడును శాస్త్రము కాజాలదు. మరికొందరు అధర్మకార్యమైన యుద్ధమునకు శ్రీకృష్ణుడు అర్జునుని పురికొల్పెనని తమ అభ్యంతరమును తెలుపుదురు. కాని వాస్తవమునకు భగవద్గీత దివ్య ధర్మోపదేశమనెడి నిజస్థితి ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది.

దివ్య ధర్మోపదేశము గీత యందలి నవమాధ్యాయపు ముప్పదినాలుగవ శ్లోకమున “మన్మనాభవ మద్భక్త:”యని తెలుపబడినది. అనగా ప్రతియొక్కరు శ్రీకృష్ణభగవానునికి భక్తులు కావలసియున్నది. సర్వధర్మముల సారము శ్రీకృష్ణుని శరణుపొందుటయే (సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ).

కనుక భగవద్గీత నీతి మరియు ధర్మముల దివ్య విధానములతో నిండియున్నది. ఇతరమార్గములు సైతము పవిత్ర్రీకరణమొనర్చునవే యైనను మరియు అంత్యమున ఈ మార్గమునకే మనుజుని గొనివచ్చునవైనను భగవద్గీత యందలి చివరి ఉపదేశమే నీతి మరియు ధర్మ విషయమున శ్రీకృష్ణభగవానుని శరణాగతి.

అట్టి శరణాగతియే అష్టాదశాధ్యాయపు తుది నిర్ణయమై యున్నది.

శ్రీకృష్ణ పరమాత్మనే నమః

సమాప్తం.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 661 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 78 🌴

Last Part

78. yatra yogeśvaraḥ kṛṣṇo
yatra pārtho dhanur-dharaḥ
tatra śrīr vijayo bhūtir
dhruvā nītir matir mama


🌷 Translation :

Wherever there is Kṛṣṇa, the master of all mystics, and wherever there is Arjuna, the supreme archer, there will also certainly be opulence, victory, extraordinary power, and morality. That is my opinion.


🌹 Purport :

The Bhagavad-gītā began with an inquiry of Dhṛtarāṣṭra’s. He was hopeful of the victory of his sons, assisted by great warriors like Bhīṣma, Droṇa and Karṇa.

He was hopeful that the victory would be on his side. But after describing the scene on the battlefield, Sañjaya told the King, “You are thinking of victory, but my opinion is that where Kṛṣṇa and Arjuna are present, there will be all good fortune.” He directly confirmed that Dhṛtarāṣṭra could not expect victory for his side.

Victory was certain for the side of Arjuna because Kṛṣṇa was there. Kṛṣṇa’s acceptance of the post of charioteer for Arjuna was an exhibition of another opulence. Kṛṣṇa is full of all opulences, and renunciation is one of them. There are many instances of such renunciation, for Kṛṣṇa is also the master of renunciation.

The fight was actually between Duryodhana and Yudhiṣṭhira. Arjuna was fighting on behalf of his elder brother, Yudhiṣṭhira. Because Kṛṣṇa and Arjuna were on the side of Yudhiṣṭhira, Yudhiṣṭhira’s victory was certain.

The battle was to decide who would rule the world, and Sañjaya predicted that the power would be transferred to Yudhiṣṭhira. It is also predicted here that Yudhiṣṭhira, after gaining victory in this battle, would flourish more and more because not only was he righteous and pious but he was also a strict moralist. He never spoke a lie during his life.

There are many less intelligent persons who take Bhagavad-gītā to be a discussion of topics between two friends on a battlefield. But such a book cannot be scripture. Some may protest that Kṛṣṇa incited Arjuna to fight, which is immoral, but the reality of the situation is clearly stated: Bhagavad-gītā is the supreme instruction in morality.

The supreme instruction of morality is stated in the Ninth Chapter, in the thirty-fourth verse: man-manā bhava mad-bhaktaḥ. One must become a devotee of Kṛṣṇa, and the essence of all religion is to surrender unto Kṛṣṇa (sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja). The instructions of Bhagavad-gītā constitute the supreme process of religion and of morality.

All other processes may be purifying and may lead to this process, but the last instruction of the Gītā is the last word in all morality and religion: surrender unto Kṛṣṇa. This is the verdict of the Eighteenth Chapter.

Sri Krishna Paramathmane namah

THE END

🌹 🌹 🌹 🌹 🌹


10 Mar 2021

శ్రీమద్భగవద్గీత - 660: 18వ అధ్., శ్లో 77 / Bhagavad-Gita - 660: Chap. 18, Ver. 77


🌹. శ్రీమద్భగవద్గీత - 660 / Bhagavad-Gita - 660 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 77 🌴

77. తచ్చ సంస్మృత్య సంస్మృత్య
రూపమత్యద్భుతం హరే: |
విస్మయో మే మహాన్ రాజన్
హృష్యామి చ పున: పున: ||


🌷. తాత్పర్యం :

ఓ రాజా! అత్యద్భుతమైన శ్రీకృష్ణభగవానుని రూపమున స్మరించిన కొలది నేను అత్యంత విస్మయము నొందుచు మరల మరల ఆనందము ననుభవించుచున్నాను.


🌷. భాష్యము :

వ్యాసుని అనుగ్రహముచే సంజయుడు సైతము అర్జునునకు చూపబడిన శ్రీకృష్ణభగవానుని విశ్వరూపమును గాంచగలిగినట్లు ఇచ్చట గోచరించుచున్నది. అట్టి విశ్వరూపమును శ్రీకృష్ణుడు పూర్వమెన్నడును చూపలేదని తెలుపబడినది. అది ఒక్క అర్జనునికే చూపబడినను ఆ సమయమున కొందరు మహాభక్తులు సైతము ఆ రూపమును గాంచగలిగిరి. అట్టివారిలో వ్యాసమహర్షి ఒకరు.

శ్రీకృష్ణుని పరమభక్తులలో ఒకడైన అతడు శక్తిపూర్ణ అవతారముగా పరిగణింపబడినాడు. వ్యాసదేవుడు దానిని తన శిష్యుడైన సంజయునకు దర్శింపజేసెను. అర్జునునకు చూపబడిన ఆ అద్భుత రూపమున తలచుచు సంజయుడు మరల మరల ఆనందము ననుభవించుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 660 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 77 🌴

77. tac ca saṁsmṛtya saṁsmṛtya rūpam aty-adbhutaṁ hareḥ
vismayo me mahān rājan hṛṣyāmi ca punaḥ punaḥ


🌷 Translation :

O King, as I remember the wonderful form of Lord Kṛṣṇa, I am struck with wonder more and more, and I rejoice again and again.


🌹 Purport :

It appears that Sañjaya also, by the grace of Vyāsa, could see the universal form Kṛṣṇa exhibited to Arjuna. It is, of course, said that Lord Kṛṣṇa had never exhibited such a form before. It was exhibited to Arjuna only, yet some great devotees could also see the universal form of Kṛṣṇa when it was shown to Arjuna, and Vyāsa was one of them.

He is one of the great devotees of the Lord, and he is considered to be a powerful incarnation of Kṛṣṇa. Vyāsa disclosed this to his disciple Sañjaya, who remembered that wonderful form of Kṛṣṇa exhibited to Arjuna and enjoyed it repeatedly.

🌹 🌹 🌹 🌹 🌹


09 Mar 2021

శ్రీమద్భగవద్గీత - 659: 18వ అధ్., శ్లో 76 / Bhagavad-Gita - 659: Chap. 18, Ver. 76


🌹. శ్రీమద్భగవద్గీత - 659 / Bhagavad-Gita - 659 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 76 🌴

76. రాజన్ సంస్మృత్య సంస్మృత్య
సంవాదమిమద్భుతమ్ |
కేశవార్జునయో: పుణ్యం
హృష్యామి చ ముహుర్ముహు: ||


🌷. తాత్పర్యం :

ఓ రాజా! శ్రీకృష్ణార్జుణుల నడుమ జరిగిన అద్భుతమును, పవిత్రమును అగు సంవాదమును స్మరించిన కొలది ప్రతిక్షణము పులకించు ఆనదము నొందుచున్నాను.

🌷. భాష్యము :

భగవద్గీత యొక్క అవగాహనము అతి దివ్యమైనట్టిది. శ్రీకృష్ణార్జున సంవాద విషయములను అవగతము చేసికొనగలిగినవాడు మహాత్ముడై ఆ సంవాద విషయములను మరవకుండును. ఇదియే ఆధ్యాత్మికజీవనపు దివ్యస్థితి.

అనగా భగవద్గీతను ప్రామాణికుడైన (శ్రీకృష్ణుడు) వానినుండి శ్రవణము చేయువాడు పూర్ణ కృష్ణభక్తిభావనను పొందగలడు. అట్టి కృష్ణభక్తిరసభావన ఫలితమేమనగా మనుజుడు నిరంతరము వికాసము నొందుచు, ఏదియో కొంత సమయము గాక ప్రతిక్షణము జీవితమున ఆనందము ననుభవించును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 659 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 76 🌴

76. rājan saṁsmṛtya saṁsmṛtya
saṁvādam imam adbhutam
keśavārjunayoḥ puṇyaṁ
hṛṣyāmi ca muhur muhuḥ

🌷 Translation :

O King, as I repeatedly recall this wondrous and holy dialogue between Kṛṣṇa and Arjuna, I take pleasure, being thrilled at every moment.

🌹 Purport :

The understanding of Bhagavad-gītā is so transcendental that anyone who becomes conversant with the topics of Arjuna and Kṛṣṇa becomes righteous and he cannot forget such talks.

This is the transcendental position of spiritual life. In other words, one who hears the Gītā from the right source, directly from Kṛṣṇa, attains full Kṛṣṇa consciousness.

The result of Kṛṣṇa consciousness is that one becomes increasingly enlightened, and he enjoys life with a thrill, not only for some time, but at every moment.

🌹 🌹 🌹 🌹 🌹


08 Mar 2021

శ్రీమద్భగవద్గీత - 658: 18వ అధ్., శ్లో 75 / Bhagavad-Gita - 658: Chap. 18, Ver. 75


🌹. శ్రీమద్భగవద్గీత - 658 / Bhagavad-Gita - 658 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 75 🌴

75. వ్యాసప్రసాదాచ్చ్రుతవానేతద్
గుహ్యమహం పరమ్ |
యోగం యోగేశ్వరాత్కృష్ణా
త్సాక్షాత్కథయత: స్వయమ్ ||

🌷. తాత్పర్యం :

అర్జునునితో స్వయముగా సంభాషించుచున్న యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి ఈ పరమగుహ్య వచనములను వ్యాసదేవుని కరుణచే నేను ప్రత్యక్షముగా వినగలిగితిని.

🌷. భాష్యము :

వ్యాసదేవుడు సంజయునికి ఆధ్యాత్మికగురువు. తన గురువైన వ్యాసదేవుని కరుణచేతనే తాను దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసికొనగలిగితినని సంజయుడు అంగీకరించుచున్నాడు.

అనగా ప్రతియొక్కరు ప్రత్యక్షముగా గాక ఆధ్యాత్మికగురువు ద్వారా శ్రీకృష్ణుని అవగతము చేసికొనవలసియున్నది. భగవదనుభూతి ప్రత్యక్షముగా అనుభవింపవలసినదే అయినను గురువు మాత్రము దానికి మాధ్యమముగా ఒప్పారగలడు. ఇదియే గురుపరమపరా రహస్యము.

గురువు ప్రామాణికుడైనప్పుడు మనుజుడు అర్జునుని రీతి ఆయన నుండి భగవద్గీతను ప్రత్యక్షముగా శ్రవణము చేయవచ్చును. జగమునందు పెక్కురు యోగులు మరియు సిద్ధపురుషులు ఉన్నప్పటకిని శ్రీకృష్ణుడు సమస్త యోగవిధానములకు ప్రభువై యున్నాడు.

అటువంటి శ్రీకృష్ణుడు తనకే శరణము నొందుమని గీత యందు నిశ్చయముగా ఉపదేశమొసగుచున్నాడు. ఆ విధముగా ఒనరించువాడు అత్యుత్తమ యోగి కాగలడు. ఈ విషయము షష్టాధ్యాయపు చివరి శ్లోకమునందు నిర్దారింపబడినది. (యోగినామపి సర్వేషాం).

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 658 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 75 🌴

75. vyāsa-prasādāc chrutavān etad guhyam ahaṁ param
yogaṁ yogeśvarāt kṛṣṇāt sākṣāt kathayataḥ svayam


🌷 Translation :

By the mercy of Vyāsa, I have heard these most confidential talks directly from the master of all mysticism, Kṛṣṇa, who was speaking personally to Arjuna.


🌹 Purport :

Vyāsa was the spiritual master of Sañjaya, and Sañjaya admits that it was by Vyāsa’s mercy that he could understand the Supreme Personality of Godhead.

This means that one has to understand Kṛṣṇa not directly but through the medium of the spiritual master. The spiritual master is the transparent medium, although it is true that the experience is still direct. This is the mystery of the disciplic succession. When the spiritual master is bona fide, then one can hear Bhagavad-gītā directly, as Arjuna heard it.

There are many mystics and yogīs all over the world, but Kṛṣṇa is the master of all yoga systems. Kṛṣṇa’s instruction is explicitly stated in Bhagavad-gītā – surrender unto Kṛṣṇa. One who does so is the topmost yogī. This is confirmed in the last verse of the Sixth Chapter. Yoginām api sarveṣām.

Nārada is the direct disciple of Kṛṣṇa and the spiritual master of Vyāsa. Therefore Vyāsa is as bona fide as Arjuna because he comes in the disciplic succession, and Sañjaya is the direct disciple of Vyāsa. Therefore by the grace of Vyāsa, Sañjaya’s senses were purified, and he could see and hear Kṛṣṇa directly.

One who directly hears Kṛṣṇa can understand this confidential knowledge. If one does not come to the disciplic succession, he cannot hear Kṛṣṇa; therefore his knowledge is always imperfect, at least as far as understanding Bhagavad-gītā is concerned.

🌹 🌹 🌹 🌹 🌹


06 Mar 2021

శ్రీమద్భగవద్గీత - 657: 18వ అధ్., శ్లో 74 / Bhagavad-Gita - 657: Chap. 18, Ver. 74


🌹. శ్రీమద్భగవద్గీత - 657 / Bhagavad-Gita - 657 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 74 🌴

74. సంజయ ఉవాచ
ఇత్యహం వాసుదేవస్య
పార్థస్య చ మహాత్మన: |
సంవాదమిమ శ్రౌష
మద్భుతం రోమహర్షణం ||


🌷. తాత్పర్యం :

సంజయుడు పలికెను : ఈ విధముగా మహాత్ములైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుని నడుమ జరిగిన సంవాదమును నేను శ్రవణము చేసితిని. అద్భతమైన ఆ సంవాదముచే నాకు రోమాంచనమగుచున్నది.


🌷. భాష్యము :

కురుక్షేత్ర రణరంగమున ఏమి జరిగెనని ధృతరాష్ట్రుడు తన కార్యదర్శియైన సంజయుని గీతారంభమున ప్రశ్నించెను. ఈ అధ్యయన విషయమంతయు సంజయుని హృదయమున అతని గురువగు వ్యాసదేవుని కరుణచే విదితమయ్యెను. ఆ విధముగా అతడు రణరంగవిషయములను ఎరుకపరచగలిగెను.

ఇరువఇరువురు మహాత్ముల నడుమ భగవద్గీత వంటి అత్యంత ప్రాముఖ్యమైన సంవాదమెన్నడును జరిగియుండలేదు మరియు భవిష్యత్తులో జరుగు నవకాశము లేదు. కనుకనే ఆ సంవాదము అత్యంత అద్భతమై యుండెను.

దేవదేవుడైన శ్రీకృష్ణుడు స్వయముగా తన శక్తులను గూర్చి జీవునకు (పరమభక్తుడగు అర్జునుడు) వివరించియుండుటచే ఆ సందేశము వాస్తవమునకు అత్యంత అద్భుతముగనే ఉండగలదు. శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనుటకు మనము అర్జునుని అడుగుజాడలను అనురించినచో తప్పక మన జీవితములు సుఖకరములు మరియు జయప్రదములు కాగలవు.

సంజయుడు ఈ విషయమును గుర్తించి దానిని అవగాహనము చేసికొనుటకు యత్నించుచు ధృతరాష్ట్రునకు దానినంతయు నెరిగించెను. కనుకనే కృష్ణార్జుణులు ఎచ్చట నుందురో అచ్చట విజయము తథ్యమని నిర్ధారింపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 657 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 74 🌴

74. sañjaya uvāca

ity ahaṁ vāsudevasya pārthasya ca mahātmanaḥ
saṁvādam imam aśrauṣam adbhutaṁ roma-harṣaṇam

🌷 Translation :

Sañjaya said: Thus have I heard the conversation of two great souls, Kṛṣṇa and Arjuna. And so wonderful is that message that my hair is standing on end.

🌹 Purport :

In the beginning of Bhagavad-gītā, Dhṛtarāṣṭra inquired from his secretary Sañjaya, “What happened on the Battlefield of Kurukṣetra?” The entire study was related to the heart of Sañjaya by the grace of his spiritual master, Vyāsa. He thus explained the theme of the battlefield.

The conversation was wonderful because such an important conversation between two great souls had never taken place before and would not take place again. It was wonderful because the Supreme Personality of Godhead was speaking about Himself and His energies to the living entity, Arjuna, a great devotee of the Lord.

If we follow in the footsteps of Arjuna to understand Kṛṣṇa, then our life will be happy and successful. Sañjaya realized this, and as he began to understand it, he related the conversation to Dhṛtarāṣṭra. Now it is concluded that wherever there is Kṛṣṇa and Arjuna, there is victory.

🌹 🌹 🌹 🌹 🌹


05 Mar 2021

శ్రీమద్భగవద్గీత - 656: 18వ అధ్., శ్లో 73 / Bhagavad-Gita - 656: Chap. 18, Ver. 73


🌹. శ్రీమద్భగవద్గీత - 656 / Bhagavad-Gita - 656 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 73 🌴

73. నష్టో మోహ: స్మృతిర్లబ్ధా
త్వత్ప్రసాదాన్మయాచ్యుత |
స్థితోస్మి గతసన్దేహ:
కరిష్యే వచనం తవ ||

🌷. తాత్పర్యం :

అర్జునుడు పలికెను : ఓ అచ్యుతా! నా మోహము ఇప్పుడు నశించినది. నీ కరుణచే నా స్మృతిని తిరిగి పొందితిని. ఇప్పుడు నేను స్థిరుడును, సందేహరహితుడును అయి నీ ఆజ్ఞానుసారమును వర్తించుటకు సిద్ధముగా నున్నాను.

🌷. భాష్యము :

దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారము వర్తించుటయే జీవుని (అర్జునుని) సహజస్థితియై యున్నది. అతడట్లు నియమబద్ధముగా వర్తించుటకే నిర్దేశింపబడినాడు.

జీవుని నిజమైన స్థితి శ్రీకృష్ణుని నిత్యదాసత్వమే యని చైతన్యమహాప్రభువు కూడా తెలిపియున్నారు. ఈ సిద్ధాంతము మరచియే జీవుడు భౌతికప్రకృతిచే బద్ధుడగుచున్నాడు. కాని అతడు ఆ భగవానుని సేవలో నిమగ్నుడగుట ద్వారా ముక్తుడు కాగలడు. జీవుని సహజస్థితి దాసత్వమే గనుక అతడు మాయనో లేదా దేవదేవుడైన శ్రీకృష్ణునో సదా సేవింపవలసివచ్చును.

ఒకవేళ అతడు శ్రీకృష్ణభగవానుని సేవించినచో తన సహజస్థితియందు నిలువగలడు. కాని భౌతికశక్తియైన మాయను సేవింపదలచినచో నిక్కముగా బంధములో చిక్కుబడగలడు. భ్రాంతి యందు భౌతికజగమున సేవను గూర్చుచు అతడు ఇచ్చాకామములచే బద్ధుడైనను తనను తాను జగత్తుకు అధినేతయైనట్లు భావించును.

అట్టి భావనయే భ్రాంతి యనబడును. కాని మనుజుడు ముక్తుడైనపుడు అట్టి భ్రాంతి నశించి, ఆ దేవదేవుని కోరికల ననుసరించి వర్తించుటకు స్వచ్చందముగా శరణాగతుడగును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 656 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 73 🌴

73. arjuna uvāca
naṣṭo mohaḥ smṛtir labdhā
tvat-prasādān mayācyuta
sthito ’smi gata-sandehaḥ
kariṣye vacanaṁ tava

🌷 Translation :

Arjuna said: My dear Kṛṣṇa, O infallible one, my illusion is now gone. I have regained my memory by Your mercy. I am now firm and free from doubt and am prepared to act according to Your instructions.

🌹 Purport :

The constitutional position of a living entity, represented by Arjuna, is that he has to act according to the order of the Supreme Lord. He is meant for self-discipline.

Śrī Caitanya Mahāprabhu says that the actual position of the living entity is that of eternal servant of the Supreme Lord. Forgetting this principle, the living entity becomes conditioned by material nature, but in serving the Supreme Lord he becomes the liberated servant of God.

The living entity’s constitutional position is to be a servitor; he has to serve either the illusory māyā or the Supreme Lord. If he serves the Supreme Lord he is in his normal condition, but if he prefers to serve the illusory, external energy, then certainly he will be in bondage. In illusion the living entity is serving in this material world.

He is bound by his lust and desires, yet he thinks of himself as the master of the world. This is called illusion. When a person is liberated, his illusion is over, and he voluntarily surrenders unto the Supreme to act according to His desires.

🌹 🌹 🌹 🌹 🌹


04 Mar 2021

శ్రీమద్భగవద్గీత - 655: 18వ అధ్., శ్లో 72 / Bhagavad-Gita - 655: Chap. 18, Ver. 72


🌹. శ్రీమద్భగవద్గీత - 655 / Bhagavad-Gita - 655 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 72 🌴

72. కచ్చిదేతచ్చ్రుతం పార్థ
త్వయైకాగ్రేణ చేతసా |
కచ్చిదజ్ఞానసమ్మోహ:
ప్రనష్ట స్తే ధనంజయ ||

🌷. తాత్పర్యం :

ఓ పార్థా! ధనంజయా! ఏకాగ్రమనస్సుతో దీనినంతటిని నీవు శ్రవణము చేసితివా? నీ అజ్ఞానము మరియు మోహము ఇప్పుడు నశించినవా?

🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట అర్జునునికి ఆధ్యాత్మికగురువు వలె వర్తించుచున్నాడు. కనుకనే అర్జునుడు భగవద్గీతను సరియైన విధముగా అవగతము చేసికొనెనా లేదా యని ప్రశ్నించుట అతని ధర్మమై యున్నది. ఒకవేళ అర్జునుడు అవగతము చేసికొననిచో అవసరమైన ఏదేని ఒక విషయమును గాని లేదా సంపూర్ణగీతను గాని శ్రీకృష్ణుడు తిరిగి తెలుపుటకు సంసిద్ధుడై యున్నాడు.

వాస్తవమునకు శ్రీకృష్ణుని వంటి గురువు నుండి గాని, శ్రీకృష్ణుని ప్రతినిధియైన ఆధ్యాత్మికగురువు నుండి గాని గీతాశ్రవణము చేసినవాడు తన అజ్ఞానమును నశింపజేసికొనగలడు. భగవద్గీత యనునది ఏదో ఒక కవి లేదా నవలారచయితచే రచింపబడినది కాదు. అది సాక్షాత్తు దేవదేవుడైన శ్రీకృష్ణునిచే పలుకబడినట్టిది.

కనుక శ్రీకృష్ణుని నుండి గాని, అతని ప్రామాణిక ఆధ్యాత్మిక ప్రతినిధి నుండి గాని ఆ ఉపదేశములను శ్రవణము చేయగలిగిన భాగ్యవంతుడు తప్పక ముక్తపురుషుడై అజ్ఞానాంధకారము నుండి బయటపడగలడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 655 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 72 🌴

72. kaccid etac chrutaṁ pārtha
tvayaikāgreṇa cetasā
kaccid ajñāna-sammohaḥ
praṇaṣṭas te dhanañ-jaya

🌷 Translation :

O son of Pṛthā, O conqueror of wealth, have you heard this with an attentive mind? And are your ignorance and illusions now dispelled?

🌹 Purport :

The Lord was acting as the spiritual master of Arjuna. Therefore it was His duty to inquire from Arjuna whether he understood the whole Bhagavad-gītā in its proper perspective. If not, the Lord was ready to re-explain any point, or the whole Bhagavad-gītā if so required.

Actually, anyone who hears Bhagavad-gītā from a bona fide spiritual master like Kṛṣṇa or His representative will find that all his ignorance is dispelled. Bhagavad-gītā is not an ordinary book written by a poet or fiction writer; it is spoken by the Supreme Personality of Godhead.

Any person fortunate enough to hear these teachings from Kṛṣṇa or from His bona fide spiritual representative is sure to become a liberated person and get out of the darkness of ignorance.

🌹 🌹 🌹 🌹 🌹


03 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 654: 18వ అధ్., శ్లో 71 / Bhagavad-Gita - 654: Chap. 18, Ver. 71


🌹. శ్రీమద్భగవద్గీత - 654 / Bhagavad-Gita - 654 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 71 🌴

71. శ్రద్ధావాననసూయశ్చ
శ్రుణుయాదపి యో నర: |
సోపి ముక్త: శుభాన్ లోకాన్
ప్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ ||


🌷. తాత్పర్యం :

శ్రద్ధను, అసూయరాహిత్యమును గూడి శ్రవణము చేయువాడు సర్వపాపఫలముల నుండి విడుదలను పొంది, పుణ్యకర్ములైనవారు నివసించు పుణ్యలోకములను పొందగలడు.


🌷. భాష్యము :

తన యెడ అసూయను కలిగినవారికి గీతాజ్ఞానమును బోధించరాదని శ్రీకృష్ణభగవానుడు ఈ అధ్యాయపు అరువదిఏడవ శ్లోకమున స్పష్టముగా పలికియున్నాడు. అనగా భగవద్గీత భక్తుల కొరకే నిర్దేశింపబడియున్నది.

కాని కొన్నిమార్లు భక్తులు బహిరంగముగా ఉపన్యాసములు గావింతురనెడి ప్రశ్న ఉదయింపవచ్చును. అది ఈ విధముగా ఇచ్చట వివరింపబడినది. ఉపన్యాసమునకు వచ్చిన ప్రతియొక్కరు భక్తులు కాకపోయినను, వారిలో పెక్కురు కృష్ణుని యెడ అసూయరహితులును కావచ్చును.

అట్టి అసూయరహితులు శ్రీకృష్ణుడు దేవదేవుడనెడి విశ్వాసమును కలిగియుందురు. వారు గీతాజ్ఞానమును భవద్భక్తుని ముఖత: శ్రవణము చేసినచో శీఘ్రమే సర్వపాపఫలముల నుండి విడుదలను పొంది, పుణ్యాతములైనవారు వసించెడి పుణ్యలోకములను పొందగలరు.

అనగా శుద్ధభక్తుడగుటకు యత్నింపనివాడు సైతము శ్రద్ధతో గీతాశ్రవణమును చేయుట ద్వారా సర్వపుణ్యకర్మల ఫలములను పొందగలడు. కునక పాపఫలముల నుండి విడుదలను పొంది కృష్ణభక్తునిగా నగుటకు ప్రతియొక్కనికి కృష్ణభక్తుడు అవకాశము నొసగుచుండును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 654 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 71 🌴

71. śraddhāvān anasūyaś ca śṛṇuyād api yo naraḥ
so ’pi muktaḥ śubhāḻ lokān prāpnuyāt puṇya-karmaṇām


🌷 Translation :

And one who listens with faith and without envy becomes free from sinful reactions and attains to the auspicious planets where the pious dwell.


🌹 Purport :

In the sixty-seventh verse of this chapter, the Lord explicitly forbade the Gītā’s being spoken to those who are envious of the Lord. In other words, Bhagavad-gītā is for the devotees only.

But it so happens that sometimes a devotee of the Lord will hold open class, and in that class not all the students are expected to be devotees. Why do such persons hold open class? It is explained here that although not everyone is a devotee, still there are many men who are not envious of Kṛṣṇa.

They have faith in Him as the Supreme Personality of Godhead. If such persons hear from a bona fide devotee about the Lord, the result is that they become at once free from all sinful reactions and after that attain to the planetary system where all righteous persons are situated.

Therefore simply by hearing Bhagavad-gītā, even a person who does not try to be a pure devotee attains the result of righteous activities. Thus a pure devotee of the Lord gives everyone a chance to become free from all sinful reactions and to become a devotee of the Lord.

🌹 🌹 🌹 🌹 🌹


02 Mar 2021

శ్రీమద్భగవద్గీత - 653: 18వ అధ్., శ్లో 70 / Bhagavad-Gita - 653: Chap. 18, Ver. 70


🌹. శ్రీమద్భగవద్గీత - 653 / Bhagavad-Gita - 653 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 70 🌴

70. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయో: |
జ్ఞానయజ్ఞేన తేనాహమిష్ట: స్యామితి మే మతి: ||

🌷. తాత్పర్యం :

మన ఈ పవిత్రమగు సంవాదమును శ్రద్ధతో అధ్యయనము చేయువాడు జ్ఞానయజ్ఞముచే నన్ను పూజించినవాడగునని నేను ప్రకటించుచున్నాను.


🌷. భాష్యము :


🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 653 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 70 🌴

70. adhyeṣyate ca ya imaṁ
dharmyaṁ saṁvādam āvayoḥ
jñāna-yajñena tenāham
iṣṭaḥ syām iti me matiḥ

🌷 Translation :

And I declare that he who studies this sacred conversation of ours worships Me by his intelligence.


🌹 Purport :


🌹 🌹 🌹 🌹 🌹


01 Mar 2021